
సాక్షి, నెల్లూరు: కార్పొరేట్ పదవులు, పద్మ అవార్డులు ఇప్పిస్తానంటూ మోసం చేసిన గుంటూరు సీసీఎస్ సీఐ శేషారావు బండారం బయటపడింది. గుడూరు పోలీసులు శనివారం సీఐ శేషారావుతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. కార్పొరేట్ పదవులు, పద్మ అవార్డుల ఇప్పిస్తానంటూ రమణయ్య అనే వ్యక్తిని వీరు బురిడీ కొట్టించారు. ఆయన నుంచి రూ. 4 కోట్లు వసూలుచేసి.. ఆపై ముఖం చాటేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీఐతోపాటు ఇతర నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
పద్మ అవార్డు కోసం 4 కోట్లు.. సీఐ అరెస్టు!
Comments
Please login to add a commentAdd a comment