సమైక్యాంధ్రకు ఏజీపీ, జేడీయూ మద్దతు | jdu,agp oppose bifurcation of andhra pradesh | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 9 2013 8:16 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మరో రెండు పార్టీలు వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని అసోం గణపరిషత్‌, జేడీయూ పార్టీలు డిమాండ్ చేశాయి. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వేలాదిమంది సమైక్యవాదులు శనివారం ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏజీపీ, జేడీయూ మద్దతు తెలిపాయి. మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమని అసోం గణపరిషత్‌ పార్టీ ఎంపీ జోసఫ్‌టోపో అన్నారు. కాంగ్రెస్‌ విభజించు-పాలించు సూత్రాన్ని అమలుచేస్తోందని ఆయన విమర్శించారు. సమైక్య ఉద్యమకారులకు తమ సహకారం ఉంటుందని జేడీయూ బీహార్‌ శాఖ అధ్యక్షుడు వశిస్టు నారాయణ్‌ అన్నారు. కేంద్రమంత్రులు సీమాంధ్రలో ద్రోహులపాత్ర పోషిస్తున్నారని విశాలాంధ్ర మహాసభ కన్వీనర్‌ చక్రవర్తి విమర్శించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement