surveys
-
USA Presidential Elections 2024: నువ్వా నేనా!?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. కమలా హారిస్ రూపంలో దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ పీఠమెక్కుతారా, లేక పాత కాపు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విజయఢంకా మోగిస్తారా అన్నది ఆసక్తకరంగా మారింది. రెండు వారాల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వారి విజయావకాశాలపై అమెరికా అంతటా జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి సర్వేలు ఏం చెబుతున్నాయనే అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఓటర్లు తలమునకలుగా ఉన్నారు. జాతీయ పోలింగ్ సగటులో హారిస్ ముందంజ జాతీయ పోలింగ్ సగటులో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హారిసే ముందంజలో ఉన్నారు. ఏబీసీ న్యూస్, వెబ్సైట్ 538 గణాంకాల ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు దేశవ్యాప్తంగా 46 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. హారిస్‌కు కాస్త ఎక్కువగా 48 శాతం మంది మద్దతుండటం విశేషం. అధ్యక్షుడు జో బైడెన్‌ను కాదని హారిస్‌ను డెమొక్రటిక్ పార్టీ బరిలో దింపడం తెలిసిందే. అనంతరం ఆమెకు ఫాలోయింగ్ అనూహ్యంగా పెరిగింది. సెపె్టంబర్ నుంచి హారిస్ ఆధిక్యత స్థిరంగా కొనసాగుతోంది. 7 కోట్ల మంది వీక్షించిన సెపె్టంబర్ పది నాటి హారిస్–ట్రంప్ బిగ్ డిబేట్ తర్వాత కూడా ఇందులో మార్పేమీ లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి కాకుండా ఎక్కువ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను సాధించిన వారే విజేతగా నిలుస్తారు. ప్రతి రాష్ట్రానికీ జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు కేటాయిస్తారు. ఇలా మొత్తంగా అమెరికాలో 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. గెలుపు కోసం కనీసం 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెల్చుకోవాల్సి ఉంటుంది. స్వింగ్ రాష్ట్రాల్లోనూ హారిసే అమెరికా ఓటర్లు చాలావరకు తాము ఏ పార్టీని అభిమానిస్తామో, ఏ పారీ్టకి మద్దతు పలుకుతామో బహిరంగంగానే చెబుతారు. అంతమాత్రాన వారు పారీ్టకి ఓటేస్తారన్న గ్యారెంటీ లేదు. ఏ పారీ్టకీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లుంటారు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. వీళ్ల మద్దతు దక్కిన అభ్యర్థే గెలవడం పరిపాటి. ఈసారి అందరి కళ్లూ ఏడు స్వింగ్ రాష్ట్రాలపైనే ఉన్నాయి! స్వింగ్ స్టేట్స్లో అత్యధికంగా 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాతో పాటు , 10 ఓట్లున్న విస్కాన్సిన్లో ట్రంప్, హారిస్ సమవుజ్జీలుగా నిలవడం విశేషం! 15 ఓట్లున్న మిషిగన్, ఆరు ఓట్లున్న నెవడాల్లో హారిస్‌కు స్వల్ప మొగ్గుంది. 16 ఓట్ల చొప్పున ఉన్న నార్త్ కరోలినా, జార్జియాల్లో, 11 ఓట్లున్న అరిజోనాలో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. అయితే స్వింగ్ రాష్ట్రాలన్నింటిలో కలిపి చూస్తే హారిసే సగటున 5 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు గణాంకాలు చాటుతున్నాయి. సగటు ఎలా లెక్కిస్తారు? రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో వేర్వేరు సంస్థలు చేసిన పోల్ సర్వేలను మదించి అభ్యర్థుల ఆదరణ తాలూకు సగటును లెక్కిస్తారు. అమెరికాలో ఏబీసీ న్యూస్‌లో భాగమైన పోలింగ్ విశ్లేషణ సంస్థ వెబ్సైట్ 538 దీన్ని లెక్కిస్తోంది. సర్వేలోఎంతమంది పాల్గొన్నారు, ఏ రోజున పోల్ చేపట్టారు, ఫోన్, టెక్సŠస్ట్ మెసేజ్, ఆన్లైన్... వీటిలో ఓటర్ల నుంచి ఎలా సమాచారం రాబట్టారు వంటి అంశాలను పారదర్శకంగా, నిజాయతీగా బేరీజు వేసి డేటాను సేకరిస్తారు. ఆ మీదట సగటును లెక్కిస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
US ELECTION: సర్వేల్లో హారిస్ ముందంజ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలాహారిస్ కాస్త ముందంజలో ఉన్నట్లు తాజా సర్వే ఒకటి తెలిపింది. ఆర్థిక వ్యవస్థ ఉద్యోగాల కల్పన అనే కీలక అంశాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌ను కమల వెనక్కి నెట్టేసినట్లు రాయిటర్స్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ పోల్‌సర్వే సోమవారం(సెప్టెంబర్23)తో ముగిసింది. ఈ సర్వేలో ట్రంప్‌నకు 40.48శాతం అనుకూలత రాగా కమలకు 46.61శాతం అనుకూల ఓట్లు వచ్చాయి.సెప్టెంబర్ తొలి వారంలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే కమల ఒక శాతం ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. దేశవ్యాప్త ట్రెండ్‌ను అంచనా వేయడంలో కీలకంగా భావించే పోల్సర్వేల్లో రాయిటర్స్-ఇప్సోస్ సర్వే ఒకటి కావడం గమనార్హం. నవంబర్5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుదిపోరు జరగనుంది. -
అందరివాడికే అందలం
తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు ఎన్నడూ కననిదీ, విననిదీ. బహుశా దేశంలోనే ఏ నాయకుడు కూడా ఇంత ఆత్మవిశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులే అన్నది ఈ విశ్వాసానికి కారణం. దానికి రుజువే ఎన్నికల ప్రచారంలో ఆయనకు లభిస్తున్న అమితమైన ఆదరణ! ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మరోసారి ఆయన్ని అధికార పీఠం ఎక్కించడానికి ‘సిద్ధం’గా ఉన్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది.‘కాణి’ ముత్యాలు ఇంటికే – మళ్లీ పట్టం జగన్‌కే!ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోమారు విస్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వనున్నారు. ఇది తెలుసుకోవడానికి ‘సర్వేశ్వరులను’ అడగనవసరం లేదు. గతంలో సర్వేలన్నీ సుప్రసిద్ధ మీడియా సంస్థలు నిర్వహించేవి. ఇప్పుడు ఎవరికి నచ్చిన విధంగా వారు సర్వేలు చేయించుకుంటూ ‘స్వింగ్’ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి ఇటు వైసీపీ, అటు కూటమి ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక, ప్రజాస్పందన నిశితంగా పరిశీలిస్తే, తీర్పు ఎలా ఉండబోతోందో మనకే అర్థమవుతుంది.జగన్ అన్ని పార్టీల కంటే ముందుగానే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేన అవగాహన కుదుర్చుకున్నా, చివరి వరకూ బీజేపీ జత కడుతుందో లేదో తెలియని సందిగ్ధం. అందుకే చాలాచోట్ల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేసుకున్నారు. తీరా బీజేపీ వచ్చి చేరాక, మళ్ళీ అభ్యర్థుల ప్రకటనలో కుస్తీ పట్టాల్సి వచ్చింది. ఆశించిన స్థాయిలో కాక అతి తక్కువ సీట్లు జనసేన తీసుకోవడం, బీజేపీ పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా సిసలైన బీజేపీ వారికి టికెట్లు దక్కకపోవడం వంటివి లుకలుకలకు కారణమయ్యాయి. పేరుకే మూడు పార్టీల జెండాలు. జన శ్రేణులు మాత్రం కలిసి పనిచేసే పరిస్థితి చాలా చోట్ల లేకుండా పోయింది.పోనీ నిలబెట్టిన టీడీపీ అభ్యర్థుల్లో ఆణిముత్యాల లాంటి వారు ఉన్నారా అంటే, అబ్బే! చాలావరకు కాణి ముత్యాలే! ఇంచుమించు చంద్రబాబు మహా దోపిడీలో భాగస్వాములు లేదా ఆ దోపిడీ నుంచి స్ఫూర్తి పొందినవారే. ఇటు బెజవాడ దుర్గమ్మ, అటు విశాఖ కనకమహాలక్ష్మి, ఆ పక్క అనకాపల్లి నూకాలమ్మ సాక్షిగా వీరంతా కాణి ముత్యాలు. ఇలాంటివాళ్లే చంద్రబాబుకు కావాలి. టిప్పర్ డ్రైవర్లు, కమతగాళ్లు అంటే ఆయనకు అసహ్యం. ఈ బాపతు కాణి ముత్యాల్ని జనం ఆదరించరని చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే వీళ్ళు ఎక్కువగా ‘బ్యాక్ డోర్ పాలిటిక్స్’ నడుపుతుంటారు.ఇక ప్రచార తీరు పరిశీలిస్తే, తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు... బహుశా దేశంలోనే ఏ నాయకుడు ఇంత ఆత్మ విశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. ఆయన ప్రచారాస్త్రాలు కూడా విలక్షణంగా ఉన్నాయని చెప్పాలి. ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా విమర్శలకే పరిమితమయ్యారు తప్ప స్థాయి మరచి తిట్లులంకించుకోలేదు, హుందాతనాన్ని కోల్పోలేదు. మరి కూటమి విషయానికొస్తే– వెకిలితనం, బూతు పురాణం, కొట్టండి, చంపండి, నరకండి అని జనాల్ని ప్రేరేపించటం సభ్య సమాజాన్ని విస్తుపరిచాయి. జగన్‌పై విసిరిన రాయి దాడిని ఖండించాల్సింది పోయి ‘గులక రాయి’ అని వెకిలితనాన్ని ప్రదర్శించటం, వలంటరీ వ్యవస్థను కట్టడి చేయడం, పండు టాకుల, పుండు రెక్కలపై ఆక్రోశం వెలిబుచ్చి వాళ్ళ చావుకి కారణం కావడం, లేని భూయాజమాన్య హక్కు చట్టంపై దుష్ప్రచారానికి పూనుకోవడం వంటివి అన్నీ బూమరాంగ్ ఆయ్యాయి. అయితే జగన్ పని అయిపోయింది, ఇక తామే అధికారంలోకి వస్తున్నామనే ఫేక్ సర్వేలలో మాత్రం ముందున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 13 లక్షలు. ఇందులో అర్బన్ ఓటర్లు కేవలం 87 లక్షలు. జగన్‌కు పెట్టని కోటల వంటి గ్రామీణ ఓటర్ల సంఖ్య 3 కోట్ల 20 లక్షలు. అందులో సంక్షేమ పథకాల లబ్ధిదారులే అధికం. ఇక కులాల ప్రాతిపదికగా చూస్తే... ఎస్సీలు 35 లక్షల 46 వేల 748, ఎస్టీలు 25 లక్షల 85 వేల 726, ముస్లింలు 23 లక్షల 84 వేల 449, బీసీ యాదవులు 25 లక్షలు, మత్స్యకారులు 15 లక్షల 74 వేల 868, గౌడలు 19 లక్షల 78 వేల 866,చంద్రబాబు చేత తీవ్ర అవమానాలకు గురైన రజకులు, నాయీ బ్రాహ్మణులు 8 లక్షల 41 వేల 400+ 4 లక్షల 15 వేల 520, బ్రాహ్మణులు 7 లక్షల 4 వేల 165. క్రైస్తవులు 3 లక్షల 15 వేల 320... ఈ సామాజిక వర్గాలలో అత్యధికులు జగన్ వైపే ఉన్నారు. అధిక శాతం ఉన్న మరొక వర్గం, గోదావరి జిల్లాల్లో నిర్ణయాత్మక శక్తి అని చెబుతున్న కాపులు, రాయలసీమలోని బలిజలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాల్లో ప్రధానంగా, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు, ఒంటరులు మొత్తం 52 లక్షల 97 వేల 748 మంది. వీరిలో జనసేన వైపు ఆశగా చూసి భంగపడిన వారు, చంద్రబాబు సామాజిక వర్గంతో దశాబ్దాల వ్యతిరేకత ఉన్నవారు, వైసీపీలోని కాపు నాయకుల వెంట ఉన్నవారు... ఇలా భిన్నాభిప్రాయాలతో అటూ ఇటూ ఉంటారు. ఇక రెడ్డి వర్గంలోని 26 లక్షల 748 మందిలో అధికులు జగన్ వైపు ఉండగా, కమ్మ వర్గంలోని 26 లక్షల 46 వేల 748 మందిలో అత్యధికులు చంద్రబాబు వైపు ఉంటారు. ఇతర బీసీలు, 13 లక్షల పైచిలుకు ఉన్న వైశ్యులు ఆయా ప్రాంతాల పార్టీ అభ్యర్థుల ప్రాతిపదికన రెండు వైపులా చీలతారు. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అధిక శాతం వైసీపీ వైపే ఉన్నారు. గెలుపును నిర్ణయించే మరో శక్తి, నారీ శక్తి. అలాంటి మహిళలు జగన్ వైపే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. దీనిని బట్టి, ‘మళ్లీ పట్టం జగన్‌కే – కాణి ముత్యాలు ఇంటికే!’_వ్యాసకర్త పూర్వ సంపాదకుడు- పి. విజయబాబుముస్లింలు బీజేపీని ఓడించాలి – వైసీపీని గెలిపించాలి!ప్రధాని నరేంద్ర మోదీజీ, బీజేపీల నాయకత్వంలో పదేళ్ళుగా కేంద్రంలో అధికా రంలో వున్న ఎన్డీయే ప్రభుత్వం దేశ సంపదను అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెడు తున్నది. ఒకవైపు భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానంటూనే మరోవైపు దేశ ప్రజల్ని పేదరికం లోనికి నెట్టి వేస్తున్నది. దేశ ప్రజలంటే 80 శాతం హిందువులు, 14 శాతం ముస్లింలు, 6 శాతం క్రైస్తవులు, సిక్కులు, తదిత రులు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన హ్యాపీనెస్ రిపోర్టులో భారతదేశం 126వ స్థానంలో వుంది. భారత ప్రజలు సంతోషంగా లేరు. అణిచివేతకు గురవుతున్న ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే ముస్లిం, ఐదుగురు హిందువులు. దీని అర్థం ఏమంటే మోదీ పాలనకు ప్రధాన బాధితులు హిందువులు. ఈ వాస్తవాన్ని కప్పి పుచ్చడానికి, హిందూ–ముస్లింల మధ్య తగువుపెట్టి ఎన్నికల్ని ఒక మత యుద్ధంగా మార్చడానికిస్వయంగా మోదీజీ నడుం బిగించారు. 2019 లోక్ సభ ఎన్నికల్ని ఆ పార్టీ 1761 నాటి పానిపట్టుయుద్ధంతో పోల్చేది. ఆ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ దుర్రానీ చేతుల్లో పీష్వా బాలాజీ బాజీరావు ఓడిపోవడంతో హిందువులు 250 ఏళ్లు అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేసి, మళ్ళీ అలాంటి దుఃస్థితి వస్తుందని భయపెట్టింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని ఔరంగజేబ్, శివాజీ మహారాజ్‌ల మధ్య పోరాటంగా ప్రచారం చేసింది. గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టిప్పూ సుల్తాన్‌కు ఓటేస్తారా? రాణి అబ్బక్కకు ఓటేస్తారా? అని అడిగింది.వివిధ రాష్ట్రాలు విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి హిందూ సమా జంలోని కింది కులాలకు కేటాయిస్తామని బీజేపీ చెపుతున్నది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని విస్తారంగా ప్రచారం చేశారు. ఆ రెండు రాష్ట్రాల ప్రజలూ ఈ మాటల్ని నమ్మలేదు. మత ప్రాతి పదికన రిజర్వేషన్లను బీజేపీ ఆమోదించదని మరో బూటకపు ప్రచారాన్ని ప్రధాని సాగిస్తున్నారు. నిజానికి మత ప్రాతిపదికనే కులాలుంటాయి. భారత రాజ్యాంగం కొన్ని సమూహాలకు ఇచ్చిన రిజర్వేషన్లు వాస్తవా నికి మత రిజర్వేషన్లే. మాల సామాజిక వర్గానికిచెందిన ఒక వ్యక్తి తాను హిందువుననిగానీ, సిక్కును అనిగానీ ప్రకటించుకుంటేనే ఎస్సీ రిజర్వేషను పొందు తాడు. క్రైస్తవుడినని ప్రకటించుకుంటే బీసీ రిజర్వేషను పొందుతాడు. ఏమిటి దీనర్థం? బీజేపీ ముస్లిం రిజర్వేషన్‌గా ప్రచారం చేస్తున్నది కూడా నిజానికి ముస్లిం రిజర్వేషన్ కాదు. ముస్లిం సమాజంలో ఓసీలుగా పరిగణించే సయ్యద్, పఠాన్, మొఘల్, బేగ్‌లకు బీసీ రిజర్వేషన్ వర్తించదు. మహా అయితే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన సమూహాల (ఇడబ్ల్యూఎస్) కోటాలో లబ్ధి పొందవచ్చు. ముస్లింలను సాంస్కృతిక రంగంలో వివక్షకు గురి చేయడం, ఆర్థిక రంగంలో అతి క్రూరంగా బుల్ డోజర్లతో కూల్చి వేయడం బీజేపీ విధానంగా మారింది. ఏపీలో ప్రధాన పోటీదారులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ మొదటి నుండీ మత సామరస్యవాదుల నేల, సామ్యవాదుల భూమి. మతవిద్వేషాన్ని రగిల్చితే తప్ప రాజకీయ మనుగడ సాగించలేని బీజేపీ ఈ నేల మీద తనంత తానుగా మొలకెత్తలేని విత్తనం. 2019 ఎన్నికల్లో విడిగా పోటీచేస్తే బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడ రాలేదు. లోక్ సభ, అసెంబ్లీల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. జాతీయ స్థాయిలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రమే. ఏపీ ముస్లింలు ఈసారి ఒక లెక్క ప్రకారం కాంగ్రెస్‌కు మద్దతు పలకాలి. అయితే, కర్ణాటక, తెలంగాణాల్లా ఏపీలో కాంగ్రెస్ నిర్మాణం బలంగా లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎంచుకున్న ప్రాధాన్య తల్ని ఆ పార్టీ ఏపీ నాయకులు పట్టించుకుంటున్నట్టు లేదు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బీజేపీని ఓడించాలనే పట్టుదల వున్నట్టు లేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని గెలిపించాలా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించాలా? అనేది ఏపీ ముస్లింల ముందున్న ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసమో, మరో కారణాలతోనో వైసీపీ జగన్ ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న ఎన్డీయేతో సఖ్యంగా వున్నారు. ఇప్పుడు ఆయనే ఏపీ నేల మీద బీజేపీని ఎదుర్కోవాల్సిన స్థితిలో పడ్డారు. ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసేలోగా బీజేపీ, జగన్‌ల మధ్య పోరు మరింత వుధృతం అవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్సా? వైఎస్సార్ కాంగ్రెస్సా? అనే ప్రశ్న మళ్ళా ముస్లింల ముందుకు వచ్చి నిలిచింది. ఇది రాజకీయ సమస్య మాత్రమే కాదు. ఒక విధంగా నైతిక సమస్య కూడా. ఆంధ్రప్రదేశ్ భౌతిక రాజకీయ సమీకరణలు, కాంగ్రెస్ ఏపీ యూనిట్ వాస్తవిక బలాబలాలు, పనితీరుల్ని పరిగణన లోనికి తీసుకుంటే ముస్లింలు వైసీపీకి మద్దతు ఇవ్వడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. అది అవసరం కూడా. ఇటీవల విజయవాడలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (ముస్లిం జేఏసీ), ముస్లిం ఆలోచనాపరుల వేదిక(ఎంటీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ముస్లిం ఉలేమాలు, ఆలోచనాపరులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రొఫె షనల్స్తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. -వ్యాసకర్త ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటీఎఫ్) కన్వీనర్-ఏఎం ఖాన్యజ్దానీ డానీ -
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఎప్పుడో మూలబడిపోయి, నట్లు ఊడిపోయిన అంబాసిడర్ కారుకు కలర్ వేసి తీసుకొస్తే అది ఆడి కార్ అయిపోతుందా...ముసలమ్మకు మేకప్ వేసి చూపిస్తే ముద్దుగుమ్మ అయిపోతుందా..సంస్థను మోసం చేసి...చెక్కుబుక్కులు ఎత్తుకుపోయి వ్యవస్థనే మోసం చేసి కేసులపాలై ఏళ్లపాటు సమాజానికి మొహం చూపించలేక ఎక్కడో దూరంగా బతుకుతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాత్రికిరాత్రి సర్వేలు అంటూ అవాస్తవాలు. చెప్పిస్తే ప్రజలు నమ్ముతారా ? అసలు ఈ కాలం జనం అలా ఉన్నారా? ఎవరో ఏదో చూపిస్తే అబ్బో...బ్రహ్మాండం అని నమ్మే తీరులో ఉన్నారా? అసలు ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెల్లోని జనం కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఏ ఛానెల్..ఏ పత్రిక ఎవరిపక్షమో చెప్పగలుగుతున్నపుడు ఈ మాయమాటలు ఎవరు నమ్ముతారు.వాస్తవానికి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఊత కర్ర లేకపోయింది. అంటే ఏ అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లి నమ్మిస్తారు..ఆకట్టుకుంటారు..ప్రస్తుత వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం అన్నివర్గాలనూ ఆకట్టుకుంటూ అవినీతి రహిత పాలనా అందిస్తోంది. దానికితోడు చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి గౌరవాన్ని కోల్పోయి ఏదో అలా బతుకుతున్నారు తప్ప ఆయన రాజకీయనాయకుడు స్టేచర్ ఏనాడో కోల్పోయారు. దీంతో ఈ ఎన్నికలవేళ తెలుగుదేశానికి కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కారణం..ఒక అంశం లేకుండా పోయింది.ఇక జగన్ ఐతే చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మాయలు ఉండవు...చేయలేనిది చేయలేను ఆయనే ఒప్పేసుకుంటాడు.. అలాంటపుడు మోసానికి కేరాఫ్ అయిన చంద్రబాబు నమ్మాల్సిన అవసరం ఏముందన్న ట్రెండ్ ప్రజల్లో నడిచింది . సినిమా ఫ్లాప్ అయిపోయి..జనాదరణ కోల్పోయి, ఇది చెత్త అని జనాల్లో టాక్ వచ్చినపుడు కొత్త మసాలా పాట కలిపి మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు. అంతే ఆ పాట సినిమాను నిలబడుతుందన్న భ్రమ ఆ నిర్మాతలది. మొత్తం సినిమా దరిద్రం అయిపోయాక ఆ ఒక్క పాట సినిమాను నిలబెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా తన పార్టీ మీదా ఆశ కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో రవి ప్రకాష్ అనే అవుట్ డేటెడ్ జర్నలిస్టును తీసుకొచ్చి నోటికొచ్చిన అంకెలు వేసి సర్వే అని విడుదల చేాశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తాయన్నది. ఎవరిపాలన బాగుందన్నది జనానికి తెలుసు. అలాంటిది ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుని ఇష్టానుసారం అంకెలు వేసేసి ఇదే సర్వే అని జనాల్లోకి వదిలితే నమ్మే కాలం కాదని ఇలాంటి కుట్రదారులు తెలుసుకోవాలి. --సిమ్మాదిరప్పన్న-- -
UK Elections: చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమా?
లండన్: కన్జర్వేటివ్ పార్టీ.. బ్రిటన్‌లో దాదాపు పదిహేన్లపాటు అధికారంలో కొనసాగింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. గత రెండు మూడేళ్లుగా ఆ దేశ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి(ప్రధాని, మంత్రుల రాజీనామాలు.. తొలగింపులు), మరీ ముఖ్యంగా భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలో ఆ పార్టీ ఇమేజ్ మరింత దిగజారిపోయిందని ఆ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో యూకేలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో(తేదీలు ఖరారు కావాల్సి ఉంది) లేబర్ పార్టీ ప్రభంజనం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. కన్జర్వేటివ పార్టీ గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలీను నెరవేర్చకపోగా.. దేశాన్ని వరుస సంక్షోభాల్లోకి నెట్టేసిందన్న అభిప్రాయంలో ఉన్నారు అక్కడి ప్రజలు. పైగా కాస్ట్ ఆఫ్ లివింగ్ సైతం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా.. మార్చి 7వ తేదీ నుంచి 27 తేదీ మధ్య YouGov ఓ పబ్లిక్ సర్వే నిర్వహించింది. అందులో 18, 761 మంది పౌరులు పాల్గొన్నారు. వాళ్లలో మెజారిటీ పౌరులు.. లేబర్ పార్టీకే ఓటేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్లో.. అధికారం చేపట్టాలంటే 326 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే యూజీవోవీ సర్వేలో లేబర్ పార్టీకి 403 స్థానాలు, కన్జర్వేటివ్ పార్టీ కేవలం 155 స్థానాలు దక్కించుకుంటాయని సదరు సర్వే తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇదే సంస్థ జరిపిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీకి 169 స్థానాలు రావొచ్చని అంచనా వేయగా.. తాజా సర్వేలో ఆ స్థానాలు మరింత తగ్గడం గమనార్హం. పోల్ ఆఫ్ పోల్స్ పోలిటికో సైతం ఇలాంటి ట్రెండ్‌నే ప్రకటించింది. మార్చి 31వ తేదీన వెల్లడించిన సర్వేలో.. 44 శాతం లేబర్ పార్టీకి, 23 శాతం కన్జర్వేటివ్పార్టీకి సీట్లు దక్కవచ్చని వెల్లడించింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ అక్టోబర్ 24, 2022లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ముందు పెను సవాళ్లు ఉండగా.. ఆయన వాటిని అధిగమిస్తానని స్పష్టం చేశారు. అయితే.. అప్పటి నుంచి బ్రిటన్ సంక్షోభం మరింత ముదిరింది. ఈ మధ్యలో ఆయన పైనా విమర్శలు వెల్లువెత్తుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మే 2వ తేదీన యూకేలో మేయర్, లోకల్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను వాయిదా వేయించాలని కన్జర్వేటివ్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ, కోర్టులు అందుకు అంగీకరించలేదు. ఇక ఈ ఎన్నికల్లోనూ కన్జర్వేటివ్ పార్టీ ఓటమి తప్పదంటూ ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయి. -
రష్యాలో ఎన్నికల తంతు!
ఆపద్ధర్మ ఏలుబడితో కలుపుకొని ప్రధానిగా, దేశాధ్యక్షుడిగా పాతికేళ్లనుంచి అవిచ్ఛిన్నంగా రష్యా అధికార పీఠాన్ని అంటిపెట్టుకునివున్న వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సార్వత్రిక ఎన్నికల తంతుకు తెరలేపారు. మూడురోజులపాటు జరిగే ఈ ఎన్నికలు శుక్రవారం మొదలయ్యాయి. 14 కోట్ల 30 లక్షలమంది జనాభాగల రష్యాతోపాటు 2014లో అది దురాక్రమించిన క్రిమియా... 2022 నుంచీ దాని ఆక్రమణలోవున్న ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వ మీడియా మినహా మరి దేనికీ చోటీయని రష్యాలో చిన్నపాటి అసమ్మతి వినిపించే ప్రయత్నం చేసినా పెద్ద నేరమవుతుంది. అందుకే ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలన్నీ పుతిన్‌కు 80 శాతం ప్రజల ఆమోదం వున్నదని చాటాయి. కనుక 71 యేళ్ల పుతిన్ మరోసారి విజయం సాధించి అయిదోసారి అధ్యక్షుడవుతారనీ, 2030 వరకూ ఆయనే పాలిస్తారనీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయని చెప్పటానికి నామమాత్రంగా ప్రత్యర్థులు కనబడతారు. కానీ వారెవరికీ ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఒకప్పుడు దశాబ్దాలపాటు దేశాన్నేలిన కమ్యూనిస్టు పార్టీ ఏనాడో నామ మాత్రావశిష్టమైంది. ఆ పార్టీ తరఫున 75 యేళ్ల నికొలాయ్ ఖరిటోనోవ్ పోటీచేస్తున్నారు. 2004లో పుతిన్‌పై మొదటిసారి ఓడిన ఆయన్నే ఈసారి కూడా ఆ పార్టీ నిలబెట్టింది. ఎటూ గెలవని ఎన్నికల కోసం మరొకరిని ముందుకు తోయటం అనవసరమని ఆ పార్టీ భావించివుండొచ్చు. లిబరల్ డెమొ క్రాటిక్ పార్టీ అభ్యర్థి లియోనెడ్ స్లట్స్కీ... పుతిన్ మాదిరే జాతీయవాది. ఆయన గెలుపే తన గెలు పని స్లట్స్కీ ఇప్పటికే ప్రకటించారు. ఉదారవాదిగా ముద్రపడి ఉక్రెయిన్‌లో ‘శాంతి’ నెలకొనాలని తరచు చెప్పే న్యూ పీపుల్ పార్టీ అధినేత వ్లాడిస్లావ్ దవాన్కోవ్ది కూడా అదే తీరు. ఇక ఉక్రెయిన్‌తో తలపడటాన్ని తప్పుబట్టిన చరిత్రగల ఇద్దరు అభ్యర్థులను అధికారులు ‘అనర్హులుగా’ తేల్చారు. చాలా దేశాలకు ఇది ఎన్నికల నామ సంవత్సరం. ఇప్పటికే బంగ్లాదేశ్, తైవాన్ ఎన్నికలుపూర్తయ్యాయి. మన దేశంతోపాటు అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఇండొనేసియా తదితర 60 దేశాల్లో ఈ ఏడాదంతా వేర్వేరు నెలల్లో ఎన్నికలుంటాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 200 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంటే ప్రపంచ జనాభాలో నాలుగోవంతన్నమాట! అయితే విజేతలై గద్దెనెక్కేవారు ప్రజాస్వామ్యబద్ధంగానే పాలిస్తారా అన్నది వేరే సంగతి. ఎందుకంటే ప్రజా స్వామ్యం ముసుగేసుకున్న నియంతలూ, సమాజంలో పరస్పర వైషమ్యాలు రెచ్చగొట్టే నేతలూ, గాలి కబుర్లతో గద్దెనెక్కాలనుకునేవారూ ఈ దేశాలన్నిటా వున్నారు. కానీ పుతిన్ మాదిరి బరితెగించిన నేత ఎక్కడా కనబడరు. క్రితంసారి ఎన్నికలకన్నా ఎక్కువ పోలింగ్ అయిందనీ, పుతిన్‌కు అధిక శాతం మద్దతు లభించిందనీ ‘నిరూపించటానికి’ అధికారగణం ఎక్కడలేని పాట్లూ పడుతూవుంటుంది. 2018 ఎన్నికల సమయంలో పోలైన ఓట్లలో పుతిన్‌కు 5 కోట్ల 60 లక్షల ఓట్లులభించాయి. కనుక ఈసారి అది ఆరు కోట్లు దాటాలన్నది వారి పట్టుదల. తమ అధీనంలోని ఉక్రెయిన్ భూభాగంలో 45 లక్షలమంది ఓటర్లున్నారని అధికారులు చెబుతున్నారు. కానీ నిత్యం బాంబుల వర్షం కురిసేచోట నిజానిజాలు నిర్ధారించేదెవరు? వారందరికీ ఆన్లైన్ వోటింగ్‌కు అవకాశం ఇచ్చామని అధికారులు ప్రకటించారు. కనుక రిగ్గింగ్ ఈసారి పాత రికార్డులు బద్దలుకొడుతుందని నిర్ధారణగా చెప్పవచ్చు. వారం పదిరోజుల్లో ఉక్రెయిన్ లెక్క తేల్చి, యుద్ధ విజేతగా చాటుకుని అధ్యక్ష ఎన్నికలకు వెళ్లాలని పుతిన్ తపించారు. కానీ 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన నాటి నుంచీ రష్యాకు అడుగడుగునా అవరోధాలే. అమెరికా ఉక్రెయిన్‌కు భారీయెత్తున సైనిక, ఆర్థిక సాయం అందించటమే కాదు...‘ఉక్రెయిన్ తర్వాత మీవంతే’ అని నాటో కూటమి దేశాలను బెదరగొట్టి ఆ దేశం పక్షాన నిలబడేలా చేసింది. కనుక యుద్ధం రెండేళ్లుదాటి మూడోసంవత్సరంలోకి ప్రవేశించినా పుతిన్‌కు అక్కడ దారీ తెన్నూ కనబడటం లేదు. పైపెచ్చు ఆయుద్ధంలో రష్యా సైనికులు భారీ యెత్తున మరణిస్తుండటం, అత్యాధునిక ఆయుధాలు అక్కరకు రాకుండా పోవటం, ఉక్రెయిన్ డ్రోన్ దాడులను నిలువరించటంలో వైఫల్యం వంటివి ఆయనకు నిరాశ కలిగిస్తున్నాయి. కానీ ఆ యుద్ధం వల్ల పుతిన్‌కు జనాల్లో ఆమోదనీయత పెరిగిందని ప్రభుత్వ మీడియా ఊదరగొడుతోంది. అయితే పుతిన్ ఏలుబడి నల్లేరు మీద నడక కాదు. 2006–08 మొదలుకొని రెండేళ్లనాడు మొదలైన ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధం వరకూ ఏదో పేరిట చెలరేగే నిరసనలు తలనొప్పిగానే వున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా, హక్కుల ఉల్లంఘన, దురాక్రమణ యుద్ధాలను నిరసిస్తూ ఈ ఉద్యమాలు సాగాయి. అయితే పుతిన్ వాటన్నిటినీ అణిచేసి, జైళ్లు నింపారు. ప్రస్తుతం రాజకీయ ఖైదీల సంఖ్య 1,16,000 పైమాటే. దేశ పౌరుల్లో పుతిన్ పాలనపై తీవ్ర అసంతృప్తి వుంది. ప్రభుత్వ వ్యయంలో 40 శాతం యుద్ధానికే కేటాయించాల్సివస్తోంది. అయినా ఫలితం నాస్తి. నిరుడు జీడీపీ 3.6 శాతంగా నమోదై జీ–7 దేశాలను అధిగమించింది. రక్షణరంగ పరిశ్రమలు మాత్రమే పచ్చగా వర్ధిల్లుతున్నాయి. అమెరికా ఆంక్షల పర్యవసానంగా దేశంలో అనేక వ్యాపార ‡సంస్థలు కుప్పకూలి మూతబడ్డాయి. వాస్తవాదాయాలు పడిపోయి, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి పౌరులు సతమతమవుతున్నారు. దానికితోడు అంతర్జాతీయంగా ఏకాకులమయ్యామన్న అసంతృప్తి అదనం. కానీ అధ్యక్ష ఎన్నికల్లో వీటి ప్రభావం కనబడనీయకపోవటం పుతిన్ ప్రత్యేకత. ఈ రీతి, రివాజు ఎన్నాళ్లు కొనసాగుతుందో, నిజమైన ప్రజాస్వామ్యం రష్యాలో ఎప్పుడు చిగురిస్తుందో చూడాలి. -
Canada: కెనడాలో ‘ట్రూడో’కు షాక్.. సర్వేల్లో సంచలన ఫలితాలు
ఒట్టావా: కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పోస్ట్ మీడియా కోసం ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది ట్రూడో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు తేలింది. దేశంలో పాలన సరిగా లేదని 60 శాతం మంది ట్రూడో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో 43 శాతం మంది 2021 ఎన్నికల్లో ట్రూడో ప్రభుత్వానికి ఓటు వేసిన వారే కావడం గమనార్హం. దేశంలో పెరగిపోతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న జీవన ఖర్చు, ఆరోగ్య రంగం, ప్రజల ఇళ్లు కొనుగోలుచేసే శక్తి వంటి అంశాల వచ్చే ఏడాది (2025) జరిగే సాధారణ ఎన్నికల్లో ట్రూడోకు వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు చెబుతున్నారు. కాగా, నాన్ ప్రాఫిట్ అంగుస్ రెడ్ సంస్థ(ఏఆర్ఐ) నిర్వహించిన సర్వేలోనూ కేవలం 17 శాతం మంది మాత్రమే ట్రూడో తిరిగి ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు. 28 శాతం మంది ‘నన్ ఆఫ్ ద అబోవ్’ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఈ సర్వేలో కన్జర్వేటివ్ నేత పియెర్రే పొలీవర్ పట్ల మాత్రం కాస్త మెరుగైన స్పందన వచ్చింది. లిబరల్స్‌తో పోల్చుకుంటే కన్జర్వేటివ్ పార్టీ గత 12 నెలల నుంచి దేశంలో నిర్వహించిన సర్వేల్లో ముందు నిలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 338 సీట్లున్న కెనడా పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీ 206 సీట్లు, లిబరల్స్ 67 సీట్లు గెలుచుకుంటాయని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. వయసుపై జోకులు వేసుకున్న బైడెన్.. పాపులర్‌గా మారిన యాడ్ -
ఇక పూటకో ప్యాకేజీ స్టార్!
ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ శిబిరం రూపొందించిన ఒక పాట బాగా పాపులరయింది. ‘జెండలు జతకట్టడమే మీ ఎజెండా... జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా’ అనే పల్లవితో పాట మొదలవుతుంది. ‘నల్లగొండ గద్దర్’గా పేరు గాంచిన నర్సిరెడ్డి గొంతుక ఈ పాటకు ప్రాణం పోసింది. వైసీపీ అభిమానులకు సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పెళ్లి వేడుక జరిగినా ఈ పాటకు స్టెప్స్ వేయడం ఓ కార్యక్రమంగా మారింది. నాలుగు పార్టీలను కూడగట్టి అతుకుల బొంత అలయెన్స్‌లను కుట్టుకోవడం తప్ప ప్రజా సంబంధమైన ఎజెండా ప్రతిపక్షాలకు లేనేలేదని ఈ పాట ఎద్దేవా చేస్తుంది. అదే సందర్భంలో ప్రజలకు అండదండగా నిలబడుతూ వారి ఆద రణను జగన్ చూరగొంటున్నారనేది ఈ పల్లవి భావన.ఈ అభిప్రాయాన్ని ప్రతిపక్ష శిబిరం కూడా నిర్ధారిస్తున్నది. తాడేపల్లిగూడెం సమీపాన మొన్న తెలుగుదేశం–జనసేన పార్టీలు ఉమ్మడిగా జరిపిన సభకు కూడా ‘జెండా’ అనే నామ కరణాన్నే కూటమి వారు ఎంపిక చేసుకున్నారు. ‘తెలుగు–జన విజయకేతన’ జెండా అనే పేరుతో వేదికను అలంకరించారు. ‘తెలుగు జన’ అనే రెండు పదాలు రెండు పార్టీ పేర్లకు గుర్తనేది కవి హృదయం. కేతనం అన్నా కూడా జెండా అనే అర్థం. మరి కేతన జెండా అంటే? నొక్కి చెప్పడం కావచ్చు. లేదా ఒకరిది కేతనం, ఒకరిది జెండా అని కావచ్చు. అర్థం ఏమైనప్పటికీ‘జెండాలు జతకట్టడమే మా ఎజెండా’ అని వారు కూడా నర్సిరెడ్డి పాటకు కోరస్ పాడినట్టు కనిపించింది. రెండు పార్టీల అగ్రనాయకులిద్దరూ ఒకరి జెండా కర్రను మరొకరు చేత పుచ్చుకొని అటూ ఇటూ ఊపుతూ కార్యక్రమాన్ని లయబద్ధం చేశారు. మూడో జెండాను కూడా ఊపడానికి చాలాకాలం ఎదురు చూశారు కానీ ఎందుకో బీజేపీ వాళ్లు కనికరించలేదు. సభలో ప్రజలు కూర్చోవడానికి కేటాయించిన పదిహేను ఎకరాల్లోకి ఆరు లక్షలమందిని సమీకరిద్దామని సంకల్పం చెప్పుకున్నారు. పదిహేను ఎకరాల్లో ఆరు లక్షల మంది ఎలా కూర్చుంటారని ప్రశ్నించవద్దు. అగస్త్య మహాముని సప్త సముద్రాలను పుక్కిట పట్టలేదా? అలాంటి విద్యనే ప్రదర్శించి వుండేవాళ్లం, కానీ ఆర్టీసీ సహకరించనందు వల్ల అంతమంది రాలేదని సర్ది చెప్పుకున్నారు. టార్గెట్‌లో పదోవంతు మందిని సమీకరించగలిగినందుకు యెల్లో మీడియా ఆ పార్టీలను అభినందనల్లో ముంచెత్తింది. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి పదోవంతు సీట్లు గెలిచినా కూడా యెల్లో మీడియా అభినందిస్తుందేమో చూడాలి. జనసమీకరణ దృష్ట్యా చూస్తే ‘సిద్ధం’ సభలు గోదావరి ప్రవాహాలైతే ‘తెలుగు జన’ సభ పిల్లవాగులా తోచింది. ఎన్ని పిల్లవాగులైతే ఒక గోదావరి కావాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్జన సామాన్యంలో వైసీపీ ప్రభావాన్ని గోదావరితో పోల్చితేఈ రెండు పార్టీలను పిల్లవాగుతో పోల్చాలి. ఇది నేటి యథార్థ దృశ్యం.ఈ దృశ్యాన్ని సరిగ్గా అంచనా వేయడానికి కష్టపడి సర్వేలు కూడా చేయనవసరం లేదు. రాష్ట్రంలో అక్కడక్కడా పర్యటిస్తూ జనంతో ముచ్చటిస్తే చాలు నాడి తెలిసిపోతున్నది. పేద వర్గాల ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వం వెనుక సమీకృతమైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ అయిదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, వారి జీవితాలు స్పష్టమైన మార్పుకు లోనయ్యాయని ఈ ప్రాంత మేధావులు చెబుతున్నారు. ఈ మార్పు పట్ల మధ్య తరగతి మేధావి వర్గం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇటువంటి మార్పుకోసమే గదా... పేద ధనిక తేడా లేకుండా అందరికీ సమానావకాశాలు లభ్యం కావాలన్న ఆశ యంతోనే కదా... చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగిందీ, ఎన్నో విప్లవాలు చెలరేగిందీ! అటువంటి విప్లవం నిశ్శబ్దంగా ఇప్పుడు పేదవాడల్లోకి ప్రవేశిస్తున్నది. ఈ అద్భుతాన్ని కులమతాలకు అతీతంగా అభ్యుదయ కాముకులందరూ నిండు మనసుతో స్వాగతిస్తున్నారు. ఇందుకు కారణమైన జగన్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఒక డజన్‌కు పైగా స్వతంత్ర సర్వేలు బయటకు వచ్చాయి. వాళ్లంతా వైసీపీ గెలుస్తుందని చెప్పారు. కానీ వారి శాంపిల్ సైజ్ పరిమితుల వల్ల జనంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న మద్దతును పూర్తిగా అంచనా వేయలేకపోతున్నామనే అభిప్రాయం సర్వే సంస్థల్లో పని చేసే వారిలోనే ఉన్నది. వైసీపీకి పురుష ఓటర్లలో ఉన్న ఆధిక్యత కంటే మహిళా ఓటర్లలో ఎక్కువ ఆధిక్యత కనిపిస్తున్నది. ఇది అన్ని సర్వేల్లో వ్యక్తమైంది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. కానీ సర్వే సంస్థల శాంపిల్స్‌లో చాలావరకు పురుష ఓటర్లే ఎక్కువగా ఉంటున్నారు. శాంపిల్స్ జనాభా ప్రాతిపదిక మీద, వర్గాల నిష్పత్తి ప్రకారం కచ్చితంగా లెక్కగట్టి తీసుకోగలిగితే వైసీపీకి ఉన్న ఆధిక్యతను సరిగ్గా అర్థం చేసు కోగలుగుతాము. ఒక ప్రతిష్ఠాత్మకమైన జాతీయ సంస్థ తరఫున సర్వే పర్యవేక్షణకు వచ్చిన ఒక కీలక వ్యక్తి అంచనా ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ, వైసీపీ ఓటు షేర్ 50 శాతానికి పైగానే ఉన్నది. వందకు పైగా నియోజక వర్గాల్లో 55 శాతంకంటే ఎక్కువ ఓటర్ల మద్దతు వైసీపీకి లభించే అవకాశం ఉన్నదని కూడా ఆయన చెప్పారు. మొత్తం 25 పార్లమెంట్ సీట్లూ వైసీపీకే దక్కుతాయనీ, అసెంబ్లీ సీట్లు కూడా గతం కంటే ఒక్కటి కూడా తగ్గబోదనీ ఆయన పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈ అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన కార్య క్రమాలను ప్రజలు సంపూర్ణంగా ఆమోదిస్తున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితేనే పేదవర్గాల నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని జనం నమ్ముతున్నారు కనుకనే క్షేత్ర స్థాయిలో వైసీపీ పటిష్ఠంగా ఉన్నది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జనంలో ఇటువంటి విశ్వాసాన్ని కలిగించలేకపోయారు. కిందటిసారి గెలిచినప్పుడు హామీలను అమలు చేయలేక మేనిఫెస్టోను మార్కెట్ నుంచి కనుమరుగు చేయడం కూడా ప్రజల మనోఫలకం నుంచి చెరిగిపోలేదు.రెండు ప్రభుత్వాలనూ జనం బేరీజు వేసుకుంటున్నారు. సహ జంగానే మార్కులు జగన్ ప్రభుత్వానికే పడుతున్నాయి. తమ జీవితాల్లో వెలుగులు పూయించి, బిడ్డల భవిష్యత్తు మీద కొండంత విశ్వాసాన్ని నింపుతున్న జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగాఎందుకు ఓటేయాలని జనసామాన్యం ప్రశ్నిస్తున్నారు. ఇదిగో ఈ సింపుల్ లాజిక్ వచ్చే ఎన్నికల్లో మరో సునామీని సృష్టించ బోతున్నది.జనం గుండెల్లో గుడి కట్టుకోవడానికి చంద్రబాబుకు అవకాశం లేదు. ఆయనకో జీవితకాలం ఆలస్యమైపోయింది. అందుకే జెండాలు జతకట్టుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం మీద అపోహలు సృష్టించడానికి, దుమ్మెత్తిపోయడానికి రక రకాల కుట్రలకు తెరతీస్తున్నారు. యెల్లో మీడియా ప్రాపగాండా సరిపోవడం లేదని సరికొత్త ప్యాకేజీ స్టార్లను ప్రయోగిస్తున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు కనిపించిన ప్రతి గడ్డిపోచ మీద కూడా ఆశ పెట్టుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి సరిగ్గా అదే! జగన్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి వివిధ టాస్క్‌లను తెలుగుదేశం డిజైన్ చేసింది. ఒక్కో టాస్క్‌కు ఒక్కో ప్యాకేజి స్టార్. వాళ్లందరికీ వెలకట్టాలి. ఎన్నికల్లో వెదజల్లాలి. అందుకు డబ్బు కావాలి. సొంత ముల్లెను విప్పడానికి ఇంట్లో వాళ్లు చస్తే ఒప్పుకోరు.అందుకని పెత్తందారీ మనస్తత్వం కలిగిన డబ్బున్న వారి మీద వలలు విసిరారు. బాబు గెలిస్తే ఇష్టారాజ్యంగా దండు కోవచ్చన్న కక్కుర్తితో చాలామంది రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ, అధిక వడ్డీల పేరుతో 650 కోట్లు సేకరించి ఎన్నికల గమ్యస్థానాలకు చేర్చారని వినిపించింది. గుంటూరు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తాడని భావిస్తున్న ఒకాయన 800 కోట్లను ఇప్పటికే సిద్ధం చేశాడట. వాటిని గమ్యస్థానాలకు చేర్చడమెట్లా అని మల్లగుల్లాలు పడు తున్నట్టు సమాచారం. ఇటువంటి పెత్తందార్లు గెలిస్తే రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే! పవన్ కల్యాణ్‌కు వైసీపీ వాళ్లు ‘ప్యాకేజి స్టార్’ అనే టైటిల్‌ను తగిలించారు. ఈ మాట అన్నందుకు ఆయనకు చాలా కోపం వచ్చింది. ఒక సభలోనైతే ఈ ఆరోపణపై పాదరక్షలను సంధించారు. కానీ ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్టు కని పిస్తున్నది. మొన్నటి తెలుగు – జనసభలోనైతే తనను తాను అవమానించుకొని, తన పార్టీనీ తానే అవమానించి చంద్ర బాబుకు జైకొట్టారు. ఈ విపరీత ప్రవర్తనకు జనసైనికులే విస్తుపోతున్నారు. తాను స్వతంత్రంగా నిలబడి తన పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా తెలుగుదేశంతో బేరమాడి ఉంటే పవన్ కల్యాణ్ తనపై పడ్డ మచ్చను తొలగించుకోగలిగి ఉండే వాడు. కానీ అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నాడు. ఇంకో సారి ఆరోపణలపై విరుచుకుపడే నైతిక బలాన్ని ఆయన కోల్పోయాడు. తెలంగాణ తన మెట్టినిల్లనీ, కర్మభూమనీ నమ్మబలికిన షర్మిల హఠాత్తుగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం వెనుక చక్రం తిప్పింది ఎవరు? డీకే శివకుమార్ ద్వారా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో రాయబారం నడిపిందెవరు? షర్మిల పర్యటనల కోసం విమాన సౌకర్యాల కల్పన వెనుకనున్న అజ్ఞాతవ్యక్తి ఎవరు? వైఎస్ జగన్ వ్యతిరేక శక్తులతో ఆమెకు సమన్వయాన్ని ఏర్పాటుచేసిన వారెవరు? ఆమె ఉపన్యాసాల్లో చెప్పవలసిన అంశాలను, జగన్‌పై చేయాల్సిన ఆరోపణలను అందిస్తున్నదెవరు? ఆమె సభలకు కమ్యూనిస్టు నాయకులను కూడా జతచేసి పంపిస్తున్న వారెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లాడికి కూడా తెలుసు! చంద్రబాబు విజయావకాశాలు రోజురోజుకూ కొడిగట్టి పోతున్న స్థితిలో ఇప్పుడు నర్రెడ్డి సునీత ముసుగును తొలగించారు. జగన్మోహన్రెడ్డిని ఓడించాలని పిలుపునిస్తూ చంద్ర బాబు మహానుభావుడని ఆమె సర్టిఫికేట్ ఇచ్చేశారు. గతంలో తన తండ్రి హత్యకు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలే కారణ మని చెప్పిన సునీత ఇలా ‘చంద్ర’ముఖిలా ఎందుకు మారి పోయారు. తన తండ్రికి రెండో వివాహం ద్వారా కలిగిన కుమా రునికి ఆస్తిలో హక్కు దక్కకుండా చేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? వివేకా రక్తపు మడుగులో ఉన్న ఫోటోలను పీఏ కృష్ణారెడ్డి పంపించింది సునీత దంపతులకే గదా! అయినా గుండెపోటు థియరీని ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాశ్‌రెడ్డి ఎందుకు ప్రచారంలో పెట్టినట్టు? హత్య సమ యంలో ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆమె భర్తకూ, ఆయన సోదరుడికీ సన్నిహితులన్న విషయం అందరికీ తెలుసు. అప్పుడు చూపుడు వేలు ఎటువైపు చూపెడుతుంది? హంతకులు వివేకాతో లేఖ రాయించిన విషయాన్నిగోప్యంగా ఉంచాలని సునీత ఎందుకు ఆదేశించినట్టు? హత్య తరువాత హంతకులు వివేకా రెండో భార్యకు రాసిన ఆస్తి పత్రాలను తస్కరించే అవకాశం ఎవరికి ఉన్నది? అసలు దోషులను రక్షించి పరులపై నింద వేయవలసిన అవసరం ఎవరికి ఉన్నది? వారి అవసరంతో రాజకీయ ప్రయోజనం ముడిపడి ఉన్న పెద్దమనిషి ఎవరు? ఇప్పుడు సునీతను ‘చంద్ర’ ముఖిగా మార్చి చిలక పలుకులు చెప్పిస్తున్న నాయకుడెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇటీవల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై ఆరోపణలు చేసి ప్రభు త్వానికి అప్రతిష్ఠ తెచ్చేలా వ్యవహరించిన హనుమ విహారి వెనుక కూడా ప్యాకేజీ ట్రాప్ ఉన్నదనే విషయం వెలుగులోకి వస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకెంతమంది ప్యాకేజీ స్టార్స్ రంగంలోకి వస్తారో చూడాలి. ప్యాకేజీ దండగే తప్ప ఇటువంటి ప్రయోగాలకు విలువ ఉంటుందా? పండగ లప్పుడు వచ్చిపోయే పిట్టల దొరల ప్రగల్భాలకు జనం నవ్వు కుంటారు తప్ప సీరియస్‌గా తీసుకుంటారా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నిషిద్ధ కాంతి చిక్కింది
ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ–01–24–014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపట్టింది. వాటికి సంబంధించి అబ్బురపరిచే ఫొటోలను భూమికి పంపింది. టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ (ఏసీఎస్) ఈ ఘనత సాధించింది. అత్యంత స్పష్టతతో ఉన్న ఫొటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న ఎంసీజీ గెలాక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు. కాస్మిక్ ఫొటోగ్రఫీ చరిత్రలోనే దీన్ని అత్యంత అరుదైన ఫీట్‌గా అభివరి్ణస్తున్నారు. హబుల్ ఫొటోల్లో కన్పిస్తున్న ఎంసీజీ గెలాక్సీ పూర్తిస్థాయిలో వికసించిన నిర్మాణం, అత్యంత శక్తిమంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తోంది. ఇది అత్యంత చురుకైన కేంద్రకాలున్న టైప్–2 సీఫెర్ట్ గెలాక్సీల జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది. సీఫెర్ట్ గెలాక్సీలు అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసార్ల సమీపంలో ఉంటాయి. అయితే క్వాసార్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రమూ కని్పంచనీయనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి. సీఫెర్ట్ గెలాక్సీలు మాత్రం వీక్షణకు అనువుగానే ఉంటాయి. కానీ అత్యంత సుదూరంలో ఉన్న కారణంగా వీటి వెలుతురు ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కలేదు. ఆ కారణంగానే సైంటిస్టుల పరిభాషలో దాన్ని ‘నిషిద్ధ కాంతి’గా ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. పైగా ఈ కాంతి పుంజాలు భూమ్మీద మనకు ఇప్పటిదాకా తెలిసిన పరిమాణ భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తిగా అతీతమన్నది సైంటిస్టుల నమ్మకం. అనంత విశ్వంలో అంతటి సుదూర అంతరిక్ష క్షేత్రంలో మన భౌతిక శాస్త్ర నియమాలన్నీ తల్లకిందులవుతాయని వారు చెబుతుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సర్వేల్లో నిజమెంత?.. తెలంగాణలో గెలుపెవరిది?
జనం ఆసక్తిని ఆసరాగా చేసుకుని..: స్వతహాగానే ఎన్నికల సర్వేలంటే జనంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొన్న తరుణంలో.. ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయనే ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉందన్న మాట ఎక్కువగా వినిపిస్తున్నందున, ఈ రెండు పార్టీల్లో దేని ఆధిపత్యం ఎంతన్న విషయాన్ని ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటనలు లేకుండా, ఇంట్లో కూర్చుని తోచిన అంకెలు వేసుకుంటూ సర్వేల పేరుతో బోగస్ సంస్థలు ఫలితాలను సోషల్ మీడియాలో ఉంచుతున్నాయి. ఇళ్లలో కూర్చుని అంకెల గారడీ చేసే క్రమంలో ఎన్నో పొరపాట్లు నమోదవుతున్నాయి. పోటీలో లేని పార్టీ పేరు, పోటీలో లేని అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తుండటమే వాటి డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక మరికొందరు ఘనులు.. అప్పటికే వెల్లడైన నాలుగైదు సర్వే ఫలితాలను బేరీజు వేసి, అన్నింటిని జోడించి అటూ ఇటూ మార్చి సర్వే ఫలితాలంటూ వివరాలను పోస్ట్ చేస్తున్నారు. సర్వే ఫలితాలను చాలామంది అనుసరించే వీలుండటంతో ఎక్కువ వ్యూస్ కోసం ఈ మాయ చేస్తున్నారు. దీంతో జనం వేటిని విశ్వసించాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు. సర్వే సంస్థల పేరు ధ్వనించేలా..: ప్రతి ఎన్నికల్లో శాస్త్రీయంగా సర్వే చేస్తూ కొన్ని సంస్థలు ఫలితాలను వెల్లడిస్తున్నాయి. వాటికి ప్రత్యేకంగా నెట్వర్క్ ఉంటుంది. ఒక నియోజకవర్గంలో ఎన్ని శాంపిల్స్ సేకరించాలి, ఒక ఊరిలో ఎన్ని ఇళ్లను కవర్ చేయాలి, అందులో పురుషులెందరు, మహిళలెందరు, ఎన్ని ఇళ్లకో శాంపిల్ సేకరించాలి.. లాంటి శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తుంటారు. వీటిని ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఆ సర్వే సంస్థల పేరుకు ముందో, వెనకో మరో పదాన్ని జోడించి కొన్ని బోగస్ సంస్థలు సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఇదీ చదవండి: ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్ -
కారు జోరా.. హస్తం హవానా.. హంగా?
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గరపడింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రకరకాల సర్వేలు భిన్నమైన ఫలితాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మధ్యనే ప్రధాన పోటీ అన్నది స్పష్టమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆఖరు నిమిషంలో పోరాట పటిమను ప్రదర్శిస్తున్నప్పటికీ ఇప్పటికైతే మూడో స్థానానికే పరిమితమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నాలుగైదు నెలల క్రితం వరకు బీఆర్ఎస్కు ఎదురులేదన్న భావన ఉండేది. కానీ క్రమేపీ కాంగ్రెస్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నోటి మాట (మౌత్ టాక్) ప్రకారమైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం కాకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. అలా అని బీఆర్ఎస్ అవకాశాలు పూర్తిగా పోయాయని కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నెగటివ్ సమస్యను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. కొద్దిరోజుల క్రితం మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ అశోక్‌నగర్‌కు వెళ్లి అక్కడ నిరుద్యోగులతో భేటీ అయినప్పుడు వచ్చిన ప్రశ్నలు ఆ విషయాన్ని చెబుతాయి. ఆయన సమర్థంగా వారి ప్రశ్నలకు జవాబిచ్చినా, మౌలికంగా నిరుద్యోగుల సమస్య, టీఎస్పీఎస్సీ వైఫల్యం ప్రభుత్వాన్ని వెంటాడుతోందన్న విషయం అర్థమవుతుంది. అంతేగాక సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై కొంత అసంతృప్తి ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మరికొంత వ్యతిరేకత ఉంది. పదేళ్లు ఈ పాలన చూశాంగా అన్న భావన కూడా ఉంది. అదే సమయంలో కేసీఆర్ వ్యూహాత్మక సుడిగాలి ప్రచారం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, హైదరాబాద్‌కు సంబంధించి చేసిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వీటితోపాటు పోల్ మేనేజ్మెంట్ కానీ, ఆర్థిక వనరుల విషయంలో కానీ బీఆర్ఎస్కు ఇబ్బంది ఉండదని, ఎలాగైనా తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేసీఆర్ తమకు గతంలో వచ్చిన సీట్లకన్నా నాలుగైదు ఎక్కువే వస్తాయని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి అంత సులువుగా లేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో లేనంతటి గట్టి పోటీని బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ బొటా»ొటీ మెజార్టీతో అధికారంలోకి రావడమో, లేక ఎంఐఎంకు వచ్చే ఆరేడు సీట్లతో గండం నుంచి బయటపడటమో జరగొచ్చన్నది ఒక అంచనా. ఒకవేళ కాంగ్రెస్ ఇంకా పుంజుకుంటే కష్టం కావొచ్చు. ముస్లింలు గతసారి బీఆర్ఎస్ వైపు పూర్తిగా మొగ్గుచూపారు. ఇప్పుడు వారు ఎలా ఉంటారన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. హస్తం పార్టీ ఇలా... కాంగ్రెస్ విషయానికొస్తే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీకి బలంగాను, బలహీనతగాను కనిపిస్తున్నారు. ఆయన చేసే ప్రసంగాలు కేడర్‌లో జోష్ నింపుతున్నాయి. ఆయనైతే కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. తమకు అనుకూలంగా వేవ్ వస్తుందన్నది ఆయన ఆశ. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ పర్యటనలు చేస్తున్నారు. రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ తదితరులు అదనపు ఆకర్షణగా ప్రచారం సాగిస్తున్నారు. అదే సమయంలో రేవంత్ టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్‌కు నాయకత్వం వహించడం నచ్చకపోవడం, ఆయనపై ఉన్న ఇతర విమర్శలు బలహీనత కావొచ్చు. ప్రస్తుతానికైతే ఆయన బలహీనతలు పెద్దగా చర్చనీయాంశమవడం లేదనే చెప్పాలి. కాంగ్రెస్‌కు 70–80 స్థానాలు వస్తాయని రేవంత్ చెబుతున్నా.. అది అంత సులభం కాదు. ఎందుకంటే పైకి కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఉన్నట్లు కనబడుతున్నా, కొన్ని పరిమితులూ ఉన్నాయని క్షేత్రస్థాయిలో చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అయితే కాంగ్రెస్‌ది పై చేయి కావొచ్చన్నది వారి పరిశీలనలో వెల్లడవుతోందట. కానీ కొన్ని పరిణామాలు దానిని దెబ్బతీయొచ్చు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు అంత బలమైన అభ్యర్థులు ఎక్కువ చోట్ల లేకపోవడం ఒక లోటుగా చెబుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో కాస్త వెనకబడే అవకాశం ఉంది. 30 స్థానాలపై కమలం దృష్టి బీజేపీ సుమారు 30 నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. వాటిలో ఎక్కువ చోట్ల కనుక గణనీయంగా ఓట్లను పొందితే అది కాంగ్రెస్‌కు చేటు చేయొచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల ఈ పరిస్థితి రావొచ్చు. సిర్పూరు, పెద్దపల్లి, సూర్యాపేట వంటి కొన్ని చోట్ల బీఎస్పీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. దీనివల్ల కూడా కొంత కాంగ్రెస్‌కు, మరికొంత బీఆర్ఎస్కు నష్టం జరగొచ్చు. ఫార్వర్డ్ బ్లాక్ పేరుతోకానీ, స్వతంత్ర అభ్యర్ధులుగా గానీ మరో పది, పదిహేను చోట్ల ప్రధాన పార్టీలకు పోటీ ఇస్తున్నారు. ఉదాహరణకు కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన నిలబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సీపీఐకి సీటు కేటాయించింది. కాంగ్రెస్ పూర్తిస్థాయిలో సహకరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా కాంగ్రెస్‌లోని కొందరు, అలాగే బీఆర్ఎస్కు చెందిన మరికొందరు జలగం వైపు మళ్లితే ఇరుపక్షాలకు నష్టం కలగవచ్చు. లేదా ఆయన చీల్చే ఓట్లను బట్టి గెలుపుఓటములు నిర్ణయమవుతాయి. ఈ రకంగా చూస్తే సుమారు 30–40 చోట్ల కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చు. వాటన్నిటినీ అధిగమించి కాంగ్రెస్ పుంజుకుని ప్రభంజనం సృష్టించుకోవాల్సి ఉంటుంది. ఎంఐఎం ఆరేడు సీట్లలో గెలిస్తే.. 119 సీట్లలో ఆరేడు సీట్లలో ఎంఐఎం గెలుస్తుంటుంది. మిగిలిన 112 సీట్లలో ఈ రకంగా 30 నుంచి 40 సీట్లలో తేడా వస్తే మిగిలిన సుమారు 70 నుంచి 80 సీట్లలోనే కాంగ్రెస్ తన ప్రభావం చూపగలుగుతుంది. సహజంగానే అన్నిట్లోనూ గెలిచే అవకాశం ఉండదు. ఇదే సమస్య బీఆర్ఎస్కూ ఎదురుకావొచ్చు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం బీఆర్ఎస్కు కలిసి రావొచ్చు. ఈ రెండింట్లో ఏ పార్టీ అయితే వేవ్ సృష్టించుకోగలుగుతుందో దానికి పూర్తి మెజార్టీ రావొచ్చు. కానీ అలా జరుగుతుందా అన్నది సస్పెన్స్‌గానే ఉంది. అందువల్ల హంగ్ అవకాశాలను తోసిపుచ్చలేని పరిస్థితి. కర్ణాటకలో, మునుగోడులో ఓడి.. బీజేపీ గురించి పరిశీలిస్తే, ఒకప్పుడు బీఆర్ఎస్కు ఇదే ప్రధాన ప్రత్యర్ధి అవుతుందని అనుకున్నారు. కర్ణాటకలో, మునుగోడులో ఓటమి, బండి సంజయ్ తొలగింపు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కుమార్తె పట్ల కొంత ఉదారంగా ఉండటం వంటి కారణాలతో ఆ పార్టీపై విశ్వాసం పోయింది. దానికి తగ్గట్లుగానే బీజేపీలో చేరిన పలువురు ప్రముఖులు మళ్లీ కాంగ్రెస్ బాట పట్టారు. అయినా బీజేపీ కొన్నిచోట్ల గట్టి పోటీలోనే ఉంది. కానీ అది తాను విజయం సాధించడం కన్నా, రెండు ప్రధాన పార్టీల్లో ఏదో ఒకదాని గెలుపు లేదా ఓటమికే ఉపకరించవచ్చన్నది ఒక అంచనా. దానిని దృష్టిలో పెట్టుకుని మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో విశ్వరూప ప్రదర్శనకు ప్రధాని హాజరై మాదిగలకు వర్గీకరణకు హామీ ఇవ్వడం, మళ్లీ మూడు రోజులపాటు ప్రచారంలో పాల్గొనడానికి రానుండటం, హోం మంత్రి అమిత్ షా తదితరులు గట్టిగా తిరుగుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సాగించడం జరుగుతోంది. తద్వారా తమ పార్టీకి 60 సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నా, అంత సీన్ కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఐదు నుంచి పది సీట్లు వస్తే గొప్ప అన్న భావన ఉంది. అందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. ఎవరికైనా వేవ్ వస్తేనే భారీ ఆధిక్యత మరో విశ్లేషణ ఏమిటంటే తెలంగాణలో వేవ్ వస్తే తప్ప ఏ పార్టీకి భారీ ఆధిక్యత రావట్లేదు. 1983 నుంచి పరిశీలిస్తే, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ ఎన్నికల్లో తెలంగాణలో 107 స్థానాలకు గాను టీడీపీకి, కాంగ్రెస్‌కు చెరో 43 సీట్లు వచ్చాయి. ఒకరకంగా ఇది హంగ్ వంటి పరిస్థితి. 1985లో టీడీపీకి వేవ్ రావడంతో తెలంగాణలో టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా బొటా»ొటిగా ఇక్కడ 58 స్థానాలు వచ్చాయి. 1994లో టీడీపీ వేవ్‌లో మిత్రపక్షాలతో కలిసి 90 సీట్లు సాధించింది. 1999లో టీడీపీ అధికారంలోకి రాగలిగినా, తెలంగాణలో బీజేపీతో కలిపి 58 స్థానాలే సాధించింది. 2004లో కాంగ్రెస్‌కు వేవ్ రావడంతో మిత్రపక్షాలతో కలిపి 84 సీట్లు వచ్చాయి. 2009లో 119 స్థానాలకుగాను కాంగ్రెస్ పవర్లోకి వచ్చినా ఇక్కడ మాత్రం 50 స్థానాలే లభించాయి. టీడీపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కూటమికి 54 సీట్లు వచ్చాయి. అంటే ఎవరికీ ఆధిక్యత రాలేదన్నమాట. 2014లో బీఆర్ఎస్ కేవలం 63 సీట్లతోనే అధికారంలోకి వచ్చింది. 2018లో మాత్రం బీఆర్ఎస్కు వేవ్ ఏర్పడి 88 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమి కట్టినా కేవలం 21 స్థానాలే దక్కాయి. దీని ప్రకారం ఏ పార్టీకి ప్రభంజనం లేకపోతే బీఆర్ఎస్కు బొటా»ొటి మెజార్టీ లేదా హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. ఏమవుతుందో చూద్దాం! -కొమ్మినేని శ్రీనివాసరావు -
surveys: అధికారం కోసం అనేక సర్వేలు..!
ఎన్నికల ద్వారా అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి అధికారం కాపాడుకోవాలని...ప్రతిపక్షంలో ఉన్నవారికి పవర్లోకి రావాలనే కోరిక బలంగా ఉంటుంది. మరి తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఎలా తెలుస్తుంది? అధికారంలో ఉన్నవారికి ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది కనుక కొంతవరకు సమాచారం తెలుస్తుంది. మరి ప్రతిపక్షాలకు ప్రజల గురించి ఎలా తెలుస్తుంది? అసలు ప్రజల్ని ప్రభావితం చేసే శక్తులేవి? అధికార, ప్రతిపక్షాలకు ప్రజల మనోగతం ఎలా తెలుస్తుంది? సర్వేసంస్థలు మరియు మీడియా సంస్థలు.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రాజకీయావర్గాల్లో హడావుడి మొదలవుతుంది. ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం అధికారులు, శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసులు, సాయుధ బలగాలు, పోటీ చేసే పార్టీలు, వాటి అభ్యర్థులు, పార్టీల్లో క్రియాశీలంగా ఉండే కార్యకర్తలు...ప్రజలు ఇలా అన్ని రంగాల్లోనూ విపరీతమైన హడావుడి కనిపిస్తుంది. కాని ఇదే సమయంలో మరో వర్గం కూడా యాక్టివ్ అవుతుంది. అవే సర్వే సంస్థలు. కొన్ని జాతీయ మీడియా సంస్థలు స్వయంగాను..కొన్ని సర్వే సంస్థలతో కలిసి జనంలో ఏ పార్టీకి మొగ్గు కనిపిస్తోందనే అభిప్రాయ సేకరణ చేస్తుంటాయి. కొన్ని సర్వే సంస్థలు ఏ మీడియాతోను సంబంధం లేకుండా తామే స్వయంగా సర్వే చేసి ఫలితాలు ప్రకటిస్తుంటాయి. ప్రజల మూడ్ తెలుసుకోవడం కోసమే.. మీడియా సంస్థలు, సర్వే సంస్థలు స్వయంగా సర్వే చేయడం ఒక భాగం కాగా...కొన్ని ఎన్నికల నుంచి రాజకీయ పార్టీలే నేరుగా కొన్ని సర్వే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికల ముందు సర్వేలు చేయించుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉందనగా సర్వేలు ప్రారంభిస్తున్నాయి. ఎన్నికలు వచ్చే నాటికి పలుసార్లు సర్వేలు చేయించుకుని వాటి ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. అయితే కొన్ని పార్టీలు రాష్ట్రంలో ఏ పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపిస్తున్నారనే అంశాల మీద సర్వే చేయించి వాటి నివేదికలను ప్రజల్లోకి వదులుతున్నాయి. సహజంగా ఏ పార్టీ సర్వే చేయించుకుంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉందనేవిధంగానే సర్వే ఫలితాలు ఇస్తుంటాయి. ఒక రకంగా ప్రజల మూడ్ మార్చడం కోసం చేసే ప్రయత్నంగా చెప్పవచ్చు. సర్వేల ఓటు బీఆర్ఎస్కే.. కొన్ని మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ప్రజల్లో తమకున్న పేరు, ప్రతిష్టలు పోగొట్టుకోకుండా నిక్కచ్చిగా సర్వేలు చేస్తూ వాటి ఫలితాలను కూడా నిస్పక్షపాతంగా ప్రజల ముందుంచుతున్నాయి. ఇక పార్టీల కోసం సర్వే చేసే సంస్థలు ఆయా పార్టీలదే విజయం అన్నట్లుగా...ప్రజలను ప్రభావితం చేయడానికి..అప్పటికి ఇంకా ఎటూ తేల్చుకోని ఓటర్ల అభిప్రాయాన్ని మలచడానికి ప్రయత్నిస్తుంటాయి. గత ఆరు నెలలుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి కొన్ని జాతీయ మీడియా సంస్థలు రకరకాల సర్వేలు నిర్వహించి ఎన్నికల ముందు ప్రజల మూడ్ ఎలా ఉందో తెలియచేశాయి. ఇప్పటివరకు వెలువడ్డ అన్ని సర్వేలు బీఆర్ఎస్కు సీట్లు తగ్గినా మరోసారి అధికారంలోకి వస్తుందని, లేదంటే హంగ్ వస్తుందని...అయినప్పటికీ గులాబీ పార్టీయే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందనే చెబుతున్నాయి. కాని కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఒక్క సర్వే కూడా చెప్పలేదు...ఒకే ఒక సర్వే మాత్రం హంగ్‌లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందని చెప్పింది. కాని బీజేపీ లీడ్‌లో ఉంటుందన్న సర్వే ఒక్కటి కూడా కనిపించలేదు. ఎవరి సర్వేలు వారికే అనుకూలం... అయితే పార్టీలు సొంతంగా చేయించుకుని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే సర్వేలు మాత్రం ఆయా పార్టీలకు అనుకూలంగా ఉంటున్నాయి. మెజారిటీ ప్రజలు ఏదో ఒక పార్టీవైపు మొగ్గు చూపిస్తుంటారు. కాని కొంత మంది ప్రజలు ఎటూ తేల్చుకోలేక పోలింగ్ తేదీ నాడు ఏదో ఒక గుర్తు మీద ఓటేస్తుంటారు. అటువంటి వారిని ప్రభావితం చేయడానికే రాజకీయ పార్టీలు సర్వే సంస్థల్ని వినియోగించుకుంటాయి. ఎవరు ఎవరిని ప్రభావితం చేస్తారో..ఏ సర్వే సంస్థ చెప్పినవి నిజమవుతాయో తెలియాలంటే డిసెంబర్ మూడో తేదీ వరకు ఆగాల్సిందే. -
దరఖాస్తు చేసుకుంటేనే టికెట్: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్నవారి బలాలు, బలహీనతలపై సర్వేలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సామాజిక సమీకరణలు, ఆశావహుల బలాబలాలు, ఇతర పార్టీల్లోని అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుని పలు దశల్లో వడపోత జరిగిన అనంతరం అభ్యర్థి ఎవరనేది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఆశావహుల దరఖాస్తులను ప్రదేశ్ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీలు కూడా పరిశీలిస్తాయని చెప్పారు. శుక్రవారం గాం«దీభవన్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌యాదవ్‌లతో కలిసి ఆయన పార్టీ దరఖాస్తు పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గాంధీభవన్‌లో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, దరఖాస్తు రుసుమును ఎస్సీ, ఎస్టీలకు రూ.25 వేలు, ఇతర వర్గాలకు రూ.50 వేలుగా నిర్ణయించినట్టు రేవంత్ చెప్పారు. ఒకవేళ ఈనెల 25 తర్వాత ఎవరైనా పార్టీలో చేరి టికెట్ అడిగితే పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అభ్యర్థులను పార్టీ ఖరారు చేస్తుంది.. గెలుపు ప్రాతిపదికన మాత్రమే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. దరఖాస్తుల స్వీకరణతో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం ప్రారంభమైందని, తాము అభ్యర్థులమని ఎవరైనా చెప్పుకున్నా, ఫలానా వ్యక్తి అభ్యర్థి అంటూ తనతో సహా ఎవరైనా ప్రకటించినా, అభ్యర్థులు ఖరారయ్యారంటూ మీడియాలో వార్తలు వచ్చినా వాటిని పట్టించుకోవద్దని, అవన్నీ వాస్తవం కాదని స్పష్టం చేశారు. టికెట్ల విషయంలో ఎవరూ పార్టీ కార్యకర్తలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. తొలి దరఖాస్తు దాఖలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ దరఖాస్తు సమర్పించారు. సత్తుపల్లి అసెంబ్లీ టికెట్ తనకు కేటాయించాలంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తన దరఖాస్తును అందజేశారు. మానవతారాయ్ వెంట సత్తుపల్లి కాంగ్రెస్ నేతలు రావి నాగేశ్వరరావు చౌదరి, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డితో పాటు ఓయూ జేఏసీ నేతలున్నారు. -
ఆస్తులు అమ్ముకుని వెళ్లిపోయేందుకు కేసీఆర్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని సర్వేలు చెప్తున్నాయని, అందుకే ఆస్తులన్నీ అమ్ముకుని విదేశాలకు వెళ్లిపోయేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టడానికి స్థలం లేదంటున్న సీఎం కేసీఆర్.. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలా అమ్ముతున్నారని నిలదీశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అలంపూర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నేతలు సోమవారం గాందీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు పట్టా భూములిస్తే.. బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి ముసుగులో వాటిని గుంజుకోవాలని చూస్తోందని ఆరోపించారు. నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ప్రజల ఆకాంక్షల కోసమని.. అంతేతప్ప ఔటర్ రింగురోడ్డును, దళితుల భూములను అమ్ముకునేందుకు కాదని పేర్కొన్నారు. వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలి.. ఓటమి భయంతోనే కేసీఆర్ రాష్ట్రంలో అన్నీ అమ్మేస్తున్నారని, పనులు చక్కబెట్టుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. భూములు కొనేవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ తన సొంత మనుషులకు అప్పగించుకునేందుకే వైన్‌షాపుల టెండర్లను నాలుగు నెలల ముందు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని రేవంత్ పేర్కొన్నారు. తమ కార్యకర్తలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు బీఆర్ఎస్ నేతలకు తొత్తుల్లా పనిచేస్తూ.. కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
శరవేగంగా భూముల రీ సర్వే.. దేశంలోనే ప్రప్రథమంగా డిజిటల్ రికార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే శరవేగంగా జరుగుతోంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పటికే అనేక మైలురాళ్లు అధిగమించింది. తొలి దశలో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, దేశంలోనే ప్రప్రథమంగా ఆ గ్రామాలకు డిజిటల్ రికార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఒక్క గ్రామంలో కూడా భూముల రీ సర్వే పూర్తి చేయలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ బ్రిటిష్ కాలం నాటి భూమి రికార్డులే ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి. వాటి ఆధారంగానే భూముల కార్యకలాపాలు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి కొత్త భూముల రికార్డులను డిజిటల్ రూపంలో తయారు చేసింది. ఆ గ్రామాల్లోనే గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రైతుల భూముల హద్దులను అక్షాంశ, రేఖాంశాలతో సహా ఎవరూ అక్రమ పద్ధతుల్లో మార్చలేని విధంగా నిర్ధారించింది. ప్రతి భూ కమతానికి ఒక విశిష్ట సంఖ్యను కూడా కేటాయించింది. ఏపీలో రూపొందుతున్న డిజిటల్ భూ రికార్డులు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు సైతం మోడల్‌గా నిలిచాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు మన మోడల్‌పై అధ్యయనం చేశాయి. రీ సర్వే ఎలా చేయాలనే అంశంపై ఏపీ సర్వే అధికారులతో ఆ రాష్ట్రాల అధికారులకు శిక్షణ కూడా ఇప్పిస్తున్నాయి. ఉత్తరాఖండ్, పాండిచ్చేరిలో ఈ శిక్షణ తరగతులు జరగ్గా, మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో ఉన్నాయి. క్షేత్ర స్థాయి నిజనిర్ధారణలోనూ దూకుడు ఇప్పటివరకు అందిన ఓఆర్ఐలతో క్షేత్రస్థాయి నిజ నిర్ధారణను వేగంగా చేపడుతున్నారు. రైతులు చూపించే వాస్తవ సరిహద్దులను డ్రోన్ చిత్రాలతో పోల్చి చూసే అతి ముఖ్యమైన నిజనిర్ధారణ 4,283 గ్రామాల్లో 57 లక్షలకుపైగా ఎకరాల్లో పూర్తయింది. దీంతో ఆయా గ్రామాల్లోని భూముల కమతాలకు సర్వే నంబర్లకు బదులుగా ఇచ్చే ల్యాండ్ పార్సిల్ మ్యాప్(ఎల్పీఎం)లు 43.42 లక్షలు జారీ చేశారు. మిగిలిన 2,246 గ్రామాల్లో నిజనిర్ధారణ జరుగుతోంది. ఆ తర్వాత మరోసారి రైతుల సమక్షంలో జరిగే గ్రౌండ్ వాలిడేషన్ (క్షేత్ర స్థాయి ధ్రువీకరణ) 3,428 గ్రామాల్లో (37.39 లక్షల ఎకరాలు) పూర్తవగా 855 గ్రామాల్లో జరుగుతోంది. ఇప్పటివరకు 3,092 గ్రామాల్లో (28.33 లక్షల ఎకరాలు) సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ లెక్కలనుబట్టి రీ సర్వే ఎంత శాస్త్రీయంగా, పక్కాగా వేగంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. 1.08 లక్షల చదరపు కిలోమీటర్లలో డ్రోన్, ఏరియల్ సర్వే పూర్తి రాష్ట్రంలో అత్యంత ఆధునిక పద్ధతుల్లో రీ సర్వే జరుగుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన డ్రోన్, ఏరియల్ సర్వేలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కొలవాల్సివుండగా 1.08 లక్షల చదరపు కిలోమీటర్లను ఈ సర్వే ద్వారా ప్రభుత్వం కొలిచింది. 17,460 గ్రామాలకుగాను 12,230 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. ఈ గ్రామాల్లో డ్రోన్లు, విమానాల ద్వారా 1.8 కోట్ల ఎకరాల కొలతలను పూర్తి చేశారు. అతి త్వరలో మిగిలిన గ్రామాల్లోనూ ఈ సర్వే పూర్తికానుంది. డ్రోన్, ఏరియల్ సర్వే ద్వారా తీసిన చిత్రాలను అభివృద్ధి చేసి 6,529 గ్రామాల ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ (ఓఆర్ఐ) లను సర్వే బృందాలకు అందించారు. మిగిలిన గ్రామాల ఓఆర్‌ఐలను నిర్ణీత సమయంలో సర్వే బృందాలకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు
దొర్నిపాడుకు చెందిన ఓ మహిళను వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం జంగాలపల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా భర్త వేధింపులు తాళలేక పిల్లలతో వచ్చి పుట్టినింట్లో జీవనం సాగిస్తున్న ఆమె మరో వ్యక్తితో తప్పటడుగులు వేసింది. విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వందేళ్ల జీవితానికి 25 ఏళ్లకే ముగింపు పలికింది. ఫలితంగా ఇద్దరు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. ఇటీవల ఆళ్లగడ్డ పట్టణంలోని యేసునాథపురానికి చెందిన ఓ వివాహిత ప్రియు డి మోజులో పడి భర్తను హత్య చేసింది. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కర్నూలు నగరం బంగారుపేటలో నివాసముంటున్న ఓ మహిళ తన భర్త మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కొంతకాలంగా మధనపడుతుండేది. భర్తలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి వేరే మహిళ మాయలో పడటం..తల్లి బలవన్మరణం చెందడంతో వారి ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడూనీడగా ఉండాల్సిన భార్యాభర్తలు వివాహేతర సంబంధాలతో విడిపోతున్నారు. ఒక్కోసారి జీవితాలను అర్ధంతరంగా చాలిస్తూ అభం శుభం తెలియని పిల్లల్ని అనాథలను చేసి వెళ్తున్నారు. కృష్ణగిరి(కర్నూలు జిల్లా): క్షణికావేశంలో తల్లిదండ్రులు చేసే తప్పుల వల్ల వారి జీవితాలు నాశనమవుతుండగా వారి పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రాం.. సామాజిక మాధ్యమం ఏదైనా వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి మరింత దగ్గర చేస్తున్నాయి. ఇవి ఒక్కోసారి కాపురాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాలకు దారి తీసి భార్యను కడతేర్చే భర్తలు, ప్రియుడి కోసం భర్తను బండరాళ్లతో మోదే భార్యలు ఎక్కువైపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు వివాహేతర సంబంధాలకు వారధిగా మారుతున్నాయని తాజాగా విడుదలైన సర్వే వెల్లడించింది. వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ఏటా మూడు వేల మంది హత్యకు గురవుతున్నారు. కట్టుబాట్లను దాటిన ఇష్టాలు, బంధాలను బలి కోరే సంబంధాలు, నైతికం కాని స్నేహాలు జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. దారి తప్పుతున్న దంపతులు పిల్లల బతుకులను చేతులారా ధ్వంసం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలతో వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఆదర్శ దాంపత్యాలు అడుగడుగునా కనిపిస్తున్నా.. ఎక్కడో ఓ చోట విషపు గుళికలా ఇలాంటి వివాహేతర సంబంధాలు తారస పడుతున్నాయి. ఒక్కసారి పట్టు తప్పితే ఆ తప్పులకు మూల్యంగా ప్రాణాలే పోతున్నాయి. అనాథలవుతున్న పిల్లలు వివాహేతర సంబంధాలు భార్యాభర్తల గొడవలతో ముగిసిపోవు. వాటి ప్రభావం పిల్లలపై అధికంగా పడుతోంది. ఎదిగే వయసులో తల్లిదండ్రులు గొడవ పడటం చూసిన పిల్లల మనసులు తీవ్రంగా గాయపడతాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు ఆ కారణంతో జైలుకు వెళ్లడం వంటి ఘటనలతో చిన్నారుల బాల్యంపై మరక పడుతోంది. అది జీవితకాలం వెంటాడుతోంది. తల్లిదండ్రుల సంరక్షణలో చక్కగా నవ్వుతూ బతకాల్సిన పిల్లలు ఇలా ఏడుస్తూ రోజులు లెక్కపెట్టాల్సి వస్తోంది. వివాహేతర సంబంధాలకు కారణాలు ♦సంపాదనే ధ్యేయంగా చూసుకుని సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం ♦దంపతుల మధ్య తరచూ పడే చిన్నపాటి గొడవలను పెద్దవి చేసుకోవడం ♦భార్యాభర్తల విషయాల్లో కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం ♦బయటవారితో కేటాయించిన సమయం.. లైఫ్‌పార్టనర్‌తో గడపకపోవడం ♦పెచ్చుమీరిన ఆన్లైన్ స్నేహాలు ♦చెడు వ్యసనాలకు బానిస కావడం ♦బలహీన మనస్తత్వాలు తప్పనిసరిగా పాటించాల్సినవి ♦దాంపత్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి ♦బకరినొకరు అర్థం చేసుకోవాలి.. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి ♦ఆకర్షణలు తాత్కాలికమే గానీ శాశ్వతం కావనే నిజాన్ని గ్రహించాలి ♦నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వాలి ♦దాంపత్య జీవితంలో భాగస్వామికి అన్ని విషయాల్లో తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి చదవండి: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగిందంటే.. చట్టం ద్వారా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు చట్టం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలే తప్ప నేరాలకు పాల్పడకూడదు. కౌన్సెలింగ్ ద్వారా చాలామంది దంపతులు మళ్లీ ఒక్కటై సంతోషంగా ఉంటున్నారు. ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోకూడదు. – కల్లా మహేశ్వరరెడ్డి, డోన్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పిల్లలపై ఎక్కువ ప్రభావం వివాహేతర సంబంధాల వల్ల కలిగే దుష్ఫరిణామాలు పిల్లలపైనే ఎక్కువ ప్రభావితం చూపుతాయి. పెద్దలు చేస్తున్న తప్పిదాలను గమనిస్తూ చిన్నారులు మానసిక క్షోభకు గురవుతారు. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. – మహేశ్వరప్రసాద్, వైద్యాధికారి, కృష్ణగిరి జీవితాలను నాశనం చేసుకోవద్దు మానవ సంబంధాల్లో అత్యంత ప్రమాదకరమైనది వివాహేతర సంబంధం. దీని వల్ల రెండు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకునే ప్రమాదముంది. వ్యామోహం సరదాగా ప్రారంభమై చివరకు జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. మా వద్దకు వచ్చే భార్య, భర్తల తగాదాల్లో అధికశాతం ఇలాంటి కేసులే. ఇప్పటికే ఎంతో మందికి కౌన్సెలింగ్ చేసి జీవితాలను నిలబెట్టాం. – యుగంధర్, సీఐ, వెల్దుర్తి -
సర్వేలు చేస్తూ.. పట్టుబడిన యువకుల బృందం
సాక్షి, విజయనగరం : జిల్లాల్లో సర్వేలు చేస్తూ వస్తున్న ఘటనలు కలకల రేపుతున్నాయి. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను గుర్తించి వారి ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వేలు నిర్వహిస్తున్నారు. రాజీవ్ నగర్ కాలనీ, అంబేద్కర్‌కాలనీలో రెండు రోజులుగా యువకుల బృందాలు సర్వేలు చేస్తున్నాయి. ఈ బృందాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులకు అప్పగించగా.. వారి వద్దనుంచి ఆరు ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాల్లో ఇలాంటి సర్వేలు చేస్తుండటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన వారి వివరాలను నమోదు చేసుకోవడం.. లాంటి వాటిపై వైఎస్సార్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
కేంద్ర పథకాలపై సర్వే..!
నల్లగొండ టూటౌన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై మున్సిపల్ పట్టణాల్లో ‘సహరి సమృద్ధి యోజన’ సర్వే చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు సర్వే చేపట్టి పూర్తి నివేదిక తయారు చేయాలని మెప్మా అధికారులకు ఆదేశాలు అందాయి. కేంద్ర పథకాల సర్వేపై ఇప్పటికే రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)కు అవగాహన కల్పించారు. అన్ని పట్టణాల్లో కచ్చితమైన నివేదిక తయారు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ఇవి క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి ఏ విధంగా అందుతున్నాయనే సంక్షిప్త సమాచారం సేకరించే పనిలో మెప్మా సిబ్బంది పడ్డారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వాటిలో 23 పథకాల అమలుకు సంబంధించిన వివరాలను లబ్ధిదారుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. పొదుపు సంఘాల మహిళల్లో ఈ పథకాలు ఎంతమందికి అందుతున్నాయనే వివరాలను నివేదిక రూపంలో తయారు చేసి సీడీఎంఏ అధికారులకు పంపించాల్సి ఉంది. ఎంత మందికి పథకాలు అందాయి ... కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎంతమంది మరుగుదొడ్లు నిర్మించుకున్నారు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఎంతమంది ఇళ్లు నిర్మించుకున్నారు ... జన్‌ధన్ యోజనలో బ్యాంకు ఖాతాలు అందరూ తీసుకున్నారా ... ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజనలో ఎంతమంది చేరారు ... ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎంత మందికి గ్యాస్ కనెక్షన్లు అందాయి ... అటల్ పెన్షన్ యోజన, జాతీయ నూట్రిషన్ మిషన్ తదితర పథకాలపై పొదుపు సంఘాల మహిళలనుంచి వివరాలు తీసుకుంటారు. ఎంతమంది ఈ పథకాలను వినియోగించుకుంటున్నారు, ఇంకా ఎంతమందికి ఈ పథకాలు చేరాలి, అర్హులైన వారుంటే ఈ పథకాలు ఎందుకు చేరడం లేదు, పొదుపు సంఘాల సభ్యులందరికీ ఈ పథకాలు చేర్చడమే లక్ష్యంగా ఈ సర్వే చేస్తున్నారు. లబ్ధిదారుల పేర్లు నమోదు ... జిల్లాలోని పాత మున్సిపాలిటీలు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ తో పాటు కొత్త మున్సిపాలిటీలైన నందికొండ, హాలియా, చండూరు, చిట్యాలలో ఈ సర్వే చేపడుతున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మెప్మా ఆర్పీల ద్వారా కేంద్ర పథకాల లబ్ధిదారుల పేర్లను ఓ ఫార్మట్‌లో నమోదు చేస్తున్నారు. అన్ని వివరాలు సేకరించిన తరువాత పథకాలు అందని వారి వివరాలతో ప్రత్యేకం జాబితా తయారు చేస్తారు. కేంద్ర పథకాలలో ఎక్కువ శాతం పథకాలు బ్యాంకులతో సంబంధించినవి కావడంతో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లకు ఈ జాబితాలు అందజేస్తారు. ప్రతి మున్సిపల్ కమిషనర్ బ్యాంకర్లతో సమావేశమై లబ్ధిదారులకు ముద్ర యోజన రుణాలు, జీరో బ్యాంకు ఖాతాలు, బీమా యోజన, పెన్షన్ తదితర వాటిని అమలు చేయించాల్సి ఉంటుంది. అదే విధంగా మున్సిపల్ పట్టణాల్లో మురుగుదొడ్లు లేని వారికి సత్వరమే స్వచ్ఛభారత్ కింద మంజూరు చేసి నిర్మాణం చేసేందుకు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. 15 వరకు సర్వే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలపై మున్సిపాలిటీ పట్టణాల్లో సర్వే చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు లేఖలు రాశాం. ఈనెల 15 వరకు ప్రొఫార్మాలో సూచించిన ప్రకారం వివరాలు సేకరించాలి. సర్వే పూర్తికాగానే పూర్తి నివేదికను సీడీఎంఏకు పంపిస్తాం. – వెంకన్న, మెప్మా పీడీ, నల్లగొండ -
సర్వేల పేరుతో కలకలం..!
సాక్షి, విజయనగరం : జిల్లాలో కొంతమంది యువకులు ప్రభుత్వానికి అనుకూలంగా సర్వేలు చేయడం కలకలం రేపుతోంది. పూసపాటిరేగ మండలం కుమిలి, రెల్లివలసలో ముగ్గురు యువకులు సర్వేలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన వారి వివరాలు నమోదు చేసుకోవడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ట్యాబ్స్‌లో ఓటర్ల జాబితా పెట్టుకుని మరీ ఇలా సర్వే చేయడం ఒక్కసారిగా అలజడి రేగింది. దీనిని గుర్తించిన వైఎస్సార్సీపీ నాయకులు సదరు యువకులను పోలీసులకు అప్పగించారు. ట్యాబ్స్‌లో ఓటర్ల లిస్ట్ పెట్టుకుని సర్వేలు చేయటం విరుద్దమని, ఇలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పనితీరు, పథకాల మీద అభిప్రాయం కోరుతూ వస్తున్న ఫోన్ల ఆధారంగా ఈ సర్వేలు సాగుతున్నట్లు విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన ట్యాబ్స్‌లో నమోదు చేసుకోవడంతో స్థానిక వైఎస్సార్సీపీ నేతలకు అనుమానం వచ్చింది. దాంతో వారిపై పోలీసులకు సమాచారం అందించారు. వారి వద్ద నుంచి పోలీసులు ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్నికల సంఘంతో పాటు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ నేతలు సమాయత్తమవుతున్నారు. -
సర్వం.. సర్వేపైనే!
తెలంగాణ రాష్ట్ర సమితిలో జహీరాబాద్ నియోజకవర్గం మినహా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో పోటీ చేసే ఇతర నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్‌లో మాత్రం స్పష్టత ఉన్న చోట కూడా అభ్యర్థుల జాబితా ఖరారు కావడం లేదు. మరోవైపు టికెట్ల కోసం బహుముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు లాబీయింగ్‌లో మునిగి తేలుతున్నారు. కొందరు హైదరాబాద్, మరికొందరు ఢిల్లీ స్థాయిలో తమ పరిచయాలను ఉపయోగించుకుని టికెట్ సాధించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : జహీరాబాద్ మినహా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ ప్రకటించింది. ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్‌లో మాత్రం అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత రావడం లేదు. మహాకూటమి పేరిట తెలుగుదేశం, సీపీఐతో ఎన్నికల అవగాహన దాదాపు ఖాయం కావడంతో ఏయే స్థానాలు కూటమిలోని మిత్ర పక్షాలకు కేటాయిస్తుందో పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. ఏక నాయకత్వం ఉన్న నియోజకవర్గాల్లో తొలి విడతగా రాష్ట్ర స్థాయిలో 40 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను టీపీసీసీ ప్రకటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. తొలి జాబితాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (అందోలు–ఎస్సీ), మాజీ మంత్రులు గీతారెడ్డి (జహీరాబాద్–ఎస్సీ), జగ్గారెడ్డి (సంగారెడ్డి), ప్రతాప్‌రెడ్డి (గజ్వేల్) పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఇతర నేతలెవరూ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించకపోవడంతో, జాబితా ప్రకటనలో పెద్దగా సమస్యలు ఉండే అవకాశం కనిపించడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ టికెట్ కోసం బహుముఖ పోటీ నెలకొంది. మహాకూటమిలో భాగస్వాములైన సీపీఐ హుస్నాబాద్, తెలుగుదేశం పార్టీ పటాన్చెరు స్థానాన్ని కోరే సూచనలు కనిపిస్తున్నాయి. గాడ్ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో తమకున్న పరిచయాలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో డజనుకు పైగా దరఖాస్తులు అందడంతో సర్వే ఆధారంగా జాబితాను కుదిస్తామని ఔత్సాహికులకు టీపీసీసీ నుంచి సమాధానం వస్తోంది. కుదించిన జాబితాలోని వ్యక్తుల పలుకుబడి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం, జనాదరణ తదితర కోణాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు సమాచారం. సర్వే నివేదిక ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చెబుతున్నట్లు తెలిసింది. ఆశ వీడని నేతలు మాత్రం టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, నాగం జనార్దన్‌రెడ్డి తదితరుల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ విజయశాంతి కూడా మెదక్ నియోజకవర్గంలో ఓ నాయకుడికి మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. కొందరు నాయకులు గులామ్ నబీ ఆజాద్, ఆర్సీ కుంతియా, ఏఐసీసీ పరిశీలకుడు బోసురాజు తదితరులను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు. ఆ ఆరు చోట్లా ఆసక్తికరం హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరుతున్నా, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. మరో నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తాడూరు శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్ వర్మ, గంప మహేందర్‌రావు, పూజల హరికృష్ణ, గూడూరు శ్రీను, గొడుగు రఘు, కలీం తదితరులతో కలిపి మొత్తం 13 మంది కాంగ్రెస్ పార్టీ టికెట్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దుబ్బాక నుంచి మాజీ మంత్రి ముత్యంరెడ్డి, డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డితో పాటు స్వచ్ఛంద సంస్థ పేరిట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఓ నేత కూడా దరఖాస్తు అందజేసినట్లు సమాచారం. మెదక్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోరుతూ 14 మంది నాయకులు టీపీసీసీకి దరఖాస్తులు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, ప్రతాప్‌రెడ్డి, బట్టి జగపతి, అమరసేనారెడ్డి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాటా శ్రీనివాస్‌గౌడ్, కార్పొరేటర్ శంకర్‌యాదవ్, జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్, గోదావరి అంజిరెడ్డి, శశికళ యాదవరెడ్డి తదితరులు దరఖాస్తులు అందజేశారు. నారాయణఖేడ్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎంపీపీ డాక్టర్ సంజీవరెడ్డి టికెట్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
సర్వేలతో హైరానా!
మీ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. మళ్లీ గెలుస్తాడా..? కాంగ్రెస్ నేతలపై మీ అభిప్రాయం చెప్పండి.. అంటూ సర్వే బృందాలు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతున్నాయి. సర్వేలు జరుగుతున్నట్లు ఆయా పార్టీల నేతలకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుండడంతో ప్రజల మనసులో తమపై అభిప్రాయం ఎలా ఉందోనని హైరానా పడుతున్నారు. సాక్షి, యాదాద్రి : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు సర్వేలపై ఎక్కువ మక్కువ చూపుతున్నాయి. అభ్యర్థులు, ఆశావహులు సైతం సోషల్ మీడియాలో వస్తున్న సర్వేలను పోల్చుకుంటూనే ఎవరికి వారు తమతమ నియోజకవర్గాల్లో వ్యక్తిగత సర్వేలు చేయించుకుంటున్నారు. జిల్లాలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో టీఆ ర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్‌ఎఫ్‌తోపాటు మరి కొన్ని పార్టీలు బరిలో నిల్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమ గెలుపు అవకాశాలు ఎలా ఉంటా యోనని తెలుసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి. పార్టీ పనితీరు, పోటీల్లో ఉండే అభ్యర్థుల పనితీరుపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ మరోసారి సర్వే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలోని సిట్టింగ్లం దరికీ టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. టికెట్లు కేటాయించిన అభ్యర్థులపై మరోసారి సర్వేకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక ఏజెన్సీతోపాటు ప్రభు త్వ నిఘా సంస్థల ద్వారా సర్వే చేపట్టారు. గ్రామాల్లో అధికార పార్టీ అభ్యర్థులపై ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు ప్రధానంగా తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలనుంచి పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరు, వారి వల్ల జయాపజయాలపై ఉండే ప్రభావాన్ని సర్వేలో ప్రధానంగా చర్చిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు, పార్టీ, అభ్యర్థి వ్యతిరేకల ప్రభావం ఎలా ఉంటుంది తిరుగుబా టు అభ్యర్థులు ఎక్కడైనా ఉన్నారా, వారి ప్రభావం ఏ మేరకు ఉంటుందనే అంశాలపై సర్వే కొనసాగుతోంది. సీఎం తాజా పరిస్థితులపై చేపట్టిన ఈసర్వే అభ్యర్థుల్లో కొంత గుబులు రేకెత్తిస్తుంది. హస్తం నేతల్లోనూ ఆందోళన మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. డీసీసీ, టీపీసీసీ ద్వా రా ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే వీరిపై షార్ట్ సర్వే నిర్వహిస్తున్నారు. ఏ అభ్యర్థిని రంగంలో దించితే గెలుపు సాధ్యమవుతుంది, ఆశావహుల్లో ప్రజల్లో ఉన్న పలుకుబడి, ఆదరణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. గతంలోనే కాంగ్రెస్ పార్టీ రెండు, మూడు సర్వేలు చేయించింది. తా జాగా మరో సర్వే చేస్తోంది. ఈసర్వేను అభ్యర్థుల ఎంపికకు కొంత ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ నుంచి ఢిల్లీ దాకా ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆశావహుల వ్యక్తిగత సర్వేలు టీఆర్ఎస్, కాంగ్రెస్ అధినాయకత్వం చేయిస్తున్న సర్వేలతో పాటు ఆశావహులు, అభ్యర్థులు కూడా తమతమ నియోజకవర్గాల్లో వ్యక్తిగత సర్వేలు చేయించుకుంటున్నారు. సర్వేల ఫలితాలను పోల్చి చూసుకుంటున్న ఆశావహుల్లో టెన్షన్ కొనసాగుతోంది. ఏది ఏమైనా జిల్లాలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు ప్రధాన ప్రతిపక్షాల నుంచి పోటీ చేసే ఆశావహుల వరకు సర్వే అంటే ఆసక్తి చూపుతున్నారు. సర్వే కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తూ తమ బలం, బలహీనతలతోపాటు ఎదుటి పార్టీల బలబలాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
రాజకీయ ప్రచార అస్త్రాలుగా సర్వేలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో సర్వేలు రాజకీయ ప్రచార అస్త్రాలుగా మారాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ సర్వే అనేది స్టిల్ పిక్చర్ (ఫొటో) వంటిదన్నారు. సర్వే చేసినప్పటి పరిస్థితిని, సర్వే చేసినవారి అవసరాలు, సామర్థ్యం, పరిమితులకు లోబడి ఫలితం ఉంటుందన్నారు. గతంలో పంచాంగాలు, ముహూర్తాలు, గ్రహచారం అంటూ ఓటర్లను ప్రభావితం చేసుకోవడానికి రాజకీయ పార్టీల నేతలు యత్నించేవారని గుర్తుచేశారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో సర్వేలతో ప్రజలను, ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సర్వేలకోసం విపరీతంగా డబ్బులు కురిపించి, తమకు అనుకూలంగా చెప్పిం చుకుంటున్నారని అన్నారు. సర్వేలను టీఆర్ఎస్ రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నదని ఆరోపించా రు. ఇలాంటి సర్వేలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం నిర్బంధంలో ఉందన్నారు. ఇప్పుడు అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఓట్లకోసం ప్రచారానికి వెళ్తే‡ ఐదేళ్లలో ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత బాగా ఉందన్నారు. పొత్తులపై చర్చలు, సంప్రదింపులు పొత్తుల విషయంలో అనేక చర్చలు, సంప్రదింపులు ఉంటాయని కోదండ రాం అన్నారు. టీఆర్ఎస్ను ఓడించాలని, ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పా టు లక్ష్యంగా పొత్తుల్లో ఉమ్మడి ఎజెండా, అభ్యర్థుల గెలుపు, సమష్టి ప్రయోజనాలు వంటి అనేక అంశాలు ఉంటాయన్నారు. ఇలా లేకపోతే కలయికకు అర్థం ఉండదన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ఉంటుందన్నారు. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య దారుణమన్నారు. దానిలో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోందన్నారు. ప్రణయ్ హత్యకేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. హత్యకు కారకులను, సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రతి పక్ష నేతలను చిన్న కేసుకు కూడా అరెస్ట్ చేస్తున్నారని కోదండరాం విమర్శించారు. అధికారపార్టీ నేతలపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. మం త్రుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, ఇంకా ప్రతి పక్షనేతల ఫోన్లు కాకుండా ఉంటాయా అని ప్రశ్నించారు. కలిసొచ్చే అన్ని పార్టీలతో నడవాలని చూస్తున్నామన్నారు. మహాకూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నవారిలో ఏకాభిప్రాయం, ఒక నిర్ణయం వచ్చిన తర్వాత పొత్తులకు దూరంగా ఉన్న సీపీఎం వంటి పార్టీతోనూ చర్చలు జరుగుతాయని చెప్పారు. -
అంతర్గత సర్వేలు.. బలాబలాలు..!
సాక్షి, యాదాద్రి : జిల్లాలో భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉంది. ప్రస్తుతం ఈ ఐదు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, బీజేపీ పక్షాలు తమ బలాబలాను బేరీజు వేసుకునేందుకు సర్వేలను ప్రారంభించాయి. ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల పని తీరుపై రెండు దఫాలు సర్వే చేయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బెంగళూరుకు చెందిన ఓ సంస్థతో నియోజకవర్గాల వారీగా సర్వే చేయించారు. బీజేపీ సైతం జాతీయస్థాయి ప్రతినిధి బృందాన్ని జిల్లాకు పంపించి సర్వే చేయించింది. అయితే సర్వేలో అందరికీ సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు వచ్చే ఎన్నికల్లో శాసనసభ స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశావహులు సైతం ఇటీవల సర్వేలు చేయించారు. తాజాగా జిల్లాలో ఓ సంస్థ ఆన్లైన్ సర్వే చేపట్టింది. వందల సంఖ్యలో శా0పిల్స్ సేకరణ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సర్వేల్లో బిజీగా ఉన్నాయి. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు, వ్యక్తిగత, పార్టీ పని తీరు, ఎన్నికల్లో ఎవరితో పోటీపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి, విజయానికి సానుకూల, వ్యతిరేక అంశాలపై సర్వేలో లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. యువత, మహిళలు, ఉద్యోగ, వ్యాపార, మధ్య తరగతి, కులాల వారీగా, మైనార్టీ, దళిత, గిరిజన వర్గాల్లో ఆయా అభ్యర్థులు తమ అనుకూల, వ్యతిరేక అంశాలపై సర్వే చేయించారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో సేకరించిన శాంపిల్స్‌ను క్రోడీకరిస్తున్నారు. బలం, బలహీనతలను గుర్తించడంతోపాటు వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్లాన్ చేసుకుంటున్నారు. వేర్వురుగా సర్వేలు.. ఆశావహులతో పాటు రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయి సంస్థలు, విద్యార్థి సంస్థలు వేర్వేరుగా సర్వేలకు దిగుతున్నాయి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, ప్రజల ఆలోచన విధానం, ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాల పనితీరు, ఆయా పార్టీల నుంచి పోటీ చేసే ఆశావహుల పనితీరు ప్రజల్లో వారికి ఉన్న సానుకూల, వ్యతిరేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థతోపాటు, ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయించడం జరుగుతుంది. అయితే ఆరు నెలలుగా జరిగిన వివిధ సర్వేల ఫలితాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. ఆశావహులు సర్వే ఫలితాలను ఉత్కంఠతో పరిశీలిస్తున్నారు. -
గుజరాత్ ఫలితాలు తలకిందులయ్యేనా?!
సాక్షి, న్యూఢిల్లీ: పాలక, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాల గణాంకాలు రోజు రోజుకు మారుతున్నాయి. విజయావకాశాలపై ఏబీపీ–లోక్‌నీతి–సీఎస్డీఎస్ గత ఆగస్టులో, అక్టోబర్ నెలల్లో నిర్వహించిన ఎన్నికల సర్వేల్లోనే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతాగస్టులో నిర్వహించిన సర్వేలో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి 60 శాతం ఓట్లు వస్తాయని తేలగా, అక్టోబర్‌లో నిర్వహించిన సర్వేలో అది 47 శాతానికి పడిపోయింది. అదే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు 12 శాతం ఓట్లు పెరిగాయి. గుజరాత్ పోలింగ్‌కు మరో 30 రోజులు ఉండడంతో పాలక, ప్రతిపక్షాల విజయావకాశాల గణాంకాలు తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. తొలుత నిర్వహించిన ఎన్నికల సర్వేల్లో కాంగ్రెస్–సమాజ్‌వాది పార్టీల కూటమి విజయం సాధిస్తుందని తేలింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోటీ పోటాపోటీగా మారింది. తీరా పోలింగ్ నాటికి పరిస్థితి బీజేపీకి పూర్తి అనుకూలంగా మారిపోయింది. ఇప్పుడు గుజరాత్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండు దశాబ్దాలకుపైగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు, ఇటీవలి జీఎస్టీ వల్ల గుజరాత్ వ్యాపార వర్గం తీవ్రంగా దెబ్బతిన్నది. వారంతా మొదటి నుంచి బీజేపీ అనుకూలురు అవడంతో వారు పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటేయరనే అందరూ భావించారు. వారిలో కూడా స్పష్టమైన మార్పు వస్తున్నట్టు ఏబీపీ–లోక్‌నీతి–సీఎస్‌డీఎసస్ నిర్వహించిన సర్వే ఫలితాల సరళే స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా జీఎస్టీ కారణంగా వ్యాపారులు ఎక్కువ మంది పాలకపక్షానికి ఎదురుతిరుగుతున్నారు. ఆగస్టులో నిర్వహించిన సర్వేలో జీఎస్టీ నిర్ణయం మంచిదని 38 శాతం అభిప్రాయపడగా, ఫర్వాలేదని 22 శాతం మంది, మంచిదికాదని 25 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే అక్టోబర్ నెలలో నిర్వహించిన సర్వేలో మంచిదని 24 శాతం మంది ఫర్వాలేదని 29 శాతం మంది, మంచిదికాదని 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. మంచిదన్న అభిప్రాయం 14 శాతం పడిపోగా, చెడ్డదన్న శాతం 15 పెరిగింది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు పట్ల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయలు ఎలా మారాయో విశ్లేషిస్తే...గత మే నెలలో కేంద్రం పనితీరు పట్ల 75 శాతం మంది, రాష్ట్రం పనితీరు పట్ల 77 శాతం మంది సంతప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు నెలలో కేంద్రం పట్ల 67 శాతం మంది, రాష్ట్రం పట్ల 69 శాతం మంది, అక్టోబర్ నెలలో కేంద్రం పట్ల 54 శాతం మంది, రాష్ట్రం పట్ల 57 శాతం మంది సంతప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల కాలంలో కనిపించిన ఈ వ్యత్యాసాలు ఇలాగే కొనసాగితే 30 రోజుల్లోనే విజయావకాశాల అంచలు తలకిందులయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. అందుకనే బీజేపీ పార్టీ, ప్రభుత్వాలు ఓటర్లపై వరాల వర్షం కురిపిస్తూ వచ్చారు. -
టీడీపీ నేతలకు ఈసీ వార్నింగ్!
- అక్రమాలకు పాల్పడితే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవు - టీడీపీ ఎంపీలకు స్పష్టం చేసిన భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఎన్నికల సంఘంపైనే ఆరోపణలకు దిగిన అధికారపక్షానికి ఈసీ వద్ద గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఏస్థాయి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవని టీడీపీ నేతలకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని, అనవసరంగా తమపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికింది. సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం ఎత్తివేయాలన్న టీడీపీ డిమాండ్‌ను తోసిపుచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని ఆదివారం ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. వైఎస్సార్ సీపీ నిబంధనలను అతిక్రమిస్తోందని, ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బులు తరలిస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ చేసిన ఫిర్యాదుపై గంటలోనే స్పందించారని, అందులో నిజం లేదని తేలినా ఆపార్టీపై చర్యలు తీసుకోలేదని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఈ వ్యాఖ్యలపై భన్వర్‌లాల్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఏ ఆధారంతో ఆరోపిస్తున్నారని టీడీపీ ఎంపీలను భన్వర్‌లాల్ నిలదీసినట్టు తెలిసింది. సర్వేలపై దర్యాప్తునకు ఆదేశం: నంద్యాల ఉప ఎన్నికల్లో సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే ఎవరికి ఓటు వేస్తారని ఓటర్లను అడగడం చట్టవిరుద్ధమని ఈసీ చెప్పినట్లు తెలిసింది. సర్వే పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, భయపెట్టడం లాంటి చర్యలకు దిగుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందటంతోనే సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిషేధించామని టీడీపీ నేతలకు భన్వర్‌లాల్ వివరించారు. ఇప్పటివరకూ జరిగిన ఇలాంటి వాటిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆయన స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగే ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకూ ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించవద్దని, వాటిని ఏ చానల్ ప్రసారం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.