ఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల స్థానాల్లో ఇండియా కూటమి 10 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీయే కూటమి రెండు చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒక సీటులో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేత, స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో ఆర్జేడీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉండటంపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచించాలని కోరారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
‘‘అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా వచ్చాయి. వచ్చే జార్ఖండ్, మహారాష్ట్ర, హార్యానా ఎన్నికల్లో కూడా ఇదే విధమైన ఫలితాలను ఇండియా కూటమి సొంతం చేసుకుంటుంది. అయితే బిహార్‌లో ప్రజలంతా.. జేడి(యూ) , ఆర్జేడీపై చాలా కొపంతో ఉన్నారు. దీంతో రాష్ట్రం రాజకీయంలో కొత్త పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ఆర్జేడీతో కూటమిపై కాంగ్రెస్ పునరాలోచించాలి. నేను, కాంగ్రెస్ పార్టీ కలిసి బిహార్‌లో కొత్త కూటమిల ఏర్పాటు చేస్తాం’’ అని పప్పూ యాదవ్ అన్నారు.
పప్పూ యాదవ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. పూర్ణియీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆర్జేడీ అభ్యర్థి బీమా భారతిపై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment