JD(U)
-
స్పీకర్ పదవి.. బీజేపీ రిస్క్ చేస్తుందా?
హోరాహోరీ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అంతా ఊహించినట్టే నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మోదీ 3.0 మంత్రివర్గమూ కొలువుదీరింది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా సొంతంగా మెజారిటీ సాధించడంలో బీజేపీ ఈసారి విఫలమైంది. దాంతో ఎన్డీఏ సంకీర్ణ సర్కారు మనుగడలో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ అతి కీలకమైన లోక్‌సభ స్పీకర్ పదవిపైనే నెలకొన్నాయి. ఎన్డీఏ కీలక భాగస్వామి టీడీపీ ఆ పదవిపై ఆసక్తిగా ఉందంటూ ముందునుంచీ వార్తలొస్తున్నాయి. తాజాగా జేడీ(యూ) పేరూ విని్పస్తోంది. అవి నాలుగైదు కేబినెట్ బెర్తులు కోరినా ఎన్డీఏ పెద్దన్న బీజేపీ మాత్రం చెరో రెండింటితో సరిపెట్టింది. కనుక స్పీకర్ పోస్టుపై ఆ పార్టీలు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. కానీ అపారమైన విచక్షణాధికారాలుండే స్పీకర్ పాత్ర కీలక సమయాల్లో అత్యంత నిర్ణాయకంగా మారుతుంటుంది. మరీ ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో లోక్‌సభ స్పీకర్ పాత్రకుండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పైగా గతంలో టీడీపీకి స్పీకర్ పోస్టు ఇచ్చి సర్కారును కుప్పకూల్చుకున్న అనుభవమూ బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలో కీలక పదవిని మిత్రపక్షాల చేతిలో పెట్టే రిస్క్‌కు బీజేపీ పెద్దలు మరోసారి సిద్ధపడతారా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది...అది 1999. రాజకీయ అస్థిరతకు చెక్ పెట్టే ఉద్దేశంతో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లోక్‌సభలో బలపరీక్షకు సిద్ధపడింది. మద్దతిస్తామన్న పలు ఇతర పారీ్టలు తీరా అసలు సమయానికి అడ్డం తిరగడంతో ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కుప్పకూలింది. నాడు స్పీకర్‌గా ఉన్న టీడీపీ నేత జీఎంసీ బాలయోగి తీసుకున్న నిర్ణయమే అందుకు కారణంగా మారడం విశేషం! అంతకు కొద్ది రోజుల ముందే ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్‌ను ఓటింగ్‌కు అనుమతించాలా, లేదా అన్న ధర్మసందేహం తలెత్తింది. స్పీకర్‌గా తన విచక్షణాధికారాలను ఉపయోగించి గమాంగ్‌ను ఓటింగ్‌కు అనుమతిస్తూ బాలయోగి నిర్ణయం తీసుకున్నారు. చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 270 వచ్చాయి. అలా గమాంగ్ వేసిన ఒక్క ఓటు ప్రభుత్వాన్ని పడ గొట్టింది. ఎన్డీఏ సర్కారుకు బయటినుంచి మద్దతిచి్చన టీడీపీ అధినేత చంద్రబాబు కోరిక మేరకు స్పీకర్ పదవిని ఆ పారీ్టకిస్తూ నాటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయం తీసుకున్నారు. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు బాబు మరోసారి టీడీపీకి స్పీకర్ పదవి కోరుతున్నట్టు వార్తలొస్తుండటం విశేషం! జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్! మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినా బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని విషయం తెలిసిందే. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272 కాగా బీజేపీకి 240 మంది ఎంపీలే ఉన్నారు. ఎన్డీఏ భాగస్వాముల్లో 16 ఎంపీలున్న టీడీపీ, 12 మంది ఉన్న జేడీ(యూ) ప్రభుత్వ మనుగడకు కీలకంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వాల మనుగడలో స్పీకర్ పదవి ఎంత కీలకమో 1999 నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ఉదంతం నిరూపించింది. పైగా ‘జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్ (స్పీకర్ పదవి దక్కిన వారిదే సర్కారు)’ అన్న నానుడి హస్తిన రాజకీయ వర్గాల్లో బాగా ఫేమస్ కూడా. అలాంటి కీలకమైన స్పీకర్ పదవిని ఈసారి టీడీపీ కోరుతోంది. మోదీ అందుకు అంగీకరించే సాహసం చేస్తారా అన్నదానిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2014, 2019ల్లో బీజేపీ సొంతగానే మెజారిటీ సాధించడంతో ఆయనకు ఇలాంటి పరీక్ష ఎదురవలేదు. అయితే మంత్రివర్గ కూర్పులో భాగస్వాముల డిమాండ్లకు మోదీ పెద్దగా తలొగ్గలేదు. టీడీపీ ఐదారు, జేడీ(యూ) నాలుగైదు బెర్తులు అడిగినా వాటికి చెరో రెండు పదవులతో సరిపెట్టారు. పైగా కీలకమైన శాఖలన్నింటినీ బీజేపీకే కేటాయించారు. కనుక స్పీకర్ పదవిని కూడా బీజేపీయే అట్టిపెట్టుకోవచ్చన్న అభిప్రాయం విని్పస్తోంది. పవర్స్ అన్నీ ఇన్నీ కావులోక్సభ స్పీకర్‌కు సాధారణ అధికారాలతో పాటు అత్యంత కీలకమైన విచక్షణాధికారాలు కూడా ఉంటాయి. సభా నిబంధనలను తన విచక్షణ మేరకు నిర్వచించగలుగుతారు. అందుకే స్పీకర్ పదవిని పాలక పక్ష బలానికి, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. లోక్‌సభను అజమాయిషీ చేస్తూ కార్యకలాపాలను సజావుగా నడిపించేది స్పీకరే. కనుక ఆ పదవి దక్కే పార్టీ సహజంగానే లోక్‌సభ కార్యకలాపాల అజెండా తదితరాలను ప్రభావితం చేయగలుగుతుంది. నిర్ణాయక సందర్భాల్లో ఇది కీలకంగా మారుతుంది. సభలో ప్రవేశపెట్టే బిల్లులు ద్రవ్య బిల్లా, సాధారణ బిల్లా అన్నది స్పీకరే నిర్ధారిస్తారు. సభా సంఘాలను ఏర్పాటు చేస్తారు. వాటి చైర్పర్సన్లు, సభ్యులను నియమిస్తారు. సభ్యుల సస్పెన్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది స్పీకరే. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు సారథ్యం వహిస్తారు. అన్నింటికీ మించి ఏ అంశంపై అయినా సభలో ఓటింగ్ జరిగి రెండు పక్షాలకూ సమానంగా ఓట్లొస్తే స్పీకర్ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. ఆయన నిర్ణాయక ఓటు ఎవరికి వేస్తే వారే నెగ్గుతారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
Bihar political crisis: మళ్లీ కూటమి మారిన నితీశ్
పట్నా: బిహార్ రాజకీయ రగడకు ఊహించిన విధంగానే తెర పడింది. గోడదూకుళ్లకు పెట్టింది పేరైన జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మళ్లీ కూటమి మారారు. ఆదివారం ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గూటికి చేరారు. ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసి జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సర్కారుకు చరమగీతం పాడారు. సాయంత్రానికల్లా బీజేపీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తద్వారా 72 ఏళ్ల నితీశ్ బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరుల సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ బీజేపీ చీఫ్ సమ్రాట్ చౌధరి, పార్టీ నేత విజయ్‌కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. నితీశ్ చర్యపై కాంగ్రెస్‌తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ, డీఎంకే, జేఎంఎం, ఆప్ తదితర పారీ్టలు మండిపడ్డాయి. బిహార్ ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నాయి. భాగస్వాములను మోసగించడంలో సిద్ధహస్తుడైన ఆయన మరోసారి ఊసరవెల్లి నైజాన్ని చాటుకున్నారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. నితీశ్ వంటి ఆయారాం, గయారాంల ని్రష్కమణతో ఇండియా కూటమికి నష్టమేమీ లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘ఆయన ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలు, ఆయన కుమారుడు తేజస్వి కూడా నాకు చెప్పారు. కానీ ఇండియా కూటమి చెదిరిపోకుండా ఉండాలని నేను బయటికి చెప్పలేదు’’ అన్నారు. ఆట ఇప్పుడే ఆరంభమైందని తేజస్వి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) మట్టి కరవడం ఖాయమంటూ శాపనార్థాలు పెట్టారు. నితీశ్‌ది ద్రోహమంటూ సీపీఐ (ఎంఎల్) దుయ్యబట్టింది. గోడ దూకుడుకు పర్యాయపదంగా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ ఎన్సీపీ (శరద్ పవార్) ఎద్దేవా చేసింది. ‘‘స్నోలీగోస్టర్ (విలువల్లేని వ్యక్తి) పదం నితీశ్‌కు బాగా సరిపోతుంది. ఇదే వర్డ్ ఆఫ్ ద డే’’ అంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ చమత్కరించారు. పదేపదే కూటములు మార్చడం నితీశ్‌కు పరిపాటేనని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది. జేడీ(యూ) మాత్రం కాంగ్రెస్ స్వార్థపూరిత వైఖరి వల్లే నితీశ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని చెప్పుకొచి్చంది. కొత్త సర్కారుకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బిహారీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పాటుపడుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక ఎటూ వెళ్లను: నితీశ్ అంతకుముందు ఆదివారం రోజంతా పట్నాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఉదయమే జేడీ(యూ) శాసనసభా పక్షం నితీశ్ నివాసంలో భేటీ అయింది. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కును ఆయనకు కట్టుబెడుతూ తీర్మానించింది. వెంటనే నితీశ్ రాజ్‌భవన్‌కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమరి్పంచారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహాఘట్బంధన్లో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్లే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు నితీశ్‌కు మద్దతిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఆ వెంటనే తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాల్సిందిగా గవర్నర్‌ను నితీశ్ కోరడం, సీఎంగా ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. తర్వాత నితీశ్ మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏను వీడి ఇకపై ఎటూ వెళ్లేది లేదని చెప్పుకొచ్చారు. ఆయన తమ సహజ భాగస్వామి అని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. జేడీ(యూ)తో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లనూ స్వీప్ చేస్తామని అన్నారు ఇండియా కూటమికి చావుదెబ్బ! తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇచి్చన ఇటీవలి షాక్‌లకు ఇప్పటికే మూలుగుతున్న కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నితీశ్ తాజా ని్రష్కమణతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే దూకుడు మీదున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమబెంగాల్లో అన్ని స్థానాల్లోనూ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించడం తెలిసిందే. పంజాబ్‌లోనూ ఆప్‌ది ఒంటరిపోరేనని రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కూడా అదే రోజు స్పష్టం చేశారు. అధికారమే పరమావధి 2020లో ఏర్పాటైన ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలంలో నితీశ్ సారథ్యంలో ఇది ఏకంగా మూడో ప్రభుత్వం కావడం విశేషం! అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ మద్దతుతో నితీశ్ సీఎం అయ్యారు. జేడీ(యూ)లో చీలికకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ 2022లో ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాఘట్బంధన్ సర్కారును ఏర్పాటు చేశారు. 18 నెలలకే దాన్నీ పడదోసి తాజాగా మరోసారి ఎన్డీఏతో జట్టు కట్టి మళ్లీ సీఎంగా పీఠమెక్కారు. మొత్తమ్మీద కూటములు మారడం నితీశ్‌కు ఇది ఐదోసారి. ఆయన తొలిసారిగా 2000లో బిహార్ సీఎం పదవి చేపట్టారు. 2013లో ఎన్డీఏతో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి నితీశ్ కుమార్ తప్పుకున్నారు. కానీ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తోకలిసి పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 2022 దాకా అందులో కొనసాగారు. -
కూటమిని కాపాడుకుంటాం: ఖర్గే
కలబురిగి(కర్ణాటక): బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్‌కు చెందిన జేడీ(యూ) ఇండియా కూటమిని వీడి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరనుందన్న వార్తలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే తపన ఉన్నవారు కచ్చితంగా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరని తమ పార్టీ భావిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమిని ఐక్యంగా నిలిపి ఉంచేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
‘సమోసాకు డబ్బుల్లేక.. చాయ్‌తో సరిపెట్టారు’
న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీలో ప్రస్తావనకు వచ్చిన కీలకాంశాలపై ఓ వైపు చర్చ జరుగుతుంటే అక్కడ సమోసాలు ఇవ్వలేదంటూ జేడీ(యూ) సీనియర్ నేత సునీల్ కుమార్ పింటూ కాంగ్రెస్‌నుద్దేశిస్తూ చులకనగా మాట్లాడారు. డబ్బుల్లేక కాంగ్రెస్ కనీసం సమోసాలు కూడా వడ్డించలేదని వ్యాఖ్యానించారు. ‘‘ నిన్నటి సమావేశానికి భాగస్వామ్య పార్టీల అగ్రనేతలంతా విచ్చేశారు. సీట్ల పంపకాలపై చర్చించాలనుకున్నా అది టీ, బిస్కెట్లకే పరిమితం అయింది. ఎందుకంటే కాంగ్రెస్ దగ్గర నిధులు నిండుకున్నాయి. రూ.138, రూ.1,380, రూ.13,800 ఇలా చిన్న చిన్న మొత్తాలను ఆ పార్టీ విరాళంగా సేకరిస్తోంది. ఇంకా విరాళాలు రావాల్సి ఉంది. అప్పటిదాకా సమోసాలుండవు. టీ, బిస్కెట్లతో సరిపెట్టుకోవాలి. సమోసాలు లేకుండా ఎలాంటి తీవ్రమైన చర్చలు జరగబోవు’’ అని సునీల్ పింటూ వెటకారంగా అన్నారు. సంబంధిత వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. JDU सांसद सुनील कुमार पिंटू का बड़ा बयान। I.N.D.I. अलायंस की बैठक को बताया टांय-टांय फिस्स। pic.twitter.com/saHVMze4bJ — News18 Bihar (@News18Bihar) December 20, 2023 Video Credits:News18 Bihar ఆయ్.. హిందీ తెలియాల్సిందే విపక్షాల కూటమి సమావేశంలో నితీశ్ కుమార్ ప్రసంగిస్తుండగా డీఎంకే నేత టీఆర్ బాలు బాగా ఇబ్బంది పడ్డారు. హిందీరాని బాలుకు నితీశ్ హిందీ ప్రసంగం అర్ధంకాలేదు. అర్ధంచేసుకునేందుకు తన పక్కనే కూర్చున్న రా్రïÙ్టయ జనతాదళ్ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝాను సాయంకోరారు. ‘మీ ప్రసంగాన్ని ఆయనకు అర్ధమయ్యేలా అనువాదం చేయొచ్చా?’ అని నితీశ్‌ను ఝా కోరారు. దీంతో ఆగ్రహించిన నితీశ్.. ‘ హిందీ మన జాతీయ భాష. అందుకే మన దేశాన్ని హిందుస్తాన్‌గా పిలుచుకుంటాం. హిందీ అందరి భాష. అలాంటి హిందీ తెలియాల్సిందే. నేర్చుకుని అర్ధంచేసుకోవాలి. మీరు అనువాదాలు ఏవీ చేయకండి’’ అని ఝాను వారించారు. -
మా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలట
సితాబ్ దియారా: తమ జేడీ(యూ) పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చాడని జేడీ(యూ) చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. సామాజికవేత్త జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలి సితాబ్ దియారాలో పర్యటించిన నితీశ్ శనివారం అక్కడి మీడియాతో మాట్లాడారు. ‘ రెండు వారాల క్రితం ప్రశాంత్ కిశోర్ నా వద్దకు వచ్చారు. నేనేం అతడిని పిలవలేదు. జేడీయూను కాంగ్రెస్‌లో కలిపేస్తే మంచిదని నాలుగైదేళ్ల క్రితమే నాకు సలహా ఇచ్చాడు. ఇప్పడేమో చాలాసేపు ఏవోవో అంశాలు మాట్లాడుతున్నాడు. నాకప్పుడే అర్థమైంది ప్రశాంత్ బీజేపీ తరఫున పనిచేస్తున్నాడని ’ అని నితీశ్ చెప్పారు. ‘10–15 రోజుల క్రితం నితీశే నన్ను పిలిచారు. తన జేడీయూ పార్టీకి సారథ్యం వహించాలని కోరారు. నేను తిరస్కరించా. మళ్లీ జేడీయూలో చేరలేనని చెప్పా’ అని మంగళవారం ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించిన నాలుగు రోజులకే నితీశ్ స్పందించడం గమనార్హం. ఐ–ప్యాక్‌కు సారథ్యం వహిస్తూ 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్‌కు జాతీయ పౌరసత్వం సవరణ చట్టంపై నితీశ్‌తో అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో పార్టీ నుంచి ప్రశాంత్‌ను బహిష్కరించారు. -
Bihar Politics: నితీశ్‌లో ఎందుకీ అసంతృప్తి?
బిహార్‌లో బీజేపీ, జేడీ(యూ) బంధం బీటలుబారుతోంది. రెండు పార్టీల మధ్య తెగతెంపులు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై తనని కూర్చోబెట్టినప్పటికీ అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఎక్కువ ఉండడంతో కమలదళం తమపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోందని సీఎం నితీశ్ కుమార్ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు.ప్రభుత్వం నడపడానికి ఆయనకి ఎప్పుడూ తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోగా, తనకున్న జనాదరణను బీజేపీ బలపడడానికి వినియోగించుకుంటోందని ఆయన అసహనంతో రగిలిపోతున్నారు. 2025 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే సొంత పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిని చెయ్యాలని భావిస్తూ దానికి అనుగుణంగా కమలదళం వ్యూహాలు రచిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన పదవికి ఎసరు తప్పదన్న అంచనాలు నితీశ్‌లో అసంతృప్తి రాజేస్తున్నాయి. స్పీకర్‌తో కయ్యం బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న బీజేపీ నాయకుడు విజయ్ కుమార్ సిన్హాను ఆ పదవి నుంచి తొలగించాలని చూసి నితీశ్ కుమార్ భంగపడ్డారు. అప్పట్నుంచి ఇరు పార్టీల నడుమ పోరు మొదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత జేడీ(యూ) నుంచి ఆర్సీపీ సింగ్ ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వడం నితీశ్‌కి రుచించలేదు. ఆ పదవి కూడా ఆర్సీపీ సింగ్‌కు బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే వచ్చింది.దీంతో గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆర్సీపీ సింగ్‌ను మరోసారి పెద్దల సభకు పంపడానికి నితీశ్ నిరాకరించడంతో ఆయన కేంద్ర మంత్రి పదవిని వీడాల్సి వచ్చింది. సింగ్‌కున్న ఆస్తులపైన కూడా జేడీ(యూ) వివరణ కోరింది. దీంతో ఆర్సీపీ సింగ్ పార్టీని వీడుతూ జేడీ(యూ) మునిగిపోతున్న నౌక అని, నితీశ్ అసూయతో రగిలిపోతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్)కి చెందిన చిరాగ్ పాశ్వాన్ బహిరంగంగానే నితీశ్‌ను దుయ్యబట్టడం వంటివన్నీ రెండు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. గైర్హాజరు పర్వం..బీజేపీ నాయకత్వం తీరుపై తన అసంతృప్తిని నితీశ్ కుమార్ ఎక్కడా దాచుకోవడం లేదు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో నితీశ్ పాలుపంచుకోలేదు. ఆదివారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారు. జూలై 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి దూరంగా ఉండిపోయారు.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వీడ్కోలు పలుకుతూ జూలై 22న ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు సైతం హాజరుకాలేదు. మూడు రోజుల తర్వాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవంలోనూ పాల్గొనలేదు. చాలారోజులుగా బీజేపీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. కులాల వారీగా జనగణన, జనాభా నియంత్రణ, అగ్నిపథ్ పథకం వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదించారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
సీఏఏపై అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ సవాల్
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలను అమలు చేయాలని హోంమంత్రి అమిత్ షాకు జనతాదళ్ (యూ) ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. పౌరుల అసమ్మతిని తోసిపుచ్చడం ఏ ప్రభుత్వానికి బలం కాదని హితవు పలికారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను మీరు ఖాతరు చేయని పక్షంలో మీరు ప్రకటించిన కార్యక్రమానికి అనుగుణంగా సీఏఏ, ఎన్ఆర్సీలపై ముందుకు వెళ్లి వాటిని ఎందుకు అమలు చేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు. కాగా, నిరసనలకు భయపడి సీఏఏను వెనక్కితీసుకోబోమని, తాము నిరసనల మధ్యే జన్మించామని, ఎదిగామని విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఇదే చెబుతున్నామని లక్నోలో జరిగిన ర్యాలీలో అమిత్ షా పునరుద్ఘాటించిన క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. చదవండి : పౌర నిరసనలు : వారంతా ఏమైపోయినట్టు..? -
#CAB2019: మరోసారి ఆలోచించండి!
పట్నా: లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడంపై జేడీ(యు)లో నిరసన గళాలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. జాతీయ అధికార ప్రతినిధి పవన్ కే వర్మ కూడా తాజాగా నిరసన గళం విప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుపై పునరాలోచన చేయాలని జేడీ(యు) జాతీయ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు వర్మ సూచించారు. ‘పౌరసత్వ సవరణ బిల్లు(#CAB2019)కు రాజ్యసభలో మద్దతు ఇచ్చే విషయంలో మరోసారి ఆలోచించాలని నితీశ్ కుమార్‌ను కోరుతున్నాను. ఈ బిల్లు రాజ్యాంగం విరుద్ధంగా, వివక్షతో పాటు దేశ ఐక్యమత్యం, సౌభ్రాతృత్వానికి వ్యతిరేకంగా ఉంది. జేడీ(యు) లౌకిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. గాంధీజీ ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించార’ని పవన్ కే వర్మ మంగళవారం ట్వీట్ చేశారు. జేడీ(యు)కు లోక్‌సభలో 16 మంది, రాజ్యసభలో 6 మంది ఎంపీలు ఉన్నారు. కాగా, మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇవ్వడం నిరాశ కలిగించిందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లుకు లౌకికవాదానికి వ్యతిరేకంగా లేదనందువల్లే తాము మద్దతు ఇచ్చామని జేడీ(యు) ఎంపీ రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్ లోక్‌సభలో చెప్పారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిల్లును సమర్థించడం మినహా తమకు మరో మార్గం లేదని జేడీ(యు) సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్ఆర్సీ, పౌరసత్వ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకించి చివరకు జేడీ(యు) మద్దతు పలకడం తమకు ఆశ్చర్యం కలిగించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘యూటర్న్ తీసుకోవడం జేడీ(యు)కు కొత్త కాదని, గతంతో మూడు సార్లు ఈవిధంగా చేసింది. ట్రిఫుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఎలా వ్యవహరించిందో ఇప్పుడు పౌరసత్వ బిల్లుపై అదే విధంగా ప్రవర్తించింది. బీజేపీ ప్రవేశపెట్టిన అంశాలను వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రజలు, ఓటర్లలో భ్రమలు కల్పిస్తుంది. చివరకు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్ దూరంగా ఉండటమో లేదా సమర్థించమో చేస్తుంద’ని ఏఎన్ సిన్హా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ రాజకీయ విశ్లేషకుడు డీఎం దివాకర్ పేర్కొన్నారు. (మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే) -
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్‌కు చెక్ : జేడీయూ
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తామని, ఈ అంశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతు ఇవ్వబోమని బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ స్పష్టం చేసింది. జేడీయూ ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తుందని, తమ వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదని ఆ పార్టీ నేత, బిహార్ మంత్రి షయం రజాక్ తెలిపారు. ట్రిపుల్ తలాక్ సామాజికాంశమని, దీన్ని సమాజమే పరిష్కరించాలని చెప్సారు. కాగా ట్రిపుల్ తలాక్ బిల్లును బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే బాహాటంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి అమలు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి నిర్ణయాలను చర్చల ద్వారా లేదా కోర్టు తీర్పు ద్వారా పరిష్కరించాలని నితీష్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతికి తాము వ్యతిరేకమని నితీష్ స్పష్టం చేశారు. -
‘ప్రధాని రేసులో నితీష్ కుమార్’
పట్నా : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఎ తరపున ప్రధాని అభ్యర్థిగా తమ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ సైతం రేసులో ఉంటారని జేడీ(యూ) స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఎన్డీఏలో సవాల్ ఎదురవుతున్నట్టు ఆ పార్టీ సంకేతాలు పంపింది. రాజకీయాల్లో నితీష్ కెరీర్ స్ఫూర్తివంతంగా సాగిందని, బిహార్‌ను ఒంటిచేత్తో అభివృద్ధిపథంలో నిలిపి దేశానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని జేడీ(యూ) ప్రతినిధి రాజీవ్ రంజన్ ఆదివారం పేర్కొన్నారు. ఎన్డీఏ నేతగా ప్రధాని మోదీ నిలిచినప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి చర్చకు వస్తే నితీష్ కుమార్ సైతం ప్రదాని రేసులో ఉంటారని రంజన్ వెల్లడించారు. కాగా, ప్రధాని అభ్యర్ధిపై చర్చ అవసరం లేదని జేడీ(యూ) ప్రకటనను తోసిపుచ్చుతూ బీజేపీ స్పష్టం చేసింది. ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోదీని స్వయంగా నితీష్ కుమార్ ప్రతిపాదించారని, బిహార్ ప్రజలే ప్రదాని అభ్యర్ధిగా మోదీని బలపరిచారని బీజేపీ ఎంపీ సీపీ ఠాకూర్ అన్నారు. మరోవైపు నితీష్ కుమార్ బిహార్‌లో మహాకూటమి నుంచి బయటికొచ్చి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని అభ్యర్థిగా బిహార్ ప్రజలు రాహుల్ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ నేత ప్రేమ్‌చంద్ర మిశ్రా పేర్కొన్నారు. జేడీ(యూ) ప్రకటనలు చూస్తుంటే ప్రధానిగా మరోసారి మోదీ గెలుపొందే అవకాశాలు లేవని వెల్లడవుతోందన్నారు. -
శరద్ యాదవ్‌కు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : జేడీ(యూ) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నుంచి అనర్హత వేటుకు గురైన ఆయనకు ప్రస్తుతం లభిస్తున్న వేతనం, అలవెన్సులు, ఇతర సౌకర్యాలపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. శరద్ యాదవ్‌కు వేతనం, అలవెన్సులు, రైలు, విమాన టికెట్ల వంటి ఇతర సౌకర్యాలు నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవరిస్తూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే రాజ్యసభ నుంచి శరద్ యాదవ్ అనర్హత వేటు అంశం పరిష్కారమయ్యే జులై 12 వరకూ న్యూఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయకుండా ఆయనకు ఊరట కల్పించింది. రాజ్యసభ నుంచి తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ శరద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను వేగవంతం చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన సుప్రీం వెకేషన్ బెంచ్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కాగా న్యూఢిల్లీలోని అధికార నివాసంలో నితీష్ కుమార్ కొనసాగవచ్చన్న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ జేడీ(యూ) దాఖలు చేసిన పిటిసన్‌పై సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. జేడీ(యూ) రాజ్యసభ ఎంపీ రామచంద్ర ప్రసాద్ సింగ్ మే 18న దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు స్వీకరిస్తూ సుప్రీం కోర్టు శరద్ యాదవ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
శరద్ యాదవ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
లాలూ ర్యాలీకి హాజరైతే అంతే...,
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఆ పార్టీ రెబెల్ నేత శరద్ యాదవ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈనెల 27న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తలపెట్టిన ర్యాలీకి హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించింది. శరద్ యాదవ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఆయన సీనియారిటీ, పార్టీతో సుదీర్ఘ అనుబంధం దృష్ట్యా చర్యలు తీసుకోలేదని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి తెలిపారు. అయితే లాలూ ర్యాలీకి హాజరైతే మాత్రం ఆయన లక్ష్మణ రేఖ దాటినట్టుగా భావించి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. శరద్ యాదవ్ తనకు తానుగా పార్టీని వీడారని, భౌతికంగా ఆయన తమ పార్టీలో లేరని వ్యాఖ్యానించారు. సీఎం అధికార నివాసంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నఅనంతరం త్యాగి విలేకరులతో మాట్లాడుతూ శరద్ యాదవ్‌ను రాజ్యసభలో జేడీయూ పక్ష నేతగా తొలగించడాన్ని సమర్ధించారు. -
తమది చిన్నపార్టీ అని ఒప్పుకున్న సీఎం
పట్నా: తాను ప్రధానమంత్రి పదవికి పోటీలో లేనని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తెలిపారు. తానో చిన్న పార్టీకి చెందిన నాయకుడినని, తనకు జాతీయస్థాయిలో ఆశలు లేవని చెప్పారు. బిహార్ ప్రజలకు సేవ చేయడంపైనే దృష్టి సారించానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. మోదీకి సమర్థ నాయకుడని నమ్మి దేశ ప్రజలకు ఆయనకు ఎన్నుకున్నారని, తనకు అంత సామర్థ్యం లేదని అన్నారు. ‘శరద్ యాదవ్ వరుసగా మూడుసార్లు జేడీ(యూ) అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఈ పదవిని నాకు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు నిర్ణయించారు. దీనికి మీడియా పెడర్థాలు తీస్తోంది. నేను జాతీయస్థాయి పదవులపై కన్నేసినట్టు ప్రచారం చేస్తోంది. జేడీ(యూ) అధ్యక్షుడిగా మా పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాను. దీనర్థం నేను ప్రధాని పదవి కోసం కలలు కంటున్నానని కాద’ని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన ఆచితూచి స్పందించారు. దీనిపై లాలునే అడగాలని, ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు. -
అంత్యక్రియలు: మోదీ, జైట్లీకి స్వీట్స్
బెంగళూరు : పెద్దనోట్ల రద్దు, ఏటీఎంల్లో నగదు కొరతపై జనతాదళ్ నాయకులు కర్ణాటకలో వినూత్నంగా నిరసనకు దిగారు. ఒకవైపు జనతా దళ్ యునైటెడ్ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ కు పరోక్షంగా మద్దతుఅందిస్తోంటే, జేడీ (యు) లోమద్దతుదారులు ఇందుకు విరుద్ధంగా స్పందించారు. జేడీయూ కార్యకర్తలు, స్థానికులు సమీపంలోని ఒక ఏటీఎం మెషీన్ కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మైసూర్ బ్యాంక్ సర్కిల్ లోని క్యాష్ లెస్ ఏటీఎం వద్ద ఈ ఆందోళన చేపట్టారు ఒక నెల తరువాత కృత్రిమ శ్వాస పరికరాన్ని తొలగించడంతో ఏటీఎం తుదిశ్వాసం విడించిందనీ, అందుకే సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాల్ని నిర్వహిస్తున్నామని సామాజిక కార్యకర్త కుమార్ జాగీర్దార్ వ్యాఖ్యానించారు. ఏటీఎం ఆత్మకుశాంతి కలగాలని కోరుకుంటున్నామంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలు ప్రభుత్వానికి తెలుసు, మా డబ్బులు మేం తీసుకోవడానికే మా కు సాధ్యం కావడంలేదని కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీఎంలలో నగదు లేదు. ఏ ఏటీఎం పనిచేయడంతో లేదు. తమ కనీస అవసరా తీర్చుకోవడానికి కూడా డబ్బుల్లేవు. పెద్ద నోట్ల రద్దు మానవహక్కుల ఉల్లంఘన అని ఆయన మండిపడ్డారు. అందుకే నగదు లేని ఏంటీఎం కు అంత్యక్రియలు నిర్వహించి, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రసాదం( స్వీట్స్) పంపించినట్టు చెప్పారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే, కానీ సాధారణ ప్రజలు, రైతులు బాధల మాట ఏమిటి అని స్థానిక నేత సయ్యద్ మెహబూబ్ వ్యాఖ్యానించారు. గత 30 రోజులగా రోజువారీ అవసరాలకోసం ప్రజలు డబ్బు కోసం క్యూలు కడుతూనే వున్నారన్నారు. సుమారు 90 శాతం ఏటీఎంలు పనిచేయడంలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఎపుడని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది జెడి (యు) కర్ణాటక ప్రతిపాదన అన్నారాయన. -
జేడీ(యూ) అధ్యక్షుడిగా నితీశ్‌కుమార్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శరద్ యాదవ్ స్థానంలో ఆదివారం ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో నితీశ్ మరోసారి జేడీయూను అధికారంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ఘనవిజయం సాధించింది. నితీశ్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా జేడీయూ అధ్యక్షుడయ్యారు. -
అసభ్య ప్రవర్తన... ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు
పట్నా: బిహార్ లో అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దంపతులతో అసభ్యంగా ప్రవర్తించి వేధించారని గత ఆదివారం ఆలంపై ఆరోపణలోచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్, బిహార్ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు అరారియా జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై చర్చిండానికి సమావేశమయ్యారు. అతని ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన వారు పార్టీ నుంచి సర్ఫరాజ్ ఆలంను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జేడీయూ బిహార్ అధ్యక్షుడు వశిస్ట్ నరేన్ సింగ్ మీడియాకు ఎమ్మెల్యే సస్పెన్షన్ విషయాన్ని తెలిపారు. గత ఆదివారం గువహటి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించారు. అదే రైళ్లో ప్రయాణిస్తోన్న భార్యాభర్తలతో ఎమ్మెల్యే ఆలం దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంపై బాధితులు ఇందర్‌పాల్ సింగ్ బేడి, ఆయన భార్య పట్నా రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆలంతో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా తమపై చాలా అసభ్యంగా కామెంట్లు చేశారని పోలీసులకు వివరించారు. పట్నా రైల్వే ఎస్పీ పీఎన్ మిశ్రా నలుగురు సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించి బాధితులు, ప్రత్యక్షసాక్షలు నుంచి రాతపూర్వకంగా మరింత సమాచారం సేకరించినట్లు వివరించారు. ఎమ్మెల్యే ఆలం సస్పెన్షన్ పై ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కూడా అనుకూలమేనని సమాచారం. -
'ఒక్క గెలుపుతో గర్వం వద్దు'
పాట్నా: కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఈనెల 14న నిర్ణయం తీసుకుంటామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. శనివారం మంత్రివర్గ సమావేశం జరుగుతుందని చెప్పారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ప్రస్తుత శాసనసభను రద్దు చేయాలని గవర్నర్ ను తాము కోరతామని తెలిపారు. బుధవారం ఆయన బిహార్ గవర్నర్ రామనాథ్ కొవింద్ ను కలిశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తో చర్చించారు. భేటీ అనంతరం నితీశ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షాలను గౌరవిస్తామని, రాష్ట్రాభివృద్ధికి వారు తమతో కలిసిరావాలని అన్నారు. ఒక్క గెలుపుతో గర్వం నెత్తికెక్కించుకోవాల్సిన అవసరం లేదని, అది వ్యక్తిత్వం కాదని అన్నారు. కాగా, ఈనెల 20న నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని జేడీ(యూ) నిర్ణయించింది. -
లాలు తనయులకు అగ్రతాంబూలం!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహా కూటమి నూతన మంత్రివర్గం ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించింది. మహాకూటమిలో భాగంగా ఉన్న జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు క్యాబినెట్ బెర్తుల కేటాయింపులపై మంతనాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 20న ఛాత్ పూజ నిర్వహించిన అనంతరం నితీశ్‌కుమార్ నేతృత్వంలో నూతన మంత్రిమండలి ప్రమాణం స్వీకరించనుందని తెలుస్తున్నది. బిహార్ క్యాబినెట్లో 35మందికి అవకాశం లభించనుందని, ఇందులో ఆర్జేడీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురికి మంత్రి పదవి లభించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఊహించినట్టే ఎమ్మెల్యేలుగా గెలిచిన లాలు తనయులు తేజ్ ప్రతాప్, తేజస్వికి క్యాబినెట్ హోదాతో కూడిన మంత్రి పదవులు లభించనున్నాయి. అదేవిధంగా ఆర్జేడీ ఎమ్మెల్యేలైన అబ్దుల్ బారి సిదిఖీ, లలిత్ యాదవ్, అలోక్ మెహతా, విజయ్ కుమార్ లకు కూడా మంత్రి పదవులు లభించే అవకాశముందని ఆ వర్గాలు చెప్పాయి. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ లో 80 స్థానాలు ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. -
రైలుకు నిప్పంటించబోయారు
పాట్నా: బీహార్‌లో తమ నేతను అరెస్టు చేయడంపట్ల జేడీయూ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భౌతికదాడులకు పాల్పడ్డారు. దీంతో వారి చర్యలను పోలీసులు అడ్డుకునే క్రమంలో తొక్కిసలాట కూడా చేసుకుంది. ఏకంగా రైలుకు నిప్పు పెట్టేందుకు జేడీయూ కార్యకర్తలు తెగబడ్డారు. హత్య, కిడ్నాప్, నిప్పుపెట్టడంవంటి ఫిర్యాదులతో జేడీయూ నేత ఎమ్మెల్యే అనంత్ సింగ్‌తోపాటు మరో పన్నెండు మందిని పోలీసులు అరెస్టులు చేశారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు బంద్ కు పిలుపునిచ్చారు. ఇది కాస్త హింసాత్మక రూపం దాల్చడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అప్పటికే కార్యకర్తలు దుకాణాలను మూతపెట్టించేందుకు ఆందోళన చేయడమేకాకుండా సమీప రైల్వే స్టేషన్‌కు వెళ్లి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ చర్యలతో రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. -
'అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటా'
పాట్నా: బీహార్ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. తనకు 56 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని జేడీయూ బహిష్కృతనేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝి అన్నారు. అవకాశమిస్తే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. కాగా జేడీయూ నేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం పీఠంపై కూర్చునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. జేడీయూ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన నితీష్ సోమవారం.. పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలసి గవర్నర్ వద్దకు వెళ్లారు. గవర్నర్ ఎదుట తనకు మద్దతు ఇస్తున్న 130 ఎమ్మెల్యేలను హాజరుపరిచారు. -
సీఎం పీఠం కోసం నితీష్ ముమ్మర ప్రయత్నం
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి సీఎం పీఠంపై కూర్చునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జేడీయూ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన నితీష్ సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలసి నితీష్ గవర్నర్ వద్దకు వెళ్లారు. గవర్నర్ ఎదుట తనకు మద్దతు ఇస్తున్న 130 ఎమ్మెల్యేలను హాజరుపరిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం ఉందని, గవర్నర్ అవకాశం ఇస్తే మెజార్టీ నిరూపించుకుంటామని నితీష్ చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝి గవర్నర్‌ను కలసి వెళ్లిన 15 నిమిషాల తర్వాత నితీష్ బృందం వెళ్లింది. గవర్నర్ తమకు అవకాశం ఇవ్వకుంటే 130 ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముందు పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. జేడీయూ నుంచి జీతన్ రామ్‌ను బహిష్కరించారు. కాగా రాజీనామా చేసేందుకు తిరస్కరిస్తున్న మంఝి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటానని చెబుతున్నారు. -
నితిశ్ కుమార్‌కే పట్టం!
-
నితీశ్ కుమార్‌కే పట్టం !
జేడీయూ శాసన సభా పక్ష నేతగా ఎన్నిక మద్దతు పలికిన 97 మంది ఎమ్మెల్యేలు, 37 మంది ఎమ్మెల్సీలు ఎల్పీ సమావేశం నిర్వహించి పంతం నెగ్గించుకున్న పార్టీ అసెంబ్లీ రద్దుకు మంఝి విఫలయత్నం.. కేబినెట్ భేటీలో రద్దును వ్యతిరేకించిన 20 మంది మంత్రులు.. అనంతరం రాజీనామా చేస్తూ గవర్నర్‌కు లేఖ వెనక్కి తగ్గని మంఝి.. మరో 15 మంది మంత్రుల బర్తరఫ్కు సిఫారసు ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైతే బీజేపీ మద్దతు: మంఝీ వర్గం పట్నా: బిహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝిని గద్దె దింపాలన్న పంతాన్ని జేడీయూ నెగ్గించుకుంది. ఎన్నికల ముంగిట మాజీ సీఎం నితీశ్ కుమార్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం హైడ్రామా మధ్య జేడీయూ శాసన సభాపక్ష(ఎల్పీ) నేతగా నితీశ్ ఎన్నికయ్యారు. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఎల్పీ సమావేశానికి పార్టీకి చెందిన మొత్తం 111 మంది ఎమ్మెల్యేలలో 97 మంది హాజరయ్యారు. శాసన మండలికి చెందిన 41 మంది సభ్యుల్లో 37 మంది హాజరయ్యారు. సీఎం మంఝి, ఆయనకు మద్దతుగా నిలిచిన ఎనిమిది మంది మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీకి గైర్హాజరయ్యారు. సమావేశంలో ఎల్పీ కొత్త నేతగా ఎమ్మెల్యే అరుణ్ మంఝి.. నితీశ్ పేరు ను ప్రతిపాదించారు. సభ్యులంతా అందుకు ఆమోదం తెలిపారు. అంతకుముందు పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన ఉద్వాసనకు రంగం సిద్ధమైందని తెలుసుకున్న మంఝి.. చివరి ప్రయత్నంగా అసెంబ్లీ రద్దు అస్త్రాన్ని ప్రయోగించాలని చూశారు. ఎల్పీ భేటీకి ముందు హడావుడిగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి 29 మంది మంత్రులు హాజరయ్యారు. మంఝి మద్దతుదారు అయిన నరేంద్ర సింగ్ అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే దీన్ని 20 మంది మంత్రులు (నితీశ్ మద్దతుదారులు) తిర స్కరించారు. 8 మంది మాత్రమే మంఝికి మద్దతుగా నిలిచారు. ఇద్దరు మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్ లలాన్, పీకే సాహిలను బర్తరఫ్ చేయాలంటూ శుక్రవారం సీఎం మంఝి చేసిన సిఫారసుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో వారిద్దరు కేబినెట్ భేటీ కి హాజరుకాలేదు. అసెంబ్లీ రద్దు ప్రతిపాదనను వ్యతిరేకించిన 20 మంత్రులు తమ సంతకాలతో ఓ లేఖను రాష్ట్రపతి ప్రణబ్‌తోపాటు గవర్నర్‌కు పంపారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అందులో తెలిపారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీకి మరో లేఖ పంపారు. సోమవారం నితీశ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌కు శరద్ విజ్ఞప్తి చేయనున్నారు. సయోధ్య యత్నం విఫలం.. కేబినెట్ భేటీకి ముందు మంఝి, నితీశ్ మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరిగాయి. ఘర్షణ వాతావరణం లేకుండా గద్దె దిగాలంటూ శరద్ యాదవ్... మంఝిని ఒప్పించేందుకు యత్నించారు. కానీ అవేవీ ఫలితం ఇవ్వలేదు. పార్టీ సీనియర్ నేత, మంత్రి నరేంద్ర సింగ్.. నితీశ్, మంఝిల మధ్య భేటీకి చొరవ చూపించారు. ఉదయం 11 గంటలకు సింగ్... నితీశ్ ఇంటికెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం సీఎం ఇంటికి వెళ్లారు. తర్వాత సీఎంను, ఆయనకు మద్దతుగా నిలిచిన మరో ఇద్దరు మంత్రులను వెంటబెట్టుకొని నితీశ్ ఇంటికెళ్లారు. అక్కడ శరద్ సమక్షంలో 2 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు సాగించారు. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని యాదవ్ కోరగా.. మంఝి అందుకు నిరాకరించారు. దాంతో జేడీయూ... ఎల్పీ భేటీ ఏర్పాట్లలో మునిగిపోయింది. పూర్తి మెజారిటీ ఉంది.. నితీశ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత నితీశ్ ఉల్లాసంగా కనిపించారు. తనకు మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారన్నారు. ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, అవసరమైతే ఎమ్మెల్యేలతో పరేడ్‌కు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శరద్.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటారన్నారు. అంతకుముందు ఎల్పీ భేటీలో మాట్లాడుతూ... జేడీయూపై బీజేపీ చేస్తున్న నీచ రాజకీయాల నేపథ్యంలో ఈ సవాలును స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇకపై అందరికంటే ముందుండి బీజేపీపై పోరాడతానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ నితీశ్ కిందటేడాది మే 19న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, సీఎంగా మంఝి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. మరో 15 మంది మంత్రుల బర్తరఫ్కు సిఫారసు పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు నితీశ్ వైపు మొగ్గినా.. మంఝి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరో 15 మంది మంత్రుల(నితీశ్ వర్గం)ను బర్తరఫ్ చేయాల్సిందిగా గవర్నర్‌కు సిఫారసు చేశారు. ఆదివారం నీతి అయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ బయల్దేరే ముందు ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేశారు. మంఝి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తారని ఆయన మద్దతుదారు నరేంద్ర సింగ్ తెలిపారు. మంఝి ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైతే బీజేపీ సాయం కూడా తీసుకుంటామని ఆయన చెప్పడం గమనార్హం. ఢిల్లీ వెళ్లిన మంఝి ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. పార్టీకి ద్రోహం చేశారు: శరద్ యాదవ్ మంఝీ... అన్నం పెట్టిన చేయికే అన్యాయం చేశారని శరద్ మండిపడ్డారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలన్నింటి నీ నీరుగార్చారని దుయ్య బట్టారు. కల చెదిరి మళ్లీ సీఎంగా! 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే బిహార్‌లో జేడీయూ, ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నమైంది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంపై నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ఎన్నికల ముంగిట థర్డ్‌ఫ్రంట్ ఏర్పడితే కాంగ్రెసేతర లౌకిక కూటమికి నాయకుడిగా ఎదగాలని తాపత్రయపడ్డారు. థర్డ్‌ఫ్రంట్ తరఫున ప్రధాని రేసులో నిలవాలని ఉవ్విళ్లూరారు. ఇందులో భాగంగానే తరచూ మోదీపై విమర్శలకు దిగడంతో తనపై ‘లౌకికవాది’గా ముద్ర వేయించుకునే యత్నం చేశారు. ఇది చివరకు ఎన్డీఏ, జేడీయూ పొత్తు విచ్ఛిన్నానికి దారి తీసింది. ఎన్డీయే కన్వీనర్ పదవి నుంచి శరద్ యాదవ్ తప్పుకున్నారు. తర్వాత థర్డ్‌ఫ్రంట్ కలగానే మిగిలిపోవడం, నితిశ్ ‘ప్రధాని’ ఆశ కూడా నెరవేరకపోవడం, 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయ దుంధుబి మోగించడం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లోని 40 స్థానాల్లో జేడీయూ కేవలం 2 లోక్‌సభ సీట్లకే పరిమితమైంది. మిత్రపక్షాలైన ఆర్జేడీ 4, కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ 22 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. దీంతో ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నితీశ్ 2014 మే 19న సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. తనకు నమ్మిన బంటైన మంఝిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. అయితే మంఝి మోదీని పొగడం, తరచూ పార్టీకి నష్టం కలిగించే ప్రకటనలు చేయడం ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఈ ఏడాది చివర్లో బిహార్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మంఝిని ఇంకా కొనసాగిస్తే పార్టీకి నష్టం తప్పదన్న వాదనతో నితీశ్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బిహార్ అసెంబ్లీలో జేడీయూ బలం 111 కాగా శనివారం పార్టీ ఎల్పీ భేటీకి 97 మంది హాజరయ్యారు. 14 మంది దూరంగా ఉన్నారు. వీరిలో మంఝితో పాటు మరో 8 మంది ఆయనకు మద్దతు తెలిపిన మంత్రులు. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు. బీజేపీ ముందుకు వచ్చి మంఝికి మద్దతునిచ్చే పక్షంలో (87 బీజేపీ, మంఝి వర్గం 14) 101 మంది బలం ఉంటుంది. సాధారణ మెజారిటీకి 117 (10 స్థానాలు ఖాళీగా ఉన్నాయి) మంది మద్దతు అవసరం. అంటే మంఝికి మరో 16 మంది ఎమ్మెల్యేలు మద్దతివ్వాలి. నితీశ్‌కు 97 మంది జేడీయూ ఎమ్మెల్యేలతో పాటు ఆర్జేడీ (24), కాంగ్రెస్ (5), సీపీఐ (1) మద్దతుంది. అంటే మొత్తం నితీశ్‌కు 127 మంది ఎమ్మెల్యేల మద్దతున్నట్లు లెక్క. మంఝి మరో 16 మంది పైచిలుకు జేడీయూ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలిగితే... బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగవచ్చు. అలాంటి పరిణామాలే చోటుచేసుకుంటే మంఝి రాజీనామా చేయలేదు కాబట్టి... అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ అడగొచ్చు. అయితే 2015 అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకొని ఇప్పటికే విమర్శల పాలైన మంఝికి బీజేపీ మద్దతు ఇస్తుందా అనేది అసలు ప్రశ్న. -
జేడీయూ శాసనసభా పక్షనేతగా నితీష్ ఎన్నిక
పాట్నా: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి జేడీయూ షాక్ ఇచ్చింది. శనివారం ఆయన్ను జేడీయూ శాసనసభా పక్ష నేతగా తొలగించి.. ఆ బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అప్పగించింది. అంతకుముందు బీహార్ లో హైడ్రామా నడిచింది. ఏకంగా అసెంబ్లీని రద్దు చేస్తానంటూ హెచ్చరించిన మాంఝీ నానా హడావుడి సృష్టించారు. దీనిలో భాగంగా అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది నితీష్ మద్దతుదారులు దీన్ని వ్యతిరేకించడంతో ఆ సమావేశం రసాభాసగా మారింది. అటు తరువాత శరవేగంగా మారిన రాజకీయ పరిణామాలతో జేడీయూ అధినాయకత్వం అనుకున్నట్లుగానే మాంఝీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఊహించినట్లుగానే రామ్ మాంఝీని పార్టీ నుంచి జేడీయూ తొలగించింది. -
బీహార్ సీఎం ఝలక్ ఇచ్చారు!
పాట్నా: బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనతాదళ్ (జేడీ)యూ నాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్న బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఏకంగా అసెంబ్లీని రద్దు చేస్తానంటూ హెచ్చరించారు. దీనిలో భాగంగా శనివారం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి హడావుడి సృష్టించారు. అసెంబ్లీ రద్దు అంశాన్ని మంత్రిమండలి ముందుంచారు. అయితే చాలా మంది మంత్రులు దీన్ని వ్యతిరేకించారు. నితీశ్ కుమార్‌కు మద్దతుగా ఉన్న మంత్రులు కేబినెట్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మాంఝీని తొలగించిన తిరిగి నితీశ్ కుమార్‌ను సీఎం చేయాలని అధి నాయకత్వం భావిస్తున్న తరుణంలో రామ్ మాంఝీ మాత్రం మొండిగా వ్యవహరిస్తూ పార్టీలో అలజడి సృష్టిస్తున్నారు. ఇదిలా ఉండగా బీహార్‌లో ప్రజాస్వామ్యం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలకు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సీఎం జితన్ రామ్ మాంఝీ బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం నటిస్తున్నారని జేడీయూ ప్రధాన కార్యదర్శి కేఎస్ త్యాగి మండిపడ్డారు. -
రాజీనామాకు ససేమిరా అంటున్న సీఎం!
-
రాజీనామాకు ససేమిరా అంటున్న మాంఝీ
పాట్నా : బీహార్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా జేడీ(యూ) పార్టీ నాయకత్వంపై ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్‌తో శనివారం ఎమ్మెల్యేల భేటీపై మాంఝీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన నేడు సమావేశం కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు మాంఝీ యత్నిస్తున్నారు. అంతేకాకుండా సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మాంఝీ స్పష్టం చేశారు. మరోవైపు బీహార్ సీఎం మార్పుపై జేడీ (యూ)లో ముమ్మర కసరత్తు జరుగుతోంది. నితీష్ కుమార్ సీఎం పదవి చేపట్టేందుకు వీలుగా ప్రస్తుత సీఎం జితన్ రామ్ మాంఝీని పదవి నుంచి తప్పించనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నెల7న జేడీ(యూ) శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశం అనధికారకంగా జరుగుతోందని, తాను రాజీనామా చేసే అవకాశం లేదని మాంఝీ ఇప్పటికే ప్రకటించారు. -
ఓటమికి బాధ లేదు: నితీష్ కుమార్
సుపాల్: సాధారణ ఎన్నికల్లో ఓటమికి బాధ లేదని బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీతో బంధాన్ని తెంచుకున్నామని చెప్పారు. బీహార్ లోని సుపాల్ జిల్లాలో ఆదివారం జేడీ(యూ) కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అమలు సాధ్యంకాని హామీలిచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీయే సర్కారు ఇప్పటివరకు అమలుచేయలేదన్నారు. వచ్చే ఏడాది బీహార్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నితీష్ కుమార్ నవంబర్ 13న సంపర్క్ యాత్ర చేపట్టారు. తనయాత్ర ద్వారా జేడీ(యూ) కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలని భావిస్తున్నారు. -
సీఎం గారూ...నోరు అదుపులో పెట్టుకోండి!
పాట్నా: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్న బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీకి సొంతపార్టీ జేడీ(యూ) కళ్లెం వేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు సూచించింది. అగౌరవపరిచే వ్యాఖ్యలు పార్టీ, నాయకులకు ఇబ్బందికరంగా ఉంటాయని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. పార్టీ కార్యకర్తల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. వివాస్పద వ్యాఖ్యలు చేయొద్దని మాంజీకి ఆయన సూచించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దని కోరారు. మాంజీని సీఎం పదవి నుంచి తప్పించే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించగా...దీనిపై జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ నిర్ణయం తీసుకుంటారని త్యాగి సమాధానమిచ్చారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుంటే బీహార్ కు చెందిన కేంద్ర మంత్రులను రాష్ట్రంలో అడుగుపెట్టనీయబోమని మాంజీ బుధవారం వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా ఆయన పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. -
నలుగురు జేడీయూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పాట్నా: బీహార్‌లో అధికార పార్టీ జేడీయూ నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ నలుగురు విప్‌ను ఉల్లంఘించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను జేడీయూ వీరిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి విచారించిన అనంతరం ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాగా స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయనున్నట్టు తిరుగుబాటు ఎమ్మెల్యేలు చెప్పారు. -
ప్రజలు ఆమోద ముద్ర వేశారు: లాలూ
పాట్నా: తాజా బీహార్ లో జరిగిన ఉప ఎన్నికల్లో తమ కూటమి విజయం దక్కడంపై ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్జెడీ, జేడీ(యూ), కాంగ్రెస్ కూటమికి ప్రజలు ఆమోద ముద్ర వేశారు అని వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సామాజిక, ఆర్ధిక న్యాయానికి ఆందించడానికి కొత్త శకం మొదలైందని ఆయన అన్నారు. బీహార్ లో జరిగిన 10 అసెంబ్లీ స్థానాల్లో ఈ కూటమి 6 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో కార్యకర్తలు పొంగిపోకూడదని, పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని లాలూ పిలుపునిచ్చారు. -
ఎమోషన్లో నిర్ణయం తీసుకోలేదు: నితీష్
పాట్నా: తన రాజీనామా నిర్ణయం ఉద్వేగంతో తీసుకున్నది కాదని జేడీ(యూ) నాయకుడు నితీష్ కుమార్ తెలిపారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను జేడీ(యూ) సంకీర్ణ ప్రభుత్వంలోని మిగతా పార్టీలకు వివరించానని చెప్పారు. తన నిర్ణయాన్ని అందరు మెచ్చుకున్నారని వివరించారు. విధిలేని పరిస్థితులే తనను రాజీనామావైపు పురికొల్పాయని నితీష్ కుమార్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామా వెనక్కు తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు. -
బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు తారాకాంత్ ఝా కన్నుమూత!
పాట్నా: బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, ప్రఖ్యాత న్యాయనిపుణుడు తారాకాంత్ ఝూ ఆదివారం పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఝూ బాధపడుతున్నారు. బీహార్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా కీలకపాత్ర పోషించిన ఝా.. బీజేపీ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఇటీవల భారతీయ జనతా దళ్ (యూ) చేరారు. బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ఝాకు జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లతో సన్నిహిత సంబంధాలుండేవి. పాట్నా హైకోర్టులో సినీయర్ న్యాయవాదైన ఝా.. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లో మైథిలి భాషను చేర్చడంలో కీలకపాత్రను పోషించారు. ఝా మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, బీజేపీ సీనియర్ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు. -
ఆ ఇద్దరి కంటే.. ప్రధాని పదవికి నేనే అర్హుడు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని పదవీపై అకాంక్షను మరోసారి వెల్లడించారు. ప్రధాని పదవి కోసం పోడుపడుతున్న నాయకులందరికంటే తానే ఆ పదవికి తానే అత్యంత అర్హుడు, అనుభవజ్ఞుడని చెప్పారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో నితీష్ 'సంకల్పయాత్ర' నిర్వహిస్తున్నారు. గురువారం బెటయ్యలో జరిగిన సభలో నితీష్ మాట్లాడారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించకుండానే.. ఒకరికి పార్లమెంటరీ అనుభవం, మరొకరికి రాష్ట్రాన్ని పాలించని అనుభవం లేదని నితీష్ అన్నారు. తనకు ఈ రెండు అనుభవాలు ఉన్నాయంటూ, వారి కంటే తనకేమి అర్హత తక్కువని ప్రశ్నించారు. అయితే ప్రధాని పదవికి పోటీ పడటానికి తమ పార్టీ (జేడీయూ) చిన్న పార్టీ అని నితీష్ పేర్కొన్నారు. -
ఎన్డీఏలో చేరే ప్రసక్తే లేదు: జేడీయూ
కోల్‌కతా: ఎన్డీఏ గూటికి మళ్లీ చేరే అవకాశమే లేదని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) స్పష్టం చేసింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ బదులు మరో వ్యక్తిని ఎంపిక చేసినా తమ వైఖరిపై పునరాలోచించబోమని పేర్కొంది. సుదీర్ఘకాలం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జేడీయూ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ కూటమి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం బీజేపీ ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్ , రాజ్‌నాథ్ సింగ్ వంటి నాయకుల్లో ఎవరిని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నా మద్దతు ఇవ్వబోమని జేడీయూ సెక్రటరీ జనరల్ కేసీ త్యాగీ పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తే మీ వైఖరి మార్చుకుంటారా అన్న ప్రశ్నకు త్యాగీ పైవిధంగా స్పందించారు. -
లాలూ ఆర్జేడీలో చీలిక
13 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు జేడీ(యూ) సర్కారుకు జైకొడుతూ స్పీకర్‌కు లేఖ కొద్దిసేపటికే సొంతగూటికి ఆరుగురు ఎమ్మెల్యేలు పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీలిపోరుుంది. పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జనతాదళ్ (యూ) నేతృత్వంలోని నితీశ్‌కుమార్ ప్రభుత్వానికి జై కొట్టారు. మైనారిటీ వర్గానికి చెందిన ఐదుగురితో పాటు వీరంతా సోమవారం ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరి నివాసంలో సమావేశమయ్యూరు. ఆర్జేడీని వీడి నితీశ్ సర్కారుకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలియజేస్తూ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరికి ఓ లేఖ రాశారు. స్పీకర్‌కు లేఖ రాసిన విషయూన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ అన్సారీ ధ్రువీకరించారు. అరుుతే అత్యంత నాటకీయంగా వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత కొద్దిసేపటికే తాము వేరుకుంపటి వర్గంలో లేమని స్పష్టం చేశారు. సామ్రాట్ చౌదరి, జావెద్ ఇక్బాల్ అన్సారీతో పాటు రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్, దుర్గాప్రసాద్ సింగ్, లలిత్ యూదవ్, అనిరుధ్ కుమార్, జితేంద్ర రాయ్, అక్తర్-ఉల్-ఇస్లాం సాహీన్, అక్తర్-ఉల్-ఇమాన్, అబ్దుల్ గఫూర్, ఫయూజ్, రామ్ లఖన్ రామ్ రమణ్, చంద్రశేఖర్‌ల సంతకాలతో కూడిన లేఖ అసెంబ్లీకి చేరింది. దీంతో మధ్యంతర ఏర్పాటు కింద వారు ప్రత్యేక బృందంగా కూర్చునేందుకు అనుమతి ఇచ్చినట్లు అసెంబ్లీ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. అరుుతే కొద్దిసేపటికే ఆర్జేడీ శాసనసభాపక్ష నేత అబ్దుల్ బారి సిద్దిఖీతో కలిసి ఆరుగురు ఎమ్మెల్యేలు మీడియూతో మాట్లాడారు. ఆర్జేడీ నుంచి బయటికొచ్చి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిసి తామెలాంటి లేఖపైనా సంతకాలు చేయలేదని వారు విలేకరులకు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో సావధాన తీర్మానం వంటి ఇతర ప్రయోజనాల కోసం ఆ సంతకాలు తీసుకున్నట్టు అబ్దుల్ గఫూర్ పేర్కొన్నారు. లలిత్‌యూదవ్, ఫయూజ్ అహ్మద్, దుర్గాప్రసాద్ సింగ్, చంద్రశేఖర్, ఇస్లాం సాహీన్‌లు ఆర్జేడీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. పార్టీలో చీలిక వార్తలను విన్నానని, ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నానని లాలూ ఢిల్లీలో విలేకరులకు చెప్పారు. బీజేపీతో పొత్తుకు ఎల్జేపీ సై! న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కారణంగా గతంలో ఎన్డీఏకి దూరమైన లోక్‌జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) ఇప్పుడు మళ్లీ బీజేపీతో ఎన్నికల పొత్తుకు ఆసక్తిగా ఉందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఆ పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. గుజరాత్ మతఘర్షణలకు సంబంధించి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కోర్టులు క్లీన్చిట్ ఇచ్చిన తర్వాత ఇక సమస్యల్లేవని ఆయన సోమవారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. అయితే సీట్ల కేటాయిం పులో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఊగిసలాట ప్రదర్శించడంతో అసంతృప్తితో ఉన్న ఎల్జేపీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోందని సమాచారం. -
నిలువునా చీలిన లాలూ పార్టీ
-
కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయి: నితీష్
పాట్నా: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ్ బిల్లును లోక్‌సభలో ఆమోదించిన తీరును జేడీ(యూ) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తప్పుబట్టారు. బిల్లు ఆమోదించిన తీరు సవ్యంగా లేదని విమర్శించారు. అక్రమ, అనారోగ్యకర సంప్రదాయానికి కాంగ్రెస్, బీజేపీ తెర తీశాయని దుయ్యబట్టారు. ఆర్టికల్ 3 ద్వారా కొత్త రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యాంగం చెబుతోందని అన్నారు. ఆరోగ్యకర వాతావరణంలో తెలంగాణ బిల్లుకు తెలిపితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. విభజన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగానే తమ పార్టీ ఎంపీలు నిన్న లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారని నితీష్‌కుమార్ వివరించారు. కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపి బిల్లును ఆమోదించాయని చెప్పారు. -
ఎన్డీయే లబ్ధికోసమే ఆ సర్వేలు
ఎన్నికల సర్వేలపై మండిపడ్డ నితీశ్ పాట్నా/మొహాలీ: వచ్చే ఎన్నికల్లో జనతాదళ్ (యూ) పార్టీకి ప్రదర్శన ఘోరంగా ఉండబోతోంది అని కొన్ని సర్వేలు చెప్పడం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మండిపడ్డారు. చట్టసభల్లో ఎన్డీఏ ఏదో అద్భుతమైన ప్రదర్శన చేసిందని చెప్పడానికే ఆ ఫలితాలు ఉన్నట్లున్నాయని ధ్వజమెత్తారు. ఈ మొత్తమంతా ఎన్నికల విధానాన్ని నిర్వీర్యం చేసేందుకేనంటూ విమర్శించారు. ఒకవేళ సర్వేలు చెప్పినట్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు విజయం చేకూరేటట్లయితే.. ఇక ఎన్నికలు నిర్వహించడం దేనికంటూ ఇక్కడ ఆదివారం జరిగిన సంకల్ప ర్యాలీలో ఎద్దేవా చేశారు. సర్వేల ప్రకారమే తమ పార్టీ గెలిచేస్తుందని బీజేపీ భావిస్తే.. నరేంద్ర మోడీ నేరుగా వెళ్లి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసేయవచ్చంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గుజరాత్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రాకుండా రాజీకీయ లబ్ధికోసం ఆర్జేడీ అడ్డుకుందని నిప్పులు చెరిగారు. ప్రకాశ్ సింగ్ బాదల్ నేతృత్వం వహించాలి: జేడీ(యూ) దేశానికి నేతృత్వం వహిస్తూ ఎర్రకోటపై ప్రకాశ్‌సింగ్ బాదల్ జెండా ఎగరవేయాలని తాము కోరుకుంటున్నామని జేడీ(యూ) నేత నరేంద్రసింగ్ చెప్పారు. పం జాబ్ వ్యవసాయాభివృద్ధి సదస్సులో పాల్గొనడానికి ఆయన మొహాలీ వచ్చారు. -
సమైక్యాంధ్రకు ఏజీపీ, జేడీయూ మద్దతు
-
సమైక్యాంధ్రకు ఏజీపీ, జేడీయూ మద్దతు
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మరో రెండు పార్టీలు వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని అసోం గణపరిషత్, జేడీయూ పార్టీలు డిమాండ్ చేశాయి. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వేలాదిమంది సమైక్యవాదులు శనివారం ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏజీపీ, జేడీయూ మద్దతు తెలిపాయి. మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమని అసోం గణపరిషత్ పార్టీ ఎంపీ జోసఫ్‌టోపో అన్నారు. కాంగ్రెస్ విభజించు-పాలించు సూత్రాన్ని అమలుచేస్తోందని ఆయన విమర్శించారు. సమైక్య ఉద్యమకారులకు తమ సహకారం ఉంటుందని జేడీయూ బీహార్ శాఖ అధ్యక్షుడు వశిస్టు నారాయణ్ అన్నారు. కేంద్రమంత్రులు సీమాంధ్రలో ద్రోహులపాత్ర పోషిస్తున్నారని విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ చక్రవర్తి విమర్శించారు. -
దాణా స్కాం దోషి లాలూ!
పదిహేడేళ్ల సుదీర్ఘ కాలం విచారణ తర్వాత బీహార్ దాణా కుంభకోణంలో ఎట్టకేలకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఆయన, ఆ రాష్ట్రానికి చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌మిశ్రా, జేడీ(యూ)కి చెందిన ఎంపీ జగదీష్‌శర్మ, ఆయన కుమారుడు ఎమ్మెల్యే రాహుల్‌సహా 45 మందికి ఈ కేసులో ఎన్నేళ్లు శిక్ష విధించబోతున్నదీ కోర్టు గురువారం తీర్పు చెబుతుంది. దోషులుగా నిర్ధారణ కావడంతో లాలూతోసహా వీరంతా జైలుకు పోవాల్సివచ్చింది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న అంశంతో నిమిత్తంలేకుండా దాదాపు 20 ఏళ్లపాటు కొనసాగిన ఈ కుంభకోణంలో... చివరకు బడా రాజకీయ నాయకులు దోషులని తేలడానికి కూడా ఇంచుమించు అంతే సమయం పట్టింది. ఈ స్కాంలో దాఖలైన ఇతర కేసుల్లో కొందరు అధికారులకూ, మరికొందరు రాజకీయనాయకులకూ ఇంతకుముందే శిక్షలు పడ్డాయి. ఎన్నడో 1985లో అప్పటి కాగ్ టీఎన్ చతుర్వేది పశు సంవర్ధక శాఖలో నిధులు స్వాహా అవుతున్నాయని గుర్తించి అప్పటి సీఎం చంద్రశేఖర్సింగ్ను తొలిసారి అప్రమత్తం చేశారు. దాదాపు 1975 ప్రాంతంలో మొదలైన ఈ స్కాంలో భారీయెత్తున నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆయన గమనించారు. కానీ, చతుర్వేది సలహాను పట్టించుకోక పోవడంవల్ల అటు తర్వాతకూడా ఇది కొనసాగింది. చివరకు పశుసంవర్ధక శాఖ అధికారి అమిత్ ఖరే రూ. 37.70 కోట్ల నిధుల స్వాహాపై 1996లో ఇచ్చిన ఫిర్యాదుతో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఆ కేసులోనే లాలూ, జగన్నాథ్ మిశ్రాలు దోషులుగా నిర్ధారణ అయ్యారు. ఇదే స్కాంకు సంబంధించిన మరో కేసులో లాలూ లోగడ నిర్దోషిగా బయటపడ్డారు. 2000 సంవత్సరంలో బీహార్నుంచి విడివడి ఏర్పడిన జార్ఖండ్‌లో కూడా దాణా స్కాం కేసులు నడుస్తున్నాయి. అక్కడ లాలూ, మిశ్రాలపై మరో నాలుగు కేసులు విచారణలో ఉన్నాయి. ఆయన వచ్చిన గ్రామీణ నేపథ్యంవల్ల కావొచ్చు...ఆయన స్వభావంవల్ల కావొచ్చు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఆయనను జోకర్‌గా చిత్రించే ప్రయత్నాలు జరిగాయి. కానీ, లాలూ ఎంతో పేదరికంలో పుట్టి, కష్టపడి ఎదిగారు. ప్రభుత్వాల అవినీతి విధానాలకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న యువ విద్యార్థి నాయకుడాయన. అయితే, అలాంటి వ్యక్తి రాజకీయ రంగ ప్రవేశం చేసి, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి, అప్పటికే పుట్టి కొనసాగుతున్న అవినీతిలో భాగస్వామిగా మారి, చివరకు ఆ కేసులోనే దోషిగా నిర్ధారణకావడం ఒక వైచిత్రి. ఆదర్శవంతమైన సమాజాన్ని కాంక్షించి ఉవ్వెత్తున లేచిన ఉద్యమంనుంచి ఎదిగిన నాయకుడొకరు చివరకు కుంభకోణంలో చిక్కుకుంటారన్నది అప్పట్లో ఊహకైనా అందని విషయం. తన నేపథ్యంరీత్యా ఈ స్కాంను తానే బయట పెట్టివుంటే లాలూ చరిత్రలో నిలిచిపోయేవారు. కానీ, ఆయన భిన్నమైన దోవను ఎంచుకున్నారు. ఇదే కేసులో కనీసం కొన్నేళ్లక్రితం తీర్పువచ్చి వున్నా పరిస్థితి వేరుగా ఉండేది. ఆయన శిక్షకు గురైనా అప్పీల్ చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేవారు. మరికొన్నాళ్లలో జరగబోయే ఎన్నికల్లో పాల్గొనేవారు. కానీ, మొన్న జూలై 10న నేర చరితులైన చట్టసభల సభ్యులపై కొరడా ఝళిపిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పువల్ల అది అసాధ్యంగా మారింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స కాస్తా వివాదంలో చిక్కుకోవడంవల్ల లాలూకు వెసులుబాటు దొరకలేదు. ఇప్పుడు ఆయనకు రెండేళ్లకుమించి శిక్షపడినట్టయితే, వెనువెంటనే పార్లమెంటు సభ్యత్వం రద్దుకావడంతోపాటు ఆరేళ్లవరకూ ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా అవకాశం ఉండదు. అప్పీల్లో నిర్దోషిగా నిర్ధారణ అయితే అది వేరే సంగతి. ఈ స్కాం విస్తృతిరీత్యా చాలా పెద్దది. దాదాపు 20 ఏళ్లపాటు సాగిన కుంభకోణంలో రూ.950 కోట్లమేర ఖజానాను కొల్లగొట్టారన్నది నిందితులపై అభియోగం. ఈ స్కాంకు సంబంధించి నమోదైన 55 కేసుల్లో జార్ఖండ్‌లోనే 53 కేసులున్నాయి. మొత్తం 46 కేసుల్లో 550 మందికి శిక్షలుపడగా 9 కేసుల్లో మరో 50 మంది విచారణను ఎదుర్కొంటున్నారు. అధికారపక్షంతోపాటు విపక్ష నాయకులు కూడా ఇందులో నిందితులు కావడం ఈ స్కాం విలక్షణత. దాణా స్కాం పర్యవసానంగా లాలూపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా నమోదుచేయగా 2006లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆ కేసును కొట్టేసింది. దానిపై సీబీఐ అప్పీల్‌కు వెళ్లకపోవడంతో బీహార్ ప్రభుత్వమే 2007లో పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దాంతో కేసు కొనసాగించమని హైకోర్టు ఆదేశించింది. అయితే, లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఈ కేసులో అప్పీల్‌కి వెళ్లే అధికారం సీబీఐకి మాత్రమే ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెబుతూ కేసు కొట్టేసింది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వానికి లాలూ మద్దతు అవసరం కావడంవల్లే ఆ కేసులో సీబీఐ అప్పీల్‌కు వెళ్లలేదన్నది బహిరంగ రహస్యం. బీహార్‌లో కొన్నాళ్లక్రితం అధికార జేడీ(యూ)-బీజేపీలమధ్య విభేదాలు తలెత్తి నూతన రాజకీయ పరిణామాలు సంభవించాక తన భవిష్యత్తుపై లాలూ ప్రసాద్ యాదవ్ బాగా ఆశలు పెట్టుకున్నారు. తాను చాస్తున్న స్నేహ హస్తాన్ని తిరస్కరించి, ముఖ్యమంత్రి నితీష్కుమార్వైపే కాంగ్రెస్ చూస్తున్నా తాజా పరిణామాలు తనకు అనుకూలంగా మారబోతున్నాయని ఆయన విశ్వసించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు సంపాదించి, కేంద్రంలో చక్రం తిప్పవచ్చునని అంచనా వేశారు. కానీ, ఈ తీర్పు పర్యవసానంగా అంతా తారుమారైంది. ఇన్నాళ్లూ ఆయన పార్టీని వెన్నంటి ఉన్న భిన్న వర్గాలు వేరే దారి చూసుకుంటాయా లేక ఆయనకు అండగా నిలబడతాయా అన్నది రాగల ఎన్నికల్లో తేలిపోతుంది. -
న్యాయం లేని విభజన: శరద్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై నిర్ణయం చేసినా, ఇరు ప్రాంతాలకు మాత్రం న్యాయం చేయలేకపోయిందని జేడీ(యూ) అధినేత శరద్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇరు ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలని తాము బలంగా కోరుకుంటున్నామన్నారు. విభజనతో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయని, వాటిని పరిష్కారించాల్సిన అవసరం ఉందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం శరద్‌యాదవ్‌తో ఆయన నివాసంలో 20 నిమిషాల పాటు భేటీ అయింది. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనను ఆయన దృష్టికి తెచ్చింది. ముఖ్యంగా నదీ జలాలు, విద్యుత్ పంపిణీ, హైదరాబాద్, ఉద్యోగులు, విద్యార్థుల భద్రత వంటి అంశాలకు ఎలాంటి పరిష్కారమూ చూపలేదని వివరించింది. సీమాంధ్రలో సాగుతున్న ఆందోళనలను విజయమ్మ తమ దృష్టికి తెచ్చారని అనంతరం శరద్‌యాదవ్ విలేకరులకు చెప్పారు. ఈ అంశం తప్ప మరేమీ చర్చకు రాలేదన్నారు. మీరు గతంలో తెలంగాణకు మద్దతిచ్చారు, ఇప్పుడు మీ వైఖరెలా ఉంది అని అడగ్గా, ‘విభజిస్తూ కాంగ్రెస్ నిర్ణయం చేసింది. అయితే అక్కడ అనేక సమస్యలున్నాయి. వాటన్నింటిపై చర్చించాల్సిన అవసరముంది’ అని బదులిచ్చారు. విభజనతో అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారా అని అడగ్గా, దానిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయచేయబోనన్నారు. భావి పొత్తుల అంశమేదీ రాలేదని మరో ప్రశ్నకు బదులుగా చెప్పారు. మర్యాదపూర్వకంగానే శరద్‌యాదవ్‌ను కలిశామని, సీమాంధ్రలోని పరిస్థితులను వివరించామని విజయమ్మ చెప్పారు. రాజీనామాలకు కట్టుబడాలి: మేకపాటి విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను శరద్‌యాదవ్‌కు వివరించినట్టు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రపతితో, ప్రధానితో విజయమ్మ బృందం సమావేశంపై టీడీపీ నేతల ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కేవలం విభజన విషయమై చర్చించేందుకే అందరినీ కలిశామని చెప్పారు. రాజీనామాలపై తామంతా చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ‘సమైక్యాంధ్ర కోసం అందరం రాజీనామాలు చేశాం. సమైక్యాంధ్ర ప్రకటన వస్తే ఉపసంహరించుకుందాం. లేదంటే వాటికి అంతా కట్టుబడి ఉండాలి’ అని సూచించారు. నేడు జంతర్‌మంతర్ వద్ద విజయమ్మ ధర్నా రాష్ట్ర విభజన విషయంలో సమన్యాయం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యులు ధర్నాలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభమవుతుంది. -
శరద్ యాదవ్‌తో విజయమ్మ సమావేశం