రాజీనామాకు ససేమిరా అంటున్న మాంఝీ | Manjhi refuses to make way for Nitish, more dissidents to back CM | Sakshi
Sakshi News home page

రాజీనామాకు ససేమిరా అంటున్న మాంఝీ

Published Fri, Feb 6 2015 11:25 AM | Last Updated on Mon, Sep 17 2018 4:55 PM

రాజీనామాకు ససేమిరా అంటున్న మాంఝీ - Sakshi

రాజీనామాకు ససేమిరా అంటున్న మాంఝీ

పాట్నా : బీహార్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా జేడీ(యూ)  పార్టీ నాయకత్వంపై ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్తో శనివారం ఎమ్మెల్యేల భేటీపై మాంఝీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన నేడు సమావేశం కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు మాంఝీ యత్నిస్తున్నారు. అంతేకాకుండా సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మాంఝీ స్పష్టం చేశారు.

మరోవైపు బీహార్ సీఎం మార్పుపై జేడీ (యూ)లో ముమ్మర కసరత్తు జరుగుతోంది.  నితీష్ కుమార్ సీఎం పదవి చేపట్టేందుకు వీలుగా ప్రస్తుత సీఎం జితన్ రామ్ మాంఝీని పదవి నుంచి తప్పించనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నెల7న జేడీ(యూ) శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశం అనధికారకంగా జరుగుతోందని, తాను రాజీనామా చేసే అవకాశం లేదని మాంఝీ ఇప్పటికే ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement