Supaul district
-
Azadi Ka Amrit Mahotsav: 7 రోజుల్లో 450 జాతీయ జెండాలు
పట్నా: 91 ఏళ్ల వృద్ధుడు కేవలం వారం రోజుల్లో ఏకంగా 450 జాతీయ జెండాలను తన కుట్టుమెషీన్‌పై కుట్టాడు. ఈ అరుదైన సంఘటన బిహార్ రాష్ట్రం సుపౌల్ జిల్లా నిర్మాలీలో చోటుచేసుకుంది. లాల్మోహన్ పాశ్వాన్(91) అచ్ఛమైన గాంధేయవాది. దర్జీగా జీవనం సాగిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంందర్భంగా ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ జాతీయ జెండాల కోసం లాల్మోహన్కు ఆర్డర్ ఇచ్చింది. కేవలం 7 రోజుల్లో 450 జెండాలు కుట్టి హెల్ప్ ఏజ్ ఇండియాకు అందజేశారు. రోజుకు 12 గంటలపాటు పనిచేసి, జెండాలు కుట్టానని లాల్మోహన్ చెప్పారు. జెండాలు కుట్టడాన్ని పవిత్రమైన బాధ్యతగా భావించానని, స్వాతంత్య్ర దినోత్సవ కంటే ముందు రోజే జెండాలను అందజేసినందుకు చాలా గర్వించానని అన్నారు. -
దారుణం: గుట్కా కోసం తుపాకీతో కాల్చివేత
పాట్నా: పాన్ షాప్‌కు వచ్చిన ఓ వ్యక్తి పాన్ మసాలా (గుట్కా) అప్పుగా ఇవ్వాలని కోరగా దుకాణ యజమాని నిరాకరించాడు. దీంతో దుకాణ యజమానితో అతడు గొడవ పడ్డాడు. అప్పుగా పాన్ మసాలా ఇవ్వకపోవడంతో అతడిపై కోపం పెంచుకున్నాడు. ఈ సందర్భంగా అదే కోపంతో తెల్లారి వచ్చి ఆ దుకాణంపై దాడి చేశాడు. ఆ సమయంలో దుకాణంలో ఉన్న యజమాని కుమారుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బీహార్‌లోని సుపాల్ జిల్లాలో త్రివేణిగంజ్‌కు చెందిన అజిత్‌కుమార్ రౌడీ. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ పాన్ షాప్‌కు వచ్చాడు. బెదిరింపులకు పాల్పడుతూ రూ.20 విలువ చేసే పాన్ మసాలా అప్పుగా ఇవ్వాలని అడిగాడు. అయితే దుకాణంలో ఉన్న యజమాని ఇవ్వను అని తేల్చిచెప్పాడు. కొద్దిసేపు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతడితో వాగ్వాదం చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు సర్ది చెప్పడంతో అజిత్ వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు సోమవారం తన అనుచరులతో దుకాణం వచ్చాడు. దుకాణంలో ఉన్న యజమాని చిన్న కుమారుడు మిథిలేశ్‌తో మళ్లీ పాన్ మసాలా కోసం గొడవ పడ్డాడు. ఈ సమయంలో క్షణికావేశానికి గురైన అజిత్ కుమార్ తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన మిథిలేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలిసి సమీపంలో ఉన్న మిథిలేశ్ అన్న పరుగెత్తుకుంటూ రావడంతో త్రివేణి సింగ్, అతడి అనుచరులు పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులను తాము గుర్తించినట్లు.. త్వరలోనే వారిని పట్టుకుంటామని సుపాల్ జిల్లా పోలీస్ అధికారి షేక్ హసన్ తెలిపారు. -
ఓటమికి బాధ లేదు: నితీష్ కుమార్
సుపాల్: సాధారణ ఎన్నికల్లో ఓటమికి బాధ లేదని బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీతో బంధాన్ని తెంచుకున్నామని చెప్పారు. బీహార్ లోని సుపాల్ జిల్లాలో ఆదివారం జేడీ(యూ) కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అమలు సాధ్యంకాని హామీలిచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీయే సర్కారు ఇప్పటివరకు అమలుచేయలేదన్నారు. వచ్చే ఏడాది బీహార్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నితీష్ కుమార్ నవంబర్ 13న సంపర్క్ యాత్ర చేపట్టారు. తనయాత్ర ద్వారా జేడీ(యూ) కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలని భావిస్తున్నారు.