Bihar: ఒకే విమానంలో ఢిల్లీకి నితీశ్‌, తేజస్వి | Nitish Tejaswi Started To Delhi In Same Flight From Bihar | Sakshi
Sakshi News home page

ఒకే విమానంలో ఢిల్లీకి నితీశ్‌, తేజస్వి..

Published Wed, Jun 5 2024 12:16 PM | Last Updated on Wed, Jun 5 2024 3:40 PM

Nitish Tejaswi Started To Delhi In Same Flight From Bihar

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(జూన్‌5) సాయంత్రం జరిగే ఎన్డీఏ,కూటమిల సమావేశాల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి నేతలు బయలుదేరారు. ఎవరి కూటమి సమావేశంలో ఆ కూటమికి చెందిన నేతలు పాల్గొంటారు. ఇదే విషయమై అయితే బిహార్‌లో మాత్రం ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది.  

ఎన్డీఏ కూటమి భేటీలో పాల్గొనేందుకు సీఎం నితీశ్‌కుమార్‌, ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 

ఈ పరిణామంతో ఎవరు ఎవరిని ఏ కూటమి వైపు తీసుకెళ్తారనే చర్చ మొదలైంది. అయితే తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని జేడీయూ నేత కేసీ త్యాగి ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరానని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ క్లారిటీ ఇచ్చారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement