మాకు సంఘ్‌ వద్దు.. షరాబ్‌ వద్దు! | BJP say something else, and do something else, says nitishkumar | Sakshi
Sakshi News home page

మాకు సంఘ్‌ వద్దు.. షరాబ్‌ వద్దు!

Published Thu, May 12 2016 4:44 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP say something else, and do something else, says nitishkumar

వారణాసి: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు ఇప్పుడే సమరశంఖం పూరించారు. గురువారం వారణాసిలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీపై, నరేంద్రమోదీ సర్కార్‌పై నిప్పులు కురిపించారు. బిహార్‌లో బీజేపీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని విమర్శించారు. బిహార్‌లో బీజేపీని ఓడించగలిగినప్పుడు, మిగతా ప్రాంతాల్లోనూ ఆ పార్టీని ఓడించవచ్చునని చెప్పారు. బీజేపీ ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను ఇచ్చిందని, కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

బీజేపీ నేతల మాటలకు చేతలకు భారీ అంతరముంటుందని మండిపడ్డారు. తాము సంఘ్‌ (ఆరెస్సెస్‌) విముక్త భారతాన్ని కోరుకుంటున్నామని, అదేవిధంగా షరాబ్ (మద్యం) విముక్త సమాజాన్ని కూడా ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. బిహార్‌, ఉత్తరప్రదేశ్ సోదరుల్లాంటివని, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి తేడా లేదని, ఈ రెండింటి స్వభావాన్ని, భూమి ఒక్కటేనని అన్నారు. హామీలు నెరవేర్చలేకనే బీజేపీ దేశం దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement