పట్నా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ విషయంలో దూరంగా ఉండకపోతే.. హత్య చేస్తామని బీహార్ ఎంపీ పప్పూ యాదవ్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈ మేరకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోమవారం ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఆడియో బిహార్‌లో కలకలం రేపుతోంది.
‘‘ఎంపీ పప్పూ యాదవ్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన విషయాల నుంచి ఆయన దూరంగా ఉండాలి. అలా ఉండకపోతే హత్య చేయడానికి కూడా వెనకాడము. అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సిగ్నల్ జామర్‌లను డిసేబుల్ చేయడానికి గంటకు రూ.1 లక్ష చెల్లిస్తున్నారు. పప్పూ యాదవ్‌తో నేరుగా కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఆయన మాత్రం మా కాల్స్‌కు స్పందించటం లేదు’’ అని ఆడియోలో క్లిప్‌లో ఓ వ్యక్తి మాట్లాడారు.
ఇక.. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ హత్యపై బిహార్‌లోని పూర్నియా నియోజకవర్గం ఎంపీ (స్వతంత్ర) పప్పూ యాదవ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అనుమతి ఇస్తే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కేవలం 24 గంటల్లో అంతం చేస్తానని సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సోమవారం వచ్చిన బెదిరింపులపై పప్పూ యాదవ్ బిహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment