శరద్ యాదవ్తో విజయమ్మ సమావేశం | YS Vijayamma Meet JD(U) chief Sharad Yadav | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 27 2013 7:15 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నాయకత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం జెడియు అధినేత శరద్ యాదవ్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను కేంద్ర నాయకత్వానికి, ప్రధాన పక్షాల నేతలకు వివరించేందుకు ఈ బృందం ఇక్కడకు వచ్చింది. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఆనాలోచిత నిర్ణయం వల్ల సీమాంధ్రలో తీవ్రరూపం దాల్చిన ఉద్యమం గురించి వివరించడంతోపాటు రాష్ట్రాన్ని విభజించవలసి వస్తే ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఈ బృందం కోరుతోంది. జెడియు లాంటి పక్షాలను కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ బృందం ఈ ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ను కలిసి పరిస్థితిని విరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement