
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారని జనతాదళ్ (యూ) మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ శరద్‌యాదవ్ విమర్శించారు. కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ స్మారక కమిటీ ఆదివారం విశాఖ వుడా బాలల థియేటర్‌లో ‘రాజ్యాంగాన్ని రక్షించండి– ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ’అనే అంశంపై నిర్వహించిన స్మారకోపన్యాసంలో శరద్‌యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అమరావతిని పచ్చదనం స్థానంలో కాంక్రీట్ జంగిల్‌గా మార్చేశారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.