సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీని సమర్థంగా ఎదుర్కొనేందుకు 15 మంది ప్రతిపక్ష పార్టీల సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటైంది. జేడీ(యూ) తిరుగుబాటు నేత శరద్‌యాదవ్ దీనికి కన్వీనర్‌గా వ్యవహరించనున్నా రు. భావ సారూప్య ప్రతిపక్ష పార్టీలను ఐకమత్యంగా ఉంచడంతో పాటు, బీజేపీ విధానాలను నిరసిస్తూ అన్ని రాష్ట్రాల్లో ‘మన వైవిధ్య సంస్కృతిని కాపాడుకుందాం’ అనే నినాదంతో సమావేశాలు నిర్వహించడం కమిటీ లక్ష్యం. కమిటీలో... ఆనంద్ శర్మ (కాంగ్రెస్), రామ్‌గోపాల్(ఎస్పీ), వీర్‌సింగ్ (బీఎస్పీ), సీతారాం ఏచూరి (సీపీఎం), సుఖెందు శేఖర్ రాయ్(టీఎంసీ), తారిక్ అన్వర్(ఎన్సీపీ), డి.రాజా(సీపీఐ), మనోజ్ సిన్హా(ఆర్జేడీ), బీఆర్ అంబేడ్కర్(భారియా బహుజన్ మహాసంఘ్), హేమంత్ సోరెన్ (జేఎంఎం) తదితరులున్నారు.