
సాక్షి, విజయనగరం : జిల్లాల్లో సర్వేలు చేస్తూ వస్తున్న ఘటనలు కలకల రేపుతున్నాయి. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను గుర్తించి వారి ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వేలు నిర్వహిస్తున్నారు. రాజీవ్ నగర్ కాలనీ, అంబేద్కర్‌కాలనీలో రెండు రోజులుగా యువకుల బృందాలు సర్వేలు చేస్తున్నాయి. ఈ బృందాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులకు అప్పగించగా.. వారి వద్దనుంచి ఆరు ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాల్లో ఇలాంటి సర్వేలు చేస్తుండటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన వారి వివరాలను నమోదు చేసుకోవడం.. లాంటి వాటిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment