మాదే అసలైన జేడీయూ
14 రాష్ట్రాల విభాగాల మద్దతుందన్న శరద్ యాదవ్ వర్గం
న్యూఢిల్లీ: జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్‌ను రాజ్యసభలో పార్టీ నాయకుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా తొలగించిన నేపథ్యంలో తమదే అసలు జేడీయూ అని చాటేందుకు శరద్ యాదవ్ వర్గం సిద్ధమవుతోంది. 14 రాష్ట్రాల జేడీయూ విభాగాలు శరద్ యాదవ్ వెంట ఉన్నాయనీ, సీఎం నితీశ్ కుమార్ బిహార్‌కే పరిమితమని శరద్‌యాదవ్ సన్నిహితుడైన అరుణ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శరద్ యాదవ్‌కు ఇద్దరు రాజ్యసభ సభ్యులు, పార్టీలోని పలువురు ఆఫీస్ బేరర్ల మద్దతు కూడా ఉందని ఆయన వెల్లడించారు. జేడీయూ ఒక్క బిహార్‌లో మాత్రమే నమోదిత పార్టీ అని నితీశ్ అనడాన్ని అరుణ్ ప్రస్తావిస్తూ తమది ఎప్పుడూ జాతీయ పార్టీనేనని పేర్కొన్నారు.
గతంలో నితీశ్ కుమారే తన సమతా పార్టీని జేడీయూలో విలీనం చేశారని అరుణ్ గుర్తు చేశారు. ‘మేం (శరద్ యాదవ్ వర్గం) పార్టీని వీడి వెళ్లం. బిహార్ బయట పార్టీనే లేదని నితీశ్ స్వయంగా చెబుతున్నారు. కానీ మాది జాతీయపార్టీ. దానిని లాక్కోవడానికి నితీశ్ యత్నించకూడదు. బిహార్ కోసం నితిశ్ ఓ ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసుకోవాలి’ అని అరుణ్ అన్నారు. రాజ్యసభ ఎంపీలు అలీ అన్వర్ అన్సారీ, వీరేంద్ర కుమార్‌లు శరద్ యాదవ్‌కు మద్దతిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో నితీశ్ మాట్లాడుతూ శరద్ యాదవ్‌తో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీతో కలవడం తన ఒక్కడి నిర్ణయం కాదనీ, పార్టీ అభిలాష మేరకే తాము కమలదళంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశామనీ, శరద్ యాదవ్‌కు ఈ విషయంలో భిన్నాభిప్రాయం ఉంటే ఉండొచ్చునని నితీశ్ అన్నారు.