బీహార్ సీఎం ఝలక్ ఇచ్చారు! | Jitan Ram Manjhi proposes dissolution of Bihar Assembly | Sakshi
Sakshi News home page

బీహార్ సీఎం ఝలక్ ఇచ్చారు!

Published Sat, Feb 7 2015 4:45 PM | Last Updated on Mon, Sep 17 2018 4:55 PM

బీహార్ సీఎం ఝలక్ ఇచ్చారు! - Sakshi

బీహార్ సీఎం ఝలక్ ఇచ్చారు!

పాట్నా: బీహార్‌ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.  జనతాదళ్‌ (జేడీ)యూ నాయకత్వంపై  తిరుగుబాటు చేస్తున్న బీహార్‌ ముఖ్యమంత్రి  జితన్‌ రామ్ మాంఝీ ఏకంగా అసెంబ్లీని రద్దు చేస్తానంటూ హెచ్చరించారు.  దీనిలో భాగంగా శనివారం అత్యవసరంగా కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి హడావుడి సృష్టించారు. అసెంబ్లీ రద్దు  అంశాన్ని మంత్రిమండలి ముందుంచారు.  అయితే చాలా మంది మంత్రులు దీన్ని వ్యతిరేకించారు. నితీశ్‌ కుమార్‌కు మద్దతుగా ఉన్న మంత్రులు కేబినెట్‌ సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేశారు. 

 

ప్రస్తుత ముఖ్యమంత్రి మాంఝీని తొలగించిన తిరిగి నితీశ్‌ కుమార్‌ను సీఎం చేయాలని అధి నాయకత్వం భావిస్తున్న తరుణంలో రామ్‌ మాంఝీ మాత్రం మొండిగా వ్యవహరిస్తూ పార్టీలో అలజడి సృష్టిస్తున్నారు. ఇదిలా ఉండగా బీహార్‌లో ప్రజాస్వామ్యం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలకు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సీఎం జితన్‌ రామ్‌ మాంఝీ బీజేపీ స్క్రిప్ట్‌ ప్రకారం నటిస్తున్నారని జేడీయూ ప్రధాన కార్యదర్శి  కేఎస్ త్యాగి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement