
ఆరు నెలల పసికందు రూ.3 లక్షలకు బేరం!
ఏలూరు:పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగులో సెల్ఫ్ హెల్ఫ్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతున్న వైనం తాజాగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే. . ఏలూరు రూరల్ మండలం వెంకటాపురంలో సెల్ఫ్ హెల్ఫ్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.
అయితే ఆ సంస్థ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగప్రవేశం చేసిన ఏలూరు పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేశారు. పోలీసులు పిల్లలు పుట్టని భార్యభర్తలుగా అక్కడకు వెళ్లారు. తమకు పిల్లలు లేరని.. ఓ పసిబిడ్డ కావాలని విన్నవించారు. అందుకు అంగీకరించిన సంస్థ నిర్వాహకుడు రవిప్రకాశ్ మూడు లక్షల రూపాయలకు బేరం పెట్టాడు. దీంతో పోలీసుల వ్యూహం ఫలించి అతను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.