కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయి: నితీష్
పాట్నా: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ్ బిల్లును లోక్సభలో ఆమోదించిన తీరును జేడీ(యూ) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తప్పుబట్టారు. బిల్లు ఆమోదించిన తీరు సవ్యంగా లేదని విమర్శించారు. అక్రమ, అనారోగ్యకర సంప్రదాయానికి కాంగ్రెస్, బీజేపీ తెర తీశాయని దుయ్యబట్టారు. ఆర్టికల్ 3 ద్వారా కొత్త రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేయాలని రాజ్యాంగం చెబుతోందని అన్నారు. ఆరోగ్యకర వాతావరణంలో తెలంగాణ బిల్లుకు తెలిపితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. విభజన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగానే తమ పార్టీ ఎంపీలు నిన్న లోక్సభ నుంచి వాకౌట్ చేశారని నితీష్కుమార్ వివరించారు. కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపి బిల్లును ఆమోదించాయని చెప్పారు.