
బిహార్ ఎన్నికల్లో కూటమిగా జనతా పరివార్
న్యూఢిల్లీ: త్వరలో బిహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో బీజేపీని కట్టడిచేయడానికి ఇతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. గతకొంత కాలంగా ఊహాగానాలకే పరిమితమైన లౌకిక కూటమి ఏర్పాటుపై జేడీ (యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ గురువారం ప్రకటన చేశారు. తమ పార్టీతో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఇతర పార్టీలు కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని శరద్ యాదవ్ వెల్లడించారు.
దేశ ప్రయోజనాల కోసం తాము కలసి పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన జనతా పరివార్ ఏకీకరణ ఇప్పుడు కార్యరూపం దాల్చిందన్నారు. అయితే కూటమి ఒప్పందం ఎప్పుడు చేసుకోబోతున్నారనే ప్రశ్నకు.. తేదీ ప్రస్తుతం చెప్పలేనని, అయితే కూటమి కట్టడం మాత్రం కచ్చితమని శరద్ తెలిపారు.