ఓటేసింది మహిళాలోకం
తుని రూరల్, న్యూస్‌లైన్ : పరిషత్ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలో 24 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఆదివారం జరిగిన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మండలంలో 57,296మంది ఓటర్లు ఉండగా 47,501మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో మహిళలే పైచేయి సాధించారు. 28,675 మంది పురుషులకుగాను 23,580మంది, 28,621మంది స్త్రీలకుగాను 23, 921మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. పురుషులకంటే స్త్రీలు 341 మంది అధికంగా ఓటు వేశారు. అత్యల్పంగా ఎస్.అన్నవరం-2లో 2180కి 1466(67.25శాతం) మంది ఓటర్లు ఓట్లు వేశారు. అత్యధికంగా వి.కొత్తూరు-4లో 1816 మందిలో 1675 (92.24 శాతం)మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.