జైపూర్: జేఎన్యూ విద్యార్థి కన్హయ్య కుమార్పై రాజస్థాన్ బీజేపీ ఎంపీ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్హయ్య కుమార్లాగా మరొకరు పుట్టకూడదని తమ పాఠ్య పుస్తకాల్లో సమూల మార్పులు చేస్తున్నామని విద్యాశాఖ సహాయక మంత్రి వాసుదేవ్ దేవ్ నాని అన్నారు.
విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు తాము పాఠ్యపుస్తకాలను దేశభక్తితో నిండిన అంశాలను చేరుస్తున్నామని, భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుల చరిత్రను, ఫొటోలను పుస్తకాల్లో పెడుతున్నామని తెలిపారు. జేఎన్యూ ఘటనను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో జెండాను ఎగురవేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాము రాష్ట్ర పుస్తకాల్లో దేశభక్తి అంశాలను చేరుస్తున్నట్లు చెప్పారు.
'కన్హయ్యలాగా ఎవరూ పుట్టొద్దు'
Published Fri, Mar 18 2016 8:54 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM
Advertisement
Advertisement