'మోదీజీ.. ఉగ్రవాదంపై మనమూ చర్చిద్దాం' | JD(U) seeks debate in Parl for common consensus on terror | Sakshi
Sakshi News home page

'మోదీజీ.. ఉగ్రవాదంపై మనమూ చర్చిద్దాం'

Published Wed, Nov 18 2015 8:48 PM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

'మోదీజీ.. ఉగ్రవాదంపై మనమూ చర్చిద్దాం' - Sakshi

'మోదీజీ.. ఉగ్రవాదంపై మనమూ చర్చిద్దాం'

ఇండోర్: ఉగ్రవాదం సమస్యపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని జేడీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి బహిరంగంగా విజ్ఞప్తి చేసింది. ఇటీవల ప్యారిస్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు జరిపి దాదాపు 129మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉగ్రవాదమనేది అన్ని దేశాలకు కామన్ ప్రాబ్లమ్ గా మారిందని, దీనిపై అత్యవసర చర్చ జరిపి ఉమ్మడి సమ్మతి తెలపాలని అన్నారు. బుధవారం జేడీయూ పార్టీ చీఫ్ శరద్ యాదవ్ మాట్లాడుతూ ప్యారీస్ ఎటాక్ తర్వాత ప్రపంచమంతా కలవరంలోకి వెళ్లిపోయిందని ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఓ అర్థమంతమైన చర్చకు తెరతీయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement