ఆ ఇద్దరి కంటే.. ప్రధాని పదవికి నేనే అర్హుడు | More qualified for rime Ministerial post, says Nitish Kumar | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి కంటే.. ప్రధాని పదవికి నేనే అర్హుడు

Published Thu, Mar 6 2014 3:00 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

ఆ ఇద్దరి కంటే.. ప్రధాని పదవికి నేనే అర్హుడు

ఆ ఇద్దరి కంటే.. ప్రధాని పదవికి నేనే అర్హుడు

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని పదవీపై అకాంక్షను మరోసారి వెల్లడించారు. ప్రధాని పదవి కోసం పోడుపడుతున్న నాయకులందరికంటే తానే ఆ పదవికి తానే అత్యంత అర్హుడు, అనుభవజ్ఞుడని చెప్పారు. బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్తో నితీష్ 'సంకల్పయాత్ర' నిర్వహిస్తున్నారు. గురువారం బెటయ్యలో జరిగిన సభలో నితీష్ మాట్లాడారు.

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించకుండానే.. ఒకరికి పార్లమెంటరీ అనుభవం, మరొకరికి రాష్ట్రాన్ని పాలించని అనుభవం లేదని నితీష్ అన్నారు. తనకు ఈ రెండు అనుభవాలు ఉన్నాయంటూ, వారి కంటే తనకేమి అర్హత తక్కువని ప్రశ్నించారు.  అయితే ప్రధాని పదవికి పోటీ పడటానికి తమ పార్టీ (జేడీయూ) చిన్న పార్టీ అని నితీష్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement