ఎల్లోమీడియాను నమ్మని జనం
బాబుపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత
రవిప్రకాష్ ను తెచ్చి సర్వేలు అంటూ నాటకాలు
సర్వే వివరాలు చూసి నవ్విపోతున్న జనం
ఎప్పుడో మూలబడిపోయి, నట్లు ఊడిపోయిన అంబాసిడర్ కారుకు కలర్ వేసి తీసుకొస్తే అది ఆడి కార్ అయిపోతుందా...ముసలమ్మకు మేకప్ వేసి చూపిస్తే ముద్దుగుమ్మ అయిపోతుందా..సంస్థను మోసం చేసి...చెక్కుబుక్కులు ఎత్తుకుపోయి వ్యవస్థనే మోసం చేసి కేసులపాలై ఏళ్లపాటు సమాజానికి మొహం చూపించలేక ఎక్కడో దూరంగా బతుకుతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాత్రికిరాత్రి సర్వేలు అంటూ అవాస్తవాలు. చెప్పిస్తే ప్రజలు నమ్ముతారా ?
అసలు ఈ కాలం జనం అలా ఉన్నారా? ఎవరో ఏదో చూపిస్తే అబ్బో...బ్రహ్మాండం అని నమ్మే తీరులో ఉన్నారా? అసలు ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెల్లోని జనం కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఏ ఛానెల్..ఏ పత్రిక ఎవరిపక్షమో చెప్పగలుగుతున్నపుడు ఈ మాయమాటలు ఎవరు నమ్ముతారు.
వాస్తవానికి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఊత కర్ర లేకపోయింది. అంటే ఏ అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లి నమ్మిస్తారు..ఆకట్టుకుంటారు..ప్రస్తుత వైఎస్‌ఆర్‌సీపీ జగన్ ప్రభుత్వం అన్నివర్గాలనూ ఆకట్టుకుంటూ అవినీతి రహిత పాలనా అందిస్తోంది. దానికితోడు చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి గౌరవాన్ని కోల్పోయి ఏదో అలా బతుకుతున్నారు తప్ప ఆయన రాజకీయనాయకుడు స్టేచర్ ఏనాడో కోల్పోయారు.
దీంతో ఈ ఎన్నికలవేళ తెలుగుదేశానికి కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కారణం..ఒక అంశం లేకుండా పోయింది.ఇక జగన్ ఐతే చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మాయలు ఉండవు...చేయలేనిది చేయలేను ఆయనే ఒప్పేసుకుంటాడు.. అలాంటపుడు మోసానికి కేరాఫ్ అయిన చంద్రబాబు నమ్మాల్సిన అవసరం ఏముందన్న ట్రెండ్ ప్రజల్లో నడిచింది . సినిమా ఫ్లాప్ అయిపోయి..జనాదరణ కోల్పోయి, ఇది చెత్త అని జనాల్లో టాక్ వచ్చినపుడు కొత్త మసాలా పాట కలిపి మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు.
అంతే ఆ పాట సినిమాను నిలబడుతుందన్న భ్రమ ఆ నిర్మాతలది. మొత్తం సినిమా దరిద్రం అయిపోయాక ఆ ఒక్క పాట సినిమాను నిలబెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా తన పార్టీ మీదా ఆశ కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో రవి ప్రకాష్ అనే అవుట్ డేటెడ్ జర్నలిస్టును తీసుకొచ్చి నోటికొచ్చిన అంకెలు వేసి సర్వే అని విడుదల చేాశారు.
వాస్తవానికి రాష్ట్రంలో ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తాయన్నది. ఎవరిపాలన బాగుందన్నది జనానికి తెలుసు. అలాంటిది ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుని ఇష్టానుసారం అంకెలు వేసేసి ఇదే సర్వే అని జనాల్లోకి వదిలితే నమ్మే కాలం కాదని ఇలాంటి కుట్రదారులు తెలుసుకోవాలి.
--సిమ్మాదిరప్పన్న--
Comments
Please login to add a commentAdd a comment