rds problem
-
హరీష్‌రావు లేఖకు దేవినేని స్పందన
అమరావతి: ఆర్డీఎస్ సమస్య పరిష్కారంపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల రాసిన లేఖకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న అంశం అంటూ హరీష్‌రావుకు రాసిన లేఖలో దేవినేని పేర్కొన్నారు. మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి ముందే ఇరిగేషన్ ఇంజనీర్లు, అధికారుల స్థాయిలో సమావేశం జరపాలని హరీష్‌కు సూచించారు. -
హరిత విప్లవమే లక్ష్యం
అలంపూర్/మానవపాడు: పభుత్వం పారిశ్రామికీకరణ, హరిత విప్లమమే లక్ష్యంగా పనిచేస్తోందని, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు 3 లక్షల ఎకరాల భూమిని ఎంపికచేసిన ట్లు ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా అలంపూర్ జోగుళాంబ ఆలయాలను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్డీఎస్ సమస్యకు త్వరలో పరిష్కారం చూపి, చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రణాళికలు సిద్ధంచేశామని చెప్పారు. ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు విధంగా తెలంగాణ ప్రభుత్వానిది గొప్ప విధానమన్నారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో వెనకబడ్డ అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో అలంపూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, దీనికితోడు జోగుళాంబ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇలాంటి ప్రాంతాన్ని ఐదేళ్లలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా సర్వేలు చేపట్టారని తెలిపారు. ఆర్డీఎస్ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. రైతులు సంబరపడే రోజులు దగ్గర్లలోనే ఉన్నాయన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని జోగుళాంబను కోరుకున్నట్లు చెప్పారు. మానవపాడు మండలంలోని జల్లాపురం, మానవపాడు గ్రామాల రైతులు వేణుగోపాలాచారిని ఘనంగా సన్మానించారు. -
ఆర్డీఎస్ పనులకు బ్రేక్..?
గద్వాల : రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) పనులకు బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. వచ్చే జనవరి దాకా పనులు జరిగేలా లేవు. ప్రాజెక్టుకు ప్రస్తుతం భారీగా వరద వస్తుండడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వాలు ఆర్డీఎస్ సమస్యపై శ్రద్ధ చూపి తక్షణం పరిష్కరించడంలో చొరవ చూపకపోవడం.. లేఖలతో కాలయాపన చేయడం కూడా కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర రిజర్వాయర్‌కు భారీగా ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. దీంతో తుంగభద్ర ప్రాజెక్టు అధికారులు ఆయకట్టు పొలాలకు ఖరీఫ్ నీటిని రెండు రోజుల క్రితమే వదిలారు. పొలాల ద్వారా తిరిగి నదిలోకి చేరే రీజనరేట్ వాటర్ నది ద్వారా ఆర్డీఎస్ ప్రధాన నిర్మాణానికి మరో రెండు రోజుల్లో చేరే అవకాశం ఉంది. కేవలం వేయి క్యూసెక్కుల వరద నీరు ఆర్డీఎస్కు చేరినా పనులు నిలిచిపోతాయి. ఇప్పటివరకు పనులు ప్రారంభించేందుకు ఏ చర్యలూ లేనందున ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు వచ్చే జనవరి వరకు వాయిదా పడినట్లే. తుంగభద్ర నుంచి విడుదలవుతున్న వరద నీటితో మరో వారం రోజుల్లో ఆర్డీఎస్ ప్రధాన నిర్మాణానికి ఇన్‌ఫ్లో భారీగా ప్రారంభమైతే ఆర్డీఎస్ పరిధిలో ఖరీఫ్ పంటలకు నీటి విడుదల చేయాల్సి ఉంది. ప్యాకేజీ-2 పరిధిలో ఒక అరకిలోమీటర్ మేర ఉన్న రాతి గోడలను పగులగొట్టిన కాంట్రాక్టర్ కాలువలలో పడిన రాళ్లను ఇప్పటి వరకు తొలగించలేదు. నీటి విడుదల ప్రారంభమయ్యేలోగా మన రాష్ట్ర అధికారులు కర్ణాటక అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రధాన కాలువలో ఉన్న అడ్డంకులను తక్షణమే తొలగించేలా చేయాల్సి ఉంది. లేనిపక్షంలో వచ్చే కొద్దిపాటి ప్రవాహానికి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నుంచి ఆయకట్టు అవసరాలకు 800 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలలో అడ్డంకులు తొలగకపోతే మన రాష్ట్ర పరిధిలోకి కాలువ ద్వారా వచ్చే నీటి సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. ఈ విషయమై ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి ప్రధాన కాలువల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అడ్డంకులు తొలగించేలా ప్రయత్నిస్తానన్నారు.