
తెనాలిరూరల్: ప్రేమ పేరుతో యువతిని లోబర్చుకుని, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ముఖం చాటేసిన యువకుడిపై అత్యాచారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరా లు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి మండలం జగ్గడిగుంటపాలెంకు తాడిబోయిన రమేష్ సోదరుడితో గతంలో సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన యువతినిచ్చి ఆమె తల్లి దండ్రులు పెళ్లి తలపెట్టి విరమించుకున్నారు.
అయితే ఆ యువతితో రమేష్ ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అది ప్రేమగా మారి, ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అయితే పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ రమేష్ ముఖం చాటేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాలూకా ఎస్‌ఐ ఎం.నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment