యావత్‌ రాష్ట్రం ఓవైపు.. బీజేపీ, ఎన్డీయే మరో వైపు! | We give full Support to Special Status Fight, says Suravaram sudhakar Reddy | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 11 2018 11:30 AM | Last Updated on Fri, Aug 10 2018 5:32 PM

We give full Support to Special Status Fight, says Suravaram sudhakar Reddy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఉన్న దీక్షాస్థలిని బుధవారం సందర్శించిన ఆయన.. ఎంపీలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ హామీని అమలుచేయలేదన్నారు. కేంద్రం నియంతృత్వ పోకడలు అనుసరిస్తోందని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో నిర్వహించిన బంద్‌లు, రైల్‌రోకోలు, దీక్షలతో ప్రత్యేక హోదా పోరాటం ఉధృతస్థాయికి చేరుకుందని అన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకున్నదని దుయ్యబట్టారు. యావత్‌ రాష్ట్రం ఓ వైపు, బీజేపీ, ఎన్డీయే మరోవైపు నిల్చుని ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా కోసం చేసే పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement