అలంపూర్/మానవపాడు: పభుత్వం పారిశ్రామికీకరణ, హరిత విప్లమమే లక్ష్యంగా పనిచేస్తోందని, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు 3 లక్షల ఎకరాల భూమిని ఎంపికచేసిన ట్లు ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా అలంపూర్ జోగుళాంబ ఆలయాలను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్డీఎస్ సమస్యకు త్వరలో పరిష్కారం చూపి, చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రణాళికలు సిద్ధంచేశామని చెప్పారు.
ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు విధంగా తెలంగాణ ప్రభుత్వానిది గొప్ప విధానమన్నారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో వెనకబడ్డ అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో అలంపూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, దీనికితోడు జోగుళాంబ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయన్నారు.
ఇలాంటి ప్రాంతాన్ని ఐదేళ్లలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా సర్వేలు చేపట్టారని తెలిపారు. ఆర్డీఎస్ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. రైతులు సంబరపడే రోజులు దగ్గర్లలోనే ఉన్నాయన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని జోగుళాంబను కోరుకున్నట్లు చెప్పారు. మానవపాడు మండలంలోని జల్లాపురం, మానవపాడు గ్రామాల రైతులు వేణుగోపాలాచారిని ఘనంగా సన్మానించారు.
హరిత విప్లవమే లక్ష్యం
Published Mon, Aug 4 2014 2:54 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement