నందమూరి బాలకృష‍్ణకు అల్లు అర్జున్ అభినందనలు | Allu Arjun Congratulates Nandamuri Balakrishna, Ajith Kumar And All Padma Awardees, Check Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun: బాలయ్యకు అభినందనలు తెలిపిన ఐకాన్ స్టార్

Published Mon, Jan 27 2025 2:31 PM | Last Updated on Mon, Jan 27 2025 3:34 PM

Allu Arjun Congratulates Nandamuri Balakrishna and Ajith Kumar for Padma Awards

నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పద్మభూషణ్ అవార్డుకు పూర్తిగా అర్హులంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తెలుగు సినిమాకు అందించిన సేవలకు సరైన గుర్తింపు లభించిందన్నారు. అజిత్ కుమార్‌ సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా పద్మ అవార్డులకు ఎంపికైన శోభన, శేఖర్ కపూర్‌, అనంత్‌ నాగ్‌లకు అభినందనలు తెలిపారు. పద్మ అవార్డులు సాధించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. కళల విభాగంలో గుర్తింపు దక్కడం నా హృదయాన్ని సంతోషంతో నింపిందని అల్లు అర్జున్‌ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ‍ప్రకటించింది.  
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement