
అవును సిఫారసు చేశా: శరద్ యాదవ్
న్యూఢిల్లీ: నిజాయితీ లేనివారికి పద్మ పురస్కారాలు ఇస్తున్నారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన జేడీ(యూ) నేత శరద్ యాదవ్ స్వయంగా ఒక డాక్టర్ కు పద్మ అవార్డు కోసం సిఫారసు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. 2014లో గుర్గావ్ కు చెందిన వైద్యుడు బాల్ రాజ్ సింగ్ యాదవ్ పేరు పద్మ పురస్కారం కోసం సిఫారసు చేశారని హోంమంత్రిత్వ శాఖ డాక్యుమెంట్ వెల్లడించింది.
వైద్యుడి పేరు సిఫారసు చేసిన విషయం వాస్తమేనని శరద్ యాదవ్ తెలిపారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. పద్మ పురస్కారాల ఎంపిక విధానం నిజాయితీగా లేదని మాత్రమే తాను అన్నానని వివరణ ఇచ్చారు. అవార్డుల ఎంపిక పారదర్శకంగా లేదని పేర్కొన్నారు.