పాట్నా: బీహార్ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. తనకు 56 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని జేడీయూ బహిష్కృతనేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝి అన్నారు. అవకాశమిస్తే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటానని చెప్పారు.
కాగా జేడీయూ నేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం పీఠంపై కూర్చునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. జేడీయూ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన నితీష్ సోమవారం.. పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్తో కలసి గవర్నర్ వద్దకు వెళ్లారు. గవర్నర్ ఎదుట తనకు మద్దతు ఇస్తున్న 130 ఎమ్మెల్యేలను హాజరుపరిచారు.
'అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటా'
Published Mon, Feb 9 2015 8:33 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM
Advertisement
Advertisement