కన్హయ్య విడుదలకు డిమాండ్
జాబల్ పూర్: రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ను విడుదల చేయాలని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. కన్హయ్య అమాయకుడని, అతడిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. అతడిని అక్రమంగా కేసులో ఇరికించినట్టు కడబడుతోందని పేర్కొన్నారు. 'జేఎన్ యూను మిని ఇండియా'గా వర్ణించారు.
జేఎన్ యూలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కన్హయ్య కుమార్ విడుదల చేయాల్సిందేనని చెప్పారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కశ్మీర్ లో దేశవ్యతిరేక నినాదాలు నిత్యకృత్యంగా మారాయని అన్నారు. బిహార్ ఎన్నికల సమయంలో బీఫ్ వివాదాన్ని లేవనెత్తి ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు.