నూఢిల్లీ: జేడీయు అధ్యక్షుడు శరద్ యాదవ్తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న ఆయన... అందులో భాగంగా జేడీయూ అధినేతను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలపై శరద్ యాదవ్‌తో చర్చించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో కలిసి రావాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
భేటీ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం దారుణమన్నారు. పైగా వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం అప్రజాస్వామికం అన్నారు. ఇలాంటి అనైతికను అడ్డుకోవాలని శరద్ యాదవ్‌ను కోరినట్లు వైఎస్ జగన్ తెలిపారు. ఆయన తమ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారన్నారు. అనంతరం వైఎస్ జగన్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు.