బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బావమరిది, వివాదాస్పద మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బావమరిది, వివాదాస్పద మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో జేడీయూ చీఫ్ శరద్ యాదవ్పై పోటీ చేయనున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలిపారు.
మాధేపూర నియోజకవర్గంలో శరద్ యాదవ్పైనా, పూర్ణియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిపైనా పోటీ చేస్తానని పప్పూ యాదవ్ చెప్పారు. ప్రజలు ఈ సారి తన వెంటే ఉన్నారని లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పూర్ణియా నుంచి మూడు సార్లు, మాధేపుర నుంచి 2004 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఇదిలావుండగా, యాదవ్ భార్య, మాజీ ఎంపీ రంజిత రంజన్ కాంగ్రెస్ టిక్కెట్ పైనా పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. సీపీఎం నాయకుడు అజిత్ సర్కార్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పప్పూ యాదవ్కు గతేడాది విముక్తి లభించింది.