
ఒకనాడు కత్తులు దూసుకున్నారు.. ఇప్పుడు అలుముకున్నారు
చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒకేలా ఉన్నారు.. అందితే జుత్తు..అందకపోతే కాళ్ళు పట్టుకోవడంలో ఆయన మాస్టర్ డిగ్రీ చేశారు. రాజకీయంగా తనకు అవసరమైనవాళ్లను మాత్రమే దగ్గర ఉంచుకుని ఒక్కోమెట్టు పైకెక్కిన అయన తనకు అవసరం లేనివాళ్లను తొక్కుకుంటూ ముందుకు వెళ్లారు. ఎవరి అండదండలు తన ఎదుగుదలకు నిచ్చెనమెట్లుమాదిరి ఉపయోగపడ్డాయో.. పైకెక్కక ఏవ్ నిచ్చెనను విరిచేసి మూలపెట్టేశారు . డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబులో పరివర్తన వచ్చిందో... ఇంకా వైరం ఎందుకని అనుకున్నారోకానీ చరమాంకంలో అయన తన తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావును పొగడ్తలతో ముంచెత్తారు.
చంద్రబాబు పెద్దల్లుడిగా దగ్గుబాటి ఆనాడు కేబినెట్లో చక్రం తిప్పుతున్న రోజులవి. వాస్తవానికి చదువు.. కుటుంబం.. సామాజిక హోదా విషయంలో వెంకటేశ్వర రావు అన్నిటిట్లోనూ చంద్రబాబు కన్నా పైమెట్టులో ఉంటారు. అయినా రాజకీయంలో మాత్రం అయన వెనుకబడ్డారు.. ముఖ్యంగా ఎన్టీయారును పదవినుంచి తొలగించే సమయంలో తోడల్లుడు దగ్గుబాటిని ఒక మెట్టుగా వాడుకుని తనకు ఒక కంఫర్ట్ పొజిషన్ ఎమ్మెల్యేల సమీకరణ అంతా తాను తన మద్దతుదారులైన మీడియా సంస్థలు సహాయంతో సానుకూలంగా సాగిపోగానే నెమ్మదిగా దగ్గుబాటిని సైడ్ చేయడం మొదలు పెట్టారు..
ఆ తరువాత తాను ఫోన్ చేసినా చంద్రబాబు లిఫ్ట్ చేయలేదని దగ్గుబాటి చెప్పుకున్నారు. ఆ తరువాతి పరిణామాల్లో చంద్రబాబు తెలుగుదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని తనకు పోటీ అనుకున్నవాళ్లను. సమర్థత.. పార్టీలో గౌరవం గుర్తింపు ఉన్న దగ్గుబాటివంటి వారిని వారంతట వాళ్ళే పార్టీనుంచి వెళ్లిపోయేలా చేసారు.. ఇదంతా గతం.. కానీ ఇప్పుడు ఇద్దరూ వృద్ధులయ్యారు.

ఇప్పుడు దగ్గుబాటి నుంచి ముప్పు లేదుగా
దగ్గుబాటి వెంకటేశ్వర రావు మొదటినుంచి మంచి అవగాహన ఉన్న వ్యక్తి.. జాతీయ అంతర్జాతీయ సామాజికాంశాలు గమనించి పుస్తకాలూ రాయడం అయన హాబీ కమ్ వ్యసనం.. ఆ క్రమంలోనే "ప్రపంచ చరిత్ర' పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చంద్రబాబుకు తోడల్లుడు దగ్గుబాటిలో ఎన్నో సుగుణాలు కనిపించాయి. బిజీగా ఉండే దగ్గుబాటి వంటి వ్యక్తి రిటైర్ అయ్యాక జీవితం ఎలా గడుపుతున్నారో తెలుసుకున్నాను.. నేనూ రిటైర్మెంట్ కు సిద్ధం అవుతున్నాను అన్నారు.. అంతేకాకుండా వెంకటేశ్వర రావుతో తనకు వైరం ఉందని అందరూ అనుకుంటారు అంటూనే.. ఒకప్పుడు చాలా వైరం ఉండేదని. ఇప్పుడు లేదని.. తామంతా కలిసిపోయామని కవరింగ్ ఇచ్చారు.
ఇప్పుడు తామంతా ఒకటే అని చెప్పేందుకు తాపత్రయ పడ్డారు.. అవును ఇప్పుడు మీరంతా ఒక్కటే .. తెలుగుదేశాన్ని క్యాడర్ ను పార్టీ నిధులను కొట్టేసి. తోడల్లుడిని ఆనాడు తొక్కేసి తనకు ఎవరూ పోటీ కారాదని అంతా నీ గుప్పెట్లోకి తెచ్చుకున్నావు.. ఇప్పుడు నీకు ఎదురులేదు కాబట్టి.. ఇప్పుడు దగ్గుబాటి మీకు మళ్ళీ బంధువయ్యాడు.. ఇప్పుడు కూడా అయన మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయితే.... నీకు పోటీ వస్తాడనిపిస్తే మళ్ళీ తొక్కేయడానికి ఏమాత్రం సందేహించవు అని సగటు టిడిపి కార్యకర్త లోలోన గొణుక్కుంటున్నాడు..
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment