న్యూఢిల్లీ: జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ విషయంలో తాను ఏం చేయలేనని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ఆయనకు నచ్చిన దారి చూసుకోవచ్చని తెలిపారు. బీజేపీతో జేడీయూ పొత్తుపెట్టుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శరద్ యాదవ్ సొంత కుంపటి పెట్టే ఆలోచన చేస్తున్న విషయం తెలిసిందే.
దీనిపై నితీష్‌ను మీడయి ప్రతినిధులు ప్రశ్నించగా.. 'ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నచ్చిన దారిని చూసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది. గురువారం మీడియాతో మాట్లాడిన శరద్ యాదవ్ తాను మహాగట్బంధన్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు. బిహార్ ప్రజలు కలిసి పరిపాలించండనే తీర్పు ఇచ్చారని, నితీష్ దెబ్బకొట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు.