సాక్షి, విజయనగరం : జిల్లాలో కొంతమంది యువకులు ప‍్రభుత్వానికి అనుకూలంగా సర్వేలు చేయడం కలకలం రేపుతోంది. పూసపాటిరేగ మండలం కుమిలి, రెల్లివలసలో ముగ్గురు యువకులు సర్వేలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన వారి వివరాలు నమోదు చేసుకోవడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ట్యాబ్స్‌లో ఓటర్ల జాబితా పెట్టుకుని మరీ ఇలా సర్వే చేయడం ఒక్కసారిగా అలజడి రేగింది. దీనిని గుర్తించిన వైఎస్సార్‌సీపీ నాయకులు సదరు యువకులను పోలీసులకు అప్పగించారు. ట్యాబ్స్‌లో ఓటర్ల లిస్ట్ పెట్టుకుని సర్వేలు చేయటం విరుద్దమని, ఇలా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి పనితీరు, పథకాల మీద అభిప్రాయం కోరుతూ వస్తున్న ఫోన్ల ఆధారంగా ఈ సర్వేలు సాగుతున్నట్లు విపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన ట్యాబ్స్‌లో నమోదు చేసుకోవడంతో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలకు అనుమానం వచ్చింది. దాంతో వారిపై పోలీసులకు సమాచారం అందించారు. వారి వద్ద నుంచి పోలీసులు ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్నికల సంఘంతో పాటు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు సమాయత్తమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment