wave
-
Canada: కెనడాలో ‘ట్రూడో’కు షాక్.. సర్వేల్లో సంచలన ఫలితాలు
ఒట్టావా: కెనడాలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పోస్ట్ మీడియా కోసం ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది ట్రూడో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు తేలింది. దేశంలో పాలన సరిగా లేదని 60 శాతం మంది ట్రూడో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో 43 శాతం మంది 2021 ఎన్నికల్లో ట్రూడో ప్రభుత్వానికి ఓటు వేసిన వారే కావడం గమనార్హం. దేశంలో పెరగిపోతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న జీవన ఖర్చు, ఆరోగ్య రంగం, ప్రజల ఇళ్లు కొనుగోలుచేసే శక్తి వంటి అంశాల వచ్చే ఏడాది (2025) జరిగే సాధారణ ఎన్నికల్లో ట్రూడోకు వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు చెబుతున్నారు. కాగా, నాన్ ప్రాఫిట్ అంగుస్ రెడ్ సంస్థ(ఏఆర్ఐ) నిర్వహించిన సర్వేలోనూ కేవలం 17 శాతం మంది మాత్రమే ట్రూడో తిరిగి ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు. 28 శాతం మంది ‘నన్ ఆఫ్ ద అబోవ్’ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఈ సర్వేలో కన్జర్వేటివ్ నేత పియెర్రే పొలీవర్ పట్ల మాత్రం కాస్త మెరుగైన స్పందన వచ్చింది. లిబరల్స్‌తో పోల్చుకుంటే కన్జర్వేటివ్ పార్టీ గత 12 నెలల నుంచి దేశంలో నిర్వహించిన సర్వేల్లో ముందు నిలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 338 సీట్లున్న కెనడా పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీ 206 సీట్లు, లిబరల్స్ 67 సీట్లు గెలుచుకుంటాయని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. వయసుపై జోకులు వేసుకున్న బైడెన్.. పాపులర్‌గా మారిన యాడ్ -
అయ్ బాబోయ్...ఏఐ! రేకెత్తిస్తున్న వేల భయాలు..!
అయ్ బాబోయ్...‘వేవ్ ఆఫ్ ది ప్యూచర్’గాచెబుతున్న ఏఐ సాంకేతికత యువతలోని ఒక వర్గంలో వేల భయాలను రేకెత్తిస్తోంది. భూతంలా భయపెడుతోంది. ఏఐ టెక్నాలజీ వల్ల ఉన్న ఉద్యోగాలు పోతాయనీ, ఉద్యోగావకాశాలు ఉండవనే ఆందోళనకు ‘ఏఐ యాంగ్జైటీ అని పేరు పెట్టారు.... ఈ భయం ఈనాటిది కాదు. ‘ఈ యంత్రాలు మన ఉపాధిని మింగేస్తాయి’ అనే భయం పారిశ్రామిక విప్లవం రోజుల నుంచి ఉన్నదే. చాట్ జీపీటీ విజయవంతం అయిన తరువాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది ఇప్పుడు యువతను భూతమై భయపెడుతోంది. ఒక సర్వే ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య వయసు వాళ్లు తమ కెరీర్‌కు సంబంధించిన భయాలతో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా ప్రకారం 2025 కల్లా 85 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ సాంకేతికతతో భర్తీ అవుతాయి. ఈ నేపథ్యంలో కంపెనీలలో ఉద్యోగుల భవిష్యత్ పనితీరు ఎలా ఉండబోతున్నది అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఎంత పాపులర్ టాపిక్ అయిందంటే మూడు సంవత్సరాల వ్యవధిలో దీనిపై పదుల సంఖ్యలో పుస్తకాలు వచ్చాయి. ఆర్థికవేత్త రిచర్డ్బాల్డ్ విన్ తన పుస్తకం ‘ది గ్లోబటిక్స్ అప్హీవల్’లో ఏఐ ద్వారా ఏయే రంగాలు ఎలాంటి ప్రభావానికి గురవుతాయో విశ్లేషించారు. కొన్ని పుస్తకాలు మాత్రం ‘భయం అక్కర్లేదు’ అంటూ యువతను ఆశావహ మార్గం వైపు నడిపిస్తున్నాయి. యంత్రాలతో చెలిమి తప్పదు, తప్పు కాదు అంటున్నాయి. సాంకేతిక శక్తి ప్రభావితం చేయని, అంటే ఉద్యోగాలకు ప్రమాదం లేని కొన్ని రంగాలు ఉండేవి. ఉదా: ఎకౌంటింగ్, న్యాయశాస్త్రం...మొదలైనవి. అయితే తాజాగా వెల్–ఎడ్యుకేటెడ్ ప్రొఫెషన్స్‌కు సంబంధించిన వారిలో కూడా ఆందోళన మొదలైంది. లా ప్రాక్టీస్‌లో ఏఐ చాట్‌బాట్ కూడా భాగం కానుంది కెరీర్ అభద్రతకు సంబంధించిన ఆలోచనల నేపథ్యంలో ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా ‘ఏఐ యాంగై్జటీ’ అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇలాంటి పదాలు పుట్టడం కొత్త కాదు. సాంకేతిక పురోగతికి సంబంధించిన ప్రతి సందర్భంలో ఇలాంటి పదాలు ఎన్నో పుట్టాయి. 1980లలో ‘కంప్యూటర్ ఫోబియా’ ‘కంప్యూటర్ యాంగై్జటీ’ ‘టెక్నో స్ట్రెస్’లాంటివి పుట్టాయి. ఏఐకి సంబంధించి రెండు వర్గాలు కనిపిస్తాయి. మొదటి వర్గానికి చెందిన వారిలో ‘ఆటోమేషన్ ఆందోళన’ కనిపిస్తుంది. రెండో వర్గం వారిలో ఆశాభావం కనిపిస్తుంది. మనుషులు, యంత్రాలతో చేయికలిపితే మెరుగైన ఫలితాలు వస్తాయనేది రెండో వర్గం నమ్మకం. టామ్ క్రూజ్ ‘మైనార్టీ రిపోర్ట్’లాంటి సినిమాలలో, పర్సనల్ ఇంట్రెస్ట్లాంటి టీవీ షోలలో మనిషి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో జత కడితే జరిగే అద్భుతాలు కనిపిస్తాయి. వివిధ రంగాలపై ఏఐ ఎలాంటి మార్పును తీసుకురానుంది? ఆ మార్పు మనపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా జాగ్రత్త పడాలి? ఏం నేర్చుకోవాలి?... ఈ విషయాలు చెప్పడానికి ఆన్లైన్ కోర్సులు వచ్చాయి. ఏఐ సాంకేతికత రీప్లేస్ చేయలేని ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అవి నొక్కి చెబుతున్నాయి. డిజిటల్‌తో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌ను కలగలిపి పాఠాలుగా చెబుతున్నాయి. ఈ కోర్సులపై యువత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ‘ఉద్యోగాలపై ఏఐ టెక్నాలజీ ప్రభావం గురించి ఫ్రెండ్‌కు నాకు మధ్య చర్చ జరిగింది. ఏటీఎం మెషీన్లు వచ్చిన కొత్తలో బ్యాంకింగ్ రంగంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతారు, కొత్త ఉద్యోగాలు ఉండవు...ఇలా ఎన్నో మాటలు వినిపించేవి. కాని అది నిజం కాలేదు. ఉద్యోగుల పనితీరు మాత్రం మారింది. ఏఐ టెక్నాలజీ విషయంలోనూ జరిగేది ఇదే’ అంటుంది ముంబైకి చెందిన అక్షర. ఏఐ...అయితే ఏంటీ! యువతలో ఏఐ ఫోబియాను తొలగించడానికి ‘ఫోర్బ్స్ కోచెస్ కౌన్సిల్’ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. వాటిలో కొన్ని... ఏఐ అంటే భయం కాదు, ఇష్టం పెంచుకోండి. ఏఐకు సంబంధించి ప్రతిదీ నేర్చుకోండి. నిపుణులతో మాట్లాడండి. ఉద్యోగ నైపుణ్యానికి ఏఐ ఎలా ఉపయోగపడగలదు అనే కోణంలో ఆలోచించండి. మనిషికి ఉండే సహజ నైపుణ్యాలను ఏఐ ఎప్పుడూ రీప్లేస్ చేయలేదు. మనిషికి ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రేరణశక్తి, ఎత్తుగడలు, సమయస్ఫూర్తి...యంత్రం అనుకరించలేనివి. ‘ఈ ఉద్యోగం మాత్రమే చేస్తాను. ఇది మాత్రమే చేయగలను’ అని ఫిక్స్ కావద్దు. బీ ఫ్లెక్సిబుల్. ఏ ఉద్యోగమైనా చేసే నైపుణ్యాన్ని సొంతం చేసుకోండి. ఒకే దారిలో నడిచే వారికి ఆ దారి మాత్రమే తెలుస్తుంది. కొత్త దారుల్లో నడవడం నేర్చుకుంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఒత్తిడి దరి చేరని, సమస్యలను పరిష్కరించే, సానుకూలతను శక్తిగా మార్చుకునే, ఇతరులతో మంచి స్నేహసంబంధాలతో ఉండగలిగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను మెరుగుపరుచుకోండి. ఏఐ ఎలాంటి పాత్ర అయినా పోషించగలదు...అని విశ్వసించే సందర్భంలో ఉన్నాం. ఇలాంటి సమయంలోనే ఏఐ కంటే భిన్నంగా, మెరుగ్గా పనిచేసే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. (చదవండి: విచిత్రమైన వాహనం! రోడ్డుపై ఉంటే వ్యాను..నీటిలో ఉంటే బోటు!) -
‘నాలుగో వేవ్ చాన్స్ తక్కువే’
‘‘రాష్ట్రంలో 92.9% మందిలో యాంటీబాడీలు ఇప్పటికే వృద్ధిచెంది ఉన్నాయి. కాబట్టి ఆందోళన అక్కర్లేదు. నాలుగో వేవ్ ఉండే అవకాశాలు లేవనేది నా విశ్లేషణ. అయితే ఇది నిర్ధారణ అవడానికి కొంతకాలం వేచి ఉండాలి. ఒకవేళ 6– 8 వారాల్లో కేసులు పెరిగినా.. అవి అతి స్వల్పంగానే ఉండే అవకాశాలు ఎక్కువ. ఆందోళన అవసరం లేదు. ఒకవేళ నాలుగో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉంది..’’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల్లో 92.9% మందికి కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు తేలిందని.. రెండు డోసుల వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయిందని.. అందువల్ల కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశం తక్కువేనని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒకవేళ నాలుగో వేవ్ వచ్చినా దాని ప్రభావం స్వల్పమేనని.. కొత్తగా వచ్చిన ఎక్స్ఈ వేరియంట్ సాధారణ జలుబు మాదిరే ఉంటుందని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘గత జనవరి 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఆధ్వర్యంలో రాష్ట్రంలో సీరో సర్వే నిర్వహించారు. అతి తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 89.2 శాతం మందిలో.. అత్యధికంగా హైదరాబాద్‌లో 97 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు సర్వేలో తేలింది. ఒకడోసు తీసుకున్న 91.4 శాతం మందిలో, రెండు డోసులు తీసుకున్న 96 శాతం మందిలో.. అసలు వ్యాక్సిన్ తీసుకోనివారిలో కూడా 77 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయి. ఈ లెక్కన రాష్ట్రంలో కరోనా నాలుగో దశ వచ్చే అవకాశం తక్కువ’’ అని శ్రీనివాసరావు తెలిపారు. మాస్కులు, వ్యాక్సిన్ తప్పనిసరి కొత్తగా వచ్చిన ఎక్స్ఈ వేరియంట్ ఇప్పటివరకు ఢిల్లీ, మహారాష్ట్రల్లో నమోదైందని.. దాని లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కరోనా సాధారణఫ్లూ దశకు చేరుకుంటుందని తెలిపారు. అప్పుడే కరోనా కథ ముగిసిపోయిందని అనుకోవద్దని, ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించడం, మాస్కు పెట్టుకోవడం, టీకాలను తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ఆంక్షలు అవసరం లేదని.. యధావిధిగా శుభకార్యాలు, ఇతర వేడుకలు జరుపుకోవచ్చని, కానీ గుంపుగా ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. దానిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని శ్రీనివాసరావు వెల్లడించారు. మన రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.14 శాతమేనని.. రోజూవారీ కేసుల సంఖ్య 20–25 మధ్య నమోదవుతోందని చెప్పారు. మే నెలలో ఎక్కువగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, విహారయాత్రలు, దూరప్రయాణాలు చేస్తుంటారని.. ఆ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలను ఇప్పించాలని, 60 ఏళ్లు దాటిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. 18–59 ఏళ్ల మధ్య వారికి ఉచితంగా బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, అనుమతి రాగానే పంపిణీ చేస్తామని తెలిపారు. -
దేశంలో కోవిడ్ రెండోవేవ్ మధ్యలో ఉంది: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: దేశంలో కోవిడ్ రెండోవేవ్ మధ్యలో ఉందని కేంద్రం పేర్కొంది. కేరళలో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని.. మొత్తం యాక్టివ్ కేసుల్లో కేరళలోనే సగం కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పండగల నేపథ్యంలో సెప్టెంబరు, అక్టోబరులో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. టీకా తీసుకున్నా మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కాగా, దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,164 కరోనా కేసులు నమోదవ్వగా.. 607 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530కి చేరగా.. మృతుల సంఖ్య 4,36,365గా ఉంది. ఇక కరోనా నుంచి కొత్తగా 34,159 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,17,88,440 మంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 3,33,725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశం మొత్తంమీద చూసుకుంటే కేరళలోనే కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 31,445 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరగడంలో ఓనం వేడుకలు కారణమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇవీ చదవండి: సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి.. రెండు ప్రాణాలను కాపాడిన దిశ యాప్ -
ఏపీ: థర్డ్‌వేవ్‌కు 462 ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధం
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్ వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 462 ప్రైవేటు ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తోంది. ప్రైవేటులో చాలావరకు 50 నుంచి 100 పడకలలోపు ఆస్పత్రులున్నాయి. 100 పడకలకంటే ఎక్కువ ఉన్న ఆస్పత్రులు 65 ఉన్నాయి. కరోనా సేవల్లో భాగంగా ఈ ప్రైవేటు ఆస్పత్రులు 33,793 డీటైప్ ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే 17,841 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. సాధారణ పడకలతోపాటు ఆక్సిజన్ పడకలు కూడా సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించింది. ఎలాంటి సమయంలో రోగులు వచ్చినా సేవలు అందించాలని కోరింది. ఈ నెల చివరి నాటికి అన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 63, కృష్ణా జిల్లాలో 60 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నట్టు తేలింది. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 11 మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చదువుతున్న నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులను సైతం కోవిడ్ సేవల్లో వినియోగించుకోనుంది. -
థర్డ్ వేవ్ ముప్పుతో నోయిడా ఆటో ఎక్స్ పో వాయిదా
-
థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలని, నెల రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకొకపొతే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించారు. దేశంలోని 50 శాతం కేసులు కేరళలోనే నమోదవుతున్నాయన్నారు. తెలంగాణలో డెల్టా ప్లస్‌కి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రెండు డెల్టా ప్లస్ కేసులు హైదరాబాద్‌లోనే వచ్చాయన్నారు. డెల్టా వేరియంట్ ప్రమాదకరమని.. ఇంటా బయటా మాస్క్ ధరించాలని తెలిపారు. వచ్చే రెండు వారాలు రెండో డోస్‌కి ప్రాధాన్యత ఇస్తామని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. -
థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధం
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 50వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. సెకండ్ వేవ్‌తో పోలిస్తే అదనంగా 10 వేల ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయనున్నారు. చిన్నారులకు వైద్యం కోసం ప్రత్యేకంగా 3,900 బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. థర్డ్‌వేవ్‌కి వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పీఎస్ఏ ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా వైరస్ నివారణ చర్యలపై బుధవారం నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ‘‘కాన్సన్ట్రేటర్లు, డీటైప్‌సిలెండర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై శ్రద్ధవహించాలన్నారు. దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంచాలని తెలిపారు. జిల్లాల వారీగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడంతో పాటు, ఏపీఎంఎస్ఐడీసీలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఆగస్టులోనే థర్డ్ వేవ్.. ఈ నాలుగు అంశాలు కీలకం: ఐసీఎంఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మూడోదశ ప్రభావంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఎపిడెమియాలజీ మరియు అంటువ్యాధుల విభాగాధిపతి డాక్టర్ సమిరన్ పాండా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు చివరిలో కోవిడ్-19 థర్డ్ స్టేజ్ దేశాన్ని తాకేఅవకాశం ఉందని తెలిపారు.అయితే సెకండ్ వేవ్ అంత తీవ్రంగా మూడో దశ ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. సూపర్ స్ప్రెడర్ సంఘటనలను నివారించడం, ఇతర జాగ్రత్త చర్యలతో దీని ఉధృతి ముడిపడి ఉందని తెలిపారు. దీంతో పాటు మరికొన్ని విషయాలను ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మూడవ వేవ్ రానుంది, కానీ కేసుల ఉధృతి మాత్రం రెండో వేవ్ కంటే తక్కువగానే ఉంటుందని డాక్టర్ పాండా ఎన్డీటీవీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు ముఖ్యమైన విషయాలను ఆయన ప్రస్తావించారు. మొదటి, రెండో దశలో రక్షించిన రోగనిరోధక శక్తి క్షీణిస్తే అది థర్డ్ వేవ్ విస్తరణకు దారి తీస్తుందన్నారు. ప్రస్తుతం ప్రజల్లో ఉన్న రోగనిరోధక శక్తిని కూడా దాటేసే పుట్టుకొచ్చే కొత్త వేరియంట్ కూడా దీనికి కారణం కావచ్చు. అలాగే కొత్త వేరియంట్‌ను రోగనిరోధక శక్తి నిరోధించినా, వేగంగా విస్తరించే లక్షణంతో లాంటి రెండు కారణాలు థర్డ్‌వేవ్‌కు కారణంగావచ్చు అని పాండా తెలిపారు. ఇక నాలుగవ కారణంగా కరోనా మార్గదర్శకాలను, ఆంక్షలను ముందస్తుగా రాష్ట్రాలు ఎత్తివేస్తే, అది మళ్లీ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని డాక్టర్ పాండా చెప్పారు. డెల్టా, డెల్టా ప్లస్ రెండూ ఇప్పటికే దేశాన్ని తాకాయి కనుక డెల్టా వేరియంట్ వలన ముప్పు ఉండకవపోచ్చని అభిప్రాయపడ్డారు. కాగా థర్డ్‌వేవ్ అనివార్యమని ఇప్పటికే దేశంలోని అగ్రశ్రేణి వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. అలాగే డెల్టా వేరియంట్ విస్తరణ ద్వారా కోవిడ్ -19 మూడో దశ "ప్రారంభ దశలో" ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. సుమారు 111 కి పైగా దేశాలలో దీన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. మరోవైపు కరోనా హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేయడం లేదని, వాతావరణ సూచనల తరహాలో తేలిగ్గా తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : ఆళ్ల నాని
-
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్
-
తప్పు చేస్తే ‘సెకండ్ వేవ్’ ముప్పు
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. యూరప్‌లోని పలు దేశాలు ఇప్పుడు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. మరికొన్ని ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నాయి. మన దేశంలో కేసుల సంఖ్య తగ్గుతున్నా, కేరళ, ఢిల్లీ, ఒడిశా, హరియాణాలో ఒక శాతానికి మించి నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు మన దేశానికీ సెకండ్‌వేవ్ ముప్పుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అలాగే, ప్రపంచంలో సెకండ్వేవ్పైనా, ప్రస్తుత పరిస్థితిపైనా ప్రపంచ ఆరోగ్యసంస్థ విశ్లేషించింది. సెకండ్‌వేవ్‌ను నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించింది. మన తప్పిదాలతోనే ‘సెకండ్ వేవ్’ అలలాగా వైరస్ విరుచుకుపడటాన్నే ‘వేవ్’ అంటారు. కేసులు గణనీయంగా తగ్గాక మళ్లీ ఒక్కసారిగా వైరస్ విజృంభిస్తుందన్న మాట. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్.. అలా వస్తూనే ఉంటాయి. సైన్స్ జర్నల్ ప్రకారం ఒకసారి కరోనా వచ్చిన వారికి మళ్లీ వచ్చే అవకాశం 90 శాతానికిపైగా ఉండదు. ఫస్ట్ వేవ్‌లో కరోనా రానివారు నిర్లక్ష్యం చేస్తే సెకండ్ వేవ్‌లో దాని బారినపడే ముప్పుంది. కరోనా వైరస్ ఇప్పుడెంత తీవ్రతతో ఉందో ఇకముందూ అదే తీవ్రతతో ఉంటుంది. జాగ్రత్తలు తీసుకున్నంత వరకు అదెవరికీ సోకే అవకాశం లేదు. అజాగ్రత్తతో వ్యవహరిస్తే మాత్రం సోకుతుంది. మాస్క్ పెట్టుకుంటే, భౌతికదూరం, శుభ్రత పాటిస్తే సెకండ్ వేవ్ రాదు. ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా సెకండ్ వేవ్‌కు అతీతం కాదు. ఎటొచ్చీ మానవ తప్పిదాలతోనే అదొచ్చే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు. బలమైన ప్రజారోగ్య వ్యవస్థ, ప్రజల సహకారంతోనే దీన్ని అధిగమించాలని చెబుతున్నారు. నిజానికి సెకండ్ వేవ్‌లో మరణాలు తగ్గాయి. మొదటి వేవ్‌లో పరీక్ష సామర్థ్యం, సన్నద్ధత లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు పరీక్షల సామర్థ్యం పెరగడంతో మరణాల రేటు తగ్గింది. యూకేలో 3 నెలల తర్వాత... యూకేలో వైరస్ తగ్గిన మూడు నెలల తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది. యూరప్, అమెరికా, ఆసియా దేశాల్లో ఇప్పుడు సెకండ్ వేవ్ నడుస్తోంది. యూరప్‌లో మార్చిలోనే వైరస్ తీవ్రస్థాయికి వెళ్లింది. ఈ ఏడాది మార్చిలో ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో 66 శాతం యూరప్‌లోనే నమోదయ్యాయి. జూలై నాటికి అక్కడ 6 శాతానికి తగ్గాయి. ఆగస్టు నుంచి అక్కడ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ రెండో వారం నాటికి ప్రపంచంలో నమోదైన కేసుల్లో 46 శాతం కేసులు అక్కడే గుర్తించారు. అంటే ఆగస్టు చివరి నుంచే సెకండ్ వేవ్ మొదలై అక్టోబర్ చివరి నాటికి తీవ్రస్థాయికి వెళ్లింది. ప్రస్తుతం ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో 19 శాతం అమెరికాలో నమోదవుతున్నాయి. చైనాలోనూ సెకండ్ వేవ్ ప్రారంభమైంది. గత వారంతో పోలిస్తే ఇప్పుడు 33 శాతం కేసులు పెరిగాయి. 44 దేశాలున్న యూరప్‌లో స్వీడన్, బెల్జియం, స్పెయిన్, ఐర్లాండ్ మినహా మిగతా అన్ని దేశాలు సెకండ్ వేవ్ బారినపడ్డాయి. దేశంలో 4 శాతం తగ్గిన కేసులు లాక్డౌన్ చివరి దశలో ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో మన దేశం వాటా 15%. జూన్‌లో క్రమంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలో జూలై చివరి నాటికి 22%, ఆగస్టు చివరి నాటికి 30%, సెప్టెంబర్ చివరికి 40% కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ తొలి వారంలో ప్రపంచంలో నమోదైన కేసుల్లో మన దేశం కేసుల వాటా 25%, రెండో వారంలో 15%గా ఉంది. ప్రస్తుతం మన దేశంలో కేసులు 4%, మరణాలు 12% తగ్గాయి. కేరళలో మాత్రం ప్రస్తుతం రోజుకు 1.6 శాతం చొప్పున కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ఒడిశా, హరియాణాలో ఒక శాతానికిపైగా పెరుగుతున్నాయి. ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మన దగ్గరా జనవరి రెండో వారం నాటికి సెకండ్ వేవ్ వస్తుందని అంచనా. పాజిటివిటీ రేటు ఆధారంగానే అంచనా కేసుల సంఖ్య ఆధారంగా కాకుండా పాజిటివిటీ రేటు ప్రకారం సెకండ్ వేవ్‌ను అంచనా వేయాలి. తక్కువ టెస్టులు చేసినందున మొదటి వేవ్‌లో తప్పిపోయిన కేసులు ఎక్కువ. యూరప్‌లో మొదటి వేవ్‌లో 14 మందికి కరోనా ఉంటే ఒకరినే గుర్తించారు. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం మన దేశంలో మొదట్లో 84 కేసులుంటే, ఒకటే గుర్తించగలిగాం. 83 మిస్సయ్యాయి. ఇప్పుడు పరీక్షలు ఎక్కువ చేస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ సరాసరి పాజిటివిటీ రేటు 15 శాతం కాగా, మన దేశంలో అది 4.3 శాతంగా ఉంది. ప్రపంచంలో 13 లక్షల జన్యు విశ్లేషణలు ప్రపంచంలో దాదాపు అన్నిచోట్లా లాక్డౌన్ పూర్తిగా ఎత్తేశారు. యూరప్‌లో విద్య, రవాణా వ్యవస్థలపై ఆంక్షలను తొలగించారు. ప్రజలు గుంపులుగా బయటకు వస్తున్నారు. యువకుల నిర్లక్ష్యం వల్ల వైరస్ పెద్ద వారికి సోకుతోంది. చలికాలం ఎక్కువ.. వేసవిలో తక్కువనే తేడా లేకుండా వైరస్ దాడి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు సంబంధించి 13 లక్షల జన్యు విశ్లేషణలు జరిగాయి. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటోందని ఇవన్నీ తేల్చాయి. అయితే, తీవ్రత తగ్గుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. సెకండ్ వేవ్ ప్రభావం తక్కువే మొదటి దశ కరోనా నుంచి జనంతో పాటు ప్రభుత్వాలు రిలాక్స్ అయ్యాయి. ఫస్ట్‌వేవ్.. సెకండ్ వేవ్.. ఏ దశలోనైనా వైరస్ అంతే తీవ్రత కలిగి ఉన్నా సెకండ్ వేవ్‌లో దాని ప్రభావం, మరణాలూ అంతగా ఉండవు. ఎందుకంటే వైరస్ లక్షణాలకు ఎలాంటి చికిత్స చేయాలనేది ఇప్పటికే తెలిసిపోయింది. ఆసుపత్రుల్లో వసతులు పెరిగాయి. యూరప్‌లో ఉన్నంత ప్రమాదం మన దేశానికి ఉండదు. వ్యాక్సిన్ ఉత్పత్తి జనవరి నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం వరకు వ్యాక్సిన్‌ను తీవ్ర ప్రభావిత ప్రజలకు ఇస్తారు. జూలై నాటికి ప్రపంచంలోని అందరికీ అందుతుంది. మార్చి వరకు జాగ్రత్తలు తీసుకుంటే సెకండ్ వేవ్‌ను ఆపేయొచ్చు. అయితే వ్యాక్సిన్ వచ్చే వరకు నిర్లక్ష్యం కూడదు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినంత మాత్రాన ప్రజలు నిర్లక్ష్యం చేయరాదు. టెస్టు కేవలం ఆ నిమిషం పరిస్థితిని మాత్రమే చెబుతుంది. కాబట్టి లక్షణాలుంటే అశ్రద్ధ చేయవద్దు. – డాక్టర్ కిరణ్ మాదల,క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
సంకెళ్లు వేయకుంటే సంకటమే!
దేశంలో పలుచోట్ల కోవిడ్ రెండో విజృంభణ (సెకండ్ వేవ్) గురించి మాట్లాడుతుంటే, దేశ రాజధాని ఢిల్లీ మూడో విజృంభణ గురించి కలవరపడుతోంది. అదీ శీతాకాలం మొదల య్యాక! అందుకే, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ మూడు మాసాల కాలం వాయుకాలుష్యపు విషకౌగిట్లో బందీ అయి ఢిల్లీ తల్లడిల్లడం మనం కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఈసారి, కోవిడ్–19 తోడవడం ఆందోళన కలిగిస్తోంది. ఫ్లూ తెగ వైరస్లు చలి వాతావరణంలో విజృంభించడం సహజం. కరోనా కూడా అంతే! మళ్లీ పెరిగి రోజూ అయిదువేలకు పైగా కరోనా కొత్త కేసులు ఢిల్లీలో తాజాగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆరువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సరిగ్గా ఈ సమ యంలోనే ఢిల్లీ పొరుగు రాష్ట్రాల నుంచి పంట అవశేషాలు పొలాల్లో తగులబెట్టడంతో వచ్చే పొగమేఘాలు ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తుం టాయి. తగులబెట్టడాలపై నిషేధం విధించినా ఆగటం లేదు. వారంలో రానున్న ధీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం వల్ల పుట్టే విష కాలుష్యం అదనం. అప్పుడు, అన్నీ కలిసి ఓ పెద్ద ‘గ్యాస్ చాంబర్’గా మారే ఢిల్లీలో సగటు మనిషి జీవనం దుర్భరంగా తయార వుతుంది. దేశాన్ని పరిపాలించే, పాలనను పర్యవేక్షించే, న్యాయ వ్యవస్థను నడిపించే.. ఇలా ఎన్నో రకాల ముఖ్యులు, అతి ముఖ్యు లుండే ఢిల్లీ పరిస్థితి ఏయేటికాయేడు దయనీయంగా మారుతోంది. ‘‘నాకు ఊపిరాడట్లేదు...!’’ అని దేశ రాజధాని గొంతెత్తి రోదించే పరి స్థితి. ఈ వాయుకాలుష్యపు సమస్య ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. ఢిల్లీ పరిసరాలతో పాటు ప్రధాన మెట్రో నగరాలకు క్రమంగా విస్తరి స్తోంది. గాలి నాణ్యతా సూచి (ఎక్యూఐ) ఈ రోజు, గురువారం లెక్కలు ఢిల్లీ (450, పీఎం10) లో ప్రమాదకరంగా ఉంటే, తర్వాత అధ్వానంగా నవీ ముంబయ్ (206, పీఎం2.5), ఓ మోస్తరుగా హైద రాబాద్ (150, పీఎం2.5–పీఎం10)లో నమోదయ్యాయి. బెంగళూరు (73, పీఎం10), చెన్నై (59, పీఎం2.5) పరవాలేదనిపించాయి. బాగ్ పాట్ (464), నొయిడా (457), గుర్గావ్ (443), ఆగ్రా (373)లలో కూడా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలోనే ఉంది. సత్వరం దీనికి విరుగుడు చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు చెయిదాటిపోయే ప్రమాద ముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య తీవ్రతను అంగీకరించడం, కారణాలు గుర్తించడం, చిత్తశుద్ధితో పరిష్కారాలకు యత్నించడం ముఖ్యం. నగరీకరణ అతిపెద్ద సవాల్ గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలతో పట్టణాలు, నగరాలు జనసమ్మ ర్ధంగా మారటం ప్రపంచమంతటా జఠిలమవుతున్న పర్యావరణ సమస్య. కిందటేడు లెక్కల ప్రకారం 55 శాతం ప్రపంచ జనాభా పట్టణాలు, నగరాల్లో ఉంది. 2050 నాటికి, ఇది మూడింట రెండొం తులకు చేరనుంది. 80 శాతం స్థూల జాతీయోత్పత్తి నగరాల నుంచే వస్తోంది. భారత్‌లో కూడా మూడింట రెండొంతుల స్థూల జాతీయో త్పత్తి నగరాలు, పట్టణాల నుంచేనని అధికారిక గణాంకాలు చెబుతు న్నాయి. ప్రణాళిక–నియంత్రణ లోపం, పౌర సదుపాయాలు జనా భాకు సరితూగేలా లేకపోవడం వల్ల జీవన ప్రమాణాలు తగ్గిపోతు న్నాయి. అతి ఎక్కువ జనాభా కలిగిన 20 ప్రపంచ నగరాల్లో అత్య ధికం భారత్, చైనా, జపాన్ వంటి ఆసియా దేశాల్లోనే ఉన్నాయి. ఢిల్లీ కన్నా ఎక్కువ జనాభా ఈ భూమ్మీద ఒక టోక్యో లోనే ఉంది. బీజింగ్, షాంఘై, ఒసాకా, కైరో, ముంబై వంటివన్నీ ఆ తర్వాతే! అధిక జనసాంద్రత, నిరంతర నిర్మాణపు పనులు, రోడ్ల విస్తరణ, వాహనాలు వదిలే వ్యర్థాలు, ఔషధ ఇతర పరిశ్రమలు, వస్తోత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే వాయువుల వల్ల గాలి కాలుష్యం అసాధారణమై ఊపిరా డటం లేదు. ఢిల్లీలో ఇది మరింత ఎక్కువ. శీతాకాలం, సాయం సమ యాల్లో పౌరులు ఊపిరిపీల్చుకోవడం కూడా కష్టమవుతోంది. ప్రమా ణాలకు మించి వాయుకాలుష్యపు స్థాయి హెచ్చినపుడు శాస్వసంబం ధమైన వ్యాధులు పెరుగుతున్నాయి. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా వంటి జబ్బులున్న వారికది నరకప్రాయమే! కాలుష్యం ముఖ్యంగా కోవిడ్– 19 వైరస్ వ్యాప్తిలోనే కాకుండా ప్రతికూల ప్రభావంతో ఆరోగ్య సమస్యల్ని జఠిలం చేస్తోంది. ఢిల్లీ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాయు కాలుష్యం వల్ల పలు జబ్బులు పెరగటమే కాకుండా మను షుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతోంది. శ్వాసలో స్వచ్చమైన గాలి– ఆక్సిజన్ తగినంత లభించక కోవిడ్ రోగులు కోలుకునే అవకాశాలూ మందగిస్తున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ మన దేశంలో ఈ సంవత్సరం జనవరి చివర్లో వచ్చినందున శీతాకాలంలో అది చూపే ప్రభావం గురించి అంచనా దొరకటం లేదు. ఐరోపా దేశాలు, అమెరికాలో రెండో విజృంభణ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని, మనం జాగ్రత్తగా ఉండటం మంచిదని వైద్యులు, పాలకులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాల్లో మొదటి పీక్ (మార్చి)తో పోల్చి చూస్తే రెండో విజృంభణలో కేసులు సంఖ్య మూడింతలు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) తాజాగా వెల్లడించింది. ఇతర ఇన్ఫ్లుయెంజా కేవల శ్వాసకోశ సంబంధ ఇబ్బందులే! కానీ, కరోనా శ్వాస ఇబ్బందులతో పాటు రక్తం గడ్డకట్టడం, గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి తీవ్ర నష్టాలు కలిగిస్తోంది. శీతాకాలంలో శ్రద్ధతీసుకోవాలని, మెట్రోల్లో మరింత జాగ్రత్త అవసరమని నిపుణులంటున్నారు. ఆర్డినెన్స్ రూపంలో కొత్త చట్టం ఢిల్లీలో గాలి స్వచ్ఛత–నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వారం కింద కేంద్ర ప్రభుత్వం కొత్త అత్యయిక ఉత్తర్వు (ఆర్డినెన్స్) తెచ్చింది. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీయార్)లో వాయుకాలుష్య కారకులయ్యే పరిశ్రమలు, ఇతర ఉత్పత్తి–సేవా సంస్థలకు నీరు, విద్యుత్తు సరఫ రాను నియంత్రించే, నిలువరించే అధికారాలు కల్పిస్తూ ఒక కమిషన్ ఏర్పాటు ఈ అత్యయిక ఉత్తర్వు వెనుక ఉద్దేశం. కమిషన్‌లో ఛైర్మన్‌తో పాటు 18 మంది సభ్యులుంటారు. వారిలో కార్యదర్శితో పాటు ముఖ్య మైన 8 శాఖలకు చెందిన ఉన్నతాధికారులుంటారు. సివిల్ ప్రొసీజర్ కోడ్–1973 కింద లభించిన వెసులుబాటుతో ఈ కమిషన్, కాలుష్య కారకులయిన వారికి లక్ష రూపాయల జరిమానా లేదా అయిదేళ్ల జైలు శిక్ష విధించే అధికారాలు కలిగి ఉంటుంది. నిజానికి రెండు దశాబ్దాల కిందటే, 1998లో, పర్యావరణ పరిరక్షణ, నియంత్రణ (ఈపీసీఏ)– చట్టమొకటి తెచ్చారు. కోరలు లేక పెద్ద ప్రభావం చూపలేకపోయింది. దీపావళి సందర్భంగా ఢిల్లీలో పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం వల్ల వచ్చే వ్యర్థ వాయువులతోనూ గాలి కాలుష్యమౌతోంది. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈసారి దీపావళి టపాసులు కాల్చకూడదని ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో పాటు ఢిల్లీ పొరుగునున్న హర్యానా, రాజ స్తాన్లలో ప్రభుత్వాలు నిషేధం విధించాయి. మీరేం చేస్తున్నారో చెప్పండని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అడిగింది. ఢిల్లీ పొరుగునున్న హరియాణా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ (పశ్చిమ ప్రాంతం) రాష్ట్రాల్లో పంట అవశేషాల్ని పొలాల్లో తగులబెట్డం వల్ల ఢిల్లీ పైకి వచ్చే పొగ, పొగ మేఘాల నియంత్రణపై సుప్రీంకోర్టు, ఎన్జీటీలు పలుమార్లు నిర్దిష్ట ఆదేశాలిచ్చాయి. ఆదిత్య దూబే–భారత ప్రభుత్వం మధ్య నడిచిన ఒక కేసులో సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి, ఈ సమస్య పరిష్కారం చూడమంది. జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలో ఏర్పరచిన ఈ కమిషన్ పలు సూచనలు చేసింది. ఇప్పుడీ కమిషన్ రద్దయి, దాని స్థానే అత్యయిక ఉత్తర్వుతో ఏర్పడ్డ తాజా కమిషన్ ఇకపై ఈ బాధ్యత నిర్వహిస్తుంది. ఒక్క దెబ్బతో రెండు పిట్టలు ఉత్తరాది రాష్ట్రాల్లో పలుచోట్ల వరిపంట నూర్పిళ్లయ్యాక పొలంలో మిగిలిన (కుదుళ్లు) గడ్డి అవశేషాల్ని రైతులు తగులపెడతారు. మను షులే అయితే వరి కుదుళ్లను నేలకు దగ్గరగా కోస్తారు. మరు పంటకు పొలం దున్నినపుడు అవి మట్టిలో కలిసి, ఎరువవుతాయి. 1980లకు ముందు ఇదే జరిగేది. కానీ, యంత్రాల ద్వారా నూర్పిళ్లు జరిపినపుడు అది వరి కుదుళ్లను నేల నుంచి దాదాపు 30 సెంటీమీటర్ల మేర వదిలి కోస్తుంది. బాస్మతి అయితే తప్ప ఆ మిగులు పశుగ్రాసంగా కూడా పనికి రాదు. దాన్ని మరో మారు కోయడం రైతుకు అదనపు ఖర్చు. వ్యయభారం తప్పించుకునేందుకు వాటిని తగులబెడతారు. ఇలా కాల్చడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్ గాల్లో కలిసి, తీవ్ర వాయుకాలుష్యానికి కారణమౌతోంది. అదొక పొగమేఘమై ఢిల్లీ వరకు విస్తరిస్తోంది. ఇంధన పరిశోధన సంస్థ (టీఈఆర్ఐ) అధ్యయనం ప్రకారం డబ్లుహెచ్‌వో అనుమతించిన కాలుష్యపరిమితి కన్నా 20 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తోంది. ఇంకోరకంగా చెప్పాలంటే, గడ్డి కాల్చడంతో అరవై రోజులపాటు వెలువడే ఈ కాలుష్యాలు, ఏడాది పాటు ఢిల్లీలో అన్ని వాహనాలు వెలువరించే కాలుష్యం కన్నా నాలుగయిదు రెట్లు అధికం! తామలా పంట అవశేషాలు కాల్చడం పర్యావరణ పరంగా ప్రమాదకరమని, ప్రభుత్వం నిషేధించిన తర్వాత అలా చేయడం భారత శిక్షాస్మృతి (సెక్షన్ 188) కింద నేరమని పాపం రైతులకు తెలియదు. వాయు (కాలుష్య నియంత్రణ) చట్టం–1981 కింద కూడా ఇది నేరమే! రైతుల్లో అవగాహన పెంచాలి. భారత పరి శ్రమల సమాఖ్య (సీఐఐ) చొరవతో పంజాబ్‌లో 2018లో 19 గ్రామాల్లో, మరుసటేడు 105 గ్రామాల్లో చేసిన ప్రత్యామ్నాయ చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. 1.83 లక్షల టన్నుల గడ్డిని కాల్చకుండా నిరోధించ గలిగారు. దీన్ని ప్రభావిత ఇతర రాష్ట్రాలన్నింటికీ విస్తరిం చాలి. అవగాహన పెంచి రైతల్ని సమాయత్తపరచాలి. వరికోత యంత్రాల్ని ఆధునీకరించడం, పంట అవశేషాల్ని మట్టిలోనే కలిపి ఎరువుగా మార్చడం వంటివి సత్ఫలితాలిస్తాయి. ఢిల్లీ కాలుష్యపీడ తొలగడమే కాకుండా రైతుల భూసారం పెరుగుతుంది. సహజంగా పంటకు సేంద్రియ ఎరువు లభిస్తుంది. మట్టిపై మంటల్లేక జీవవైవిధ్య రక్షణ జరుగుతుంది. భూగర్బజల మట్టాలూ పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యామ్నాయ చర్యలకు... ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు, సామాజిక బాధ్యత కింద కార్పొరేట్లు, స్వచ్ఛంద–పౌర సమాజ సంస్థలు, రైతులు సంఘటితం కావాలి. సంబంధీకులంతా చేయి చేయి కలిపితేనే.... వాయు కాలుష్యభూతం కట్టడి సాధ్యం. -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
సెకండ్ వేవ్: కరోనా మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ‘సెకండ్ వేవ్’ దడ మొదలైంది. అమెరికా, యూరప్ దేశాల్లో వైరస్ సెకండ్ వేవ్ సృష్టిస్తున్న ప్రకంపనలతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మొదటి దశలో కరోనాను నియంత్రించినట్లుగానే రెండో దశను ఎదుర్కోవాలని నిర్ణయించింది. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవ్వాలని ఇప్పటికే వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అధి కారులకు దిశానిర్దేశం చేయగా, వాటిని అమలు చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు ప్రారంభిం చింది. ప్రజల్లో, వైద్యాధికారుల్లో కరోనా కట్టడిలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని పారదోలేందుకు ఉన్నతాధి కారులు నడుం బిగించారు. జిల్లాలపై ప్రత్యేక ఫోకస్..: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.42 లక్షలకు చేరుకుంది. తెలం గాణలో మార్చి 2 నుంచి మొదలైన కరోనా వ్యాప్తి, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఉధృతి తక్కువగా ఉండటం, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం, కోలుకునేవారి రేటు 92.12 శాతానికి చేరుకోవడంతో ప్రజల్లోనూ, యంత్రాంగంలోనూ కాస్తంత నిర్లిప్తత నెలకొం దన్న చర్చ జరుగుతోంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పడిపోవడంతో జనాల్లో కరోనా పట్ల గతంలో ఉన్నంత ఆందోళన లేదు. అయితే కరోనా పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తు న్నాయి. కరోనా పూర్తి నియంత్రణకు వచ్చే వరకు జాగ్రత్తలు తప్పదని చెబుతూనే ఉన్నారు. కానీ ఏమీ కాదన్న ధోరణి జనంలో ఏర్పడటంతో వైద్య, ఆరోగ్య శాఖలో ఆందోళన మొదలైంది. పైపెచ్చు ఇప్పుడు చలికాలం మొదలైంది.. ఈ కాలంలో సీజనల్ ఫ్లూ వ్యాధులు, దానికి తోడు కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. యూరప్, అమెరికా దేశాల్లో సెకండ్ వేవ్ మొదలైంది. కొన్ని దేశాల్లో లాక్డౌన్ కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేసింది. అందుకే జిల్లాలపై ఫోకస్ పెట్టింది. పరిస్థితిని అంచనా వేసి యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం నుంచి జిల్లాల్లో వైద్య ఉన్నతాధికారులు పర్యటన మొదలు పెట్టారు. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. కరోనా పరీక్షలు, చికిత్స చేసే ఆసుపత్రులను పరిశీలించారు. జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సెకండ్ వేవ్ రాకుండా చేపట్టాల్సిన ప్రణాళికను వారు వివరించారు. మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖలతో సమన్వయం చేసుకొని కరోనా కట్టడి చేయాలని సూచించారు. మరోవైపు డెంగీ, మలేరియా వంటి వంటి సీజనల్ వ్యాధులతోనూ కరోనా వచ్చే ప్రమాదం ఉందని, అటువంటి కేసులను గుర్తించాలన్నారు. ఇక కరోనాపై తాజాగా రూపొందించిన మార్గదర్శకాలను అందరూ పాటించాల్సిందేనని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా తాజా మార్గదర్శకాలివే.. –సెకండ్ వేవ్ ప్రమాదం ఉన్నందున అవసరమైతేనే ఎవరైనా ఇంటి నుంచి బయటకు రావాలి. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రాకపోవడమే శ్రేయస్కరం. –పండుగలు, శుభకార్యాలు ఏవైనా అందరూ ఒకేచోట చేరడం మంచిది కాదు. ఎవరికి వారే కుటుంబంలో జరుపుకోవాలి.. –చలికాలంలో డెంగీ, మలేరియా సహా ఫ్లూ జ్వరాలతో కలిపి కరోనా వచ్చే అవకాశముంది. కాబట్టి ఏమాత్రం లక్షణాలున్నా అశ్రద్ధ చేయొద్దు. –కరోనా లక్షణాలుంటే వెంటనే నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. సాధారణ లక్షణాలుంటే వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాలి. అటువంటివారు ఇంట్లో కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించాలి. –ఐసోలేషన్‌లో ఉండే గదికి గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. –ఎప్పటికప్పుడు జ్వరాన్ని చెక్ చేసుకోవాలి. శ్వాస సంబంధ సమస్యలు వస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి. –ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. –ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వెళ్లేవారు ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించకూడదు. –కూరగాయలు, పండ్లను బేకింగ్ పౌడర్ కలిపిన నీటితో కడగాలి. ఇంట్లో తయారుచేసిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. –రోజుకు తప్పనిసరిగా 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. పసుపు వేసిన వేడి పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. –కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి. –ఇంట్లో ఖాళీగా ఎవరూ కూర్చోకూడదు.. అంటే ప్రాణాయామం, ధ్యానం చేస్తుండాలి.. సంగీతం వినడం, టీవీ చూడటం, పుస్తకాలు చదవడమూ చేయాలి. కరోనా టెస్టుల పెంపు.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో మొబైల్ టెస్టింగ్ వాహనాలతో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా సంతలు, రైతుబజార్లు, బస్టాండ్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పని ప్రదేశాల వద్దకే వెళ్లి టెస్టులు చేయాలని నిర్ణయించారు. సహజంగా చలికాలంలో అన్ని రకాల వైరస్లు విజృంభిస్తుంటాయి. ఇక కరోనా లాంటివి మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే రాబోయే మూడు మాసాలు అత్యంత కీలకమని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా ఐదారు మాసాలు సమయం పడుతుందని, అప్పటివరకు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ, జాగ్రత్తలు పాటించేలా చేయడమే తమ ముందున్న కర్తవ్యమని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవైపు ప్రజల్ని చైతన్య పరుస్తూ.. మరోవైపు వారు భయపడకుండా, ఆందోళన చెందకుండా అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. -
ప్రతి ఇంట్లోనూ ‘మోదీ’ గాలే
రత్లాం/సోలన్: దేశంలో ఇప్పుడు మోదీ గాలి వీయడం లేదని కొందరు ఎన్నికల పండితులు దుష్ప్రచారం చేస్తున్నారనీ, దేశంలోని ప్రతీ ఇంట్లో నుంచి మోదీ గాలి వీస్తోందని ప్రధాని మోదీ సోమవారం అన్నారు. పంజాబ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌లలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘దేశంలో మోదీ గాలి లేదని గతంలో కొందరు ఎన్నికల పండితులు అన్నారు. కానీ గతంలోకన్నా ఇప్పుడు పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. రికార్డులు సృష్టిస్తున్న వారిలో రెండు రకాల ప్రజలు ఉన్నారన్న విషయం ఆ కొందరికి తెలియదు. తొలిసారి ఓటేస్తున్న నా యువ స్నేహితులు ఒక రకమైతే, ఇక రెండో రకం తమ కొడుకు/సోదరుడిని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్న నా తల్లులు, సోదరిలు. వారికి వంటగ్యాస్, కరెంట్ ఇచ్చాను. వారంతా నాకు ఓటేయడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వీరంతా ఏ గాలి వల్ల వస్తున్నారో అర్థం చేసుకోవడంలో ఆ ఎన్నికల పండితులు విఫలమయ్యారు. ఆ గాలి ప్రతీ ఇంటి నుంచి వస్తోంది.’ అని అన్నారు. దేశంలో భోపాల్ విషవాయువు ఘటన, కామన్వెల్త్ ఆటలు, 2జీ స్పెక్ట్రం కుంభకోణం తదితర కుంభకోణాలు కాంగ్రెస్ హయాంలో జరిగినవేననీ, ఇప్పుడు ఆ పార్టీ నేత శామ్ పిట్రోడా సిక్కు అల్లర్లపై ‘అయ్యిందేదో అయ్యింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వారి సిగ్గులేని తనానికి నిదర్శనమని మోదీ మండిపడ్డారు. ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీలు విహారయాత్రలకు ఉపయోగించుకోవడం, ఉగ్రవాదులు, నక్సలైట్ల దాడుల్లో జవాన్లు చనిపోవడం తదితర ఏ అంశంపై ప్రశ్నించినా ఇకపై కాంగ్రెస్ ‘అయ్యిందేదో అయ్యింది’ అన్న సమాధానమే ఇస్తుందని ఎద్దేవా చేశారు. పంజాబ్‌లోని బఠిండాలో మోదీ మాట్లాడుతూ శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రాహుల్ ఆయనను నిందించడం కాదనీ, తమ పార్టీ నేత అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు రాహులే సిగ్గుపడాలని మోదీ అన్నారు. 50 సీట్లు గెలవడానికే కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతోందని విమర్శించారు. ప్రజలనే దేవుళ్లను మోసం చేశారు.. మధ్యప్రదేశ్‌లో రైతు రుణమాఫీ హామీని అమలు చేయడంలో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మోదీ అన్నారు. ఈ విషయంలో ప్రజలు అనే దేవుళ్లను కాంగ్రెస్ మోసం చేసిందని పేర్కొన్నారు. ‘భారతమాతకు జై’ అనే నినాదాన్ని పలకడానికి కూడా కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆరోపించారు. హిందూ ఉగ్రవాదం అనే కొత్త పదాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందన్నారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ లోక్‌సభ ఎన్నికలకు భోపాల్ స్థానం నుంచి పోటీ చేస్తుండి కూడా పార్టీలో అంతర్గత కొట్లాటల వల్లే ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రధాని, రాష్ట్రపతి సహా దేశం మొత్తం ఓటు వేస్తుంటే దిగ్విజయ్ మాత్రం ఓటు వేయలేదనీ, ఇది ఆయన దురహంకారానికి నిదర్శనమని మోదీ అన్నారు. ఓటు వేయకపోవడం ద్వారా దిగ్విజయ్ మహా పాపానికి ఒడిగట్టారనీ, తన సొంత ఊరికి వెళ్లి దిగ్విజయ్ ఓటు వేయకుండా, ఓటమికి భయపడే భోపాల్‌లోనే ఉండి ప్రజలను ఓట్లు అడిగారని మోదీ పేర్కొన్నారు. అవి కాంగ్రెస్‌కు ఏటీఎంలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రక్షణ ఒప్పందాలను తమకు కాసులు కురిపించే ఏటీఎంలుగా చూశాయని హిమాచల్‌ప్రదేశ్ ప్రచారంలో మోదీ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ హయాంలో రక్షణ దళాలకు అవసరమైన ఆయుధాలు, వస్తువుల్లో 70 శాతం విదేశాల నుంచే వచ్చేవి. ఆ దేశాలపై ఇండియా ఆధారపడేది. ఆయా ఆయుధాలు, వస్తువుల కొనుగోలు కోసం కాంగ్రెస్ పార్టీ విదేశాలతో చేసుకునే ఒప్పందాలు ఆ పార్టీకి ఏటీఎంలుగా ఉండేవి. 1947లో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చే నాటికి మనకు రక్షణ వస్తువుల ఉత్పత్తిలో 150 ఏళ్ల అనుభవం ఉండగా, నాటికి చైనాకు ఏ మాత్రం అనుభవం లేదు. కానీ ఇప్పుడు చైనా నుంచి ఉత్పత్తులు కొనాల్సి వస్తోంది. ఇందుకు కాంగ్రెస్ విధానాలే కారణం’ అని అన్నారు. -
కడుపులో ఈతకొట్టే కొత్త రోబో..!
ఇజ్రాయెల్ః శరీర లోపలి భాగాలను పరీక్షించేందుకు ఎక్స్ రేలు, స్కానింగ్ లు తీయించే కాలం చెల్లి పోయింది. ప్రతి పనికీ రోబోను వినియోగిస్తున్నట్లే ఇకపై వైద్య పరీక్షల్లోనూ రోబోల ప్రాధాన్యత మరింత పెరగనుంది. ఇప్పుడు శరీరంలోని ఆరోగ్య పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి అతిచిన్న రోబోను సృష్టించారు. ఆ సూక్ష్మ పరికరం కడుపులో ఈతకొడుతూ, అన్నివైపులకు సంచరిస్తూ రోగికి సంబంధించిన ప్రతివిషయాన్నీ పరిశీలించి వివరాలను వెల్లడిస్తుంది. ఎస్ఏడబ్ల్యూ (సా..) పేరున తరంగంలా నడిచే రోబోను వైద్యపరీక్షలకోసం ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి. కడుపులో ఈత కొడుతూ వైద్య పరీక్షలు నిర్వహించే కొత్త రోబోను ఇజ్రాయెల్ నెగేవ్ (బిజియు) కు చెందిన బెన్-గురియన్ విశ్వవిద్యాలయం ఇంజనీర్లు మొదటిసారి అభివృద్ధి పరిచారు. ఈ అద్భుతమైన చోదక శక్తి కలిగిన పరికరం కడుపులో పైకీ కిందికీ పాకుతూ, ఇసుక గడ్డిలా ఉండే అస్థిరమైన భాగాల్లోనూ సంచరించగలిగేలా మొదటిసారి డిజైన్ చేశారు. సెకనుకు 57 సెంటీమీటర్ల వేగంతో సంచరించగలిగే ఈ రోబో కేవలం ఓ మోటార్ తో పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పుడు దీన్ని మరింత సూక్ష్మంగా రూపొందిస్తే... వైద్యులు, సర్జన్లు.. రోగుల అంతర్గత పరీక్షలు నిర్వహించేందుకు ఉపయోగించేందుకు వీలుగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే పర్వతాల్లోనూ, కోస్ట్ గార్డ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు సైతం ఇటువంటి మైక్రోస్కోపిక్ రోబోను వినియోగించవచ్చని అంటున్నారు. తరంగం (వేవ్) లాంటి కదలికలు కలిగిన రోబోను రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తొంభై ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారని.. మెకానికల్ ఇంజనీరింగ్ బిజియు శాఖ, మరియు బయో ఇన్స్ పైర్డ్ అండ్ మెడికల్ రోబోటిక్ ల్యాబ్ హెడ్.. డాక్టర్ డేవిడ్ జరౌక్ తెలిపారు. ఇప్పుడు తాము వివిధ ప్రయోజనాలకోసం, వివిధ పరిమాణాల్లో వినియోగించే ఈ రోబోట్ ను రూపొందించి సక్సెస్ అయినట్లు చెప్తున్నారు. ఒక సెంటీమీటర్ లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉండే ఈ సూక్ష్మ పరికరం.. శరీరంలో ప్రవేశించి జీర్ణవ్యవస్థను పరిశీలించేందుకు, బయాప్సీ వంటివి నిర్వహించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే శోధన, సహాయక కార్యక్రమాల్లోనూ ఈ మైక్రోస్కోపిక్ రోబో వినియోగించేందుకు వీలుగా తయారు చేసినట్లు చెప్తున్నారు.