అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది?.. చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే? | Who Will Win In US Presidential Elections 2024, Know What ChatGPT Says | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది?.. చాట్‌జీపీటీ ఏం చెప్పిందంటే?

Published Tue, Nov 5 2024 1:53 PM | Last Updated on Tue, Nov 5 2024 3:26 PM

Who Will Win Us Election 2024 What Chatgpt Says

వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పుడే ఇదే అంశం తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తుండగా.. ఈ ఎన్నికల్లో గెలిచేది వారేనని కృత్రిమ మేథ(ఏఐ) చాట్‌జీపీటీ తేల్చి చెప్పింది. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుస్తారా? లేదంటే కమలా హారిస్‌ గెలుస్తారా?

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు అమెరికా ఫలితాల అంచానాల్ని తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీ చాట్‌జీపీటీకి ప్రశ్నలు సంధిస్తున్నారు.

అంచనాలకు భిన్నంగా చాట్‌జీపీటీ సైతం ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తికర సమాధానాలు ఇస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, కమలా హారిస్ గెలుస్తారా? అని అడిగితే.. ఆ ఇద్దరి పేర్లు చెప్పలేదు. బదులుగా ట్రంప్‌, హారిస్‌లు ఇద్దరూ విజయం సాధించలేరని చాట్‌జీపీటీ తెలిపింది. వీరిద్దరికి బదులు ప్రత్యమ్నాయంగా, అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్పడం ఆసక్తికరంగా మారింది.  

పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘‘ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చివరి గంటలో ఊహించని మలుపు తిరగనున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేని అభ్యర్థులే గెలుస్తారు. ట్రంప్‌, హారిస్‌లు పోటా పోటీగా గెలుపుకోసం ప్రయత్నం చేసినప్పటికీ మూడో వ్యక్తి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజే స్పష్టమైన ఫలితాలు వెల్లడవుతాయి’’ అని చాట్‌జీపీటీ చెప్పినట్లు పేర్కొన్నాయి. .

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్‌ టిమ్‌వాల్ట్స్‌, రిపబ్లికన్‌ పార్టీ తరుఫున ఉపాధ్యక్షుడు రామస్వామిలు పోటీ పడుతున్నారు. మరి వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు గెలిచి అమెరికా అధ్యక్షులవుతారా? లేదంటే ట్రంప్‌,హారిస్‌లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటల వరకు ఎదురు చూడాల్సి ఉంది.

చదవండి : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ‘హిప్పో’ జోస్యం నిజమయ్యేనా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement