'బాగా ఆలోచించే నితీశ్ నిర్ణయం తీసుకున్నారు'
పాట్నా: నితీశ్ కుమార్ బాగా ఆలోచించే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్ తెలిపారు. జేడీయూ పార్టీ ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం 4 గంటలకు సమావేశమయి తమ నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పారు. నితీశ్‌ను కాకుండా మరో కొత్త నేతను ఎన్నుకునే అవకాశాలున్నాయని పరిశీలకుల అంచనా వేస్తున్నారు.
తమ పార్టీ ఆధ్వర్యంలోనే కొత్త సర్కారు ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో జేడీయూ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ గడవు 2015 నవంబరు వరకు ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు.