జనతా దళ్ (యు) నేత, రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్ మరోసారి నోరుపారేసుకున్నారు. పార్లమెంటులో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శరద్ యాదవ్ ఇపుడు ఆడబిడ్డల్ని ఘోరంగా అవమనించారు. అమ్మాయి గౌరవం కంటే..ఓటును కాపాడుకోవడం ముఖ్యమంటూ సెలవిచ్చారు. విచక్షణ మరిచి నోరుజారడం... తప్పయిందంటూ క్షమాపణలు చెప్పడం ఆయనకు కొత్తేమీ కాదు. అయితే ఒకవైపు ఆడబిడ్డల్ని కాపాడుకుందామంటూ ఉత్సవాలు జరుగుతోంటే...మరోవైపు సాక్షాత్తూ ఎంపీ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేపింది.