ఎన్డీయే లబ్ధికోసమే ఆ సర్వేలు
ఎన్నికల సర్వేలపై మండిపడ్డ నితీశ్
పాట్నా/మొహాలీ: వచ్చే ఎన్నికల్లో జనతాదళ్ (యూ) పార్టీకి ప్రదర్శన ఘోరంగా ఉండబోతోంది అని కొన్ని సర్వేలు చెప్పడం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మండిపడ్డారు. చట్టసభల్లో ఎన్డీఏ ఏదో అద్భుతమైన ప్రదర్శన చేసిందని చెప్పడానికే ఆ ఫలితాలు ఉన్నట్లున్నాయని ధ్వజమెత్తారు. ఈ మొత్తమంతా ఎన్నికల విధానాన్ని నిర్వీర్యం చేసేందుకేనంటూ విమర్శించారు. ఒకవేళ సర్వేలు చెప్పినట్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు విజయం చేకూరేటట్లయితే.. ఇక ఎన్నికలు నిర్వహించడం దేనికంటూ ఇక్కడ ఆదివారం జరిగిన సంకల్ప ర్యాలీలో ఎద్దేవా చేశారు. సర్వేల ప్రకారమే తమ పార్టీ గెలిచేస్తుందని బీజేపీ భావిస్తే.. నరేంద్ర మోడీ నేరుగా వెళ్లి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసేయవచ్చంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గుజరాత్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రాకుండా రాజీకీయ లబ్ధికోసం ఆర్‌జేడీ అడ్డుకుందని నిప్పులు చెరిగారు.
ప్రకాశ్ సింగ్ బాదల్ నేతృత్వం వహించాలి: జేడీ(యూ)
దేశానికి నేతృత్వం వహిస్తూ ఎర్రకోటపై ప్రకాశ్‌సింగ్ బాదల్ జెండా ఎగరవేయాలని తాము కోరుకుంటున్నామని జేడీ(యూ) నేత నరేంద్రసింగ్ చెప్పారు. పం జాబ్ వ్యవసాయాభివృద్ధి సదస్సులో పాల్గొనడానికి ఆయన మొహాలీ వచ్చారు.