రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రతీ రోజూ టీడీపీ నేతల బరితెగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం పోతవరంలో టీడీపీ నేతలు బరి తెగించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన సానుభూతిపరుల భూమిని దోచుకునేందుకు కుట్ర చేశారు. గందదిపాము రాజ్‌కుమార్‌కు చెందిన భూమిని చిడిపి గోపీ అతని అనుచరులతో కలిసి దోచకునేందుకు ప్రణాళిక రచించారు. దీనిలో ాగంగా తనపై విచక్షణారహితంగా దాడికి దిగాడని గందిపాము రాజ్‌కుమార్ ఆరోపిస్తున్నాడు.