వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలాహారిస్ కాస్త ముందంజలో ఉన్నట్లు తాజా సర్వే ఒకటి తెలిపింది. ఆర్థిక వ్యవస్థ ఉద్యోగాల కల్పన అనే కీలక అంశాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌ను కమల వెనక్కి నెట్టేసినట్లు రాయిటర్స్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ పోల్‌సర్వే సోమవారం(సెప్టెంబర్23)తో ముగిసింది. ఈ సర్వేలో ట్రంప్‌నకు 40.48శాతం అనుకూలత రాగా కమలకు 46.61శాతం అనుకూల ఓట్లు వచ్చాయి.
సెప్టెంబర్ తొలి వారంలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే కమల ఒక శాతం ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. దేశవ్యాప్త ట్రెండ్‌ను అంచనా వేయడంలో కీలకంగా భావించే పోల్‌సర్వేల్లో రాయిటర్స్-ఇప్సోస్ సర్వే ఒకటి కావడం గమనార్హం. నవంబర్5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుదిపోరు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment