
పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్‌లను అసభ్యకరంగా వర్ణిస్తూ పాటలు పాడిన భోజ్‌పురి గాయకుడు సూరజ్ సింగ్‌ను నవాడ పోలీసులు అరెస్టు చేశారు.
నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌లపై సూరజ్ సింగ్ అభ్యంతరకరమైన రీతిలో పాటలు పాడిన విషయమై సీనియర్ అధికారులకు ఫిర్యాదు అందిన దరిమిలా వారి ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. భోజ్‌పురి పాటలు బీహార్‌లో ఎంతో ఆదరణ పొందుతుంటాయి. అయితే ఈ పాటలు అశ్లీలంగా ఉంటున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
కాగా భోజ్‌పురి సింగర్ సూరజ్ సింగ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌లపై అభ్యంతరకరంగా పాడిన పాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వైరల్ వీడియోను పోలీసులు గుర్తించారు. ప్రముఖ నేతలను అవమానించిన ఆ గాయకునిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ పాటపై జేడీయూ, ఆర్జేడీ పార్టీలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కేసు గురించి సైబర్ డీఎస్పీ ప్రియా జ్యోతి మాట్లాడుతూ ఈ కేసులో సూరజ్ సింగ్ అనే గాయకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment