ఓటమికి బాధ లేదు: నితీష్ కుమార్ | No regrets over debacle in general elections, says Nitish Kumar | Sakshi
Sakshi News home page

ఓటమికి బాధ లేదు: నితీష్ కుమార్

Published Sun, Nov 23 2014 8:23 PM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

ఓటమికి బాధ లేదు: నితీష్ కుమార్

ఓటమికి బాధ లేదు: నితీష్ కుమార్

సుపాల్: సాధారణ ఎన్నికల్లో ఓటమికి బాధ లేదని బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీతో బంధాన్ని తెంచుకున్నామని చెప్పారు. బీహార్ లోని సుపాల్ జిల్లాలో ఆదివారం జేడీ(యూ) కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అమలు సాధ్యంకాని హామీలిచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీయే సర్కారు ఇప్పటివరకు అమలుచేయలేదన్నారు.

వచ్చే ఏడాది బీహార్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నితీష్ కుమార్ నవంబర్ 13న సంపర్క్ యాత్ర చేపట్టారు.  తనయాత్ర ద్వారా జేడీ(యూ) కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement