సర్వేలపై నమ్మకం లేదు: షీలా | Don't believe in surveys: Sheila Dikshit | Sakshi
Sakshi News home page

సర్వేలపై నమ్మకం లేదు: షీలా

Published Sat, Dec 7 2013 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

Don't believe in surveys: Sheila Dikshit

 న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్, సర్వేలను తాను నమ్మనని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎగ్జిట్ పోల్స్, సర్వేల ఫలితాలపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ... ‘సర్వేల ఆధారంగా మేమెప్పుడూ పనిచేయలేదు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తదితర ఫలితాలను నేను ఎంతమాత్రం నమ్మను. మేం చేయాల్సింది చేశాం. లెక్కింపు పూర్తయ్యాక ఫలితాల గురించి మాట్లాడుకుందామ’న్నారు. ఫలితాలు ఎలా ఉంటాయని మీరు ఆశిస్తున్నారు? అని అడిగిన ప్రశ్నకు మళ్లీ అదే సమాధానమిస్తూ... ‘ఫలితాల తర్వాతే మాట్లాడుకుందామ’ని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement