Sharad Yadav
-
Sharad Yadav: ‘మండల్’ అమలు వ్యూహం ఆయనదే!
దేశరాజధానిలో 2023 జనవరి 12న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూసిన శరద్ యాదవ్ (75) మృతి దేశవ్యాప్తంగా ఆయన అనుయాయులను, ఆరాధకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఈ యువ ఎమర్జెన్సీ వ్యతిరేక విద్యార్థి నేత 1974 జయప్రకాష్ నారాయణ్ ఉద్యమ సమ యంలో 27 ఏళ్ల ప్రాయంలోనే పార్ల మెంటు స్థానంలో గెలుపొంది జాతీయ నేతగా మారారు. ఓబీసీ భావన, దాని వర్గీకరణ జాతీయ నిఘంటువుగా మారడానికి చాలాకాలానికి ముందే ఆయన శూద్ర, ఓబీసీ, సామాజిక శక్తుల ప్రతినిధిగా, సోషలిస్టు సిద్ధాంతవేత్తగా ఆవిర్భవించారు. రామ్మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్ (బిహార్‌కి చెందిన క్షురక సామాజిక బృందానికి చెందిన నేత)ల సోషలిస్టు సిద్ధాంత భూమిక నుంచి ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన నూతన యువ శూద్ర, ఓబీసీ నేతల బృందంలో శరద్ యాదవ్ ఒక భాగమై ఉండేవారు. ఈ బృందంలోని ఇతర నేతలు తమ సొంత రాష్ట్రాలకే పరిమితమై పోగా, ఈయన మాత్రం జాతీయ ప్రముఖుడిగా మారారు. ఈ యువ బృందానికి చెందిన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్‌లు జాతీయ రాజకీయాల నుంచి వెనుదిరిగి రాష్ట్ర రాజ కీయాలకు పరిమితమైపోగా, శరద్ యాదవ్ మాత్రం పార్లమెంటులోనే ఉండిపోయారు. ఏడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా నెగ్గిన శరద్ యాదవ్ పార్లమెంటులో పేదల అనుకూల సమరాల్లో పోరాడుతూ వచ్చారు. హిందీలో చక్కటి వక్త, తార్కిక చింతనాపరుడైన శరద్ యాదవ్ రాజకీయ వ్యూహకర్తగా ఉండేవారు. ఈయన రాజకీయ వ్యూహం ఫలితంగానే నాటి ఉప ప్రధాని, జాట్ నేత అయిన దేవీలాల్ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలోనూ... మండల్ నివేదికలోని ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని వీపీ సింగ్ అమలు చేయవలసి వచ్చింది. జనతా దళ్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పరిణామాల గురించి శరద్ యాదవ్ వివరించి చెప్పారు. ‘మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందిగా జనతా దళ్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి మేము సోషలిస్టు నేతలందరినీ సమీకరించడం ప్రారంభించాము. ఇది జరగకుండా శూద్రులకు నిజమైన న్యాయం కలగదని మేము బలంగా నమ్మాము. మండల్ కమిషన్ సిఫార్సులను వీపీ సింగ్ సన్నిహితులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని అధిగమించడానికి ఆయన ఉపప్రధాని, ప్రముఖ జాట్ నేత దేవీలాల్ చౌదరి అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. చరణ్ సింగ్ జోక్యం కారణం గానే జాట్లను వెనుకబడిన వర్గాల జాబి తాలో మండల్ చేర్చలేక పోయారని తనకు తెలుసు. అయినప్పటికీ అనేక మంది స్థానిక జాట్ నేతలు, బృందాలు రిజ ర్వేషన్ కేటగిరీలో తమను చేర్చాల్సిందిగా తమ తమ రాజకీయ నేతలను ఒత్తి డికి గురి చేశారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న వీపీ సింగ్ గొప్ప ఎత్తు వేశారు. జాట్లను రిజర్వేషన్ జాబితాలో చేర్చడానికి తాను వ్యతిరేకమే అయినప్పటికీ, ప్రముఖ జాట్ నేత అయిన దేవీలాల్ జాట్లను చేర్చకుండా మండల్ సిఫార్సులను అమలు చేయబోరని వీపీ సింగ్‌కు కచ్చితంగా తెలుసు. జనతాదళ్ జనరల్ సెక్రెటరీ, పరిశ్రమల మంత్రీ అయిన చౌదరి అజిత్ సింగ్ కూడా వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ప్రచారం ప్రారంభించారు, ఓబీసీ జాబితాలో జాట్లను చేర్చాల్సిందేనని నొక్కి చెప్పసాగారు. దీంతో దేవీలాల్ రాజకీయ డైలమాలో చిక్కుకున్నారు. జాట్లను వెనుకబడిన వర్గంగా చేర్చిన ఘనత అజిత్ సింగ్‌కు దక్కకూడదని ఆయన కోరుకున్నారు. మరోవైపు, జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చకుంటే తన సొంత జాట్ కమ్యూనిటీ నుంచి ఆగ్రహాన్ని చవిచూసే ప్రమాదాన్ని కూడా దేవీలాల్ కోరుకోలేదు. కాబట్టి, ఇది మండల్ కమిషన్‌పై చర్చకు ముగింపు పలుకుతుందని వీపీ సింగ్ భావించారు. ‘‘1990 ఆగస్టు 3న, వీపీ సింగ్ నాకు కబురంపి ‘సోదరా శరద్! చౌదరి దేవీలాల్ని ఇక ఏమాత్రం నేను సహించలేన’ని చెప్పారు. దేవీలాల్‌తో మాట్లాడతాననీ, ఈ అధ్యాయానికి శాశ్వతంగా ముగింపు పలుకుతాననీ నేను వీపీ సింగ్‌కు హామీ ఇచ్చాను. అయితే దేవీ లాల్‌ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించవద్దని నేను వీపీ సింగ్‌ను అభ్యర్థించాను. కానీ అప్పటికే దేవీలాల్‌కి ఉద్వాసన పలుకుతున్న ఆదేశాన్ని తాను రాష్ట్రపతికి పంపేసినట్లు వీపీ సింగ్ సమాధాన మిచ్చారు. దీంతో నేను సంభాషణను ముగించాల్సి వచ్చింది. మరుసటి రోజు తన కార్యాలయానికి రావలసిందిగా వీపీ సింగ్ కబురంపారు. నేను వెళ్లాను. దేవీలాల్ గురించి చర్చించుకున్నాము. నన్ను విశ్వాసంలోకి తీసుకోవాలని వీపీ సింగ్ భావించారు. అలాగైతేనే నేను దేవీలాల్‌తో జతకట్టబోనని ఆయన భావించారు. దేవీలాల్ పక్షంలో నేను చేరినట్లయితే ప్రధానమంత్రిగా తాను ఎక్కువ కాలం కొనసాగలేనని వీపీ సింగ్ భావిస్తున్నారని దీనర్థం. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న నేను మండల్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేస్తున్నట్లు ప్రకటించాలని వీపీ సింగ్‌ను కోరాను. ఆయన 1990 ఆగస్టు 15న దీనిపై ప్రకటన వెలువరించడానికి మొదట అంగీకరించారు. కానీ ఆగస్టు 9వ తేదీనే ఆయన దాన్ని ప్రకటించాల్సి వచ్చింది. అలా ప్రకటించకపోయి ఉంటే నేను ఢిల్లీలో జరగనున్న దేవీ లాల్ ర్యాలీలో చేరడం తప్ప మరొక అవకాశం నాకు ఉండేది కాదు. మండల్ సిఫార్సులను అమలు చేస్తే అవి సమానతా సమాజాన్ని విశ్వసించి, దానికోసం కలగన్న అంబేడ్కర్, కర్పూరీ ఠాకూర్, లోహియా, జయప్రకాష్ నారాయణ్ స్వప్నాలు సాకారమవుతాయని నేను భావించాను. 1990 ఆగస్టు 6న వీపీ సింగ్ నివాసంలో సాయంత్రం 6 గంటలకు క్యాబినెట్ సమావేశం జరిగింది. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు ఈ సమావేశ ప్రధాన ఎజెండా. సన్ని హితులు హెచ్చరిస్తున్నప్పటికీ, ఆ మరుసటి రోజు అంటే 1990 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు కల్పిస్తూ మండల్ కమిషన్ చేసిన రికమంండేషన్ను అమలు చేస్తామని ప్రకటించింది. చివరకు 1990 ఆగస్టు 13న ఓబీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. ఆగస్టు 10 నుంచే ఆధిపత్య కులాలు రిజర్వేషన్కి వ్యతిరేకంగా నిర సనలు ప్రారంభించాయి. నెలరోజుల పాటు విద్యార్థులు, బ్యూరోక్రాట్లు, టీచర్లు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేక నిర సనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. రహదారులు దిగ్బంధనకు గురయ్యాయి.’’ – ‘ది శూద్రాస్– విజన్ ఫర్ ఎ న్యూ పాత్’ అనే పుస్తకం నుంచి. అయితే, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసేలా వీపీ సింగ్ ప్రభుత్వాన్ని ప్రేరేపించడంలో; వీధుల్లో మండల్ అనుకూల, వ్యతిరేక పోరాటాలను రగుల్కొల్పడంలో నాటి యువ శరద్ యాదవ్ తగిన పాత్ర పోషించకపోయి ఉంటే, భారతీయ శూద్ర/ఓబీసీలు ఈ రోజు దేశంలో ఈ స్థాయికి చేరుకుని ఉండేవారు కాదు. ఆర్ఎస్ఎస్/బీజేపీ శక్తులను నియంత్రిస్తున్న ద్విజులు మండల్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆనాడు శూద్ర/ఓబీసీలు భారీ స్థాయిలో మండల్ అనుకూల సామాజిక సమీకరణకు పూనుకోకపోయి ఉంటే, నేడు ఓబీసీలు తమకు నాయకత్వం వహించి, నరేంద్రమోడీ భారత ప్రధాని కావ డానికి ద్విజులు అమోదించి ఉండేవారు కాదు. చివరగా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ శూద్ర/ఓబీసీ నేతలు నేటి తమ రాజకీయ ప్రతిపత్తికి గాను శరద్ యాదవ్ అనే గొప్ప పోరాటకారుడికి ఎప్పటికీ రుణపడి ఉంటారు. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
చావు ఇంటికి వెళ్లి నవ్వుతావా? ఇదేం పద్ధతి? రాహుల్‌పై బీజేపీ ఫైర్..
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, జేయూయూ నేత శరద్ యాదవ్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ సందర్భంలో నవ్వుతూ కన్పించారు. ఈ పొటోను షేర్ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి షహ్జాద్ పూనావాలా రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓ వైపు శరద్ యాదవ్ కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖంలో ఉంటే, వాళ్ల మధ్యన కూర్చున్న నీకు ఎలా నవ్వు వస్తుందని ధ్వజమెత్తారు. ఓ తపస్విగా చెప్పుకునే రాహుల్ ఇలా ప్రవర్తించడం సరికాదని సెటైర్లు వేశారు. అంతేకాదు 2018లో కర్ణాటక మాజీ సీఎం ఎన్ ధారం సింగ్ సంతాప సభలోనూ రాహుల్ నవ్వుతూ కన్పించారని షెహ్జాద్ పూనావాలా పేర్కొన్నారు. పుల్వామా అమరులకు శ్రద్ధాంజలి ఘటించే సమయంలోనూ రాహుల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. Rahul Gandhi smiling while Sharad Yadav’s family is in tears- certainly not how a Tapasvi would behave Sensitivity demands one acts maturely but then in 2018 Rahul was laughing during Dharam Singh's condolence meet; was busy in phone during Pulwama Shraddhanjali Some tapasvi! pic.twitter.com/axj2CwS4fR — Shehzad Jai Hind (@Shehzad_Ind) January 13, 2023 చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతికి రాహుల్ నివాళి
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాజీ కేంద్ర మంత్రి శరద్ యాదవ్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆ ప్రముఖ రాజకీయవేత్త నుంచి చాలా విషాయాలు నేర్చుకున్నానని చెప్పారు. సీనియర్ రాజకీయవేత్త, లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ) నేత 75 ఏళ్ల శరద్ యాదవ్ గురుగ్రామ్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ సోషలిస్ట్ నాయకుడు శరద్ యాదవ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధింత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాహుల్ శరద్ యాదవ్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి వివరించారు. యాదవ్ ప్రతిపక్ష నాయకుడిగా నానమ్మ ఇందిరా గాంధీతో రాజకీయ పోరాటం చేశారని, వీరిద్దరూ గౌరవం, ఆప్యాయతలతో మెలిగేవారిని గుర్తు చేసుకున్నారు. అంతేగాదు యాదవ్ ఎప్పుడూ ఇతరుల గౌరవాన్ని కోల్పోలేదని, ఇది రాజకీయాలలో అతి గొప్ప విషయమని అన్నారు. శరద్ యాదవ్ సోషలిజం నాయకుడిగా ఉండటమే గాక వినయశీలి. తాను ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని, దేశానికి ఆయన చేసిన కృషి, సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రో ఉన్న రాహుల్ శుక్రవారం యాత్రకు విరామం ఇచ్చి మరీ పంజాబ్ నుంచి ఢిల్లీ చేరుకుని శరద్‌యాదవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. (చదవండి: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత) -
బడే భాయ్.. శరద్ యాదవ్ మృతిపై లాలూ భావోద్వేగం
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ హఠాన్మరణం.. బీహార్ రాజకీయాల్లో విషాద ఛాయలు నింపింది. ఐదు దశాబ్దాలపాటు.. జాతీయ రాజకీయాల్లో రాణించి తనదైన ముద్ర వేసుకున్నారాయన. అయితే చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా పేరున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. శరద్ యాదవ్ మరణంపై ఎమోషనల్ అయ్యారు. తమ మధ్య రాజకీయపరంగా రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా.. తమ మధ్య బంధం మాత్రం చెడిపోలేదని లాలూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య కారణాల రిత్యా సింగపూర్‌లో ఉన్న లాలూ.. ఆస్పత్రి నుంచి వీడియో సందేశం ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. బడే భాయ్(పెద్దన్న)గా శరద్ యాదవ్‌ను సంబోధిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని లాలూ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘అతను(శరద్ యాదవ్), ములాయం సింగ్, నితీశ్ కుమార్, నేను.. మీమంతా రామ్ మనోహర్ లోహిలా, కార్పూరి థాకూర్ నుంచి సోషలిజం రాజకీయాలు నేర్చుకున్నాం. ఎన్నోసార్లు మేం రాజకీయాల పరంగా పోటీ పడ్డాం. కానీ, మా మధ్య బంధం మాత్రం ఎప్పుడూ చెడిపోలేదు’’ అని లాలూ గుర్తు చేసుకున్నారు. अभी सिंगापुर में रात्रि में के समय शरद भाई के जाने का दुखद समाचार मिला। बहुत बेबस महसूस कर रहा हूँ। आने से पहले मुलाक़ात हुई थी और कितना कुछ हमने सोचा था समाजवादी व सामाजिक न्याय की धारा के संदर्भ में। शरद भाई...ऐसे अलविदा नही कहना था। भावपूर्ण श्रद्धांजलि! pic.twitter.com/t17VHO24Rg — Lalu Prasad Yadav (@laluprasadrjd) January 12, 2023 శరద్ యాదవ్ తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది.. సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి మొదలుపెట్టినప్పటికీ.. ఆయన మాధేపురనే బేస్‌గా చేసుకుని ముందుకు వెళ్లారు. ఇందులో లాలూతోనే పోటాపోటీ నడిచింది. నాలుగుసార్లు గెలిస్తే.. నాలుగుసార్లు ఓడిపోయారు. 1991, 1996 నుంచి నెగ్గి, 1998లో లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. 1999లో లాలూను ఓడించారు. మళ్లీ 2004లో లాలూ చేతిలో ఓడారు. 2009లో మళ్లీ నెగ్గారు. 2014, 2019లో మోదీ మేనియాలో శరద్ యాదవ్ ఓటమి పాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్ యాదవ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1999 నుంచి 2004 మధ్య వాజ్పేయూ ప్రభుత్వంలో శరద్ యాదవ్ పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2003లో జనతాదళ్ యునైటెడ్(జేడీ-యూ) జాతీయ అధ్యక్షుడయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో విభేదించి జేడీయూ నుంచి బయటకొచ్చారు. 2018లో లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ) పార్టీ ఏర్పాటు చేశారు. కానీ, ఆ పార్టీకి అధికారిక గుర్తింపు లేకుండా పోయింది. తొలుత బహుజన్ ముక్తి పార్టీ తో విలీనం కావాలని భావించినప్పటికీ.. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయితే 2022 మార్చిలో ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలను ఏకం చేయడంలో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇది తొలి అడుగని శరద్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్ట్ నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి వెల్లడించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. పల్స్ లేదు. మేము తొలుత సీపీఆర్ ప్రయత్నించి చూశాం. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 10.19 గంటలకు ఆయన చనిపోయారు’ అని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. -
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
సీనియర్ రాజకీయవేత్త, లోక్తాంత్రిక్ జనతా దళ్(ఎల్జేడీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల శరద్ యాదవ్ గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి ట్విటర్ ద్వారా ధ్రువీకరించారు. అనారోగ్యం పాలై అపస్మారక స్థితికి చేరుకున్న యాదవ్‌ను తమ ఆసుపత్రికి తీసుకొచ్చారని, ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స ప్రారంభించామని, నాడి పనిచేయలేదని, రక్తపోటు రికార్డు కాలేదని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. రాత్రి 10.19 గంటలకు మరణించారని తెలియజేసింది. శరద్ యాదవ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శరద్ యాదవ్ మొత్తం పదిసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1970వ దశకంలో జయప్రకాశ్ నారాయణ్ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సోషలిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. జనతాదళ్ నుంచి బయటకు వచ్చి 1997లో జేడీ(యూ)ను స్థాపించారు. జేడీ(యూ) నితీశ్ వర్గానికే చెందుతుందని 2017లో ఈసీ ప్రకటించింది. 2018లో తాను స్థాపించిన ఎల్జేడీని శరద్ యాదవ్ ఇటీవలే జేడీ(యూ)లో విలీనం చేశారు. శరద్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. पापा नहीं रहे 😭 — Subhashini Sharad Yadav (@Subhashini_12b) January 12, 2023 -
ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (74) తన నేతృత్వంలోని లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ)ను రాష్ట్రీయ జనతాదళ్‌లో విలీనం చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల్లో ఐక్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఆయన తెలిపారు. బీజేపీని దీటుగా ఎదుర్కోగల సత్తా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఉందన్నారు. 1997లో దాణా కుంభకోణం బయటపడ్డాక జనతాదళ్‌లో విభేదాల నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీని స్థాపించారు. అప్పట్లో జనతాదళ్‌లో లాలూకు గట్టి పోటీ ఇచ్చే నేతగా శరద్ యాదవ్ ఉండేవారు. 2005లో ఆర్జేడీ పాలనకు చరమగీతం పాడేందుకు శరద్ యాదవ్, నితీశ్‌కుమార్ ఏకమయ్యారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ–ఆర్జేడీ అలయెన్స్ ఏర్పాటులో శరద్‌యాదవ్ కీలకంగా వ్యవహరించారు. తర్వాత శరద్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకున్నాక ఎల్జేడీ పెద్దగా ఎదగలేకపోయింది. అనారోగ్యం తదితర కారణాల వల్ల పార్టీ శ్రేణులకు మరో ప్రత్యామ్నాయం చూపేందుకే ఆయన విలీనం వైపు అడుగులు వేసినట్లు భావిస్తున్నారు. -
శరద్ యాదవ్ కుమార్తె కాంగ్రెస్‌లో చేరిక
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో నూతనోత్తేజం నెలకొంది. లోక్తాంత్రిక్ జనతాదళ్ చీఫ్ శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి రాజ్‌రావు బుధవారం ఢిల్లీలో సీనియర్ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఎల్జేపీ నేత, మాజీ ఎంపీ కాళీ పాండే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. తన తండ్రి ఆకాంక్షలకు అనుగుణంగా బిహార్‌లో మహాకూటమి తరపున పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను చేపడతానని ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న సుభాషిణి పేర్కొన్నారు. చదవండి : బిహార్ ఎన్నికలు.. మరక మంచిదే తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా లేరని, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా మహాకూటమిని బలోపేతం చేసి బిహార్‌ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రయత్నిస్తానని కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా సుభాషిణి చెప్పుకొచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు దశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు -
బాడీ షేమింగ్
‘బోండాం’ అనడం బాడీ షేమింగ్. ‘బక్క పీనుగ’ అనడమూ బాడీ షేమింగే. స్త్రీని పురుషుడు చేసే బాడీ షేమింగ్ అయితే ఇంకా రకరకాలుగా ఉంటుంది. బాడీ షేమింగ్ అని అతడికి తెలియకపోవచ్చు. ఆమెకు తెలుస్తుంది. హర్ట్ అవుతుంది. ఏ విధంగానైనా స్త్రీని బాడీ షేమింగ్ చెయ్యడం అంటే ప్రకృతి ధర్మాన్నే అవమానించడమే. స్త్రీ దేహధర్మాలు, స్త్రీ దేహ స్వభావాలు విలక్షణమైనవి. ఆ విలక్షణతల కారణంగా కొన్ని విభిన్నతలకూ ఆమె దేహం లోనవుతూ ఉండొచ్చు. ఆ విభిన్నతలను ఎత్తిచూపుతూ ఒక మాట అనడం అంటే.. జన్మనిచ్చే జెండర్‌ను కించపరచడమే. వసుంధరారాజే (65) సీనియర్ లీడర్. రాజస్తాన్ తొలి మహిళా ముఖ్యమంత్రి. మళ్లీ కనుక ఆమె ముఖ్యమంత్రి అయితే హ్యాట్రిక్ అవుతుంది. మూడోసారి ముఖ్యమంత్రి కాకుండా ఆమెను అడ్డుకోవాలంటే ఆమె ప్రభుత్వంలోని బలహీనతలేవో ఎత్తి చూపాలి. చేస్తానని చెయ్యని పనులేవైనా ఉంటే వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అయితే శరద్ యాదవ్, వసుంధరా రాజే ‘ఒంటిని’ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు! ఆయన కూడా సీనియర్ లీడరే. 73 ఏళ్లు. ‘ఏళ్లొచ్చాయ్ ఎందుకు?’ అనిపిస్తుంది రాజేను ఆయన చేసిన కామెంట్‌ని వింటే! వినే ఉంటారు. ‘‘వసుంధర కో ఆరామ్ దో. బహుత్ థక్ గయీ హై. మోటీ హో గయీ హై’’ అన్నారు. పోలింగ్‌కి ముందురోజు ప్రత్యర్థిపై ఆయన సంధించిన చివరి అస్త్రం అది! ‘‘వసుంధరకు విశ్రాంతి ఇవ్వండి. మనిషి బాగా లాౖÐð పోయి ఆయాస పడుతోంది’’ అని. స్త్రీని సవ్యంగా ఎదుర్కోలేకపోయినప్పుడే పురుషుడు ఇలా ఉక్రోషంతో ఆమె ఒంటి పైకి నోటిని ప్రయోగిస్తాడు. వాస్తవానికి శరద్, రాజే సమీప ప్రత్యర్థి ఏమీ కాదు. అయన్ది రాజస్తాన్ కూడా కాదు. ఎన్నికల ప్రచారం కోసం బిహార్ నుంచి వచ్చారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో పడక, గతేడాది జేడీయూ నుంచి బయటికి వచ్చి, ఈ ఏడాది మే నెలలో సొంతంగా ‘లోక్తాంత్రిక్ జనతాదళ్’ పార్టీ పెట్టుకుని రాజస్తాన్ ఎన్నికల్లో రాజేకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వచ్చారు. ఆ సందర్భంగానే శరద్, రాజే ఒంటిపై కామెంట్ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన వివరణ కూడా ఆయన స్థాయికి తగినట్లుగా లేదు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు క్యాబినెట్ మినిస్టర్‌గా చేసిన శరద్ యాదవ్.. ‘ఊరికే జోక్ చేశాను’ అన్నారు! ‘‘ఆమెను హర్ట్ చెయ్యాలని నా ఉద్దేశం కాదు. తనతో నాకు పాత పరిచయం ఉంది. ఆమెను కలిసినప్పుడు కూడా నేనిదే చెప్పాను.. మీరు లావౌతున్నారని’’ అన్నారు. శుక్రవారం జలావర్‌లోని ‘మహిళా పోలింగ్ బూత్’ నుంచి ఓటేసి వస్తూ.. ‘‘అతడి కామెంట్‌పై నేను ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయబోతున్నాను’’ అని రాజే మీడియా ప్రతినిధులతో అనగానే.. శనివారం ఆమెకు క్షమాపణలు చెబుతూ శరద్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్మృతి ఇరానీ (శరద్ యాదవ్) శరద్ యాదవ్ ఇలా మహిళల్ని కించపరుస్తూ, ‘బాడీ షేమింగ్’ (ఒంటి సైజు, ఒంటి షేప్, ఒంటి రంగును అవమానించడం) చెయ్యడం ఇదే మొదటి సారి కాదు. మూడేళ్ల క్రితం స్మృతి ఇరానీని ఇలాగే పార్లమెంటులో.. ‘నువ్వేంటో నాకు తెలుసు’ అన్నారు. గత ఏడాది విచిత్రంగా ఓటుకు, ఆడపిల్లలకు ముడిపెట్టి మాట్లాడారు. ఆడపిల్ల పరువు కన్నా ఓటు పరువు ముఖ్యమట. ‘‘ఆడపిల్ల అమ్ముడుపోతే ఇంటి పరువు, ఊరి పరువు మాత్రమే పోతాయి. ఓటు అమ్ముడు పోతే దేశం పరువే పోతుంది’’ అన్నారు. ఏంటో దానర్థం! ‘నువ్వేంటో నాకు తెలుసు’ అని స్మృతి ఇరానీని అన్న మాటల్లోని పరమార్థం ఏమిటో కూడా ఆయనకే తెలియాలి. రాజ్యసభలో ఇన్సూరెన్స్ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు డిబేట్ ఎటు నుంచి ఎటో వెళ్లిపోయి, ‘‘ఇండియాలో అందరికీ తెల్లగా ఉండే అమ్మాయిలే కావాలి. నల్ల అమ్మాయిలను ఎవరూ వధువుగా కోరుకోరు. దక్షిణాది మహిళలంతా నల్లగా ఉంటారు. అయినప్పటికీ వారిలో మెరుపు కనిపిస్తుంది..’’ అని యాదవ్ అన్నారు. అక్కడితో ఊరుకోకుండా ఇంకా వివరణ ఇవ్వబోతుంటే.. మంత్రి స్మృతి ఇరానీ డిప్యూటీ చైర్మన్ వైపు చూస్తూ ‘ఇక ఆపమనండీ’ అని అభ్యర్థించారు. దానికి యాదవ్ అసహనంతో.. ‘ఐ నో వాట్ యు ఆర్’ అని స్మృతిపై మండిపడ్డారు. రేణుకా చౌదరి (వెంకయ్య నాయుడు) ఈ ఏడాది మార్చిలో రాజ్యసభ సభ్యత్వపు పదవీకాలం పూర్తి చేసుకున్నవారిలో రేణుకా చౌదరి ఒకరు. ఆ వీడ్కోలు సభలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు, రేణుకా చౌదరికి మధ్య జరిగిన సంభాషణలోనూ రేణుక బాడీషేమింగ్‌కి గురయ్యారు. అయితే వారిద్దరి మధ్య ఉన్న చిరకాల పరిచయం కారణంగా అది కేవలం ఉల్లాసభరితమైన వాగ్వాదంగా మాత్రమే మిగిలిపోయింది. బరువు టాపిక్ తెచ్చింది మొదట రేణుకే. తన వీడ్కోలు ప్రసంగంలో ఆమె వెంకయ్యనాయుడును ఉద్దేశించి.. ‘సర్.. నా వెయిట్ గురించి అంతా వర్రీ అవుతున్నారు. కానీ ఇది మన వెయిట్ ఏంటో చూపించాల్సిన జాబ్ కదా’’ అన్నారు. అందుకు వెంకయ్యనాయుడు.. ‘‘మీరు వెయిట్ తగ్గండి. మీ పార్టీ వెయిట్ పెంచండి’’ అని సలహా ఇచ్చా రు. ఆ మాటకు రేణుక హాయిగా నవ్వేస్తూ.. ‘మా పార్టీ వెయిట్‌కి వచ్చిన నష్టం ఏమీ లేదు సర్. ఇటీస్ ఫైన్’ అన్నారు. అప్పటికే నాయుడు ఉపరాష్ట్రపతి. రేణుక గానీ, ఇతర మహిళలు కానీ పాయింట్ అవుట్ చెయ్యకపోవడంతో అది పెద్ద ఇష్యూ కాలేదు. షేక్ హసీనా (నరేంద్ర మోదీ) గత ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘ఆడమనిషై ఉండీ టెర్రరిజాన్ని జీరో టాలరెన్స్ (ఏమాత్రం సహించకపోవడం)తో నియంత్రిస్తోంది’ అని ఆయన అన్నారు. ‘ఆడ మనిషై ఉండీ’ అనడంలో మెచ్చుకోలు ఉన్నప్పటికీ.. ‘కంపారిటివ్లీ బలహీనమైన’ అనే అర్థం ధ్వనిస్తుండడంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇందులో బాడీ షేమింగ్ ఎక్కడున్నట్లు? ఉంది. ‘ఆడపిల్ల నయం కదా, ధైర్యంగా పోరాడింది’ అంటే.. అంతర్లీనంగా ఆమె బలహీనత స్ఫురిస్తుంది కదా. బలహీనమైన బాడీ అనడం షేమింగ్ కాక మరేమిటి?! మహిళల మీద (అబూ అజ్మీ) ఐదేళ్ల క్రితం సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ అజ్మీ ఒక కామెంట్ చేశాడు. ఆడవాళ్లను స్వేచ్ఛగా వదిలిపెడితే దోపిడికీ గురవుతారట. ఎందుకనంటే.. ‘‘వాళ్లు బంగారంలా విలువైనవారు. బాహాటంగా పెడితే ఆ బంగారాన్ని దోచుకునిపోతారు’’ అని ఆయన ఆందోళన. అందుకే ఆడవాళ్లు.. తోడు లేకుండా బయట తిరగకూడదు. చీకటైతే అసలు బయటికి రాకూడదు అని కూడా అన్నారు అజ్మీ. ఇదొక రకం బాడీ షేమింగ్. తమని తాము కాపాడుకోలేని దేహాలు అని చెప్పడమేగా! చివరికి ఆయన మాటలకు ఆయన కోడలు (కొడుకు ఫర్హాన్ భార్య) అయేషా టాకియా సోషల్ మీడియాలోకి వచ్చి క్షమాపణ చెప్పారు. ‘‘మా మామగారు అలా అని ఉండాల్సింది కాదు’’ అని. భార్యల మీద (శ్రీ ప్రకాశ్ జైస్వాల్) శ్రీ ప్రకాశ్ జైస్వాల్ అయితే ఏకంగా యావత్ద్దేశంలోని భార్యలనే బాడీ షేమింగ్ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ, మంత్రి ఆయన. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకు రెండేళ్ల క్రితం కాన్పూర్‌లోని ఒక మహిళా కాలేజ్‌లో ప్రసంగిస్తూ... ‘‘ఈ భార్యలున్నారే.. ముసలివాళ్లయిపోతారు. అప్పుడు వాళ్ల మీద ఏ ఆకర్షణా కలగదు’’ అన్నారు. ఎంత ఘోరమైన బాడీ షేమింగ్! పెద్ద చదువులుండి, పెద్ద హోదాలుండీ.. ఎందుకీ పెద్దవాళ్లు ఇలా చిన్న మాటలు మాట్లాడతారు? ఒక్క రాజకీయ నాయకులనే కాదు, ఏ రంగంలోని పురుషులైనా.. స్త్రీలను అవమానించడానికి, వ్యంగ్యంగా మాట్లాడటానికి వారి దేహాలను టార్గెట్ చెయ్యడం సంస్కారమేనా? బలవంతుణ్ని అనుకుంటాడు కదా మగవాడు! స్త్రీని బాడీ షేమింగ్ చెయ్యడమేనా అతడి బలం?! ప్రియాంకా చోప్రా (రాజ్‌నాథ్ సింగ్) కొన్ని కామెంట్లు పైకి బాడీ షేమింగ్‌గా అనిపించవు కానీ, లోతుగా చూస్తే వాటిల్లోనూ బాడీ షేమింగ్ కనిపిస్తుంది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్‌గా ఎన్నికైనప్పుడు రాజ్‌నాథ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా ప్రియాంక లక్నోలో ఉంటోంది. సీఎం స్థాయిలో ఉండి ఆయన ప్రియాంకను ప్రశంసించాల్సింది పోయి, ‘ఈ అందాలపోటీలను బ్యాన్ చెయ్యాలి. మన సంస్కృతిని ఇవి దిగజారుస్తున్నాయి’ అన్నారు. ఆయన ఉద్దేశం.. ఆడపిల్లలు వేదికలెక్కి ఒళ్లు చూపిస్తున్నారని! బ్యూటీ షేమింగ్‌లా కనిపించే బాడీ షేమింగ్ ఇది. -
‘చాలా అవమానకరం.. చర్యలు తీసుకోవాల్సిందే’
పట్నా : రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే తన మాటల వల్ల బాధ పడి ఉంటే ఆమెకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని జేడీ(యూ) బహిష్కృత నేత శరద్ యాదవ్ అన్నారు. ఈ మేరకు క్షమాపణ కోరుతూ ఆమెకు లేఖ కూడా రాస్తానని పేర్కొన్నారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శరద్ యాదవ్ వసుంధర రాజేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అల్వార్‌లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న యాదవ్... ‘వసుంధరకు కొంత విశ్రాంతి ఇవ్వండి.. ఈ మధ్య ఆమె చాలా అలసిపోయారు. అలాగే లావయ్యారు కూడా. ఆమె సన్నబడాల్సి ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఒక మహిళను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే బాడీ షేమింగేనని బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అంతేకాకుండా శరద్ యాదవ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన విమర్శల పాలయ్యారు. కాగా శరద్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన వసుంధర రాజే శుక్రవారం మాట్లాడుతూ.. ‘ షాక్‌కు గురయ్యాను. నిజంగా చాలా అవమానకరంగా అన్పించింది. ఇలా మహిళలను కించపరచడం ద్వారా యువతకు ఆయన ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘం తప్పకుండా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాల నేతలు వారి భాషను నియంత్రించుకోవాలి’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
‘ఆమె లావయ్యారు..విశ్రాంతి అవసరం’
జైపూర్ : బహిష్కృత జేడీ(యూ) నేత శరద్ యాదవ్ రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్ సీఎం వసుంధరా రాజెను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు బాడీ షేమింగ్ అంటూ ప్రత్యర్దులు విరుచుకుపడ్డారు. వసుంధర రాజె లావయ్యారని, ఆమెకు విశ్రాంతి అవసరమని శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ఆమెకు కొంత విశ్రాంతి ఇవ్వండి..మధ్యప్రదేశ్ బిడ్డ అయిన వసుంధర రాజె ఈ మధ్య లావయ్యారు..అలిసిపోతున్నా’రని బుధవారం ఆల్వార్‌లో జరిగిన ఓ ప్రచార సభలో పేర్కొన్నారు. శరద్ యాదవ్ వసుంధర రాజెపై చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. -
చీలిక దిశగా ఎన్డీయే..!
పట్నా : చీలిక దిశగా బిహార్‌లో ఎన్డీయే కూటమి మలుపులు తిరుగుతోంది. లోక్‌సభ సీట్ల పంపకంతో మొదలైన వీరి విభేదాలు సొంత కూటమిలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వరకు చేరింది. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీ ఆర్ఎల్ఎస్పీ అధినేత, కేంద్రమంత్రి ఉపేందర్ కుష్వాహా సోమవారం శరద్ యాదవ్‌తో భేటీ అయ్యారు. వారి భేటీ బిహార్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో శరద్‌ను కలిసిన ఉపేంద్ర రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయనకు వివరించినట్లు సమాచారం. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ, జేడీయూ మధ్య కుదిరిన లోక్‌సభ సీట్ల పంపిణీపై భాగస్వాయ్య పార్టీలైన ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కూటమిలో సరైన ప్రాతినిథ్యం లేని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామని ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్ఎల్ఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జేడీయూ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ కిషోర్‌తో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలపై ఉపేంద్ర స్పందించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎరగా చూపి జేడీయూలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు చీల్చడంలో నితీష్ ఘనుడని ఆయనపై మండిపడ్డారు. కాగా రాష్ట్రంలో ఎన్డీయేలో విభేదాలన్నింటికీ మూలకారణం సీట్ల పంపకమేనని కూటమిని నేతలు భావిస్తున్నారు. మిత్ర పక్షాలను సంప్రధించకుండా బీజేపీ, జేడీయూ లోక్‌సభ సీట్లలో 20-20 చొప్పున పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయని ఎల్జేపీ నేతలు అసంతృత్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అవుతామని ఎల్జేపీ నేత కేంద్రమంత్రి, రామ్‌విలాస్ పాశ్వాన్, ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. కాగా 40 లోక్‌సభ స్థానాలు గల బిహార్‌లో గత ఎన్నికల్లో బీజేపీ 20, ఎల్జేపీ ఏడు, ఆర్ఎల్ఎస్పీ మూడు స్థానాల్లో విజయం సాధించగా, జేడీయూ కేవలం రెండుస్థానాలకే పరితమైంది. బీజేపీకి షాకివ్వనున్న మిత్రపక్షాలు! -
సోషల్ మీడియా
నవభారత్ ఆవిష్కరణ ‘‘దేశ స్థూలజాతీయోత్పత్తి శరవేగంగా పెరుగుతోంది. వ్యవసాయం నుంచి తయారీ రంగం వరకు అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి కనిపి స్తోంది. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. సామాన్యులు తాము కన్న కలలు తీర్చుకునే అవకాశాలు వస్తాయి. ప్రధాన మంత్రి మోదీ ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడూ చూడని నవ భారతం ఆవిష్కృతమవుతోంది. ప్రధానికి అభినందనలు’’ – అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు ఉద్యోగ ఆశలకూ పరిమితి ‘‘ఇవాళ రేపు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం తాపత్రయపడు తున్నారు. అందరూ తమ జీవితం సాఫీగా సాగిపోవాలని అను కుంటున్నారు. ఒక్క పోస్టుకి లక్షల్లో దర ఖాస్తులు వస్తున్నాయి. కానీ, జీవితం ఎల్ల వేళలా నిశ్చింతగా ఉండదు. అధిక ఆశలు మనకి సమస్యలనే మిగులుస్తాయి’’ – అభిషేక్ మిశ్రా, వీహెచ్‌పి కార్యకర్త వ్యక్తి స్వాతంత్య్ర హరణం ‘‘స్వాతంత్య్రం అనేది ఉన్నట్టుండి కోల్పోయే అంశంగా ఉండదు. అంతి మంగా మనలో ప్రతి ఒక్కరి స్వాతంత్య్రం హరించుకు పోయేం తవరకు.. ఒక వ్యక్తి, ఒక కార్యకర్త, ఒక లాయర్, ఒక రచయిత, ఒక మేధావి నిత్యం తమ స్వాతంత్య్రాన్ని విడివిడిగా కోల్పోతూనే ఉంటారు’’ – ట్వింకిల్ ఖన్నాబాలీవుడ్ నటి ఉపాధి కల్పన హరీ ‘#rupee@71.. మన దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమై పోయింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, తదితర తప్పుడు విధానపరమైన నిర్ణయాలు ఒకవైపు... ఆకాశాన్నంటే పెట్రోల్, డీజీల్ ధరలు మరోవైపు దేశ ప్రజల్ని నిత్య కష్టాల్లోకి నెట్టేశాయి. కేవలం 10–15 టాప్ కంపెనీలకు మాత్రమే దేశంలో పని ఉంది. మిగిలిన వారికి ఉద్యోగాల్లేవు. చిన్నా చితకా వ్యాపారాలు ప్రస్తుతం నడవట్లేదు. కేంద్రం తీసుకున్న అనేక తప్పుడు నిర్ణయాలతో రైతులే కాదు సమాజంలోని అన్ని వర్గాల వారు చాలా బాధలు పడుతున్నారు.’’ – శరద్ యాదవ్మాజీ కేంద్ర మంత్రి రాఫెల్ బాంబులు ‘‘రాఫెల్ విమానాలు చాలా వేగంగా, సుదూరంగా ప్రయాణిస్తు న్నాయి. త్వరలోనే ఈ విమానాలు అతి పెద్ద బాంబుల్ని పేల్చబోతు న్నాయి. మోదీజీ కాస్త అనిల్‌కు చెప్పండి. ఫ్రాన్స్‌లో చాలా పెద్ద సమస్య ఉంది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు -
‘ముజఫర్‌పూర్’ రేప్‌లు సిగ్గుచేటు
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్ వసతి గృహంలో బాలికలపై అత్యాచారాలు సిగ్గుచేటని విపక్షాలు ఖండించాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం ఆర్జేడీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పలు పార్టీల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, సీపీఐ నాయకుడు డి.రాజా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నాయకుడు శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. బిహార్‌లో అధికార జేడీయూ–బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ముజఫర్‌పూర్ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికలకు అండగా ఉంటామని రాహుల్ అన్నారు. ప్రస్తుతం దేశమంతా ఒకవైపు, ఆర్ఎస్సెస్–బీజేపీ భావజాలం ఒకవైపు ఉన్నాయన్నారు. గత నాలుగేళ్లుగా జరుగుతున్న పరిణామాలను దేశం ఇష్టపడటం లేదని, ప్రజలు తలచుకుంటే ఎవరూ వారి ముందు నిలవలేరని అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్న తేజస్వి యాదవ్ మాట్లాడుతూ..రేప్ ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇలాంటి హేయమైన నేరాల్లో దోషులకు కఠిన శిక్ష విధించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అరాచకం రాజ్యమేలుతోందని ఏచూరి మండిపడ్డారు. ‘భేటీ బచావో’ నినాదం ‘సేవ్ భేటీ ఫ్రమ్ బీజేపీ’గా మారిందన్నారు. బాలికలకు బదులుగా బీజేపీ గోవులను కాపాడుతోందని శరద్ యాదవ్ ధ్వజమెత్తారు. -
శరద్ యాదవ్‌కు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : జేడీ(యూ) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నుంచి అనర్హత వేటుకు గురైన ఆయనకు ప్రస్తుతం లభిస్తున్న వేతనం, అలవెన్సులు, ఇతర సౌకర్యాలపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. శరద్ యాదవ్‌కు వేతనం, అలవెన్సులు, రైలు, విమాన టికెట్ల వంటి ఇతర సౌకర్యాలు నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవరిస్తూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే రాజ్యసభ నుంచి శరద్ యాదవ్ అనర్హత వేటు అంశం పరిష్కారమయ్యే జులై 12 వరకూ న్యూఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయకుండా ఆయనకు ఊరట కల్పించింది. రాజ్యసభ నుంచి తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ శరద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను వేగవంతం చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన సుప్రీం వెకేషన్ బెంచ్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కాగా న్యూఢిల్లీలోని అధికార నివాసంలో నితీష్ కుమార్ కొనసాగవచ్చన్న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ జేడీ(యూ) దాఖలు చేసిన పిటిసన్‌పై సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. జేడీ(యూ) రాజ్యసభ ఎంపీ రామచంద్ర ప్రసాద్ సింగ్ మే 18న దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు స్వీకరిస్తూ సుప్రీం కోర్టు శరద్ యాదవ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
టీడీపీ ఎంపీలు రాజీనామా చేయరెందుకు?
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ/న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఎంపీలకు సంఘీభావంగా ఇప్పటికే నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలతోపాటు మరిన్ని కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించాలని, బుధవారం నాడు రైల్‌రోకో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, చిత్తూరు, కడప, గుంతకల్, గుత్తి, కర్నూలు, అనంతపురంలలో రైల్‌రోకోలు నిర్వహించాలని పేర్కొంది. వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్ష కొనసాగినంత వరకూ ప్రతిరోజూ నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సూచించింది. ఈ ఆందోళనా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చింది. టీడీపీ ఎంపీలు రాజీనామా చేయరెందుకు ప్రత్యేక హోదా సాధన కోసం అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదో ప్రశ్నించాలని ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాజీనామా చేయకుండా కుంటిసాకులు వెతుక్కుంటున్న టీడీపీ ఎంపీలను ఎక్కడికక్కడ నిలదీయాలని పేర్కొంది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు సంధించింది. టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదు? వైఎస్సార్సీపీ ఎంపీలతోపాటు వారు ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేయడం లేదు? 25 మంది పదవులు వదులుకుని, ఆమరణ దీక్షకు దిగితే... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ జరగదా? ఎంపీల రాజీనామాలు, దీక్షలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, ప్రత్యేక హోదా ఇవ్వరా? రాజీనామాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఎందుకు కుంటిసాకులు వెతుక్కుంటున్నారు? లోక్‌సభ సభ్యులు రాజీనామా చేస్తే అది ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించదా? రేపు ఉప ఎన్నికలు వచ్చినా ప్రత్యేక హోదాపై ప్రజలు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే అవకాశం రాదా? ఇది తెలిసి కూడా చంద్రబాబు తన ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదు? అని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. నాలుగో రోజుకు ఎంపీల దీక్ష ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఆయన రక్తంలో చక్కెరస్థాయి పడిపోవడం, డీహైడ్రేషన్‌తో బాధపడుతుండడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు సుబ్బారెడ్డిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వైఎస్ అవినాశ్‌రెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి ఏపీ భవన్లో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షా వేదికపై ఎంపీలకు సంఘీభావం తెలిపారు. శరద్ యాదవ్ సంఘీభావం జేడీ(యూ) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ దీక్షా వేదికను సందర్శించి వైఎస్సార్సీపీ ఎంపీలకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వాలు మారినా ప్రధానమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నారు. పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్ చేశారు. హోదా సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీలను అభినందిస్తున్నానని, సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని శరద్ యాదవ్ అన్నారు. ఎంపీల ఆమరణ దీక్షకు పలు సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. ప్రాణాలైనా అర్పిస్తా: వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా సాధన కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి అన్నారు. దీక్ష కొనసాగిస్తున్న వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు సుబ్బారెడ్డిని బలవంతంగా ఆంబులెన్స్‌లోకి ఎక్కించి రామ్మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేయగా సుబ్బారెడ్డి బీపీ 104/60, షుగర్ లెవెల్స్ 64కు పడిపోయాయి. దీక్ష విరమణకు నిరాకరించడంతో వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆర్ఎంఎల్లో చికిత్స పొందుతున్న ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావులను వైఎస్ విజయమ్మ పరామర్శించారు. రాత్రి మేకపాటి, వరప్రసాదరావు డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం మెరుగుపడేవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్తున్న పోలీసులు -
ఏపీకి పూర్తి మద్దతు ఉంటుంది : శరద్ యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో తీవ్ర అన్యాయం జరిగిందని జేడీయూ మాజీ నేత శరద్‌యాదవ్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ దేశ రాజధానిలో వైఎస్సార్ సీపీ ఎంపీలు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా ప్రజలు హక్కునే అడుగుతున్నారు కానీ, కొత్త కోరికలు కోరడం లేదని ఆయన అన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న చట్టం ప్రకారం ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. కానీ కాంగ్రెస్‌ను బూచీగా చూపెడుతూ బీజేపీ మాటలు దాటేస్తుందని శరద్‌యాదవ్ విమర్శించారు. ఏపీకీ జరిగిన అన్యాయం గురించి విజయసాయిరెడ్డి వివరించారని అన్నారు. ఈ విషయంలో తమ పూర్తి మద్దతు వైఎస్సార్ సీపీకి ఉంటుందని శరద్ యాదవ్ తెలిపారు. -
బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి
లక్నో: మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా 2019 సాధారణ ఎన్నికలకు ముందే మహాకూటమి ఏర్పాటవుతుందని జేడీయూ మాజీ ఎంపీ శరద్‌యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయకోసం చేసే ఈ పోరాటంలో ఒంటరిగా ముందుకు వెళ్లడం సాధ్యం కాదని, బీజేపీ విస్తరించిన మతతత్వాన్ని అడ్డుకోవాలంటే మహా కూటమిగా ఏర్పడాలని అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అతిపెద్ద పోరాటం సామాజిక న్యాయం కోసమే. బీజేపీ విస్తరించిన మతతత్వ వాదానికి అడ్డుకట్ట వేస్తేనే ఇది సాధ్యపడుతుంది. 2019 ఎన్నికలకు ముందే బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటవుతుందనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయని, సమాజంలోని ఏ వర్గం బీజేపీపై సంతోషంగా లేరని, ఈసారి బీజేపీ హిందూ–ముస్లిం అజెండా పనిచేయబోదని చెప్పారు. -
‘గోరఖ్‌పూర్ ట్రైలర్ మాత్రమే..’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. బీజేపీకి అసలు సినిమా ముందుందని జేడీయూ మాజీ ఎంపీ శరద్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఒక మునిగిపోయే నావ అని అభివర్ణించారు. ఎన్డీయేలోని మిత్రపక్షాలన్నీ త్వరలోనే ఆ కూటమిని గుడ్‌బై చెప్తాయని ఆయన జోస్యం చెప్పారు. సిట్టింగ్ స్థానాలైన గోరఖ్‌పూర్, ఫూల్పుర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ‘ఎన్డీయే ఎజెండా విభజన రాజకీయాలతో సాగుతోంది. శివసేనతోపాటు టీడీపీ కూడా ఎన్డీయేను వీడింది. త్వరలో ఏ పార్టీ కూడా ఎన్డీయేలో ఉండదు’ అని శరద్ యాదవ్ లక్నోలో విలేకరులతో అన్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో మంగళవారం భేటీ అయిన శరద్ యాదవ్ త్వరలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా సమావేశమవుతానని తెలిపారు. యూపీలో యోగి సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అసలు వాస్తవమేమిటో ప్రజలు చూపిస్తారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు మహా కూటమి ఏర్పాటు కోసం తాను ప్రయత్నిస్తున్నాని, ఇందులో భాగంగానే దేశమంతట పర్యటిస్తున్నట్టు తెలిపారు. అఖిలేశ్‌తో దాదాపు గంటసేపు భేటీ అయిన శరద్ యాదవ్ జాతీయ రాజకీయాలు, బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఐక్యత అంశంపై చర్చించారు. -
శరద్‌యాదవ్‌కు ఝలక్
న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ సభ్యుడు, జేడీయూ బహిష్కృత నేత శరద్‌యాదవ్ అనర్హత కేసులో ఢిల్లీ హైకోర్టు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ఈ కేసులో తీర్పు ప్రతికూలంగా వస్తే ప్రస్తుతం యాదవ్ అందుకుంటున్న వేతనాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి రావొచ్చని జస్టిస్ రాజీవ్ షక్ధర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల ర్యాలీలో పాల్గొనడంతో శరద్‌యాదవ్, అన్వర్ అలీలను జేడీయూ సిఫార్సు మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు 2017, డిసెంబర్ 4న అనర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ యాదవ్ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ పూర్తయ్యేవరకూ ఎంపీలకు అందే అన్ని సౌకర్యాలను వీరిద్దరికీ కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో శరద్‌యాదవ్‌కు అందిస్తున్న సౌకర్యాలను తొలగించాలంటూ జేడీయూ రాజ్యసభ నేత రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకానందున ఆయనకు ఎలాంటి వేతనం, అలవెన్సులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్ రాజీవ్ తదుపరి విచారణను మార్చి 21కి వాయిదా వేశారు. ఈ కేసు విచారణను సింగిల్ జడ్జీ లేదా డివిజన్ బెంచ్‌లలో ఎవరికి అప్పగించాలన్న దానిపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామన్నారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న యాదవ్ పదవీకాలం 2022లో, అన్వర్ పదవీకాలం వచ్చేఏడాదితో ముగియనుంది. -
శరద్ పవార్ రాయని డైరీ
‘సంవిధాన్ బచావ్’ సక్సెస్ అయింది! రిపబ్లిక్ డే రోజు ముంబైలో పెద్ద ర్యాలీ తీశాం. సీతారాం ఏచూరి, శరద్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, పృథ్వీరాజ్ చవాన్, హార్ధిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్, ఇంకా.. నేను తెలిసినవాళ్లు, నాకు తెలియనివాళ్లు చాలామంది వచ్చారు. ర్యాలీ మధ్యలో ఎవరో నా వెనుక నుంచి నా ముందుకు వచ్చి.. ‘‘మీకెందుకు పవార్జీ.. శ్రమ’’ అని నా దగ్గర్నుంచి ఏదో లాక్కుపోయారు. ర్యాలీలో శరద్ యాదవ్ నా పక్కనే ఉన్నాడు. ‘‘యాదవ్.. నా దగ్గర్నుంచి ఎవరో ఏదో లాక్కుపోయారు, వాళ్లెవరో చూడొద్దు కానీ, ఏం లాక్కుపోయారో చూసి చెప్పు’’ అన్నాను. ‘‘మీ దగ్గర ఏం ఉండేదో గుర్తు చేసుకుంటే, మీ దగ్గర్నుంచి ఏం లాక్కుపోయారో తెలుస్తుంది కదా సర్’’ అన్నాడు హార్ధిక్ పటేల్! కుర్రాడు షార్ప్‌గా ఉన్నాడు. ‘‘పోనీ, నువ్వు చెప్పు. నువ్వూ నా పక్కనే ఉన్నావు కదా’’ అన్నాను. ‘‘మీ దగ్గర్నుంచి ఏం లాక్కెళ్లారో చెప్పలేను కానీ, మీ దగ్గర్నుంచి ఎవరు లాక్కెళ్లారో చెప్పగలను సర్’’ అన్నాడు హార్ధిక్ పటేల్. ‘‘మనది ఎవరు లాక్కెళ్లారో మనకెందుకయ్యా. మనది ఏం లాక్కెళ్లారో ముఖ్యం కానీ’’ అన్నాను. ‘‘కానీ సర్, మనది ఏం లాక్కెళితే మనకెందుకు? మనది ఎవరు లాక్కెళ్లారో ముఖ్యం కానీ’’ అన్నాడు. జనరేషన్ గ్యాప్! ర్యాలీ అయ్యాక అంతా ఒకచోట కూర్చున్నాం. ‘‘29న ఢిల్లీకి ఎవరొస్తారో చేతులెత్తండీ’’ అన్నాను. కొంతమంది ఎత్తారు. కొంతమంది ఎత్తలేదు! ఎత్తినవాళ్లు ఎందుకు ఎత్తారో అడిగాను. ‘‘మీరు ఎత్తమన్నారు కాబట్టి ఎత్తాం’’ అన్నారు. ఎత్తనివాళ్లు ఎందుకు ఎత్తలేదో అడిగాను. ‘‘ఆ రోజు మేము ఢిల్లీలోనే ఉంటాం కాబట్టి ఎత్తలేదు’’ అన్నారు! ‘‘ఉంటే మాత్రం? చెయ్యెత్తకూడదా?’’ అన్నాను. ‘‘ఢిల్లీలో లేనివాళ్లు ఢిల్లీ రావడానికి చెయ్యెత్తాలి కానీ, ఢిల్లీలో ఉండేవాళ్లు ఢిల్లీ వస్తామని చెయ్యెత్తడానికి ఏముంటుంది పవార్జీ?’’ అన్నారు! ‘‘అక్కడ మళ్లీ ఇంకొక ర్యాలీనా సర్’’ అన్నాడు అల్పేశ్ ఠాకూర్ ఉత్సాహంగా. ‘‘ర్యాలీ కోసం కాదయ్యా.. అందరం కూర్చొని మాట్లాడుకోడానికి. ఇవాళెందుకు ర్యాలీ తీశాం? రాజ్యాంగాన్ని రాయిలా చేత్తో పట్టుకుని తిరుగుతున్నాడనే కదా మోదీ! ఆయన చేతుల్లోంచి రాజ్యాంగాన్ని లాగేసుకోవడం ఎలా అని ఆ రోజు ప్లాన్ చేస్తాం’’ అని చెప్పాను. హార్థిక్ పటేల్ నా చేతికి జాతీయ జెండా అందించాడు!! ‘‘ఏంటయ్యా ఇది? కాంప్లిమెంటా!’’ అన్నాను. ‘‘లాక్కెళ్లినవాడి దగ్గర్నుంచి లాక్కొచ్చాను సార్’’ అన్నాడు! అతడివైపు చూశాను. లాక్కొచ్చే పనికి బాగా పనికొచ్చేలా ఉన్నాడు. ‘‘రా.. నా పక్కన కూర్చో’’ అన్నాను. - మాధవ్ శింగరాజు -
చంద్రబాబుది వ్యాపార ధోరణి: శరద్‌యాదవ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారని జనతాదళ్ (యూ) మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ శరద్‌యాదవ్ విమర్శించారు. కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ స్మారక కమిటీ ఆదివారం విశాఖ వుడా బాలల థియేటర్లో ‘రాజ్యాంగాన్ని రక్షించండి– ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ’అనే అంశంపై నిర్వహించిన స్మారకోపన్యాసంలో శరద్‌యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అమరావతిని పచ్చదనం స్థానంలో కాంక్రీట్ జంగిల్‌గా మార్చేశారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. -
2017 : అత్యంత వివాదాస్పద ఘటనలు
మరికొన్ని గంటల్లో 2017 చరిత్రలోకి జారుకుని.. జ్ఞాపకాలను మాత్రం మనకు వదిలేస్తోంది. పలువురు నేతలు దేశాన్ని, పార్టీలను, మత విశ్వాసాలను ప్రభావితం చేసే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని మంటలు పుట్టించాయి.. మరికొన్ని ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించాయి. ఏడాది ముగుస్తున్న సందర్భంలో.. ఇటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రాహుల్ గాంధీ : వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏడాదిని మొదలు పెట్టారు. జనవరి 11న న్యూఢిల్లీలో జరిగిన ‘జనవేదన సమ్మేళన్’లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుపై మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ‘శివాజీ, గురునానక్, బుద్ధుడు, మహావీరుడు’ వంటి వారిలో నేను కాంగ్రెస్ గుర్తును చూశాను అంటూ వ్యాఖ్యానించారు. ఇది అభయహస్తం అంటూ.. ఆయన చెప్పుకొచ్చారు. శరద్‌యాదవ్ : జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఓటు గొప్పతనం గురించి చెప్పే క్రమంలో మహిళలను అత్యంత దారుణంగా అవమానించారు. పట్నాలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న శరద్ యాదవ్ మాట్లాడుతూ.. ఆడపిల్లల గౌరవం కన్నా ఓటుకు ఉన్న గౌరవమే ఎక్కువని చెప్పారు. ఆడపిల్ల గౌరవం పోతే ఆ గ్రామం.. ఊరుకు అవమానమని.. అదే ఓటు గౌరవం పోతే దేశానికే నష్టమని ఆయన అన్నారు. సాక్షి మహరాజ్ : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అయిన బీజేపీనేత సాక్షి మహరాజ్.. నలుగురు భార్యలు 40 మంది పిల్లల సంస్కృతి వల్లే జనాభా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వచ్చాయి. వినయ్ కతియార్: 2017 ఏడాది మొత్తం వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యల చుట్టూ తిరిగిందని చెప్పవచ్చు. ఏడాది ఆరంభంలో.. ప్రియాంక గాంధీ అందంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ప్రియాంక గాంధీ తరువాత.. తాజ్ మహల్, జామా మసీదుపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ శివాలయమే అని, ప్రఖ్యాత జామా మసీదు జమునా దేవి అలయం అంటూ ఆయన కొత్త వివాదాలకు తెరలేపారు. సందీప్ దీక్షిత్: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నేత అయిన సందీప్ దీక్షిత్, ఆర్మీ చీఫ్ బిపన్ రావత్‌పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. బిపిన్ రావత్‌ను ఒక వీధి గూండాగా సందీప్ పోల్చడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై చివరకు సందీప్ దీక్షిత్ క్షమాపణలు కోరారు. సంగీత్ సోమ్ బీజేపీ యువనేత సంగీత్ సోమ్ తాజ్ మహాల్‌పై చేసిన వ్యాఖ్యలు ఈ ఏడాది ప్రజల ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపాయి. తాజ్ మహల్‌ను ఆయన దేశద్రోహులు కట్టిన కట్టడంగా పేర్కొనడం వివాదానికి కారణమైంది. అదే సమయంలో మొఘల్ చక్రవర్తులపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మణిశంకర్ అయ్యర్: కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన రెండు వివాదాస్పద వ్యాఖ్యల ఆ పార్టీకి శరాఘాతంలా మారాయి. ముఖ్యంగా 2014లో మోదీపై చేసిన చాయ్‌వాలా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరణశయ్య మీదకు చేర్చాయి. 2017లో గుజరాత్ ఎన్నికల ఆఖరి సమయంలో మోదీపై అయ్యర్ చేసిన నీచ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ పీఠాన్ని దూరం చేశాయి. 2014లో ప్రధాని మోదీపై చేసిన చావ్వాలా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని దూరం చేస్తే.. ఈ ఏడాది చేసిన నీచ్ వ్యాఖ్యలు అనంత్ కుమార్ హెగ్డే : 2017 ముగుస్తుందన్న సమయంలో కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా రాజ్యంగ పీఠికలో ఉన్న ‘లౌకిక’ అనే పదాన్ని తొలగిస్తామని..అందుకే అధికారంలోకి వచ్చామని అనంత్ కుమార్ చేసిన ప్రకటనపై ఉభయసభలు దద్దరిల్లాయి. చివరకు అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై పార్టీకి సంబంధంలేదని బీజేపీ ప్రకటించింది. చివరకు అనంత్ కుమార్ హెగ్డే కూడా తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. -
ఆల్ ఈజ్ ఇన్ వెల్...
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజే పెద్దల సభ దద్దరిల్లింది. తమ పార్టీ రాజ్యసభ ఎంపీలపై జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అనర్హత వేటు వేసిన వ్యవహారంపై రాజ్యసభలో దుమారం రేగింది. సీనియర్ నేత శరద్ యాదవ్‌కు మద్దతుగా కాంగ్రెస్ సభ్యులు సభలో చర్చలేవనెత్తారు. శరద్ పై అనర్హత వేటు తప్పన్న కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్.. నితీశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఒకదశలో సభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు(ఉపరాష్ట్రపతి) ఈ అంశంపై చర్చ అవసరం లేదని ప్రకటించటంతో అసంతృప్తికి లోనైన కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో ఆయన సభను కాసేపు వాయిదా వేశారు. కాగా, ఈ నేతలిద్దరూ తమ పార్టీ ఆదేశాలను ధిక్కరించి, ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు హాజరయ్యారని, తద్వారా వారు స్వచ్ఛందంగా తమ సభ్యత్వాలను వదులుకున్నారని రాజ్యసభ చైర్మన్‌కు జేడీయూ విన్నవించింది. దీని ఆధారంగా శరద్ యాదవ్‌తోపాటు అలీ అన్వర్‌ను రాజ్యసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ ఈ నెల 4న రాజ్యసభ ఆదేశాలు జారీ చేసింది. ఇక తమపై పడిన వేటు గురించి మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి తనను అనర్హుడిగా ప్రకటిస్తూ జారీ అయిన ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేసే ముందు తన వాదనను వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని పిటిషన్లో ఆయన తెలిపారు. ప్రాసతో వెంకయ్య... ఈ గందరగోళం నడుమ కూడా చైర్మన్ వెంకయ్యనాయుడు తన వాక్ చాతుర్యం చూపించటం విశేషం. వెల్‌లోకి దూసుకొచ్చిన సభ్యులను ఉద్దేశించి.. ఆల్ ఇన్ వెల్.. నాట్ వెల్... (అంతా వెల్‌లోకి రావటం బాగా లేదు) అంటూ రైమింగ్‌తో సభను వాయిదావేశారు. తిరిగి సభ ప్రారంభం కాగా, ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల అంశం లేవనెత్తటంతో మరోసారి సభలో గందరగోళం చెలరేగి సభ మధ్యాహ్నాం 2గం.30ని. కి వాయిదా పడింది. గుజరాత్ ఎన్నికల కోసం మాజీ ప్రధాని మన్మోహన్, ఇతర కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్‌తో చేతులు కలిపారంటూ మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇవి సాధారణ ఆరోపణలు కాదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. Leader of Opposition GN Azad raises the issue of PM Modi's allegations against former PM (Manmohan Singh) & others of conspiring with Pakistan for #GujaratElection2017, says, 'ye sadharan aarop nahi hai.' House adjourned till 2:30 pm. pic.twitter.com/bMZ23wNWXK — ANI (@ANI) December 15, 2017 -
శరద్ యాదవ్‌కు బిగ్ షాక్.. నితీశ్ ఫుల్ హ్యాపీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు శుభవార్త అందించింది. ఆయన నేతృత్వంలోని జనతా దళ్ (యూనైటెడ్) పార్టీని నిజమైన వర్గంగా గుర్తిస్తూ గురువారం నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ బాణం గుర్తును కూడా నితీశ్ వర్గానికే కేటాయిస్తున్నట్లు తెలిపింది. ‘‘మెజార్టీ సభ్యుల మద్ధతు నితీశ్‌కే ఉంది. నేషనల్ పార్టీ కౌన్సిల్ కూడా ఆయన వెంటే ఉంది. అలాంటప్పుడు జేడీయూ పార్టీపై శరద్ యాదవ్‌కు ఎలాంటి హక్కు ఉండవు’’ అని ఈసీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. దీంతో శరద్ యాదవ్ వర్గం ఢీలా పడిపోయింది. కాగా, మహాకూటమి నుంచి ఈ యేడాది జూలై 26న నితీశ్ వైదొలిగిన తర్వాత.. ఆ నిర్ణయంపై శరద్ యాదవ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోగా.. శరద్ యాదవ్‌ను రాజ్యసభ ప్రాతినిథ్యం నుంచి తప్పిస్తూ నితీశ్ మరో కవ్వింపు చర్య చేపట్టారు. దీంతో అసలైన పార్టీ తమదేనంటూ శరద్ తరపున ఆ వర్గ నేత చోటుభాయ్ అమరసంగ వాసవ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. -
ఈసీపై నమ్మకం పోతోంది!?
సాక్షి, న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. గుజరాత్‌కు కూడా షెడ్యూల్ ప్రకటించాలని జేడీయూ బహిష్కృత నేత రాజ్యసభ ఎంపీ శరద్‌యాదవ్ పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల తేదీను ప్రకటించకపోవడం అనేది ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించేలా ఉందని ఆయన అన్నారు. అవినీతి విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని.. ఇంకు అమిత్ షా తనకుడు జై షా వ్యవహారం నిదర్శనమని ఆయన చెప్పారు. దేశ ప్రజలకు ఎన్నికల సంఘంపై నమ్మకం, విశ్వాసం ఉన్నాయని.. అవి సడలకముందే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. -
శరద్ జేడీయూ దరఖాస్తు తిరస్కరణ’
పట్నా: శరద్ యాదవ్ వర్గానికి జేడీయూ పార్టీ గుర్తును కేటాయించేందుకు ఎన్నికల కమిషన్ నిరాకరించిందని బిహార్ సీఎం నితీశ్ వర్గానికి చెందిన జేడీయూ పార్లమెంటరీ పక్షనేత ఆర్సీపీ సింగ్ తెలిపారు. శరద్ వర్గం తగిన సాక్ష్యాధారాలను సమర్పించలేకపోవడంతో వారి దరఖాస్తును ఈసీ తిరస్కరించిందని వెల్లడించారు. ఈ మేరకు ఈసీ కార్యదర్శి రాసిన లేఖను విడుదల చేశారు. ఈసీ నిర్ణయంపై తగిన నిర్ణయం తీసుకుంటామని శరద్ యాదవ్ తెలిపారు. -
అది అపరిపక్వ నిర్ణయమన్న శరద్ యాదవ్
న్యూఢిల్లీః నోట్ల రద్దుపై ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలతో ఈ నిర్ణయం అపరిపక్వమైనదని తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని జేడీ(యూ) నేత శరద్ యాదవ్ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రభుత్వం ఆశయాల్లో ఏ ఒక్కదాన్నీ చేరుకోలేదని విమర్శించారు. నోట్ల రద్దుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకే అమ్ముకుని 50 నుంచి 60 శాతం వరకూ ఆదాయాలను కోల్పోయారని అన్నారు. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు కసరత్తు చేపట్టకుండా తీసుకున్న నిర్ణయంతో కోట్లాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ తేరుకోలేదని అన్నారు. -
పట్నాలో ఆర్జేడీ భారీ సభ
సాక్షి, పట్నా: 'దేశ బచావో-బీజేపీ భాగవో' పేరిట రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆదివారం పట్నాలోని గాంధీ మైదానంలో భారీ సభను నిర్వహిస్తోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సభలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలు పాల్గొంటున్నారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ సభకు గైర్హాజరు అవుతుండటం విపక్షాల్లో ఐక్యతపై అనుమానాలకు తావిస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన బిహార్ మహాకూటమి నుంచి తప్పుకొని.. తిరిగి బీజేపీతో చేతులు కలిపి నితీశ్‌కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సభ జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సభలో జేడీయూ అసమ్మతి నేతలు శరద్ యాదవ్, అలీ అన్వర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. జేడీయూ ఎంపీలైన ఈ ఇద్దరు అసమ్మతి నేతలు లాలూతోపాటు వేదిక పంచుకోనున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డీ రాజా, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు సభలో పాల్గొనున్నారు. లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతి, తనయులు తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. -
బీజేపీకి పోటీగా ప్రతిపక్షాల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీని సమర్థంగా ఎదుర్కొనేందుకు 15 మంది ప్రతిపక్ష పార్టీల సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటైంది. జేడీ(యూ) తిరుగుబాటు నేత శరద్‌యాదవ్ దీనికి కన్వీనర్‌గా వ్యవహరించనున్నా రు. భావ సారూప్య ప్రతిపక్ష పార్టీలను ఐకమత్యంగా ఉంచడంతో పాటు, బీజేపీ విధానాలను నిరసిస్తూ అన్ని రాష్ట్రాల్లో ‘మన వైవిధ్య సంస్కృతిని కాపాడుకుందాం’ అనే నినాదంతో సమావేశాలు నిర్వహించడం కమిటీ లక్ష్యం. కమిటీలో... ఆనంద్ శర్మ (కాంగ్రెస్), రామ్‌గోపాల్(ఎస్పీ), వీర్‌సింగ్ (బీఎస్పీ), సీతారాం ఏచూరి (సీపీఎం), సుఖెందు శేఖర్ రాయ్(టీఎంసీ), తారిక్ అన్వర్(ఎన్సీపీ), డి.రాజా(సీపీఐ), మనోజ్ సిన్హా(ఆర్జేడీ), బీఆర్ అంబేడ్కర్(భారియా బహుజన్ మహాసంఘ్), హేమంత్ సోరెన్ (జేఎంఎం) తదితరులున్నారు. -
తెలివితక్కువ పనులు చేశా: సీఎం
పట్నా: అలీ అన్వర్ అన్సారీని రెండు సార్లు ఎంపీని చేసి తప్పుచేశానని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నాయకుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. బిహార్ ప్రజలు ఒక కుటుంబానికి అనుకూలంగా ఓటు వేయలేదని లాలూ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. పట్నాలో శనివారం జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్డీయేలో చేరటంపై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ.. 'ఒకాయన రాజ్యసభకు ఎన్నికకాగానే చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. 2012లో బీజేపీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూడండి. నా సహచరులు అన్నట్టు, కొన్ని సమయాల్లో నేను తెలివితక్కువ పనులు చేశానని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఆయనను రెండుసార్లు రాజ్యసభకు పంపిస్తే ఇప్పుడు నాకే ఉపదేశాలు బోధిస్తున్నార'ని అన్సారీపై నితీశ్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. లౌకికవాదంకు మద్దతుగా 2015లో బిహార్ ప్రజలు మహాకూటమిని గెలిపించారని శరద్ యాదవ్ వర్గం చేసిన చేసిన వ్యాఖ్యలపైనా నితీశ్ స్పందించారు. 'తమకు సేవ చేయాలని బిహార్ ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. అంతేకాని ఒక కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి కాద'ని నితీశ్ పేర్కొన్నారు. కాగా, అలీ అన్వర్ అన్సారీతో పాటు 21 మంది బిహార్ నాయకులను జేడీయూ ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించింది. -
శరద్ యాదవ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
ఎన్డీయేలో జేడీయూ చేరిక
- జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం - పార్టీ మొదట్నుంచీ నేనున్నా.. నన్నే తరిమేస్తారా?: శరద్ యాదవ్ పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీయే గూటికి చేరింది. బీజేపీ కూటమితో ఉన్న పాత బంధాన్ని మళ్లీ చిగురింపజేసింది. పట్నాలో శనివారం జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్డీయేలో చేరటంపై తీర్మానం చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాకూటమికి జేడీయూ గుడ్ బై చెప్పింది. జాతీయకార్యవర్గ సమావేశంలో నితీశ్ మాట్లాడుతూ.. తమ వర్గంపై విమర్శలు చేస్తున్నవారు దమ్ముంటే పార్టీని చీల్చి చూపించాలని పరోక్షంగా శరద్ యాదవ్‌కు సవాల్ విసిరారు. పార్టీ జాతీయ కార్యవర్గానికి గైర్హాజరైన శరద్ యాదవ్.. పార్టీ ఎంపీ అలీ అన్వర్‌తో కలిసి ‘జన్ అదాలత్’ నిర్వహించారు. ప్రజలు 2015లో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నితీశ్ బీజేపీతో జట్టుకట్టాడని ఆయన విమర్శించారు. కాగా, ఎన్డీయేలో చేరుతూ జేడీయూ జాతీయ కార్యవర్గం తీర్మానం చేయటాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా స్వాగతించారు. అంతా మావైపే: కేసీ త్యాగి ‘పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో సమావేశమైన జేడీయూ జాతీయ కార్యవర్గం.. ఎన్డీయేలో చేరాలని తీర్మానించింది. దీంతో మేం ఎన్డీయేలో భాగస్వాములమయ్యాం’ అని పార్టీ సీనియర్ నేత త్యాగి స్పష్టం చేశారు. ‘71 మంది పార్టీ ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీలు, పార్టీ పదాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాంటప్పుడు పార్టీలో చీలిక ఉందని ఎలా అంటారు?’ అని త్యాగి ప్రశ్నించారు. శరద్ యాదవ్‌పై ప్రస్తుతానికి విప్ జారీ చేయబోవటంలేదని ఆయన తెలిపారు. అయితే పట్నాలో ఆగస్టు 27న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో జరగనున్న విపక్షాల ర్యాలీకి శరద్ యాదవ్ హాజరైతే.. చర్యలు తప్పవన్నారు. బిహార్ సీఎం అధికారిక నివాసం ముందు నితీశ్, యాదవ్ వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అప్పుడెందుకు మాట్లాడలేదు! తమదే అసలైన పార్టీ అని చెబుతున్న యాదవ్ వర్గం నేతలు.. దమ్ముంటే పార్టీని చీల్చాలని సవాల్ విసిరారు. ‘వారికి సత్తా ఉంటే జేడీయూ శాసనసభాపక్షాన్ని చీల్చి చూపించాలి. అనవసరంగా పసలేని విమర్శలు చేయటం మానుకోండి. 2013లో ఎన్డీయే నుంచి జేడీయూ విడిపోవాలనుకున్నప్పుడు శరద్ యాదవ్ ఎందుకు మాట్లడలేదు? అప్పుడు మీరే పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కదా?’ అని నితీశ్ ప్రశ్నించారు. ‘2004 లోక్‌సభ ఎన్నికల్లో మధేపుర నుంచి శరద్ యాదవ్ ఓడిపోతే.. అప్పటి పార్టీ చీఫ్ జార్జి ఫెర్నాండేజ్‌తో రెండుగంటలపాటు మాట్లాడి రాజ్యసభకు శరద్ యాదవ్‌ను పంపేలా ఒప్పించాను’ అని నితీశ్ పేర్కొన్నారు. ‘చౌదరీ దేవీలాల్‌తో కలిసి పార్టీ నిర్మాణంలో పనిచేశాను. నన్నే తరిమేయాలనుకుంటున్నారు. నేను ఎవరికీ భయపడను’ అని శరద్ యాదవ్ అన్నారు. -
లాలూ ర్యాలీకి హాజరైతే అంతే...,
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఆ పార్టీ రెబెల్ నేత శరద్ యాదవ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈనెల 27న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తలపెట్టిన ర్యాలీకి హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించింది. శరద్ యాదవ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఆయన సీనియారిటీ, పార్టీతో సుదీర్ఘ అనుబంధం దృష్ట్యా చర్యలు తీసుకోలేదని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి తెలిపారు. అయితే లాలూ ర్యాలీకి హాజరైతే మాత్రం ఆయన లక్ష్మణ రేఖ దాటినట్టుగా భావించి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. శరద్ యాదవ్ తనకు తానుగా పార్టీని వీడారని, భౌతికంగా ఆయన తమ పార్టీలో లేరని వ్యాఖ్యానించారు. సీఎం అధికార నివాసంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నఅనంతరం త్యాగి విలేకరులతో మాట్లాడుతూ శరద్ యాదవ్‌ను రాజ్యసభలో జేడీయూ పక్ష నేతగా తొలగించడాన్ని సమర్ధించారు. -
శరద్‌యాదవ్.. బల ప్రదర్శన
న్యూఢిల్లీ: జేడీ(యూ) నేత శరద్‌యాదవ్ ప్రతిపక్షాలతో కలసి నేడు బల నిరూపణకు దిగనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్, గులామ్ నబీ ఆజాద్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరీ, సీపీఐ నుంచి డి.రాజా, ఆర్జేడీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ నుంచి అఖిలేశ్‌యాదవ్ హాజరవుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా శరద్‌యాదవ్ మాట్లాడుతూ.. ‘నైతిక విలువతో కూడిన’ రాజకీయాలు దేశానికి ఆత్మ లాంటివని, దాన్ని మేల్కొలిపేందుకే ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల మరణం, జేఎన్‌యూ యూనివర్సిటీ విద్యార్థి నజీబ్ అహ్మద్, రైతు ఆత్మహత్యలు.. ఇలా పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. -
ఎన్సీపీ కూడా ‘చెయ్యి’స్తుందా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో ఏకమవుతున్న ప్రతిపక్షాల కూటమి నుంచి బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఇప్పటికే తప్పుకోగా ఇప్పుడు శరద్ యాదవ్ నాయకత్వంలోని ఎన్సీపీ తప్పుకోనుందని ఊహాగానాలు బయల్దేరాయి. సోనియా గాంధీ నాయకత్వాన శుక్రవారం జరిగిన విపక్షాల సమావేశానికి ఎన్సీనీ హాజరుకాకపోవడమే ఈ ఊహాగానాలకు కారణమైంది. నితీష్ కుమార్ పార్టీ జేడీయూ విపక్షాల కూటమి నుంచి తప్పుకున్న నేపథ్యంలో జరిగినందున ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్రంలో బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలనే అంశంపై సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి సమావేశానికి ఎన్సీపీ రాకపోవడం ఊహాగానాలకు తెరలేపింది. ఇంతకుముందు జరిగిన అన్ని విపక్షాల సమావేశానికి శరద్ పవార్ హాజరయ్యారు. ఈసారి మాత్రం తాను అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నానని కబురు పంపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబోలు అనుకున్నారు. ఇంతలో తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ బహిరంగంగా ప్రకటించడం వారిని ఇరుకున పెట్టింది. ఇటీవల గుజరాత్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేసినప్పటికీ వేయలేదని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నందున తాము అసంతప్తితో ఉన్నట్లు ఎన్సీపీ నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బయట మాట్లాడకపోయినా అంతర్గతంగా పార్టీ నాయకులు తమ అనుమానాన్ని ఎన్సీపీ నాయకుల ముందు బయటపెట్టారు. అహ్మద్ పటేల్ ఒక్క ఓటుతో ఆ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. జేడీయూ వేయడం వల్ల ఆ ఒక్క ఓటుతో గట్టెక్కామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కేంద్రంలో, అటూ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ మొదటి నుంచి కలసి కాపురం చేస్తున్నప్పటికీ ఎన్సీపీ పట్ల కాంగ్రెస్‌కు ఎన్నడూ పూర్తి విశ్వాసం లేదు. అందకు కారణం శరద్ పవార్ అన్ని రాజనీయ పార్టీలతో సన్నిహితంగా ఉండడమే. ఎప్పుడు ఎవరి పట్ల ఎలా వ్యవహరిస్తారో ఎవరికి అర్థం కాకపోవడమే. ఆయన రాజకీయ కదలికలు అర్థం కాకపోవడం వల్ల మున్ముందు బీజేపీ–శివసేన కూటమి ప్రభుత్వం నుంచి శివసేన తప్పుకున్న పక్షంలో బీజేపీకి ఎన్సీపీ తప్పకుండా మద్దతిస్తుందన్నది కాంగ్రెస్ విశ్వాసం. 2019 సార్వత్రిక ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష కూటమికి దూరంగా ఉండాల్సిందిగా ఆది నుంచి ఎన్సీపీపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండడం, అలాగే సీనియర్ ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖా మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండడం వల్ల వారు మోదీ ఒత్తిళ్లకు లొంగిపోతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల భావన. కేంద్రంలోని దర్యాప్తు సంస్థల ద్వారా లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్జేడీతో జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకునేలా చేసిందీ మోదీయేనని, ఇప్పుడు ఎన్సీపీపై కూడా అలాగే ఒత్తిడి తెస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాల కూటమి నుంచి ఎన్సీపీ కూడా తప్పుకుంటే ఆ కూటమికి పెద్ద నష్టమే. విపక్షాలన్నీ ఎలా కలసికట్టుగా వెళ్లాలో, ప్రభుత్వాన్ని దబ్బెతీసే విధంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలో నిర్ణయం తీసుకునేందుకు సోనియా గాంధీ మొన్నటి సమావేశంలో ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు తదుపరి కార్యాచరణ ఉండవచ్చు. -
మాదే అసలైన జేడీయూ
14 రాష్ట్రాల విభాగాల మద్దతుందన్న శరద్ యాదవ్ వర్గం న్యూఢిల్లీ: జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్‌ను రాజ్యసభలో పార్టీ నాయకుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా తొలగించిన నేపథ్యంలో తమదే అసలు జేడీయూ అని చాటేందుకు శరద్ యాదవ్ వర్గం సిద్ధమవుతోంది. 14 రాష్ట్రాల జేడీయూ విభాగాలు శరద్ యాదవ్ వెంట ఉన్నాయనీ, సీఎం నితీశ్ కుమార్ బిహార్‌కే పరిమితమని శరద్‌యాదవ్ సన్నిహితుడైన అరుణ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శరద్ యాదవ్‌కు ఇద్దరు రాజ్యసభ సభ్యులు, పార్టీలోని పలువురు ఆఫీస్ బేరర్ల మద్దతు కూడా ఉందని ఆయన వెల్లడించారు. జేడీయూ ఒక్క బిహార్‌లో మాత్రమే నమోదిత పార్టీ అని నితీశ్ అనడాన్ని అరుణ్ ప్రస్తావిస్తూ తమది ఎప్పుడూ జాతీయ పార్టీనేనని పేర్కొన్నారు. గతంలో నితీశ్ కుమారే తన సమతా పార్టీని జేడీయూలో విలీనం చేశారని అరుణ్ గుర్తు చేశారు. ‘మేం (శరద్ యాదవ్ వర్గం) పార్టీని వీడి వెళ్లం. బిహార్ బయట పార్టీనే లేదని నితీశ్ స్వయంగా చెబుతున్నారు. కానీ మాది జాతీయపార్టీ. దానిని లాక్కోవడానికి నితీశ్ యత్నించకూడదు. బిహార్ కోసం నితిశ్ ఓ ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసుకోవాలి’ అని అరుణ్ అన్నారు. రాజ్యసభ ఎంపీలు అలీ అన్వర్ అన్సారీ, వీరేంద్ర కుమార్‌లు శరద్ యాదవ్‌కు మద్దతిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో నితీశ్ మాట్లాడుతూ శరద్ యాదవ్‌తో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీతో కలవడం తన ఒక్కడి నిర్ణయం కాదనీ, పార్టీ అభిలాష మేరకే తాము కమలదళంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశామనీ, శరద్ యాదవ్‌కు ఈ విషయంలో భిన్నాభిప్రాయం ఉంటే ఉండొచ్చునని నితీశ్ అన్నారు. -
'సిగ్గుంటే రాజీనామా చెయ్'
పట్నా: బిహార్ అధికార పార్టీ జనతా దళ్(యునైటెడ్) లో అంతర్గత కలహాలతో పరిస్థితి నానాటికీ ముదురుతోంది. రాజ్యసభ అధికార ప్రతినిధి పదవి నుంచి శరద్ యాదవ్‌ను తొలగించిన మరుసటి రోజే ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత అజయ్ అలోక్. ఏ మాత్రం సిగ్గు ఉన్నా రాజ్యసభ పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. 'అధినేత నితీశ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు.. పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి కూడా వదులుకోవాలి కదా?' అని అలోక్, శరద్‌ను ప్రశ్నించారు. శరద్ గౌరవం పక్కనపెట్టి మరీ ఇంకా ఎంపీ పదవినే పట్టుకుని వెలాడుతున్నాడని, ఏ మాత్రం రోషం మిగిలి ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలన్నారు. అవినీతిమయం అయినందునే మహాకూటమి నుంచి తాము బయటకు రావాల్సి వచ్చిందని అలోశ్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే శరద్‌ను తామేం తొలగించలేదని, ఆయన స్థానాన్ని ఆర్సీపీ సింగ్‌తో భర్తీ మాత్రమే చేశామని బిహార్ జేడీ(యూ) అధ్యక్షుడు నారాయణ్ సింగ్ తెలిపారు. మరో సీనియర్ నేత త్యాగి పార్టీలో చీలిక రాబోదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకోపక్క తన తొలగింపు విషయంపై యాదవ్ పెద్దగా స్పందించకపోవటంతో త్వరలోనే ఈ ముసలం తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. అయితే 19న జరిగే పార్టీ సర్వసభ్యసమావేశానికి పవార్, మరో అసంతృప్త ఎంపీ అలీ అన్వర్ గైర్జారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
రాజ్యసభ నేతగా శరద్ యాదవ్ తొలగింపు
న్యూఢిల్లీ: బిహార్‌లో బీజేపీతో కలవడాన్ని వ్యతిరేకించడంతో జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్‌ను రాజ్యసభలో పార్టీ నాయకుడి పదవి నుంచి తప్పించారు. మరో నాయకుడు ఆర్సీపీ సింగ్‌ను రాజ్యసభలో తమ నాయకుడిగా జేడీయూ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని జేడీయూ ఎంపీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి శనివారం అధికారికంగా తెలియజేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఆర్సీపీ సింగ్ విశ్వాసపాత్రుడు. జేడీయూకు రాజ్యసభలో 10 మంది ఎంపీలుండగా, కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి హాజరైనందుకుగాను అలీ అన్వర్ అన్సారీ అనే ఎంపీని శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీయేలో చేరి మంత్రి పదవి చేపట్టాల్సిందిగా జేడీయూను ఆహ్వానించినట్లు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. నితీశ్‌ను తన నివాసంలో శుక్రవారం కలిసినట్లు షా శనివారం ఓ ట్వీట్లో తెలిపారు. -
శరద్ యాదవ్‌కు నితీశ్ ఝలక్
సాక్షి, ఢిల్లీ: జనతా దళ్(యునైటెడ్) మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత శరద్ యాదవ్‌కు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గట్టి ఝలక్ ఇచ్చారు. రాజ్యసభలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న శరద్ ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు జేడీయూ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ స్పీకర్ అయిన వెంకయ్యనాయుడుకు పార్టీ సమాచారాన్ని తెలియజేసింది. అంతేకాదు కొత్త ప్రతినిధిగా నితీశ్ సన్నిహితుడు ఆర్సీపీ సింగ్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంతకు ముందు మరో రాజ్యసభ సభ్యుడు అన్వర్ అలీపై కాంగ్రెస్ నిర్వహించిన బీజేపీ వ్యతిరేక సమావేశంలో పాల్గొనటంతో వేటు వేసిన విషయం తెలిసిందే. మొత్తం జేడీయూ తరపున పార్లమెంట్లో ఇద్దరు లోక్ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన మద్ధతుదారులను సేకరించే పనిలో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శరద్ సిద్ధమవుతున్న వేళ తాజా వేటుతో కొత్త పార్టీ ఏర్పాటు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. -
'శరద్ యాదవ్ నచ్చిన దారి చూసుకోవచ్చు'
న్యూఢిల్లీ: జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ విషయంలో తాను ఏం చేయలేనని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ఆయనకు నచ్చిన దారి చూసుకోవచ్చని తెలిపారు. బీజేపీతో జేడీయూ పొత్తుపెట్టుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శరద్ యాదవ్ సొంత కుంపటి పెట్టే ఆలోచన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నితీష్‌ను మీడయి ప్రతినిధులు ప్రశ్నించగా.. 'ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నచ్చిన దారిని చూసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది. గురువారం మీడియాతో మాట్లాడిన శరద్ యాదవ్ తాను మహాగట్బంధన్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు. బిహార్ ప్రజలు కలిసి పరిపాలించండనే తీర్పు ఇచ్చారని, నితీష్ దెబ్బకొట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
నితీశ్‌కు ఝలక్: శరద్ యాదవ్ బిగ్ స్టెప్!
-
11 కోట్ల బిహారీలకు నమ్మకద్రోహం: శరద్
పట్నా: బిహార్‌లో మహాకూటమి విచ్ఛిన్నమవడం 11 కోట్ల మంది రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని జేడీ(యూ) సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ అన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో జేడీయూ తెగతెంపులు చేసుకుని బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తరువాత ఆయన గురువారం తొలిసారి బిహార్ పర్యటనకు వచ్చారు. పట్నా విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడుతూ...‘బిహార్‌లో మహాకూటమికి అధికారం అప్పగించిన 11 కోట్ల మంది ప్రజల విశ్వాసం దెబ్బతింది. ఐదేళ్లు కొనసాగాల్సిన మహాకూటమి ఒప్పందం అర్ధంతరంగా ముగియడం నన్నెంతో బాధించింది’ అని శరద్ అన్నారు. ఆ తరువాత సోనెపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ...సర్కారీ జేడీ(యూ) నితీశ్ వద్ద ఉన్నా అసలు జేడీ(యూ) తన వద్దే ఉందన్నారు. తదుపరి సాధారణ ఎన్నికల తరువాత లౌకికవాద పార్టీలతో కలసి అసలు జేడీ(యూ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
నితీశ్‌కు ఝలక్: శరద్ యాదవ్ బిగ్ స్టెప్!
పట్నా: జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ)లో ఇద్దరు కీలక నేతలైన నితీశ్‌కుమార్, శరద్‌యాదవ్ మధ్య దూరం నానాటికీ పెరిగిపోతున్నది. నితీశ్‌కుమార్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న శరద్ యాదవ్ సొంత కుంపటి పెట్టే దిశగా సాగుతున్నారు. జేడీయూను చీల్చి.. తన మద్దతుదారులతో కొత్త పార్టీ పెట్టే దిశగా ఆయన సాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అహ్మద్ పటేల్‌కు అభినందలు తెలుపడం ద్వారా శరద్ యాదవ్ ఈ దిశగా పెద్ద ముందడుగు వేశారని భావిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలను చిత్తుచేస్తూ.. అహ్మద్ పటేల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గెలిచిన వెంటనే అహ్మద్‌కు శరద్ యాదవ్ అభినందనలు తెలిపారు. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ గెలుపొందారంటూ.. ఆయనతో తాను దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. ఇటీవల ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమిని వీడి నితీశ్‌కుమార్ మళ్లీ బీజేపీతో జత కట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి నితీశ్‌కు శరద్ యాదవ్ దూరంగా ఉంటున్నారు. మొదట సీఎం నితీశ్‌పై నేరుగా విమర్శలు చేయనప్పటికీ, ఆయన మిత్రపక్షమైన బీజేపీపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. మళ్లీ బీజేపీతో జతకట్టాలన్న నితీశ్ నిర్ణయం దురదృష్టకరమన్న శరద్.. ఇక ఆయనతో వేరుపడటం తన ముందున్న మార్గమని చెప్పకనే చెప్పారు. ఆయన త్వరలోనే కొత్త పార్టీ పెట్టే అవకాశముందని ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. జేడీయూలోని తన మద్దతుదారులందరినీ తనవైపు తిప్పుకొని.. ఆ తర్వాత కొత్త పార్టీ పెట్టాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర ప్రతిపక్ష పార్టీలతో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో అహ్మద్ పటేల్‌కు అభినందనలు తెలుపడం ద్వారా తాను ఎవరి వెంట కలిసి సాగనున్నారో శరద్ యాదవ్ స్పష్టం చేసినట్టు భావిస్తున్నారు. -
శరద్ కొత్త పార్టీ?
పట్నా: జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ మరో కొత్త పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయనకు అత్యంత సన్నిహితుడు వెల్లడించిన అంశాల మేరకు ఆయన కొత్త పార్టీవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ‘బిహార్ రాజకీయ పరిణామాలను శరద్ యాదవ్ నిశితంగా గమనిస్తున్నారు. ఆయన స్నేహి తులతో చర్చలు జరుపుతున్నారు. దీంతోపాటు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అవకాశాలను కూడా ఆయ న పరిశీలిస్తున్నా’రని శరద్‌కు అత్యంత సన్నిహి తుడైన సీనియర్ నేత విజయ్ వర్మ తెలిపారు. ఇతర లౌకిక పార్టీలను కూడా కలుపుకుని ఇదే కూటమిని కొనసాగించే అవకాశాలను ఆజాద్ (కాంగ్రెస్), ఏచూరి (సీపీఎం)లతో చర్చించినట్లు తెలుస్తోంది. -
సీఎంతో కటీఫ్.. శరద్ యాదవ్ సొంత కుంపటి!
పాట్నా: మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతో సీఎం నితీశ్ కుమార్ తెగదెంపులు చేసుకున్న తర్వాత బిహార్‌లో రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జేడీయూ అగ్రనేత శరద్ యాదవ్ కొత్త కుంపటి పెట్టుకునేలా కనిపిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి పాత మిత్రపక్షమైన బీజేపీ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన జేడీయూ నేత నితీశ్‌కుమార్ నిర్ణయంపై ఆ పార్టీ అగ్రనేత శరద్‌యాదవ్ ఇంకా అసంతృప్తి జ్వాలలు కురిపిస్తున్నారు. శరద్ యాదవ్ సన్నిహితుడైన విజయ్ వర్మ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలువురు జేడీయూ నేతలను శరద్‌యాదవ్ కలుసుకోనున్నారని తెలిపారు. తమ భావజాలంతో జోడు కుదిరే పార్టీలతోనూ శరద్ యాదవ్ చర్చిస్తున్నారని చెప్పారు. కొత్త పార్టీకి సంబంధించి కీలక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని విజయ్ వర్మ అన్నారు. ముఖ్యంగా నితీశ్ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ప్రజా తీర్పును గౌరవించకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సీనియర్ నేత శరద్ యాదవ్ ర్ణించుకోలేక పోతున్నారు. ఇదే అంశంపై జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ పాట్నాలో మీడియాతో మాట్లాడారు. శరద్ తమ పార్టీ సీనియర్ నేతని, అయితే కొత్త మార్గం ఎంచుకునే అవకాశం ఉందన్నారు. శరద్ యాదవ్ తనకు నచ్చిన నిర్ణయం తీసుకునేందుకు ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందని అభిప్రాయపడ్డారు. ‘బీజేపీ హఠావో దేశ్ బచావో’ పేరిట ఆగస్టు 27వ తేదీన ఆర్జేడీ నిర్వహిస్తున్న ర్యాలీలో జేడీయూ పార్లమెంటరీ పార్టీ నాయకుడైన శరద్ యాదవ్ పొల్గొననున్నారు. -
శరద్ భాయ్.. గమ్మునుండు!
- ఏదైనా ఉంటే పార్టీలో మాట్లాడుకుందాం: నితీశ్ చురక - బీజేపీతో దోస్తీపై జేడీయూలో చర్చ పట్నా: ‘ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదికాదు. బీజేపీతో జేడీయూ కలవడం దురదృష్టకరం’ అంటూ బిహార్ పరిణామాలపై నిక్కచ్చిగా మాట్లాడిన పార్టీ సీనియర్ నేత, ఎంపీ శరద్ యాదవ్‌కు సీఎం నితీశ్ కుమార్ గట్టి జవాబిచ్చారు. ‘పార్టీ నిర్ణయాలపై మండిపాటు తగదని, ఏదైనా ఉంటే పార్టీ సమావేశంలో మాట్లాడుకుందాం’అని శరద్‌కు నితీశ్ సూచించారు. ఎన్నికల తీర్పునకు విరుద్ధంగా నితీశ్ కుమార్.. మహాకూటమి నుంచి బయటికివచ్చి, బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తీరుపై శరద్ యాదవ్ సహా జేడీయూలోని పలువురు సీనియర్లూ బాహాటంగా నిరసించారు. అయితే, నితీశ్‌కుమార్ వాదన మరోలాఉంది. శరద్‌యాదవ్‌ను, ఇతర ముఖ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాతే జేడీయూ మహాకూటమి నుంచి బయటికి వచ్చిందని నితీశ్ మీడియాకు వివరించారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే ఆగస్టు 19న పట్నాలో జేడీయూ కీలక సమావేశం జరగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు నితీశ్‌కుమార్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో.. ఆర్జేడీ(లాలూ ప్రసాద్)తో దోస్తీకి స్వస్తి, బీజేపీతో పొత్తు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై పార్టీ నేతలు చర్చించనున్నారు. జేడీయూ తిరిగి ఎన్డీయేలోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో పదవులు స్వీకరించాలా? వద్దా? అనేదానిపైనా ఈ సమావేశాలలోనే నిర్ణయం తీసుకోనున్నారు. -
మర్మమేంటి: సీఎంపై మౌనం.. మోదీపై ఫైర్!
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ మిత్రపక్షాలను మార్చుకొని.. మళ్లీ అధికార పీఠంపై కొలువైన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్.. నితీశ్‌పై వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. అదే సమయంలో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై ఆయన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. లాలూకు ఝలక్ ఇచ్చి నితీశ్ మళ్లీ బీజేపీ పంచన చేరిన నేపథ్యంలో శరద్ యాదవ్ పార్టీ వైఖరికి భిన్నంగా మోదీపై ఫైర్ అవుతుండటం గమనార్హం. గతంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన తాజాగా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు పెట్టారు. 'అధికార పార్టీ ప్రధాన నినాదమైన నల్లధనాన్ని విదేశాల నుంచి రప్పించలేదు. పనామా పత్రాల్లో పేరున్న వారిని పట్టుకోలేదు. ప్రభుత్వ రంగ ఆస్తులను కాపాడటానికి బదులు అందులోని పెట్టుబడులను నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఫజల్ బీమా యోజన ఒక పెద్ద వైఫల్యం. దీని గురించి రైతులకు తెలియదు. ఇన్సూరెన్స్ కంపెనీలు రైతుల రుణాల నుంచి బీమా ప్రీమియాన్ని కోసివేసి లబ్ధి పొందుతున్నాయి' అని శరద్ యాదవ్ వరుస ట్వీట్లలో మండిపడ్డారు. నితీశ్‌కుమార్ మళ్లీ బీజేపీ చెంత చేరడంపై శరద్‌యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన మోదీపై విమర్శలు గుప్పిస్తూ.. నితీశ్‌పట్ల మౌనంగా ఉండటం వెనుక మర్మమేమిటన్నదని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆయన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గూటికి చెరవచ్చునని తెలుస్తోంది. -
జేడీయూలో రగిలిన చిచ్చు!
► శరద్ యాదవ్ తీవ్ర అసంతృప్తి ► నితీశ్ తీరును తప్పుపట్టిన ఇద్దరు ఎంపీలు పట్నా, న్యూఢిల్లీ: కమలం పార్టీతో నితీశ్ కుమార్ దోస్తీ జేడీయూలో చిచ్చు రాజేసింది. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుపై జేడీయూలో ఒక వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఇప్పటికే ఇద్దరు జేడీయూ ఎంపీలు బహిరంగంగా నితీశ్ తీరును తప్పుపట్టగా... పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్ కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ రెండుగా చీలనుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి చోటుచేసుకున్న పరిణామాలపై జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఇంతవరకూ నోరు మెదపకపోవడంపై పలు వాదనలు విన్పిస్తున్నాయి. బిహార్‌లో మహాకూటమి కొనసా గాలనేదే యాదవ్ అభిమతమని, నితీశ్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కావాలనే నితీశ్ ప్రమాణస్వీకారానికి యాదవ్ గైర్హాజరైనట్లు భావిస్తున్నారు. అదే సమయంలో రాహుల్‌తో ఆయన భేటీ కావడం చర్చనీయాంశమైంది. నితీశ్‌ను రాహుల్ విమర్శించిన కొద్దిసేపటికే వీరిద్దరూ కలిశారు. ఏం చర్చించారన్నది తెలియరాలేదు. ఇటీవలి కాలంలో జరిగిన విపక్షాల భేటీలో బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు జేడీయూ కట్టుబడి ఉందని శరద్ అన్నారు. బీజేపీకి నితీశ్ దగ్గరవుతున్న నేపథ్యంలోనే విపక్షాలకు ఆయన వివరణ ఇచ్చారు. మూడ్రోజుల క్రితం రాజ్యసభలో గోరక్షణ హత్యలపై మాట్లాడుతూ.. దేశంలో తాలిబాన్ల పాలన కొనసాగుతుందని బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఢిల్లీలో ఉన్న జేడీయూ సీనియర్ నేతలతో గురువారం సాయంత్రం యాదవ్ సమావేశమై పార్టీ భవితవ్యంపై చర్చించారు. బీజేపీతో పొత్తు అంశాన్ని పార్టీలో కనీసం చర్చించలేదని, శరద్ యాదవ్ అభిప్రాయాన్ని అడగలేదని భేటీలో పాల్గొన్న జేడీయూ ఎంపీ అన్వర్ అలీ చెప్పారు. అన్వర్‌తో పాటు జేడీయూ కేరళ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ వీరేంద్ర కుమార్ కూడా నితీశ్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తాను షాక్‌కు గురయ్యాయనని, కేరళ విభాగం ఎట్టి పరిస్థితుల్లోను ఎన్డీఏతో జట్టుకట్టదని చెప్పారు. మహారాష్ట్రలో ఏకైక జేడీయూ ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ స్పందిస్తూ.. బీజేపీతో కలిసేందుకు నితీశ్ తొందర తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ నిర్ణయంతో ఎంతో బాధపడ్డామని.. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. -
బిహార్ రాజకీయాల్లో మరో ట్విస్ట్!
పట్నా: మహాకూటమితో నితీశ్ కుమార్ సంబంధాలు తెంచుకోవడం పట్ల జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. గతరాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ప్రకటనపై శరద్ యాదవ్ ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు బీజేపీ మద్దతుతో మరోసారి సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నితీశ్ నిర్ణయంపై శరద్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సాయంత్రం జేడీ(యూ) ఎంపీలతో ఆయన సమావేశం కానున్నారు. బీజేపీతో అంటకాగడంపై విమర్శలు చేసిన ఎంపీ అన్వర్ అలీ కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఏయే అంశాలు చర్చిస్తారన్న దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది కీలకంగా మారింది. మరోవైపు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో చీలిక వచ్చే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీ మద్దతుతో రేపు బలనిరూపణకు నితీశ్ సిద్ధమవుతున్న తరుణంలో బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాగా, గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠీ తీరుపై లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆర్జేడీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. త్రిపాఠీపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు లాలూ తెలిపారు. -
బిహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు
-
'ఇంత జరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నారు?'
న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీపై ఉమ్మడి దాడి మొదలుపెట్టాయి. గురువారం నాటి రాజ్యసభ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు దళితులపై జరుగుతున్న దాడులను, గోసంరక్షణ పేరిట ముస్లింలను కొట్టి చంపుతున్న సంఘటనలపై పలువురు నేతలు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలకు మంచిని చేయండి. గోసంరక్షణ పేరిట చేస్తున్న నాటకాలన్నీ ఆపేయండి. ధనవంతులు మాత్రమే స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారు. పేదలకు, ఆదివాసీలకు అది అందడం లేదు. ఈ దేశంలో ఇక ఏ మాత్రం రైతుల ఆత్మహత్యలు జరగనివ్వకూడదు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవసాయ రంగంపై బాగా పడింది. చేతుల్లో డబ్బు లేక అప్పులు చేయలేక రైతన్న ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దళితులపై దాడులు (ఈసమయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ విషయం గుర్తుచేశారు) జరుగుతుంటే ఏం చేస్తున్నారు. ఓ వ్యక్తిపై మూకపడి కొట్టి చంపడానికి తాలిబన్‌కు పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ గోసంరక్షణ పేరిట దాడులు జరుగుతుంటే తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు అంటున్నారని, అయితే, గో సంరక్షక దళాన్ని విశ్వహిందూపరిషత్ నియమిస్తోందని, వారికి భజరంగ్దల్వాళ్లు శిక్షణ ఇస్తున్నారని దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న ప్రధాని ఏం చేస్తున్నారని, ఎందుకు బీజేపీ నేతలు సీరియస్‌గా స్పందిండచం లేదని మండిపడ్డారు. ఇక సీపీఐ నేత డీ రాజా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులకు రక్షణ ఇవ్వడంలో ఉమ్మడిగా విఫలమయ్యామని అన్నారు. 70ఏళ్ల తర్వాత వ్యక్తులపై దాడి చేసి కొట్టడం అనే అంశాన్ని సభలో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, దీనిని చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. దళితులకు, మహిళలకు ఇక మనపై ఎలాంటి సానుభూతి చూపించే ఉద్దేశం లేకుండా పోయిందని, ప్రతినిధులుగా వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. -
ఆ నలుగురిలో ఒకరు!
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై కసరత్తు న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్ గాంధీల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నలుగురిలో ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టవచ్చని ప్రతిపక్ష నేత ఒకరు వెల్లడించారు. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న శరద్ పవార్ పేరుపై ప్రతిపక్షాలు సానుకూలంగా ఉండగా.. దళిత నేత, కాంగ్రెస్‌కు చెందిన మీరా కుమార్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. జేడీయూకు చెందిన శరద్ యాదవ్ సీనియర్ నేతే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ అనుభవముంది. మహాత్మాగాంధీ మనవడైన గోపాలకృష్ణ గాంధీకి పార్టీలకతీతంగా మద్దతిస్తున్నారు. గాంధీ అభ్యర్థిత్వానికి తృణమూల్ కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి విషయమై కొందరు ప్రతిపక్ష నేతలు తనను సంప్రదించారని గాంధీ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, బిహార్ సీఎం నితీశ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, ఇతర ప్రతిపక్ష నేతలు చర్చలు కొనసాగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, బీజేడీతో పాటు దక్షిణాదికి చెందిన ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా తమకు మద్దతిచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నారు. -
చట్టంలో తక్షణం మార్పులు తేవాలి
-
చట్టంలో తక్షణం మార్పులు తేవాలి: ఏచూరి
న్యూఢిల్లీ: ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లినప్పుడు రాజీనామా చేయాలని, చట్టంలో తక్షణం మార్పులు తేవాల్సిన అవసరం ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అనర్హతలపై నిర్ణయానికి స్పీకర్‌కు కాలపరిమితి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై ఏచూరీతో చర్చించి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న పరిణామాలే మణిపూర్, గోవాలో జరిగాయని, అలాంటి వాటిని ఉపేక్షించరాదని అన్నారు. దీనిపై తాము ఎన్నికల కమిషన్‌తో కూడా మాట్లాడతామని అన్నారు. భేటీ అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఫిరాయింపులపై అన్ని పార్టీల నేతలు స్పందించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు మారాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. వ్యవస్థలో మార్పు కోసం అందరూ కలిసి రావాలని, లేకుంటే వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అంతకు ముందు వైఎస్ జగన్...ములాయం సింగ్ యాదవ్, సురవరం సుధాకర్ రెడ్డి, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, శరద్ యాదవ్‌తో సమావేశం అయిన విషయం తెలిసిందే. -
శరద్ యాదవ్‌ను కలిసిన వైఎస్ జగన్
నూఢిల్లీ: జేడీయు అధ్యక్షుడు శరద్ యాదవ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న ఆయన... అందులో భాగంగా జేడీయూ అధినేతను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై శరద్ యాదవ్‌తో చర్చించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో కలిసి రావాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం దారుణమన్నారు. పైగా వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం అప్రజాస్వామికం అన్నారు. ఇలాంటి అనైతికను అడ్డుకోవాలని శరద్ యాదవ్‌ను కోరినట్లు వైఎస్ జగన్ తెలిపారు. ఆయన తమ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారన్నారు. అనంతరం వైఎస్ జగన్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. -
మరోసారి రెచ్చిపోయిన శరద్ యాదవ్
-
శరద్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జనతా దళ్ (యు) నేత, రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్ మరోసారి నోరు పారేసుకున్నారు. పార్లమెంటులో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన ఇపుడు ఆడబిడ్డల్ని ఘోరంగా అవమానించారు. అమ్మాయి గౌరవం కంటే.. ఓటును కాపాడుకోవడం ముఖ్యమంటూ సెలవిచ్చారు. ఆడ బిడ్డల గౌరవంకంటే బ్యాలెట్ చాలా ముఖ్యమైందన్న ఆయన బ్యాలెట్ పేపర్ ఎంత శక్తివంతమైందో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా అవసరమని పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు.. ఆడపిల్లల కంటే బ్యాలెట్ పేపర్ చాలా ముఖ్యం. మీ ఓటు విలువ మీ కుమార్తె గౌరవం కంటే పెద్దది.. ఒక అమ్మాయి గౌరవానికి భంగం కలిగితే.. ఆ కుటుంబానికి లేదా ఆ గ్రామానికి అవమానం.. కానీ ఓటు అమ్ముడుబోతే.. దేశ గౌరవానికే భంగం.. మన కలలన్నీ తుడుచుకుపెట్టుకుపోతాయంటూ చెప్పుకొచ్చారు. విచక్షణ మరిచి నోరుజారడం... తప్పయిందంటూ క్షమాపణలు చెప్పడం శరద్ యాదవ్ కు కొత్తేమీ కాదు. అయితే ఒకవైపు ఆడబిడ్డల్ని కాపాడుకుందామంటూ ఉత్సవాలు జరుగుతోంటే... మరోవైపు సాక్షాత్తూ ఎంపీ ఇలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేపింది. రాజకీయనేతలు తరచూ చేసే ఇలాంటి వ్యాఖ్యలు స్త్రీలపై దాడికి పురికొల్పుతాయంటూ మహిళా సంఘాల నేతలు మండి పడుతున్నారు. -
ఆర్మీకి శుభాభినందనలు :శరద్ యాదవ్
-
ఐదు రాష్ట్రాల్లో తప్పని రాజ్యసభ ఎన్నికలు
- ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ - యూపీ. కర్ణాటక, రాజస్తాన్, ఎంపీ, హరియాణాల్లో ఎన్నికలు - గోయల్, సురేశ్ ప్రభు, చిదంబరం, శరద్ యాదవ్ ఏకగ్రీవం న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. ఏపీతోపాటు మహారాష్ట్ర. తమిళనాడు. బిహార్, పంజాబ్, ఒడిశాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవగా.. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హరియాణాల్లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. శుక్రవారం రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువుముగిసిన తర్వాత ఎన్నికలపై మరింత స్పష్టత వచ్చింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సురేశ్ ప్రభుతోపాటు కాంగ్రెస్ నేత పి. చిదంబరం, జేడీయూ నేత శరద్ యాదవ్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. మహారాష్ట్ర నుంచి గోయల్, వీరూ సహస్రబుద్ధే, వికాస్ మహాత్మే (బీజేపీ), సంజయ్ రౌత్ (శివసేన), పి. చిదంబరం (కాంగ్రెస్), ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ) ఎంపికయ్యారు. తమిళనాడు నుంచి అన్నాడీఎంకే నుంచి నలుగురు, డీఎంకే నుంచి ఇద్దరు కూడా ఎన్నిక లేకుండానే పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ఏపీ నుంచి కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, సుజనా చౌదరిలతోపాటు టీజీ వెంకటేశ్, వి. విజయసాయి రెడ్డిలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఒడిశా నుంచి ముగ్గురు బీజేడీ సభ్యులు ఏకగ్రీవంగా గెలవగా.. ఛత్తీస్‌గఢ్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ తరపున ఒక్కొక్కరు పోటీ లేకుండానే విజయం సాధించారు. బిహార్ నుంచి జేడీయూ నేత శరద్ యాదవ్, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది రాం జెఠ్మలాని, లాలూ ప్రసాద్ కూతురు మిసా భారతితోపాటు జేడీయూ, బీజేపీ నుంచి ఒక్కొక్కరు పోటీ లేకుండానే గెలిచారు. యూపీలో 11 సీట్లకోసం 12 మంది బరిలో ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది. 34 మంది మద్దతు కావాల్సిన ఎన్నికల్లో కాంగ్రెస్ (కపిల్ సిబల్)కు 29 మందే ఉన్నారు. అయితే తమ పార్టీ నుంచి ఇద్దరిని గెలిపించుకున్నాక మిగిలిన 12 మందితో కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతామని బీఎస్పీ ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో 3 స్థానాలకు ఎన్నికకోసం బీజేపీ నుంచి ఎంజే అక్బర్‌తోపాటు మరో నేత గెలవనుండగా, బీజేపీ మూడో అభ్యర్థిని (స్వంతంత్ర) బరిలో ఉంచింది. నలుగురికే అవకాశమున్న కర్ణాటకనుంచి ఆరుగురు బరిలో ఉన్నారు. -
భార్యకు మొండిచేయి చూపిన లాలూ
పట్నా: బిహార్ లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సోమవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. జేడీ(యూ) నేత శరద్ యాదవ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ, లాలూ ప్రసాద్ తనయ మిసా భారతి, నితీశ్ కుమార్ అనుచరుడు ఆర్సీపీ సింగ్ నామినేషన్లు దాఖలు వేశారు. లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవిని కాదని కూతురికి సీటు ఇచ్చారు. సతీమణిని పెద్దల సభకు పంపుతారని వార్తలు వచ్చాయి. దీనిపై సోమవారం సస్పెన్స్ కొనసాగింది చివరకు కూతురివైపే ఆయన మొగ్గుచూపారు. అవినీతి కేసుల్లో తన తరపున వాదించిన జెంఠ్మలానీకి మరొ స్థానం కేటాయించారు. ఆదివారం ఆయన ఆర్జేడీలో చేరారు. తాను లాలూ ప్రసాద్ కు స్నేహితుడిని, రక్షకుడిని అని జెంఠ్మలానీ ప్రకటించుకున్నారు. బీజేపీ తరపున రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్ నారాయణ్ సింగ్ టికెట్ దక్కించుకున్నారు. ఈ ఐదు స్థానాలు జులైలో ఖాళీ అవుతాయి. -
ఫిరాయింపులు జాడ్యంలా విస్తరించాయి
జేడీ(యూ) సీనియర్ నేత శరద్‌యాదవ్ వెల్లడి న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పార్టీ ఫిరాయింపులు ఒక జాడ్యంలా దేశమంతటా విస్తరించాయని జనతాదళ్(యునెటైడ్) సీనియర్ నేత శరద్‌యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీలో ఆయనతో సమావేశమైంది. ఏపీలో కొనసాగుతున్న అనైతిక రాజకీయాల గురించి వివరించింది. వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటానికి శరద్‌యాదవ్ మద్దతు ప్రకటించారు. భేటీ అనంతరం ఆయన జగన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. శరద్ యాదవ్ ఏమన్నారంటే... ‘‘ఫిరాయింపులు జాడ్యంలా దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ జాడ్యం ఆంధ్రప్రదేశ్‌లో మరీ ఎక్కువగా విస్తరించింది. అధికార పార్టీకి చెందిన వ్యక్తే స్పీకర్‌గా ఉండటం వల్లే ఫిరాయింపులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగానే పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా సాగుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుంది. ఏపీలో అనైతిక రాజకీయ కార్యకలాపాలు, చంద్రబాబు సాగిస్తున్న అవినీతి గురించి వైఎస్సార్సీపీ బృందం నాకు వివరించింది. వినతిపత్రం, అవినీతి చక్రవర్తి చంద్రబాబు పుస్తకాన్ని అందించింది. వాటిని క్షుణ్నంగా చదువుతాను’’ అని చెప్పారు. -
శరద్ యాదవ్‌తో వైఎస్ జగన్ బృందం భేటీ
న్యూఢిల్లీ: జేడీయూ నేత శరద్ యాదవ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం భటీ అయ్యారు. ఆయనతో పాటు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికార టీడీపీ అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేస్తున్న తీరును నిరసిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని నినదిస్తూ..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. శరద్ యాదవ్‌ను కలిసిన వైఎస్ జగన్ బృందం.. మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా శరద్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులనే జాఢ్యం దేశవ్యాప్తంగా విస్తరించిందని, అధికార పార్టీకి చెందిన వ్యక్తులు స్పీకర్ గా ఉన్నందువల్లే ఇది జరుగుతోందన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ అధికార పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక రాజకీయాలను జాతీయ స్థాయిలో ఎండగట్టడానికి, ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట జగన్ నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం జాతీయ నేతల దృష్టికి తీసుకు వచ్చారు. వైఎస్ జగన్ బృందం ... హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులను కలిసి టీడీపీ అనుసరిస్తున్న వక్రమార్గాలను, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. -
ఉత్తరాదిన మరో కొత్త పార్టీ!
జేడీయూ, ఆర్ఎల్డీ, జేవీఎంపీ, ఎస్జేపీఆర్ విలీనంపై కసరత్తు న్యూఢిల్లీ: ఉత్తరాదిన జనతా పరివార్ పేరిట జేడీయూ, ఆర్జేడీ తదితర పార్టీల విలీన ప్రయోగ వైఫల్యం తర్వాత తాజాగా మరో విలీన ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఈసారి బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో జేడీయూ, రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ), జార్ఖండ్ వికాస్ మోర్చా-ప్రజాతాంత్రిక్ (జేవీఎంపీ), సమాజ్‌వాది జనతా పార్టీ- రాష్ట్రీయ(ఎస్జేపీఆర్)లు విలీనంవైపు అడుగులు వేస్తున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటుకోసం బిహార్ సీఎం నితీశ్ కుమార్, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్, ఆర్ఎల్డీ చీఫ్అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్, ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తదితరులు ఈనెల 15న ఢిల్లీలో జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ఇంట్లో సమావేశమై మార్గదర్శకాలపై చర్చించినట్లు తెలిసింది. జార్ఖండ్ మాజీ సీఎం, జేవీఎంపీ చీఫ్ బాబూలాల్ మరాండితో నితీశ్ నేరుగా చర్చలు జరుపుతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరో పక్క అజిత్‌సింగ్,త్యాగీలు ఎస్జేపీ(ఆర్) అధినేత కమల్ మొరార్కతో విలీనంపై చర్చించారు. త్వరలోనే ఈ 4 పార్టీలు విలీనం కానున్నాయని, చర్చలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని విలీన ప్రక్రియను చూస్తున్న నాయకులు తెలిపారు. విలీన తేదీని ఖరారు చేయనప్పటికీ ఈ నెలాఖరుకల్లా కొత్త పార్టీ ఆవిర్భావం ఖాయమంటున్నారు. -
కన్హయ్య విడుదలకు డిమాండ్
జాబల్ పూర్: రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ను విడుదల చేయాలని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. కన్హయ్య అమాయకుడని, అతడిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. అతడిని అక్రమంగా కేసులో ఇరికించినట్టు కడబడుతోందని పేర్కొన్నారు. 'జేఎన్ యూను మిని ఇండియా'గా వర్ణించారు. జేఎన్ యూలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కన్హయ్య కుమార్ విడుదల చేయాల్సిందేనని చెప్పారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కశ్మీర్ లో దేశవ్యతిరేక నినాదాలు నిత్యకృత్యంగా మారాయని అన్నారు. బిహార్ ఎన్నికల సమయంలో బీఫ్ వివాదాన్ని లేవనెత్తి ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. -
సుమిత్రది మనువాద తత్వం
లక్నో/న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలను బీఎస్పీ చీఫ్ మాయావతి, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఖండించారు. ఆమె అభిప్రాయాలు మనువాద మనస్తత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. అహ్మదాబాద్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ప్రిసైడింగ్ అధికారుల భేటీలో సుమిత్ర మాట్లాడుతూ ‘పదేళ్లు కోటా ఉండాలని, ఈలోగా స్వతంత్ర భారత్‌లో అందరూ సమానమే అన్న సమాజాన్ని సృష్టించుకోగలమని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భావించారు’ అని అన్నారు. కులాధార రిజర్వేషన్లపై సమీక్షించాలని సుమిత్ర అన్నారని, మనువాద మనస్తత్వం వల్లే అలా మాట్లాడగలిగారని మాయావతి విమర్శించారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రాజ్యాంగపరంగా ఉన్నతస్థానంలో ఉన్న మహిళ ఇలా అనడం అగ్నికి ఆజ్యం పోయడమేనన్నారు. రాజకీయ రిజర్వేషన్లు(పార్లమెంటు, అసెంబ్లీలు) మాత్రమే అంబేడ్కర్ సమీక్షించాలన్నారని శరద్‌యాదవ్ చెప్పారు. -
అసభ్య ప్రవర్తన... ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు
పట్నా: బిహార్ లో అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దంపతులతో అసభ్యంగా ప్రవర్తించి వేధించారని గత ఆదివారం ఆలంపై ఆరోపణలోచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్, బిహార్ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు అరారియా జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై చర్చిండానికి సమావేశమయ్యారు. అతని ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన వారు పార్టీ నుంచి సర్ఫరాజ్ ఆలంను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జేడీయూ బిహార్ అధ్యక్షుడు వశిస్ట్ నరేన్ సింగ్ మీడియాకు ఎమ్మెల్యే సస్పెన్షన్ విషయాన్ని తెలిపారు. గత ఆదివారం గువహటి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించారు. అదే రైళ్లో ప్రయాణిస్తోన్న భార్యాభర్తలతో ఎమ్మెల్యే ఆలం దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంపై బాధితులు ఇందర్‌పాల్ సింగ్ బేడి, ఆయన భార్య పట్నా రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆలంతో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా తమపై చాలా అసభ్యంగా కామెంట్లు చేశారని పోలీసులకు వివరించారు. పట్నా రైల్వే ఎస్పీ పీఎన్ మిశ్రా నలుగురు సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించి బాధితులు, ప్రత్యక్షసాక్షలు నుంచి రాతపూర్వకంగా మరింత సమాచారం సేకరించినట్లు వివరించారు. ఎమ్మెల్యే ఆలం సస్పెన్షన్ పై ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కూడా అనుకూలమేనని సమాచారం. -
'మోదీజీ.. ఉగ్రవాదంపై మనమూ చర్చిద్దాం'
ఇండోర్: ఉగ్రవాదం సమస్యపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని జేడీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి బహిరంగంగా విజ్ఞప్తి చేసింది. ఇటీవల ప్యారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు జరిపి దాదాపు 129మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదమనేది అన్ని దేశాలకు కామన్ ప్రాబ్లమ్ గా మారిందని, దీనిపై అత్యవసర చర్చ జరిపి ఉమ్మడి సమ్మతి తెలపాలని అన్నారు. బుధవారం జేడీయూ పార్టీ చీఫ్ శరద్ యాదవ్ మాట్లాడుతూ ప్యారీస్ ఎటాక్ తర్వాత ప్రపంచమంతా కలవరంలోకి వెళ్లిపోయిందని ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఓ అర్థమంతమైన చర్చకు తెరతీయాలని కోరారు. -
ఈ ఓటమి మోదీ.. అమిత్ షా.. అందరిదీ: శరద్ యాదవ్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓటమి ఏ ఒక్కరిదో కాదని.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఇలా మొత్తం అందరిదీ అవుతుందని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నారు. నిజానికి మొదట్లో తమకు కూడా కొంత అనుమానం ఉందని, ఎందుకంటే ఇక్కడ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం బిహార్‌లో దిగిపోయిందని తెలిపారు. ఈ ఎన్నికలను కమ్యూనలైజ్ చేసే ప్రయత్నాలు జరిగాయని, బీఫ్, రిజర్వేషన్లు.. ఇలా అన్ని అంశాలను తెరమీదకు తెచ్చారని అన్నారు. అవార్డు వాప్సీ.. లాంటి అంశాలన్నింటి ప్రభావం కూడా ఈ ఎన్నికల మీద ఉందన్నారు. కేవలం బిహార్‌లోనే కాదు, మొత్తం దేశంలో బలహీన వర్గాలు తిరగబడినా, దాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కులవ్యవస్థలో వేల ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి ఓటర్లుగా వాళ్లు ముందుకొచ్చారని శరద్ యాదవ్ చెప్పారు. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ మీద చర్చ జరుగుతున్న సమయంలో ఆ విషయంలో వేలు పెట్టడంతో అది వాళ్లకు ఎదురు దెబ్బగా మారిందని విశ్లేషించారు. ఇక మహాకూటమి విజయం కూడా ఏ ఒక్కరిదో కాదని.. ఇది మొత్తం కూటమి గెలుపని తెలిపారు. -
పునరాలోచించండి
ములాయంకు లాలూ, శరద్ యాదవ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపంకంపై విభేదాలతో లౌకిక కూటమి నుంచి తప్పుకున్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్‌ను దారిలోకి తెచ్చుకోవడానికి జనతా పరివార్ తిప్పలు పడుతోంది. ములాయంను బుజ్జగించడానికి జేయూడీ చీఫ్ శరద్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు శుక్రవారమిక్కడ ములాయం ఇంట్లో ఆయనతో భేటీ అయ్యారు. ఎస్పీ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరారు. అయితే ఎస్పీ అధినేత వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. లాలూ రెండు గంటలు ములాయంతో భేటీ అయ్యారు. ఆ సయయంలో శరద్ కూడా అక్కడే ఉన్నారు. భేటీ తర్వాత శరద్, లాలూ మీడియాతో మాట్లాడుతూ కూటమి కొనసాగింపుపై ధీమా వ్యక్తం చేశారు. 'బిహార్‌లో సోషలిస్టు, లౌకిక ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఎస్పీ నిర్ణయంపై పునరాలోంచాలని నేతాజీ(ములాయం)ను కోరాం. చర్చలు సాగుతున్నాయి. మొత్తం 200 సీట్లు(ఆర్జేడీకి కేటాయించిన 100, జేడీయూ కేటాయించిన 100) నేతాజీ, ఎస్పీవే. ములాయం మా సంరక్షుడు. కూటమి కొనసాగింపు బాధ్యత అందరికంటే ఆయనపైనే ఎక్కువ. ఏవో కొన్ని కారణాలతో ఆయన కలతచెంది, కూటమి నుంచి బయటికి రావాలనుకున్నారు. ఈ ఎన్నికలు బిహార్‌కే కాకుండా మొత్తం దేశానికి కీలకం' అని లాలూ అన్నారు. ములాయంతో సీట్ల పంపకంపై చర్చించలేదని, ఒకటి రెండు రోజుల్లో శుభవార్త వింటారని శరద్ అన్నారు. సమస్యలు పరిష్కారమవుతాయని బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ పట్నాలో అన్నారు. సీట్ల పంపకంలో తమను సంప్రదించకుండా, తమకు 5 సీట్లే కేటాయించారని, కూటమి నుంచి తప్పుకుని ఒంటరిగా పోటీ చేస్తామని ఎస్పీ గురువారం ప్రకటించడం తెలిసిందే. కాగా, ఉత్తరప్రదేశ్‌లో తమకు శత్రువైన కాంగ్రెస్‌తో బిహార్ ఎన్నికల్లో కలసి కనిపించడం ములాయంకు అసౌకర్యంగా ఉందని ఎస్పీ వర్గాలు చెప్పాయి. -
బిహార్ ఎన్నికల్లో కూటమిగా జనతా పరివార్
న్యూఢిల్లీ: త్వరలో బిహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీని కట్టడిచేయడానికి ఇతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. గతకొంత కాలంగా ఊహాగానాలకే పరిమితమైన లౌకిక కూటమి ఏర్పాటుపై జేడీ (యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ గురువారం ప్రకటన చేశారు. తమ పార్టీతో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఇతర పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని శరద్ యాదవ్ వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం తాము కలసి పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన జనతా పరివార్ ఏకీకరణ ఇప్పుడు కార్యరూపం దాల్చిందన్నారు. అయితే కూటమి ఒప్పందం ఎప్పుడు చేసుకోబోతున్నారనే ప్రశ్నకు.. తేదీ ప్రస్తుతం చెప్పలేనని, అయితే కూటమి కట్టడం మాత్రం కచ్చితమని శరద్ తెలిపారు. -
'పద్మ అవార్డులను నిలిపేయండి'
న్యూఢిల్లీ:పద్మ అవార్డుల ఎంపిక అనేది నీతి నిజాయితీగా జరగడం లేదంటూ జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ కొత్త గళం అందుకున్నారు. పద్మ అవార్డులను అత్యధిక మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నందున వాటిని నిలిపివేయాలంటూ సరికొత్త వివాదానికి తెరలేపారు. 'పద్మ అవార్డుల అనేవి కేవలం కొంతమంది చేతుల్లోకి మాత్రమే వెళుతున్నాయి. జనతా పరివార్ పాలనలో ఇటువంటి అధికారిక కార్యక్రమాలు ఏమీ నిర్వహించలేదు. ఆ అవార్డుల ఎంపికలో పారదర్శకత లేదు' అని శరద్ యాదవ్ తెలిపారు. గతంలో పద్మ అవార్డుల ఎంపికలో జరుగుతున్న ఉల్లంఘనలపై ఆనాటి ప్రధాని వాజ్ పేయ్ కి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒక నివేదికను పంపిన విషయాన్ని శరద్ యాదవ్ గుర్తు చేశారు. ఈ సంవత్సరం అవార్డుల ఎంపికకు ఎస్సీ. ఎస్టీ, మైనార్టీలతో పాటు రైతు కుటుంబం నుంచి ఏ ఒక్కరికీ ప్రకటించకపోవడాన్నిశరద్ యాదవ్ తప్పుబట్టారు.పద్మ అవార్డుల ఎంపికలో సచ్ఛీలత అనేది కొట్టొచ్చినట్లు కనబడుతున్న కారణంగా ఆ అవార్డులను నిలిపి వేయాలని శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. -
అవును సిఫారసు చేశా: శరద్ యాదవ్
న్యూఢిల్లీ: నిజాయితీ లేనివారికి పద్మ పురస్కారాలు ఇస్తున్నారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన జేడీ(యూ) నేత శరద్ యాదవ్ స్వయంగా ఒక డాక్టర్ కు పద్మ అవార్డు కోసం సిఫారసు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. 2014లో గుర్గావ్ కు చెందిన వైద్యుడు బాల్ రాజ్ సింగ్ యాదవ్ పేరు పద్మ పురస్కారం కోసం సిఫారసు చేశారని హోంమంత్రిత్వ శాఖ డాక్యుమెంట్ వెల్లడించింది. వైద్యుడి పేరు సిఫారసు చేసిన విషయం వాస్తమేనని శరద్ యాదవ్ తెలిపారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. పద్మ పురస్కారాల ఎంపిక విధానం నిజాయితీగా లేదని మాత్రమే తాను అన్నానని వివరణ ఇచ్చారు. అవార్డుల ఎంపిక పారదర్శకంగా లేదని పేర్కొన్నారు. -
'పద్మ అవార్డుల్ని విసిరికొట్టండి'
వివిధరంగాల్లో వ్యక్తుల సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అందించే పద్మ అవార్డులపై జేడీ (యూ) నేత శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజాయితీ లేనివారికి (బే ఇమాన్), అధికారుల అండదండలు ఉన్నవారికి మాత్రమే ఆ అవార్డులు దక్కుతాయన్నారు. సాంఘికవాదులందరూ పద్మ అవార్డుల్ని విసిరికొట్టాలని పిలుపునిచ్చారు. 'పద్మ అవార్టులకు ఎంపియ్యేవారి జాబితా ఒక్కసారి చూడండి.. అందులో రైతులు, ఆదివాసీలు, దళితులు మచ్చుకైనా ఉండరు! ఎందుకంటే అవి అర్హులకు దక్కవు కాబట్టి! గత ఏడాదే కాదు.. గడిచిన 68 ఏళ్లుగా ఈ తంతు జరుగుతూ వస్తున్నదే' అని అన్నారు. శుక్రవారం రాత్రి ఓ సీనియర్ సామాజిక వేత్త సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శరద్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశ మహిళల రంగుపై, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఏకంగా పార్లమెంటులోనే కామెంట్లు చేసిన శరద్ యాదవ్.. అనేక విమర్శల్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పద్మ అవార్డులపై ఆయన చేసిన కామెంట్లు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచిచూడాల్సిందే. -
నువ్వేంటో నాకు తెలుసు!
స్మృతి ఇరానీపై శరద్ యాదవ్ వ్యాఖ్య రాజ్యసభలో కేంద్రమంత్రితో జేడీయూ చీఫ్ వాగ్వాదం న్యూఢిల్లీ: మహిళల శరీరం, రంగుపై రాజ్యసభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా మరో వివాదానికి తెరతీశారు. సోమవారం రాజ్యసభలో ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వేంటో నాకు తెలుసు’ అని అన్నారు. మహిళల రంగుపై వ్యాఖ్యలు చేయొద్దని ఇరానీ అనడంతో పైవిధంగా స్పందించారు. ‘ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎంతో ముఖ్యమైన వర్ణవివక్షను లేవనెత్తాను. దీనిపై ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధం’ అని అన్నారు. ఇరానీ స్పందిస్తూ.. ‘ఏ మహిళల రంగుపైనా ఇలా మాట్లాడొద్దని మీ(సభాపతి) ద్వారా ఆయన(యాదవ్)కు విజ్ఞప్తి చేస్తున్నా. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మీరు(యాదవ్) సీనియర్ సభ్యులు. చాలా తప్పుడు సందేశం పోతోంది’ అని అన్నారు. యాదవ్ ప్రతిస్పందిస్తూ.. ‘గాంధీ నుంచి లోహియా వరకు మహిళలపై ఏమన్నారో నా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. నల్లరంగు మహిళల సంక్షేమం కోసం ఎంతో పోరాటం జరిగింది’ అని చెప్పారు. ఇరానీ మళ్లీ లేచి, ‘దయచేసి లోహియా, గాంధీల పేర్లు చెప్పొద్దు..’ అని అన్నారు. గత గురువారం రాజ్యసభలో బీమా బిల్లుపై చర్చలో తను చేసిన వ్యాఖ్యలను యాదవ్ సమర్థించుకున్నారు. ‘నల్లరంగు మహిళలు భారత్‌లో ఎంతోమంది, ప్రపంచంలో చాలా మంది ఉన్నారన్నాను. వారి కోసం లోహియా, ఇతరులు చేసిన పోరాటంపై ఎవరితోనైనా చర్చించడానికి నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. కాగా, అన్ని పార్టీల మహిళా సభ్యులందరూ ఏకతాటిపై ఉన్నారని, యాదవ్ పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని డీఎంకే సభ్యురాలు కనిమొళి డిమాండ్ చేశారు. గురువారం యాదవ్ సభలో మాట్లాడుతూ భారతీయులకు తెల్లరంగుపై ప్రేమ అని అన్నారు. ‘మీ దేవుడు రవిశంకర్ ప్రసాద్(కేంద్రమంత్రి)లా నల్లనివాడు. అయితే వివాహ సంబంధాల ప్రకటనల్లో మాత్రం మీరు తెల్లరంగు వధువులు కావాలంటారు. దక్షిణాది మహిళలు నల్లగా ఉన్నా అందంగా ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. యాదవ్ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, వాటిని ఆయన వాపసు తీసుకోవాలని రవిశంకర్ ప్రసాద్ సోమవారం రాజ్యసభలో అనడంతో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. -
మీరు నల్లగా ఉన్నా.. తెల్ల అమ్మాయిలు కావాలా!
మహిళలపై జేడీ(యూ) ఎంపీ శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభలో బీమా బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ''మీ దేవుడు రవిశంకర ప్రసాద్‌లా నల్లగా ఉంటారు. కానీ పెళ్లి ప్రకటనల్లో మాత్రం తెల్లటి అమ్మాయిలు కావాలని చెబుతారు'' అని శరద్ యాదవ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రవిశంకర్ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటితో పాటు ఇంతకుముందు శరద్ యాదవ్ దక్షిణాది మహిళల నల్ల రంగు గురించి చేసిన వ్యాఖ్యలనూ ఆయన ప్రస్తావించారు. ''వాళ్లు చాలా అందమైన వాళ్లు.. వాళ్లకు డాన్సు చేయడం కూడా వచ్చు'' అని గతంలో శరద్ యాదవ్ అన్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని రవిశంకర ప్రసాద్ సభలో ప్రస్తావించారు. శరద్ యాదవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందేనని పట్టుబట్టారు. దీనిపై శరద్ యాదవ్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించుకున్నారని చెప్పారు. దేశంలోను, ప్రపంచంలోను చాలామంది నల్లరంగు మహిళలున్నారని, దీనిపై తాను ఎవరితోనైనా చర్చించగలనని, భారతీయ సంస్కృతిని తాము ఎంతో గౌరవిస్తామని అన్నారు. అయినా అధికారపక్షం మాత్రం పట్టు విడవలేదు. మహిళల రంగు మీద సభ్యులు వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. అయితే.. దీనిపై చర్చకు డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ నిరాకరించారు. -
దక్షిణాది మహిళల అందాన్ని మాత్రమే వర్ణించారా?
న్యూఢిల్లీ : మహిళలపై జేడీయూ అధినేత శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఆయనపై యావత్ మహిళాలోకం మండిపడుతోంది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధా...లేక ఆ రూపంలో ఉన్న పోకిరియా అంటూ దుమ్మెత్తి పోస్తోంది. బీమా బిల్లుపై చర్చ సందర్భంగా శుక్రవారం శరద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు శాతాన్ని పెంచటాన్ని...ఆయన భారతదేశ పురుషులకు తెల్ల మహిళలపై ఉన్న ఆసక్తిని పోల్చుతూ వర్ణించారు. దక్షిణాది మహిళలు నల్లగా ఉన్నా చాలా అందంగా ఉంటారని...వారు నృత్యాలు చేస్తుంటే కళ్లు తిప్పుకోలేమన్నారు. వారికి ఎంతటివారినైనా ఆకట్టుకునే అందం ఉందన్నారు. అలాంటి వాళ్లు ఉత్తరభారతంలో కన్పించరని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పలువురు మహిళా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శరద్ యాదవ్ వ్యాఖ్యలు దక్షిణాది మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆందోళనకు దిగారు. వెంటనే ఉపసంహరించుకుని.... దేశంలోని మహిళలందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ కూడా శరద్‌యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టాయి. క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. అయితే శరద్‌యాదవ్ అందుకు అంగీకరించలేదు. తానెవరనీ విమర్శించలేదని...కేవలం దక్షిణాది మహిళల అందాన్ని మాత్రమే వర్ణించానని చెప్పారు. విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.... పార్టీ అధ్యక్షుడి తరపున జేడీయూ ఎంపీ కేసీ త్యాగి క్షమాపణలు చెప్పారు. -
మంఝికి నేడు ఉద్వాసన!
పార్టీ ఎల్పీ భేటీలో నితీశ్‌కు పగ్గాలు! 20న తాను ఎల్పీ భేటీని నిర్వహిస్తానని మంఝి వెల్లడి ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు సిఫార్సు పట్నా: జేడీయూ నాయకత్వాన్ని ధిక్కరిస్తున్న బిహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. శనివారం జరిగే పార్టీ శాసనసభాపక్ష(ఎల్పీ) భేటీలో సీఎం పగ్గాలను సీనియర్ నేత నితీశ్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. నితీశ్, మంఝి వర్గాల మధ్య ఆధిపత్య పోరు శుక్రవారం తీవ్రమైంది. పార్టీ చీప్ శరద్ యాదవ్ శనివారం ఏర్పాటు చేసిన ఎల్పీ సమావేశం అనధికారికమని మంఝి ఆరోపించారు. అసెంబ్లీలో పార్టీ నేత హోదాలో తాను ఈ నెల 20న తన నివాసంలో ఎల్పీ భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు మంఝి శనివారం ఢిల్లీ వెళ్లనుండడంతో ఆ రోజు జరిగే ఎల్పీ భేటీకి గైర్హాజరు కానున్నారు. కాగా, శనివారం జరిగే అత్యవసర ఎల్పీ సమావేశానికి రావాలని మంఝి, నితీశ్ సహా 111 మంది ఎమ్మెల్యేలు, 41 మంది ఎమ్మెల్సీలకు శుక్రవారం నోటీసులు అందాయి. జేడీయూ రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షుడికి ఎల్పీ భేటీని ఏర్పాటు చేసే అధికారం ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. ‘సాయంత్రం 4 గంటల తర్వాత మంఝి జేడీయూ ఎల్పీ నేతగా ఉండర’ని అన్నారు. మంఝి వెళ్లనున్న ‘నీతి’ భేటీ గురించి విలేకర్లు ప్రస్తావించగా.. ఆయన సీఎం కానప్పుడు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. . పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు, కార్యకలాపాలకు పాల్పడుతున్న మంఝి, పార్టీ పెద్దలు మందలించినా మారలేదని, ఆయనను పదవి నుంచి తప్పించడం అవశ్యంగా మారిందని అన్నారు. 2010 ఎన్నికల్లో ప్రజలు నితీశ్‌కే పట్టం కట్టారని, మంఝి పదవి తాత్కాలికమేనని అన్నారు. ముంఝి ముంచేస్తున్న పార్టీ పడవను నితీశ్ కాపాడతారని పేర్కొన్నారు. నితీశ్‌కు తిరిగి సీఎం పదవి అప్పగించే యత్నానికి శరద్ యాదవ్‌తోపాటు ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు లాలూ, ములాయంల మద్దతు ఉందన్నారు. కాగా, త్యాగి యమదూత అని, ఆయనకు పిచ్చిపట్టిందని మంఝి ఆరోపించారు. నితీశ్ భీష్ముడి వంటి వారని, తను పేద ప్రజల సంక్షేమం గురించి మాట్లాడకుండా నితీశ్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాగా, మంఝి శనివారం అనూహ్యంగా అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేయొచ్చని జేడీయూ భయపడుతోంది. అందుకే మంఝి ప్రభుత్వం మైనారిటీలో పడిందని, ఆయన చేసే సిఫారసులను పరిగణనలోకి తీసుకోవద్దని కోరుతూ శరద్ యాదవ్ గవర్నర్‌ను ఓ లేఖలో కోరినట్లు సమాచారం. కాగా నితీశ్‌కు సన్నిహితులైన మంత్రులు రాజీవ్‌రంజన్, పీకే సాహీలు ప్రభుత్వ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని, వారిని కేబినెట్ తొలగించాలని మంఝి శుక్రవారం రాత్రి గవర్నర్‌కు సిఫారసు చేశారు. పార్టీ కార్యాలయం వద్ద ఘర్షణలు నితీశ్, మంఝి మద్దతుదారులు శుక్రవారం పట్నాలోని జేడీయూ కార్యాలయం వద్ద ఘర్షణలకు దిగారు. దళిత కార్యకర్తలు నితీశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, నితీశ్ మద్దతుదారులపై దాడి చేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర మంత్రులు బ్రిషేన్, నితీశ్ మిశ్రా తదితరులు సీఎం ఇంటికెళ్లి మద్దతు ప్రకటించారు. నితీశ్ నివాసం కూడా జేడీయూ దళిత సంఘం భేటీతో సందడిగా కనిపించింది. ఒత్తిళ్లకు తలొగ్గి సీఎం పదవి నుంచి తప్పుకోవద్దని మంఝికి కేంద్రమంత్రి పాశ్వాన్ సూచించారు. -
మోదీ ఉన్నారని రానివ్వలేదు!
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ 66 వ వర్థంతి సందర్భంగా ఆయన స్మృతి వనాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన జేడీయూ అధినేత శరద్ యాదవ్ కు అనుమతినివ్వకపోవడం పలు విమర్శలకు దారి తీసింది. శుక్రవారం గాంధీ వర్థంతి కావడంతో న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద ఉన్న మహాత్ముని సమాధికి అంజలి ఘటించడానికి శరద్ యాదవ్ వెళ్లారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అప్పటికే లోపల ఉండటంతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది శరద్ యాదవ్ ను అనుమతించలేదు. మోదీ లోపల ఉన్నారంటూ అభ్యంతర వ్యక్తం చేశారు. దీంతో ఆయన చేసేది లేక వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది అనుసరించిన తీరుపై జేడీయూ విమర్శలు గుప్పించింది. ఒక పార్లమెంట్ సభ్యున్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ప్రశ్నించారు. ఒక గుర్తింపు పొందిన పార్టీకి అధ్యక్షునిగా ఉన్న శరద్ యాదవ్ ను నియంత్రిచడం సరైనది కాదన్నారు. ఇది చరిత్రలోనే చాలా దురదృష్టకర అంశమని త్యాగి వ్యాఖ్యానించారు. గాంధీకి నివాళులు అర్పించడానికి గాంధీయే వాది కాని మోదీకి అసలు అర్హత లేదని విమర్శించారు. గత 30 సంవత్సరాల నుంచి గాంధీజీ వర్థంతి రోజున యాదవ్ నివాళులు అర్పిస్తున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
ల్యాండ్ పూలింగ్తో జీవితాలు తాకట్టు
* ప్రజా ఉద్యమ జాతీయ కూటమి ఆందోళన * ఆంధ్రప్రదేశ్ విధానంతో ఆహార భద్రతకూ ముప్పే * గాంధీ స్ఫూర్తితో పోరాటాలు చేయాలన్న శరద్‌యాదవ్ * చంద్రబాబు.. తాకట్టు విధానాలు వీడాలన్న స్వామి అగ్నివేశ్ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ నూతన రాజధాని నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ల్యాండ్ పూలింగ్ కేవలం ప్రజల జీవితాలను తాకట్టు పెట్టేలా ఉందని ప్రజా ఉద్యమాల జాతీయ కూటమి(ఎన్ఏపీఎం) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల అనుమతి, సంప్రదింపులు లేకుండా, పర్యావరణ అనుకూలతలు పట్టించుకోకుండా, శివరామకృష్ణన్ కమిటీ నివేదికపైనా కనీసం చర్చించకుండా టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు సాగుతోందని కూటమి దుయ్యబట్టింది. సింగపూర్ తరహా రాజధాని అంటూ ఆకాశంలో చందమామను చూపి భూములను మింగేస్తున్నారని విమర్శించింది. రాజధాని నిర్మాణంపై ఏపీ అవలంబిస్తున్న వైఖరిని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని, అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కూటమి తీర్మానించింది. ఈ మేరకు ఎన్ఏపీఎం జాతీయ కన్వీనర్ రామకృష్ణరాజు, మాజీ ఐఏఎస్ అధికారి దేవసహాయం అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో ‘ఏపీ గ్రీన్ ఫీల్డ్ రాజధాని, భూసేకరణ చట్టం’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జేడీయూ అధినేత శరద్‌యాదవ్, సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యుడు డి.రాజా, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, సామాజికవేత్త స్వామి అగ్నివేశ్‌తో పాటు వివిధ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు. రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ‘చట్ట ప్రకారం ఎలాంటి భూమినైనా ఎంతటి అవసరాల కోసమైనా ప్రజలతో సంప్రదింపులు జరపకుండా సేకరించరాదు. ఆహార భద్రతకు ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా వ్యవసాయ భూముల సేకరణ జరగాలి. కానీ ‘ఫుడ్ బౌల్ ఆఫ్ ఏపీ’గా ఉన్న వీజీటీఎం(విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) ప్రాంతాన్ని రాజధాని పేరిట నాశనం చేస్తున్నారు. గ్రామీణ నిర్మాణ వికాసాన్ని చెదరగొట్టి.. ప్రభుత్వం చెబుతున్న ‘మేకిన్ ఇండియా’ ఎలా సాధిస్తారు?’ అని వక్తలు ప్రశ్నించారు. ఆహార భద్రతకు భరోసా లేనప్పుడు జాతీయ భద్రత ఎక్కడుందన్నారు. ఈ సందర్భంగా దేవసహాయం పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ పేరిట ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నది, వారిని దెబ్బతీసే యత్నాలు ఎలా జరుగుతున్నాయి వంటి అంశాలను వివరించారు. ‘120 రకాల పంటలు, ఏడాదికి రూ.1000 కోట్ల వ్యవసాయోత్పత్తి ఉన్న భూములను పూలింగ్ పేరిట లాక్కొంటూ ప్రజలను ఫూల్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. బాధిత ప్రజలకు అండగా ఉంటాం: శరద్‌యాదవ్, జేడీయూ అధినేత కేంద్రం తెచ్చిన భూసేకరణ బిల్లు దేశం మొత్తాన్నీ లూఠీ చేసేలా ఉందని జేడీయూ అధినేత శరద్‌యాదవ్ విమర్శించారు. ఆవో.. లూటో.. కమావో (రండి..దోచుకోండి..సంపాదించండి) అన్న తరహాలో వ్యవహరిస్తూ కార్పోరేట్ కంపెనీలకు దాసోహం పలుకుతోందని నిప్పులు చెరిగారు. ఒక్క ఏపీలోనే కాకుండా దేశమంతటా ఇలాంటి కొల్లగొట్టే చర్యలే జరుగుతున్నాయన్నారు. రైతులకు నష్టం కలగనీయకుండా మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఉద్యమించాల్సి ఉందన్నారు. ఏపీ రాజధాని బాధిత రైతులకు అండగా ఉంటామన్నారు. వారి కోసం పార్లమెంటు లోపలా, బయటా కూడా పోరాడతామని నొక్కి చెప్పారు. బాబువి తాకట్టు విధానాలు: అగ్నివేశ్ ఏపీ సీఎం చంద్రబాబు.. తన తాకట్టు విధానాలను కొనసాగిస్తున్నారని సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ అన్నారు. ‘ప్రజాభిప్రాయానికి తిలోదకాలిస్తూ భూసేకరణ చేస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో సింగపూర్ ప్రతినిధులకు తెలియదు. వారి చేతిలో రాజధాని నిర్మాణం పెట్టి అభివృద్ధి అంటే అది గ్రామీణ వ్యవస్థను వినాశనం చేయడమే. శివరామకృష్ణన్ కమిటీ సైతం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించింది. వాటిని ఉల్లంఘించి ముందుకెళితే ఉద్యమం తప్పదు’ అని హెచ్చరించారు. గొంతు నొక్కారు: రామచంద్రయ్య రాజధాని నిర్మాణం విషయంపై శాసనసభ, మండలిలో సీఎం చంద్రబాబు.. విపక్షం గొంతు నొక్కి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య తెలిపారు. విజయవాడ చుట్టూ 180 కిలోమీటర్ల పరిధి అంత సురక్షిత ప్రాంతం కాదని జియోలాజికల్ శాఖ తేల్చిచెప్పినా సీఎం మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. సింగపూర్ తరహా రాజధానిపై కేబినెట్లోని మంత్రులకే తెలియదని, ఎమ్మెల్యేలకు ల్యాండ్ పూలింగ్‌పై కనీస అవగాహనా లేదని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోలీసులతో కవాతులు చేయిస్తున్నారన్నారు. ‘అక్కడేమైనా జిహాదీలు తిరుగుతున్నారా?’ అని ప్రశ్నించారు. ఇలాంటి రాక్షస నిర్ణయాలు దేశానికి ముప్పని వ్యాఖ్యానించారు. -
మంఝికి పదవీ గండం?
పట్నా: వివాదాస్పద వ్యాఖ్యలతో జేడీయూను ఇబ్బందుల్లో పడేస్తున్న ఆ పార్టీ నేత, బిహార్ ముఖ్యమంత్రి జితన్‌రాం మంఝిని పదవి నుంచి తొలగించే అవకాశాలున్నట్లు గురువారం మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. మంఝి నలుగురు పార్టీ రెబెల్స్‌కు వత్తాసు పలకడం, పార్టీ నేత నితీశ్ కుమార్‌కు సన్నిహితులైన పలువురు అధికారులను బదిలీ చేయడం, నక్సల్స్‌ల లెవీ వసూళ్లను సమర్థించడం, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రానుండడం నేపథ్యంలో ఆయనకు పదవీ గండం తప్పకపోవచ్చని కథనాలు వచ్చాయి. మంఝిని సీఎం పదవిలో కూర్చోబెట్టిన నితీశ్ గురువారం ఢిల్లీకి వెళ్లడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. మంఝి భవితవ్యాన్ని తేల్చడానికి పార్టీ చీఫ్ శరద్ యాదవ్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలతో చర్చించేందుకు ఆయన హస్తిన బాట పట్టారని వార్తలొచ్చాయి. అయితే వీటిని నితీశ్ తోసిపుచ్చారు. మంఝి సీఎం పదవిలో కొనసాగుతారో, లే దో నిర్ణయించడానికి తానెవరినని పట్నాలో విలేకర్లతో అన్నారు. బిహార్ అంశాన్ని ఢిల్లీలో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీలో శరద్‌ను కలిసిన అనంతరమూ ఇదే విధంగా స్పందించారు. మంఝిని పదవి నుంచి తప్పించే అవకాశం లేదని, శరద్‌తో జరిపిన చర్చల్లో ఈ అంశం రాలేదని అన్నారు. ఎన్డీఏ సర్కారుపై పోరాడ్డానికి జనతా పరివార్ పార్టీలను విలీనం చేయడంపై శరద్‌తో చర్చించానని తెలిపారు. మంఝిని తొలగిస్తారన్న వార్తలు మీడియా సృష్టేనని శరద్ కూడా అన్నారు. కాగా, తాను తెలివైన వాడిని కానని, సుదీర్ఘ అనుభవం ఆధారంగా మాట్లాడుతున్నాని, దురదృష్ట వశాత్తూ అవి పతాకశీర్షికలకు ఎక్కుతున్నాయని మంఝి పేర్కొన్నారు. మరోపక్క.. మంఝిని సీఎం పదవి నుంచి తప్పుకునేలా చేసి ఆ పదవి చేపట్టేందుకు నితీశ్ ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ నేత సుశీల్ కుమార్ షిండే ఆరోపించారు. నితీశ్ వర్గం నేతల నుంచి అవమానాలు పడేబదులు మంఝీ రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ సూచించారు.