raviprakash
-
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఎప్పుడో మూలబడిపోయి, నట్లు ఊడిపోయిన అంబాసిడర్ కారుకు కలర్ వేసి తీసుకొస్తే అది ఆడి కార్ అయిపోతుందా...ముసలమ్మకు మేకప్ వేసి చూపిస్తే ముద్దుగుమ్మ అయిపోతుందా..సంస్థను మోసం చేసి...చెక్కుబుక్కులు ఎత్తుకుపోయి వ్యవస్థనే మోసం చేసి కేసులపాలై ఏళ్లపాటు సమాజానికి మొహం చూపించలేక ఎక్కడో దూరంగా బతుకుతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాత్రికిరాత్రి సర్వేలు అంటూ అవాస్తవాలు. చెప్పిస్తే ప్రజలు నమ్ముతారా ? అసలు ఈ కాలం జనం అలా ఉన్నారా? ఎవరో ఏదో చూపిస్తే అబ్బో...బ్రహ్మాండం అని నమ్మే తీరులో ఉన్నారా? అసలు ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెల్లోని జనం కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఏ ఛానెల్..ఏ పత్రిక ఎవరిపక్షమో చెప్పగలుగుతున్నపుడు ఈ మాయమాటలు ఎవరు నమ్ముతారు.వాస్తవానికి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఊత కర్ర లేకపోయింది. అంటే ఏ అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లి నమ్మిస్తారు..ఆకట్టుకుంటారు..ప్రస్తుత వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం అన్నివర్గాలనూ ఆకట్టుకుంటూ అవినీతి రహిత పాలనా అందిస్తోంది. దానికితోడు చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి గౌరవాన్ని కోల్పోయి ఏదో అలా బతుకుతున్నారు తప్ప ఆయన రాజకీయనాయకుడు స్టేచర్ ఏనాడో కోల్పోయారు. దీంతో ఈ ఎన్నికలవేళ తెలుగుదేశానికి కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కారణం..ఒక అంశం లేకుండా పోయింది.ఇక జగన్ ఐతే చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మాయలు ఉండవు...చేయలేనిది చేయలేను ఆయనే ఒప్పేసుకుంటాడు.. అలాంటపుడు మోసానికి కేరాఫ్ అయిన చంద్రబాబు నమ్మాల్సిన అవసరం ఏముందన్న ట్రెండ్ ప్రజల్లో నడిచింది . సినిమా ఫ్లాప్ అయిపోయి..జనాదరణ కోల్పోయి, ఇది చెత్త అని జనాల్లో టాక్ వచ్చినపుడు కొత్త మసాలా పాట కలిపి మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు. అంతే ఆ పాట సినిమాను నిలబడుతుందన్న భ్రమ ఆ నిర్మాతలది. మొత్తం సినిమా దరిద్రం అయిపోయాక ఆ ఒక్క పాట సినిమాను నిలబెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా తన పార్టీ మీదా ఆశ కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో రవి ప్రకాష్ అనే అవుట్ డేటెడ్ జర్నలిస్టును తీసుకొచ్చి నోటికొచ్చిన అంకెలు వేసి సర్వే అని విడుదల చేాశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తాయన్నది. ఎవరిపాలన బాగుందన్నది జనానికి తెలుసు. అలాంటిది ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుని ఇష్టానుసారం అంకెలు వేసేసి ఇదే సర్వే అని జనాల్లోకి వదిలితే నమ్మే కాలం కాదని ఇలాంటి కుట్రదారులు తెలుసుకోవాలి. --సిమ్మాదిరప్పన్న-- -
మీడియా ట్రేడ్ మార్క్ వివాదం: ఆర్టీవీకి భారీ ఊరట
మీడియాలో ట్రేడ్ మార్క్ వివాదంలో తెలుగు న్యూస్ ఛానల్ ఆర్టీవీకి ఊరట లభించింది. రిపబ్లిక్ టీవీ లోగో, 'R'ను వినియోగించి RTV న్యూస్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలను కోర్టు బాంబే హైకోర్టు శుక్రవారం తోసి పుచ్చింది. ఈ వ్యాజ్యాన్ని విచారించే వరకు ఆర్టీవీ న్యూస్ లోగో వినియోగంపై అత్యవసర స్టే విధించాలని కోరుతూ రిపబ్లిక్ టీవీ వేసిన మధ్యంతర దరఖాస్తును జస్టిస్ మనీష్ పితలే తోసిపుచ్చారు. జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ, రవిప్రకాష్ నేతృత్వంలోని R TV న్యూస్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు రూ.100 కోట్ల నష్ట పరిహారం కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. RTV తన ట్రేడ్‌మార్క్‌ను కాపీ కొట్టి, మోసపూరితంగా వ్యవరించిందని ఆరోపించింది. ఈ ఉల్లంఘనకు గాను ఆర్టీవీపై శాశ్వత నిషేధాన్ని విధించాలని కోరుతూ రిపబ్లిక్ TV మాతృ సంస్థ ARG Outlier మార్చి 2023లో దావా వేసింది. తాజాగా ఈ విషయంలో రిపబ్లిక్ టీవీకి భారీ షాక్ తగిలింది. -
టీవీ9 రవిప్రకాష్ ‘నట’రాజనే
సాక్షి, హైదరాబాద్: టీవీ9 సంస్థను నిర్వహించిన ఐల్యాబ్స్ గ్రూప్‌ను ఓ కేసులో ఓడించాలనే ఉద్దేశంతో రవిప్రకాష్ అదే సంస్థలో పనిచేస్తున్న నటరాజన్ పేరుతో నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి కీలక సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్ సంస్థకు పంపినట్టుగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఐల్యాబ్స్ గ్రూప్ అధ్యక్షుడు టి.కృష్ణ ప్రసాద్ మే 6వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 406 ఐపీసీ, 66డీ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రవిప్రకాషే ఆ నటరాజన్ అని టెక్నికల్ సాక్ష్యాలతో నిర్ధారించారు. టీవీ9 ఆఫీస్‌లోని అతని కంప్యూటర్ నుంచే ఈ–మెయిల్ సృష్టించడంతోపాటు సమాచారం సైఫ్‌పార్టనర్స్‌కు పంపినట్టుగా తేల్చారు. కేసు పూర్వాపరాలు.. ఐల్యాబ్స్ గ్రూప్ ప్రారంభించిన టీవీ9 సంస్థలో సైఫ్ పార్టనర్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. వీరి మధ్య ఆర్థిక లావాదేవీల్లో పొరపొచ్చాలు రావడంతోపాటు టీవీ9ను ఏబీసీఎల్ కంపెనీకి అమ్మేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో హైదరాబాద్‌లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. అయితే ఫిబ్రవరి 24న ఐల్యాబ్స్ గ్రూప్‌లో పనిచేస్తున్న నటరాజన్ అనే ఉద్యోగి పేరు మీదున్న ఈ–మెయిల్ ఐడీ నుంచి ఐల్యాబ్స్‌కు సంబంధించిన కీలక సమాచారం ఎన్సీఎల్టీ కేసులో ప్రత్యర్థిగా ఉన్న సైఫ్ పార్టనర్స్ ఎండీ రవి అదుసుమిల్లీకి చేరింది.సైఫ్ పార్టనర్స్ అధికారి వివేక్ మాతూర్, జనరల్ కౌన్సిల్ రామానుజ గోపాల్‌కు మెయిల్ వెళ్లింది. ఇదే సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్ ఎన్సీఎల్టీ ముందు ఉంచింది. అయితే ఆ కాపీలను ఎన్సీఎల్టీలో న్యాయవాది ఎన్.లోమేశ్ కొరియర్ ద్వారా ఐల్యాబ్స్ గ్రూప్‌కు పంపారు. నకిలీ ఉద్యోగిపై ఫిర్యాదు.. ఆ కాపీలను చూసి అవాక్కయిన ఐల్యాబ్స్ గ్రూప్ అధ్యక్షుడు తమ కంపెనీలో నటరాజన్ పేరుతో ఏ ఉద్యోగీ లేడని, థర్డ్ పార్టీలతో కమ్యూనికేట్ చేసేందుకు ఎటువంటి జీ మెయిల్ ఉపయోగించమని పేర్కొంటూ ఏప్రిల్ 24న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారాన్ని సైఫ్ పార్టనర్స్‌కు పంపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఫిర్యాదుతో ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేశారు. టీవీ9 కార్యాలయంలో జరిగినట్టుగా గుర్తించి.. రవిప్రకాష్ కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా టెక్నికల్ డేటా అనాలాసిస్‌తో ఆ నటరాజన్ ఎవరో కాదు రవిప్రకాషే అని తేల్చారు. -
రవిప్రకాష్‌పై మరో కేసు
-
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్: కోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: టీవీ9 నిధుల కుంభకోణంలో అరైస్టయిన రవిప్రకాష్‌ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. టీవీ9 యాజమాన్యమైన అలందా మీడియా హౌజ్‌కు చెందిన రూ. 18 కోట్ల మొత్తాన్ని బోనస్ పేరుతో పక్కదారి పట్టించారన్న రవిప్రకాష్‌పై అభియోగాలు నమోదయ్యాయి. రవిప్రకాష్ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు. -
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్: కోర్టు విచారణ
-
సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో రవిప్రకాశ్
-
రవిప్రకాశ్‌కు మరోసారి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్లో ఉన్న నిబంధనలను తొలగించాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పోలీసు స్టేషన్‌కు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే ఇతర దేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని రవిప్రకాశ్ హైకోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. టీవీ9 చానెల్లో పలు ఆర్ధిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు మాజీ సీఈవో రవిప్రకాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా టీవీ9 లోగోని పాతసామాను అమ్మేసినట్లు రూ. 99 వేలకి చిల్లరగా అమ్మేసిన కేసును ఆయన ఎదుర్కొంటున్నారు. -
రవిప్రకాశ్‌వన్నీ అసత్యాలే!
సాక్షి, హైదరాబాద్: తమ సంస్థలపై అసత్య, పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేయడంపై టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పాత యాజమాన్యం శ్రీనిరాజు సంస్థలైన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. ప్రధానంగా టీవీ 9 ప్రస్తుత ప్రమోటర్లైన అలంద మీడియా, పాత ప్రమోటర్లైన శ్రీనిరాజు సంస్థల మధ్య లావాదేవీల్లో చెల్లింపులు అక్రమంగా హవాలా మార్గంలో జరిగాయని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చేసిన వాదనలు అవాస్తవం అని ప్రకటించాయి. ఫోర్జరీకి పాల్పడి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని, అరెస్టును ఎదుర్కొంటున్న రవిప్రకాశ్, ఎలాగైనా బెయిల్‌ను పొందడం కోసం తమపై నిరాధార ఆరోపణలు ప్రచారంలోకి తీసుకురావడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. విచారణ అధికారుల ముందు, కోర్టులోనూ రవిప్రకాశ్ చేసిన ఆరోపణలకు ఎలాం టి ఆధారాలు లేవని ఒక ప్రకటనలో తెలిపాయి. కోర్టులో రవిప్రకాశ్ తరఫు న్యాయవాది చేసిన వాదనల ఆధారంగా మీడియాలో వచ్చిన వార్తలను ఖం డించాయి. ఫోర్జరీ, చీటింగ్ కేసుల్లో తాను ఎదుర్కొంటున్న విచారణను పక్కదారి పట్టించడం కోసమే రవిప్రకాశ్ ఈ ఆరోపణలకు దిగారంటూ విమర్శిం చా యి. వాస్తవాలను వెల్లడించడంలో భాగంగా టీవీ9 విక్రయ లావాదేవీల వివరాలను కొత్త, పాత యాజమాన్యాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. డీల్ విలువ రూ.414 కోట్లు... ‘2018, ఆగస్టు నాటికి చింతలపాటి హోల్డింగ్స్, ఐ ల్యాబ్స్, క్లిపోర్డ్ ఫెరీరా, ఎంవీకేఎన్ మూర్తిలకు టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్లో 90.54 శాతం వాటా ఉండేది. ఈ వాటా మొత్తాన్ని ఆగస్టు 24, 2018న అలంద మీడియా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.414 కోట్లు. దీనికి సంబంధించిన షేర్ పర్చేజ్ ఒప్పందాన్ని చట్టబద్ధంగా చేసుకుని, నిధుల బదిలీని పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిపింది. రవిప్రకాశ్ ఆరోపిస్తున్నట్లు ఇందులో ఎలాంటి నగదు లావాదేవీ అన్నదే జరగలేదు. ఏబీసీఎల్కు అప్పటికి ఉన్న బకాయిలను చెల్లించడానికి అలంద మీడియా రూ.150 కోట్లు నేరుగా సంస్థ ఖాతాల్లోకి బదిలీ చేయగా, మిగిలిన రూ.264 కోట్లు పాత ప్రమోటర్లకు బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిగాయి. ఈ లావాదేవీలు పాత, కొత్త ప్రమోటర్ల రికార్డుల్లో నమోదయ్యాయి. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచార ప్రసార మం త్రిత్వ శాఖకు కూడా సమాచారమిచ్చాం. ఈ వ్యవహారమంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు’అని వివరించాయి. ‘ఈ బదిలీ వ్యవహారం ఆగస్టు 2018 లోనే జరిగింది. ఆ సమయంలో టీవీ9 సీఈవోగా ఉన్న రవిప్రకాశ్, షేర్‌పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశారు. అయినప్పటికీ, 9 నెలల తర్వాత, రవిప్రకాశ్ ఈ ఆరోపణలు చేయడం చూస్తుంటే, ఫోర్జరీ కేసుల విషయంలో తాను ఎదుర్కొంటున్న క్రిమినల్ విచారణను పక్కదారి పట్టించడానికి, తనను తాను కాపా డుకోవడానికి చేస్తున్న పనే అని అర్థమవుతోంది. సైఫ్ త్రీ మారిషస్‌తో కుదిరిన సెటిల్మెంట్ వ్యవహారం పైనా రవిప్రకాశ్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. టీవీ9 విక్రయం జరిగే సమయానికి హైదాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైఫ్ త్రీ కంపెనీ వేసిన ఓ కేసు పెండింగ్‌లో ఉంది. ఐ విజన్‌లో ఉన్న వాటాల విషయంలో సైఫ్ త్రీ ఈ కేసు వేసింది. అయితే.. ఇది సెటిల్మెంట్ అగ్రిమెంట్ ద్వారా పరిష్కారం అయ్యింది. దీనికి సంబంధించి ఆర్బీఐ నియమ నిబంధనలకు లోబడి బ్యాంకుల ద్వారానే చెల్లింపు జరిగింది. నిధులను స్వీకరించిన తర్వాత, సైఫ్ త్రీ కేసును ఉపసంహరించుకోవడానికి ఎస్‌సీఎల్‌టీ అనుమతి కూడా ఇచ్చింది. వాస్తవాలు ఇలా ఉంటే, రవిప్రకాశ్ మాత్రం ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగినట్లుగా అవాస్తవమైన, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలతో ప్రభావితం కావొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తమ పరువుకు భంగం కలిగించేలా అసత్యమైన, పూర్తిగా అవాస్తమైన ఆరోపణలను రవిప్రకాశ్ చేసినందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’అని స్పష్టం చేశాయి. -
రవిప్రకాశ్‌కు బెయిలా? జైలా?
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ కేసు నిందితుడు, టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ అరెస్ట్ ఎప్పుడనేది మంగళవారం తేలే అవకాశం కనిపిస్తోంది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తన విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. పలు నేరారోపణ కేసులలో రవిప్రకాష్ తనకు బెయిల్ కావాలని కోరుతుంటే.. రవికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని, కాబట్టి బెయిల్ ఇవ్వద్దని పోలీసుల తరపు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలూ విన్న న్యాయస్థానం సోమవారం తన విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. టీవీ9 చానెల్లో పలు ఆర్ధిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ సీఈవో రవిప్రకాష్ సైబర్ క్రైమ్ విచారణకు హాజరైనా ఏ మాత్రం విచారణకు సహకరించడంలేదన్నది పోలీసులు అంటున్నారు. అదేవిధంగా టీవీ 9 లోగోని పాతసామాను అమ్మేసినట్లు 99 వేలకి చిల్లరగా అమ్మేసిన కేసులో బంజారాహిల్స్ పోలీసులు రవిని విచారించారు. అయితే ఈ విచారణలోనూ రవిప్రకాష్ పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా తప్పించుకున్నాడని తెలుస్తోంది. మొత్తానికి రవి ప్రకాష్ పై నమోదైన కేసులకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలనూ సేకరించిన పోలీసులు విచారణ అనంతరం నివేదికను రూపొందించి హైకోర్టుకు సమర్పించారు. -
అరెస్ట్‌కు రంగం సిద్ధం
-
రవిప్రకాశ్కి శల్యపరీక్ష!
-
కొనసాగుతున్న రవిప్రకాశ్ విచారణ
-
రవిప్రకాశ్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
-
రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు
-
ఫోర్జరీ కేసు.. రోజుకో మలుపు!
-
గరుడ పురాణం 2.0
-
కథ,స్క్రీన్ ప్లే,డైరెక్షన్ రవిప్రకాశ్!
-
టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కుట్ర బట్టబయలు
-
బాబు,రామోజీ మధ్యలో రవిప్రకాశ్
-
రవిప్రకాశ్‌కు హైకోర్టులో చుక్కెదురు
-
టీవీ9 స్క్రీన్‌పై ప్రత్యక్ష్యమైన రవిప్రకాశ్
-
హింసాత్మక చర్యలపై ఉపేక్ష వద్దు
జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశం కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా ప్రవర్తిస్తూ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించవద్దని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ఆదేశించారు. అమలాపురం సబ్ డివిజినల్ పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశం వివరాలను మంగళవారం కాకినాడలో వెల్లడించారు. రౌడీషీటర్లు ఆధిపత్యం కోసం హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు తెరవాలని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇటీవల జరిగిన వరుస మహిళా హత్య కేసుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించారు.బాహుబలి–2 సినిమా విడుదల సందర్భంగా అమలాపురంలో జరిగిన అల్లర్లు, 13 కార్ల ధ్వంసం కేసుపై ఆయన సమీక్షిస్తూ.. ఈ కేసులో కొంత మంది రౌడీషీటర్ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. విధి నిర్వహణ, కేసుల దర్యాప్తు, ఫిర్యాదు స్వీకరణలో అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అల్లవరంలో నిర్మించిన నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన ఎస్సై డి.ప్రశాంత్‌కుమార్‌ను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య, సీఐలు జి.దేవకుమార్, వైఆర్కే శ్రీనివాస్, కృష్టాఫర్, వెంకటరమణ, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు. -
హత్యలతో ఏం సాధించలేరు..
జన జీవన స్రవంతిలో కలవండి మావోలకు ఎస్పీ రవిప్రకాష్ హితవు రంపచోడవరం : పోలీస్ ఇన్పార్మర్ల అన్న అనుమానంతో గిరిజనులను హత్య చేస్తున్న మావోయిస్టుల చర్యలు హేయమైనవని ఎస్పీ రవిప్రకాష్ అన్నారు. రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. అమాయక గిరిజనులను హత్య చేయడం ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరని జనజీవన స్రవంతిలో కలవాలని హితవు చెప్పారు. చింతూరు మండలం అల్లిగూడెంలో ఆదివారం గిరిజనుడు పుల్లయ్యను పోలీస్ ఇన్‌పార్మర్ పేరుతో హత్య చేయడాన్ని ఖండించారు. మావోలు ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2007లో అల్లిగూడెంలో జరిగిన గొడవలో పుల్లయ్యను మావోయిస్టులు కొట్టారని, అప్పటినుంచి పుల్లయ్య భద్రాచలం వెళ్లి కూలీ పని చేసుకుంటున్నాడని తెలిపారు. బంధువుల ఇంటిలో శుభకార్యానికి రావడంతో మాటు వేసిన మావోయిస్టులు భోజనం చేస్తున్న అతడిని లాక్కుపోయి తుపాకితో కాల్చి చంపారన్నారు. ఇటీవల కాలంలో ఉనికి కోల్పోయిన మావోలు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని, అందుకే హత్యలకు తెగబడుతున్నారని విమర్శించారు. మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగలడంంతో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. మావోలు గిరిజనుల అభివృద్ధికి అడ్డంకిగా మారారని, ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్‌లో ఏజెన్సీలో రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిపారు. ఏజెన్సీ నుంచి గంజాయి రవాణాను ఆరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. జనమైత్రి ద్వారా గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నట్టు వివరించారు. గిరిజన యువతకు ఆర్మీ, పోలీస్ రిక్రూట్మెంట్కు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ అడ్నాన్ నయింఆస్మీ, సీఐలు గీతారామకృష్ణ, ముక్తేశ్వరరావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక
జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆలమూరు /మండపేట : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. ఆయన శుక్రవారం ఆలమూరు పోలీసు స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆగి ఉన్న లారీలు, డ్రైవర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. జిల్లాలో గోపాలపురం నుంచి తుని వరకూ ఉన్న సుమారు 130 కి.మీ. పదహారవ నంబరు జాతీయ రహదారిలో అత్యంత ప్రమాదకరమైన 34 ప్రాంతాలను, 214 నంబరు రహదారిలోని కత్తిపూడి నుంచి చించినాడ వరకూ 150 కి.మీ. పరిధిలో 16 ప్రాంతాలను గుర్తించామన్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణాలను విశ్లేషించేందుకు జిల్లాను మోడల్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి జియోట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. వీటిని జియోట్యాగ్ ద్వారా గూగుల్‌కు అనుసంధానం చేస్తామన్నారు. వీటి నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తామన్నారు. కొద్ది నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఎక్కువగా ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, అందుకు కారణాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విశ్లేషించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని రవిప్రకాష్ తెలిపారు. తరచూ ఏడీబీ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలపై కూడా దృష్టి సారించామన్నారు. ఆయా ప్రదేశాల్లోని లోపాలను గుర్తించి హైవే ఆథారిటీకి నివేదించి సూచనలు, సలహాలను అందజేశామన్నారు. వారి నుంచి అనుమతులు రాగానే ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ప్రతి 25 కి.మీ. దూరానికి మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రహదారులపై ఎక్కడి కక్కడ లారీలను నిలపకుండా పార్కింగ్‌కు ప్రత్యేక ప్రదేశాలను నెలకొల్పుతామని ఎస్పీ తెలిపారు. రోడ్ల పక్కన మద్యం దుకాణాలు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు ఎక్సైజ్ శాఖ సహకారం తీసుకుంటామన్నారు. నాలుగు చక్ర వాహనదారులు కచ్చితంగా సీటుబెల్ట్‌ను ధరిస్తే మరణాల సంఖ్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. నేరాలు అదుపు జిల్లాలో నేరాలు అదుపులో ఉన్నాయని ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. ప్రస్తుతం విభిన్నమైన నేరాలు పోలీసుశాఖకు సవాల్‌గా మారాయన్నారు. నమ్మించి మోసగించడం, సైబర్ నేరాలతో పాటు ఇటీవల ఎక్కువగా మహిళల అనుమానస్పద మరణాలు జిల్లాలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయన్నారు. టీనేజీ బాలికల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ వారి వ్యవహారశైలిని గమనిస్తూ ఉండాలని విజ్ఞప్తి చేశారు. కబడ్డీ బెట్టింగ్‌లు పెరిగాయ్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు తగ్గుముఖం పట్టినప్పటికీ కబడ్డీ బెట్టింగ్‌లు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం మండపేట రూరల్ సర్కిల్ కార్యాలయానికి వచ్చిన ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. కబడ్డీ బెట్టింగ్‌లను నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 80 పోలీస్ స్టేషన్లకు గాను 70 శాతం సొంత భవనాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది 15 పోలీస్‌స్టేçÙన్లు, ఐదు సీఐ కార్యాలయాలు, రెండు డీఎస్పీ కార్యాలయాల భవన నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు ఎస్పీ తెలిపారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యచరణను అమలుచేస్తున్నామన్నారు. మండపేటæ సీఐ వి. పుల్లారావు, రూరల్ ఎస్సై సీహెచ్ విద్యాసాగర్ పాల్గొన్నారు. 16ఆర్వీపీ21 : ఆలమూరులో మాట్లాడుతున్న ఎస్పీ రవిప్రకాష్