ఒట్టావా: కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పోస్ట్ మీడియా కోసం ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది ట్రూడో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు తేలింది. దేశంలో పాలన సరిగా లేదని 60 శాతం మంది ట్రూడో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో 43 శాతం మంది 2021 ఎన్నికల్లో ట్రూడో ప్రభుత్వానికి ఓటు వేసిన వారే కావడం గమనార్హం.
దేశంలో పెరగిపోతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న జీవన ఖర్చు, ఆరోగ్య రంగం, ప్రజల ఇళ్లు కొనుగోలుచేసే శక్తి వంటి అంశాల వచ్చే ఏడాది (2025) జరిగే సాధారణ ఎన్నికల్లో ట్రూడోకు వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు చెబుతున్నారు. కాగా, నాన్ ప్రాఫిట్ అంగుస్ రెడ్ సంస్థ(ఏఆర్‌ఐ) నిర్వహించిన సర్వేలోనూ కేవలం 17 శాతం మంది మాత్రమే ట్రూడో తిరిగి ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు. 28 శాతం మంది ‘నన్ ఆఫ్ ద అబోవ్’ ఆప్షన్‌ను ఎంచుకున్నారు.
ఈ సర్వేలో కన్జర్వేటివ్ నేత పియెర్రే పొలీవర్ పట్ల మాత్రం కాస్త మెరుగైన స్పందన వచ్చింది. లిబరల్స్‌తో పోల్చుకుంటే కన్జర్వేటివ్ పార్టీ గత 12 నెలల నుంచి దేశంలో నిర్వహించిన సర్వేల్లో ముందు నిలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 338 సీట్లున్న కెనడా పార్లమెంట్‌లో కన్జర్వేటివ్ పార్టీ 206 సీట్లు, లిబరల్స్ 67 సీట్లు గెలుచుకుంటాయని అంచనాలున్నాయి.
ఇదీ చదవండి.. వయసుపై జోకులు వేసుకున్న బైడెన్.. పాపులర్‌గా మారిన యాడ్
Comments
Please login to add a commentAdd a comment